n_id
stringlengths
5
10
doc_id
stringlengths
64
67
lang
stringclasses
7 values
text
stringlengths
19
212k
pib-68276
10634ae740f0a7ca0125346db264f44c8ec69637a6e80b6955e46698893fbedc
tel
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కొవిడ్ టీకాల లభ్యతపై తాజా సమాచారం రాష్ట్రాలు, యూటీలకు ఇప్పటివరకు 203.03 కోట్లకు పైగా డోసులు పంపిణీ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వద్ద అందుబాటులో 3.70 కోట్లకు పైగా డోసులు దేశవ్యాప్తంగా కొవిడ్-19 టీకాల వేగాన్ని మరింత పెంచడానికి, పరిధిని విస్తరించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమం 2021 జనవరి 16న ప్రారంభమైంది. కొవిడ్ టీకాల సార్వత్రికీకరణ కొత్త దశ 2021 జూన్ 21 నుంచి ప్రారంభమైంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మరిన్ని టీకాల లభ్యత, టీకాల లభ్యతపై దూరదృష్టిని పెట్టడం ద్వారా టీకా కార్యక్రమం వేగవంతమైంది. ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చక్కటి ప్రణాళికతో పని చేయడానికి, టీకా సరఫరా గొలుసును క్రమబద్ధీకరించడానికి దీనిని ప్రారంభించారు. సార్వత్రిక టీకా కార్యక్రమంలో భాగంగా, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉచితంగా కొవిడ్ టీకాలను అందించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం మద్దతునిస్తోంది. టీకా సార్వత్రీకరణ కొత్త దశలో, దేశంలో తయారవుతున్న టీకాల్లో 75 శాతాన్ని కేంద్ర ప్రభుత్వం సమీకరించి, వాటిని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉచితంగా సరఫరా చేస్తోంది. | | టీకా డోసులు | | | | పంపిణీ చేసినవి | | 2,03,03,52,325 | | అందుబాటులోని నిల్వలు | | 3,70,12,740 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ద్వారా , ప్రత్యక్ష సేకరణ పద్ధతిలో 203.03 కోట్లకు పైగా టీకా డోసులు అందాయి. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వద్ద 3.70 కోట్లకు పైగా డోసులు అందుబాటులో ఉన్నాయి.
pib-11727
4b51cd5cda1e0085e920fe5a779cad0a7f790ff69955f90b83ff8043edafe88b
tel
సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అద్భుతమైన సాంస్కృతిక ప్రదర్శనలతో హైదరాబాద్ లో ముగిసిన మూడు రోజుల రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్ మహమ్మారి కారణంగా నష్టపోయిన కళాకారులు , చేతివృత్తుల వారి జీవనోపాధి అవకాశాలు తిరిగి పెంచడానికి భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నమే రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్: కేంద్ర సాంస్కృతిక, పర్యాటక ,ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి మన సుసంపన్నమైన సంస్కృతి , వారసత్వం మహిళా సాధికారతను జరుపుకున్నాయి; మన గత వైభవం నుంచి మనం నేర్చుకోవాలి: విదేశీ వ్యవహారాలు , సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి శ్రీమతి మీనాక్షి లేఖి రాష్ట్రీయ సంస్కృతీ మహోత్సవ్ 2022లో భాగంగా హైదరాబాద్ ఎన్టీఆర్ మైదానంలో మూడవ, చివరి రోజున జానపద కళాకారులు, శాస్త్రీయ సంగీత విద్వాంసులు అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 600 మందికి పైగా కళాకారులు, చేతి వృత్తుల కళాకారులు కలసి పాల్గొన్నారు. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక , ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ ల మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ఈ మహోత్సవ్ లక్ష్యం మన దేశ భిన్నత్వంలో ఏకత్వాన్ని చటి చెప్పడమే కాకుండా గత కొన్ని సంవత్సరాలుగా మహమ్మారి కారణంగా తీవ్రంగా ప్రభావితమైన కళాకారులు , చేతివృత్తుల వారి జీవనోపాధికి సహాయపడటం అని అన్నారు. ఉత్సవం లో పాల్గొన్న కళాకారులకు, స్టాల్స్ ఏర్పాటు చేసిన వారికి, ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు శ్రీ కిషన్ రెడ్డి కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ సంవత్సరం రెండు తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రీయ సంస్కృతీ మహోత్సవ్ నిర్వహించడానికి గౌరవ ప్ర ధాన మంత్రి నుండి తనకు లభించిన ప్రోత్సాహాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. విదేశీ వ్యవహారాలు , సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి శ్రీమతి మీనాక్షి లేఖి మాట్లాడుతూ, మహిళా సాధికారతకు మన వారసత్వంలో కాకతీయ వంశానికి చెందిన రాణి రుద్రమ దేవి వంటి స్ఫూర్తి ప్రదాతలు ఎందరో ఉన్నారని, మన గత వైభవం నుండి మనం ఎన్నో నేర్చుకోవాలని, సమాజంలోని అన్ని కోణాల్లో మహిళా నాయకులను తయారు చేసే దిశగా ముందుకు సాగాలని అన్నారు. మాజీ గవర్నర్, కేంద్ర మాజీ మంత్రి సిహెచ్ విద్యాసాగర్ రావు ఈ కార్యక్రమానికి హాజరై మాట్లాడుతూ, 75 సంవత్సరాల స్వాతంత్య్రం సందర్భంగా మనం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ను జరుపుకుంటున్నామని, ప్రపంచం ఇప్పుడు సాంస్కృతిక , ఆధ్యాత్మిక ప్రేరణ కోసం భారతదేశం వైపు చూస్తోందని అన్నారు. నేడు ముగింపు రోజున శ్రీ రామాచారి బృందం ప్రదర్శనలు, , పరంపర ఫౌండేషన్ వారి దేవాలయ నృత్య ప్రదర్శన-గుడి సంబరాలు, జయప్రభ మీనన్ నృత్య రూపకం, ఇంకా అనేక జానపద నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పద్మశ్రీ డాక్టర్ ఎల్. సుబ్రమణ్యం , పద్మశ్రీ కవితా కృష్ణమూర్తితో సహా ప్రముఖ విద్వాంసుల సంగీత ప్రదర్శనలు కూడా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. హైదరాబాద్ లో మూడు రోజుల పాటు జరిగిన ఈ మెగా ఫెస్టివల్ ను గౌరవ ఉప రాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు ఏప్రిల్ 1న ఎన్టీఆర్ స్టేడియమ్ లో ప్రారంభించారు. క్రాఫ్ట్స్ అండ్ ఫుడ్ ఫెస్టివల్ ను తెలంగాణ గవర్నర్ శ్రీమతి తమిళిసై సౌందరరాజన్ ప్రారంభించారు. హర్యానా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ ఏప్రిల్ 1న మహోత్సవ్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏప్రిల్ 2న తమిళనాడు గవర్నర్ శ్రీ ఆర్.ఎన్.రవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి , కేంద్ర సాంస్కృతిక , పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘ్ వాల్ ఏప్రిల్ రెండవ తేదీ కార్యక్రమం లో పాల్గొన్నారు. ప్రముఖ సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి శ్రీ కె.చిరంజీవి కూడా ఏప్రిల్ 2న కార్యక్రమం లో పాల్గొని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ చేస్తున్న కృషిని ప్రశంసించారు. తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రీయ సంస్కృతీ మహోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు కేంద్ర మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రతిష్టాత్మక కార్యక్రమం అయిన రాష్ట్రీయ సంస్కృతీ మహోత్సవ్, ఏడు జోనల్ సాంస్కృతిక కేంద్రాల చురుకైన భాగస్వామ్యంతో 2015 నుండి నిర్వహించబడుతోంది. రాష్ట్రీయ సంస్కృతీ మహోత్సవ్ ఈ 12వ ఎడిషన్ మన వారసత్వం యొక్క మూడు ‘సి‘ లను - కల్చర్ , క్రాఫ్ట్స్ , కుయిజన్ - ను ప్రదర్శించడం, బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించింది. భారతదేశ శక్తివంతమైన సాంస్కృతిక వైవిధ్యాన్ని ఆడిటోరియాలు , గ్యాలరీలకు పరిమితం చేయకుండా ప్రజల వద్దకు తీసుకెళ్లడంలో ఆర్ఎస్ఎం కీలక పాత్ర పోషిస్తోంది. "ఏక్ భార త్- శ్రేష్ఠ భార త్" అనే లక్ష్యాన్ని సాధించడం కోసం ఒక రాష్ట్రానికి చెందిన జానపద, గిరిజన కళలు, నృత్యం, సంగీతం, వంటకాలు, సంస్కృతిని ఇతర రాష్ట్రాల్లో ప్రదర్శించడం లోను, అదే సమయంలో కళాకారులు, చేతి వృత్తుల వారి జీవనోపాధికి మద్దతు ఇచ్చేందుకు ఒక సమర్థవంతమైన వేదిక ను కల్పించడం లోను ఇది కీలక పాత్ర పోషించింది. ఢిల్లీ, వారణాసి, బెంగళూరు, తవాంగ్, గుజరాత్, కర్ణాటక, తెహ్రీ, మధ్యప్రదేశ్ ,పశ్చిమ బెంగాల్ వంటి వివిధ రాష్ట్రాలు ,నగరాలలో నవంబర్, 2015 నుండి ఇప్పటి వరకు ఆర్ఎస్ఎమ్ పదకొండు ఎడిషన్ లను నిర్వహించారు.
pib-276115
5cd05f36466b00cebabb4632f59c39d71d6ab3f4dc324429148394d9f205f283
tel
సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ డాక్టర్ వీరేంద్ర కుమార్ 'పిఎం-దక్ష్' పోర్టల్ మరియు 'పిఎం-దక్ష్' మొబైల్ యాప్ను ప్రారంభించారు 'PM-DAKSH' పోర్టల్ ద్వారా నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన మొత్తం సమాచారం షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతులు మరియు సఫాయ్ కరంచారిలకు ఒకే చోట లభిస్తుంది. గత ఐదు సంవత్సరాలలో లక్ష్య సమూహాలకు చెందిన 2,73,152 మందికి నైపుణ్య అభివృద్ధి శిక్షణ ఇవ్వబడింది 2021-22 సంవత్సరంలో లక్ష్యం మేరకు సుమారు 50,000 మందికి నైపుణ్యాభివృద్ధి శిక్షణను అందించాలని లక్ష్యంగా నిర్ణయించారు కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ నైపుణ్యాభివృద్ధి పథకాలను అందుబాటులోకి తెచ్చేందుకు సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిన 'PM-DAKSH' పోర్టల్ మరియు 'PM-DAKSH' మొబైల్ యాప్ను ప్రారంభించారు. ఈ పోర్టల్ మరియు యాప్ ద్వారా లక్ష్య సమూహాల యువత ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ల ప్రయోజనాలను మరింత సులభంగా పొందగలుగుతారు. ప్రధాన మంత్రి దక్ష్తా ఔర్ కుశాల్తా సంపన్న హిత్గ్రాహి యోజన 2020-21 సంవత్సరం నుండి సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ ద్వారా అమలు చేయబడుతోంది. ఈ యోజన కింద అర్హత కలిగిన లక్ష్య సమూహానికి అప్-స్కిలింగ్/రీ-స్కిలింగ్ షార్ట్ టర్మ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాంగ్ టర్మ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మరియు ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పై నైపుణ్య అభివృద్ధి శిక్షణా కార్యక్రమాలు అందించబడుతున్నాయి. ఈ శిక్షణా కార్యక్రమాలు ప్రభుత్వ శిక్షణా సంస్థలు, నైపుణ్య అభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన సెక్టార్ స్కిల్ కౌన్సిల్స్ మరియు ఇతర విశ్వసనీయ సంస్థల ద్వారా అమలు చేయబడుతున్నాయి. ఇప్పుడు ఏ వ్యక్తి అయినా 'PM-DAKSH' పోర్టల్ను సందర్శించడం ద్వారా ఒకే చోట నైపుణ్య అభివృద్ధి శిక్షణకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని పొందవచ్చు. అలాగే, ఒక్క క్లిక్తో, అతని/ఆమె దగ్గర జరుగుతున్న నైపుణ్యాభివృద్ధి శిక్షణల గురించి సమాచారాన్ని పొందవచ్చు మరియు నైపుణ్య శిక్షణ కోసం అతను/ఆమె సులభంగా నమోదు చేసుకోవచ్చు. PM- DAKSH పోర్టల్ http://pmdaksh.dosje.gov.in లో అందుబాటులో ఉండగా, 'PM-DAKSH' మొబైల్ యాప్ గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉంది. "ఈ రోజు ఈ పోర్టల్ మరియు మొబైల్ యాప్ను ప్రజల ఉపయోగం కోసం ప్రారంభించినందుకు నేను గర్వపడుతున్నాను. ఈ పోర్టల్ అమలుకు సంబంధించిన ఏవైనా సలహాలు మరియు అమలునుదృష్టిలో ఉంచుకుని మంత్రిత్వ శాఖ అవసరమైన మార్పులు చేస్తుంది, తద్వారా ఈ పోర్టల్ మరింత ఉపయోగకరంగా మరియు లక్ష్య సమూహాలకు స్వయం ఉపాధి లేదా వేతన-ఉపాధికి సంబంధించిన అవకాశాలను పొందడానికి మరింత ప్రయోజనకరంగా మారుతుంది."అని కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ అన్నారు. ఈ పోర్టల్ యొక్క కొన్ని లక్షణాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:షెడ్యూల్డు కులాలు, వెనుకబడిన తరగతులు మరియు సఫాయి కరంచారిల కోసం ఒకే చోట నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన మొత్తం సమాచారం లభిస్తుంది.శిక్షణ సంస్థ మరియు వారి ఆసక్తి కార్యక్రమం కోసం నమోదు చేసుకునే సౌకర్యం.వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన కావలసిన పత్రాలను అప్లోడ్ చేసే సౌకర్యం.శిక్షణ కాలంలో ముఖం మరియు కంటి స్కానింగ్ ద్వారా ట్రైనీల హాజరు నమోదు చేసుకునే సౌకర్యం.శిక్షణ మొదలైన సమయంలో ఫోటో మరియు వీడియో క్లిప్ ద్వారా పర్యవేక్షణ సౌకర్యం. సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ కింద మూడు అపెక్స్ కార్పొరేషన్లు - జాతీయ షెడ్యూల్డ్ కులాల ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, జాతీయ వెనుకబడిన తరగతుల ఫైనాన్స్ మరియు డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు నేషనల్ సఫాయ్ కరంచారిస్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పనిచేస్తున్నాయి. ఈ కార్పొరేషన్లు స్వయం ఉపాధి కోసం వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు మరియు సఫాయి కరంచారీల లక్ష్య సమూహాలకు రాయితీ వడ్డీ రేట్లపై రుణాలను అందిస్తున్నాయి. అంతేకాకుండా లక్ష్య సమూహాల నైపుణ్య అభివృద్ధి కోసం ఉచిత శిక్షణను కూడా అందిస్తున్నారు. రుణాలు మరియు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ద్వారా లక్ష్యంగా ఉన్న సమూహాలను ఆర్థికంగా మరియు సామాజికంగా స్వావలంబన కల్పించడానికి ఈ కార్పొరేషన్లు నిరంతరం శ్రమిస్తున్నాయి. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ మూడు అపెక్స్ కార్పొరేషన్ల ద్వారా గత ఐదు సంవత్సరాలలో లక్ష్య సమూహాలకు చెందిన 2,73,152 మందికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వబడింది. తద్వారా వారు స్వయం ఉపాధి మరియు వేతన ఉపాధి ద్వారా తమను మరియు వారి కుటుంబాలను పోషించుకునే వీలు కల్పించారు. 2021-22 సంవత్సరంలో పైన పేర్కొన్న మూడు అపెక్స్ కార్పొరేషన్ల ద్వారా లక్ష్య సమూహాలకు చెందిన సుమారు 50,000 మంది వ్యక్తులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించాలని లక్ష్యంగా నిర్ణయించారు.
pib-122791
5fbad2cf97beacc764bba8ab71191a627ada8dcf3d607056b497f564e2446c8d
tel
ప్రధాన మంత్రి కార్యాలయం యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్ వర్క్ లో శ్రీనగర్ చేరినందుకుసంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి శ్రీనగర్ తన పనితనాని కి, జానపద కళ కు ఒక ప్రత్యేక ప్రస్తావన లభించి, యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్ వర్క్ లో చేరినందుకు గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షాన్ని వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో – ‘‘సుందరమైన శ్రీనగర్ తన పనితనం మరియు జానపద కళల తాలూకు ఒక ప్రత్యేకమైన ప్రస్తావన అండదండల తో @UNESCO Creative Cities Network లో చేరినందుకు నేను సంతోషం గా ఉన్నాను. ఇది శ్రీనగర్ యొక్క చైతన్యభరితమైనటువంటి సాంస్కృతిక సభ్యత కు ఒక సముచితమైన గుర్తింపు గా ఉన్నది. జమ్ము, కశ్మీర్ ప్రజల కు అభినందన లు.’’ అని పేర్కొన్నారు. (
pib-257646
35c443ef76b114429a02820a89f4c4946f068535d66f2a46b29b6114f666ce6f
tel
యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ పురుషుల ఫ్రీ-స్టైల్ 65 కేజీల విభాగంలో రెజ్లర్ బజరంగ్ పునియాకు కాంస్య పతకం : టోక్యో ఒలింపిక్స్లో ఇది భారత్ కు ఆరో పతకం కీలక ముఖ్యాంశాలు :కాంస్య పతక పోరులో పునియా 8-0 పాయింట్లతో కజకిస్తాన్ కు చెందిన డౌలెట్ నియాజ్బెకోవ్ ను ఓడించారు.బజరంగ్ సాధించిన విజయానికి రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ మరియు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.కేంద్ర క్రీడా శాఖ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ, "నేను మీ గురించి గర్వపడుతున్నాను. మీ ఆధిపత్య ప్రదర్శన మరియు అద్భుతమైన ముగింపు ను చూసి నేను చాలా ఆనందించాను." అని భజరంగ్ ను అభినందించారు. టోక్యో ఒలింపిక్స్-2020 క్రీడల్లో, పురుషుల ఫ్రీస్టైల్ 65 కిలోల విభాగంలో రెజ్లర్ బజరంగ్ పునియా, ఈ రోజు, కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. కాంస్య పతకం కోసం జరిగిన మ్యాచ్ లో అతను, 8-0 పాయింట్లతో కజకిస్తాన్ కు చెందిన డౌలెట్ నియాజ్ బెకోవ్ ను ఓడించారు. టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో, భారతదేశానికి ఇది ఆరో పతకం, తద్వారా లండన్ ఒలింపిక్ లో సాధించిన ఆరు పతకాల రికార్డు భారత్ సమం చేసింది. రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, క్రీడా మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ తో సహా దేశం నలుమూలల నుండి భారతీయులు, బజరంగ్ పునియాకు అభినందనలు తెలియజేశారు. రెజ్లర్ బజరంగ్ పునియా ను, రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్, అభినందించారు. ప్రతి భారతీయుడు తన విజయానికి సంతోషాన్ని పంచుకుంటున్నారని ఆయన అన్నారు. ఈ మేరకు రాష్ట్రపతి, సామాజిక మాధ్యమం ద్వారా, ఒక ట్వీట్ చేస్తూ, “భారత కుస్తీ పోటీలకు ఇది ఒక ప్రత్యేక క్షణం! #టోక్యో- 2020 లో కాంస్య పతకం సాధించినందుకు బజరంగ్ పునియా కు అభినందనలు. సంవత్సరాలుగా అవిశ్రాంత ప్రయత్నాలు, స్థిరత్వం, పట్టుదలతో మీరు అత్యుత్తమ రెజ్లర్ గా మిమ్మల్ని మీరు గుర్తించుకున్నారు. మీరు విజయం సాధించినందుకు, ప్రతి భారతీయుడు ఆ సంతోషాన్ని పంచుకుంటున్నారు! ” అని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బజరంగ్ విజయాన్ని అభినందిస్తూ, "#టోక్యో-2020 నుండి సంతోషకరమైన వార్త! బజరంగ్ పూనియా, నీవు అద్భుతంగా పోరాడావు. ప్రతి భారతీయుడు గర్వంగా, సంతోషంగా భావించే, మీ విజయానికి, అభినందనలు. ” అని, సామాజిక మాధ్యమం ద్వారా ఒక ట్వీట్ చేసారు. కేంద్ర క్రీడా శాఖ మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ ట్విట్టర్ లో అభినందన సందేశం తో పాటు గెలిచిన క్షణాన్ని తాను చూస్తున్న వీడియో క్లిప్ను పంచుకున్నారు. “బజరంగ్కు కాంస్యం !!! మీరు సాధించారు! భారతదేశం మాటలకు అతీతంగా పులకించింది! నేను మీ గురించి చాలా గర్వపడుతున్నాను. #టోక్యో 2020 లో మీ ఆధిపత్య ఆట తీరు మరియు అద్భుతమైన ముగింపు ను చూడటం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది!", అని, కేంద్ర క్రీడా శాఖ మంత్రి ట్వీట్ చేశారు. బజరంగ్ పునియా- బజరంగ్ పునియా 7 సంవత్సరాల వయస్సులో కుస్తీ చేయడం ప్రారంభించారు. ఆయన హర్యానా రాష్ట్రంలోని ఝజ్జర్ జిల్లా, ఖుదాన్ గ్రామంలో ఒక గ్రామీణ నేపథ్య కుటుంబానికి చెందినవారు. బజరంగ్ జన్మతః సంపన్న కుటుంబానికి చెందినవారు కాకపోవడం వల్ల, బాల్యంలో, ఆయన, అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది. అయితే, అతని స్నేహితుడు మరియు గురువు అయిన ప్రముఖ రెజ్లర్ యోగేశ్వర్ దత్ ఎల్లప్పుడూ అతనికి మద్దతుగా నిలిచారు. వ్యక్తిగత వివరాలు : పుట్టిన తేదీ : ఫిబ్రవరి 26, 1994 నివాస స్థానం : సోనిపట్, హర్యానా క్రీడ : కుస్తీ శిక్షణా స్థావరం : ఎస్.ఏ.ఐ. ఎం.ఆర్.సి., సోనిపట్ వ్యక్తిగత కోచ్ : ఎమ్జారియోస్ బెంటినిడిస్ జాతీయ కోచ్ : జగ్మందర్ సింగ్ సాధించిన విజయాలు : ● ప్రపంచ ఛాంపియన్ షిప్ : రజతం -1 మరియు కాంస్యం - 2 ● ఆసియా ఛాంపియన్ షిప్ : స్వర్ణం - 2 ; రజతం - 3 మరియు కాంస్య పతకాలు - 2 ● ఆసియా క్రీడలు : స్వర్ణం - 1 మరియు రజతం - 1 ● కామన్వెల్త్ క్రీడలు : స్వర్ణం - 1 మరియు రజతం - 1 కీలక ప్రభుత్వం జోక్యాలు: ● ఒలింపిక్ క్రీడల కోసం రష్యాలో సన్నాహక శిక్షణ శిబిరం. ● అమెరికాలోని మిచిగన్ లో తన సహాయక సిబ్బందితో పాటు రెండు నెలల పాటు సన్నాహక శిక్షణా శిబిరం. ● అమెరికా, రష్యా, జార్జియాలో సన్నాహక శిక్షణా శిబిరం మరియు సీనియర్ ప్రపంచ ఛాంపియన్ షిప్-2019 కి ముందు. ● అలీ అలీవ్, టిబిలిసి జి.పి, ఆసియా ఛాంపియన్ షిప్ లు, యార్ డోగు, మాటియో పెల్లికోన్ ర్యాంకింగ్ టోర్నమెంట్ లలో పాల్గొనడం, ఇది టి.ఓ.పి.ఎస్. మరియు ఏ.సి.టి.సి. ద్వారా అందించబడింది. ● లాక్-డౌన్ సమయంలో సప్లిమెంట్స్ మరియు మ్యాట్స్. ● స్పోర్ట్ ఎస్. & సి. సామగ్రి. ● అంతర్జాతీయ ఆటగాళ్లకు మల్ల యుద్ధ భాగస్వాములుగా ఎం.వై.ఏ.ఎస్. మరియు ఏ.ఈ.ఏ. ద్వారా వీసా మద్దతు. ● బజరంగ్ కోసం వీసా సదుపాయం మరియు ఒలింపిక్ సన్నాహకంగా రష్యా కు సహాయక బృందం. ● జాతీయ శిబిరాల సమయంలో వ్యక్తిగత కోచ్ మరియు సహాయక సిబ్బందిని చేర్చడం. టి.ఓ.పి.ఎస్. : రూ. 1,47,40,348 ఏ.సి.టి.సి. : రూ. 59,07,151 మొత్తం: రూ. 2,06,47,499 పూనియాకు శిక్షణ ఇచ్చిన కోచ్ల వివరాలు: క్షేత్ర స్థాయిలో : వీరేందర్ అభివృద్ధి స్థాయిలో : రాంపాల్ ఉన్నత స్థాయిలో : జగ్మీందర్ సింగ్ / ఎమ్జారియోస్ బెంటినిడిస్
pib-181608
fc720e33d76329cbd2ceb20327bbe61d6bbfbf24d6e6d1f61b0d01bc69385398
tel
నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ ఉగాండా, కొమొరోస్, మాలి లో తొమ్మిది సౌర ప్రదర్శన ప్రాజెక్టులను ప్రారంభించిన కేంద్ర విద్యుత్, ఎన్ఆర్ఈ మంత్రి, అంతర్జాతీయ సోలార్ అలయన్స్ అధ్యక్షుడు ఉగాండా, కొమొరోస్, మాలీలోని ప్రాథమిక పాఠశాలలు, గ్రామీణ ఆరోగ్య సంరక్షణ కేంద్రాలను ఐఎస్ఏ ద్వారా ఏర్పాటు జరిగాయి "ఐఎస్ఏ సభ్య దేశాలలో ప్రతిబింబించేలా సోలార్ ప్రాజెక్టుల నమూనాలను వేయడానికి ఐఎస్ఏ ప్రయత్నిస్తుంది": కేంద్ర విద్యుత్, ఎన్ఆర్ఈ మంత్రి, ఐఎస్ఏ అధ్యక్షుడు శ్రీ ఆర్.కె.సింగ్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ తన 5వ ప్రాంతీయ సమావేశాన్ని ఆగస్టు 31న రువాండాలోని కిగాలీలో నిర్వహించింది, రువాండా ప్రభుత్వం మద్దతుతో 36 దేశాల ప్రతినిధులు, 15 దేశాల మంత్రులు పాల్గొన్నారు. సమావేశంలో, ప్రెసిడెంట్, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, కేంద్ర విద్యుత్, నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్.కె.సింగ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యూ ఢిల్లీ నుండి పాల్గొన్నారు. ఉగాండా, యూనియన్ ఆఫ్ కొమొరోస్, రిపబ్లిక్ ఆఫ్ మాలి మొత్తం 9 డెమోన్స్ట్రేషన్ ప్రాజెక్టులను ప్రారంభించారు. వీటిలో నాలుగు ఉగాండాలో, రెండు కొమొరోస్లో, మూడు మాలిలో ఉన్నాయి. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అందించిన గ్రాంట్ల ద్వారా, 8.5 కిలో-వాట్ అత్యధిక స్థాయి అవసరాల సామర్థ్యం, 17.2 కిలో-వాట్ అవర్ బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ కలిగిన గ్రామీణ ఆరోగ్య సంరక్షణ కేంద్రం, మూడు ప్రాథమిక పాఠశాలల సోలారైజేషన్ 48,835 అమెరికన్ డాలర్ల ఖర్చుతో ఉగాండాలో ప్రారంభమైంది. అదేవిధంగా కొమొరోస్లో, 15 కిలో-వాట్ పీక్ సామర్థ్యం, 33 కిలో-వాట్ అవర్ బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్తో బాంగూయికౌని, ఇవెంబెనిలోని రెండు గ్రామీణ ఆరోగ్య సంరక్షణ కేంద్రాల సౌరీకరణ మొత్తం 49,999 అమెరికన్ డాలర్ల తో పూర్తయింది. రిపబ్లిక్ ఆఫ్ మాలిలోని కౌలా, సింజాని, డౌంబాలోని మూడు గ్రామీణ ఆరోగ్య సంరక్షణ కేంద్రాల సోలరైజేషన్, 13 కిలో-వాట్ పీక్ సామర్థ్యం, 43 కిలో-వాట్ అవర్ బ్యాటరీ స్టోరేజ్, మొత్తం 49,995 డాలర్ల ఖర్చుతో జరిగింది. ఈ ప్రాంతాలలో దేనికీ ఇంతకు ముందు విద్యుత్ సౌకర్యం లేదు. (“ఐఎస్ఏ సభ్య దేశాలలో ప్రతిబింబించేలా సౌర ప్రాజెక్టుల నమూనాలను వేయడానికి ఐఎస్ఏ ప్రయత్నిస్తుంది" తొమ్మిది ప్రదర్శన ప్రాజెక్టులను దేశాలకు అంకితం చేస్తూ, కేంద్ర విద్యుత్, నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి, ఐఎస్ఏ అధ్యక్షుడు తక్కువ సేవలందించే వారి శ్రేయస్సును మెరుగుపరిచే అటువంటి ప్రాజెక్టులను చేపట్టాలనే నిబద్ధతను నొక్కిచెప్పారు. “ఈ ప్రదర్శన ప్రాజెక్టులు వాటి శక్తి కేటాయింపు పాత్రను అధిగమించాయి; వారు పురోగతికి చోదకులకు, ప్రపంచ సహకారానికి చిహ్నాలుగా పనిచేస్తారు. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో, అటువంటి షోకేస్ ప్రాజెక్ట్లు వెనుకబడిన వారి శ్రేయస్సును మెరుగుపరిచే అదనపు సందర్భాలను సమకూర్చడంలో మా అంకితభావం తిరుగులేనిది. మేము మా సభ్య దేశాలలో ప్రతిరూపణ కోసం నమూనాలను నిర్దేశించాలనుకుంటున్నాము" అని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. “స్థిరమైన శక్తి పరివర్తనను ప్రారంభించడానికి సౌరశక్తిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది” ఐఎస్ఏ అనేది రిపబ్లిక్ ఆఫ్ ఇండియా జి20 ప్రెసిడెన్సీకి భాగస్వామిగా ఉన్న అంతర్జాతీయ సంస్థ అని, 2023 G20 ప్రక్రియలలో భాగస్వామిగా, సార్వత్రిక శక్తి యాక్సెస్, స్థిరమైన శక్తి పరివర్తనను ప్రారంభించడంలో. ఐఎస్ఏ సూచించిన ముఖ్యమైన సందేశం సౌరశక్తిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి చెప్పారు.
pib-201602
7f8ea6d3c66f123a5f6cb7643019e8404a2ab74b0bb1f9db2b344ca88a07de7a
tel
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అసిస్టెడ్ రీప్రడక్టివ్ టెక్నాలజీ రెగ్యులేశన్ బిల్లు 2020కి ఆమోదం తెలిపిన మంత్రిమండలి మహిళల పునరుత్పత్తి హక్కుల ను పరిరక్షించడానికి తీసుకున్న చరిత్రాత్మక చర్య లు దేశం లోని మహిళ ల సంక్షేమం కోసం చరిత్రాత్మకమైనటువంటి అసిస్టెడ్ రీప్రడక్టివ్ టెక్నాలజీ రెగ్యులేశన్ బిల్లు, 2020కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. సరగేసీ రెగ్యులేశన్ బిల్లు 2020ని పార్లమెంటు లో ప్రవేశపెట్టడం మరియు వైద్యం పరం గా గర్భ విచ్ఛిత్తి కి సంబంధించిన సవరణ బిల్లు 2020కి ఆమోదం లభించడం దరిమిలా దీని కి రూపకల్పన జరిగింది. చట్టపరమైన ఈ చర్య లు మహిళ ల పునరుత్పత్తి హక్కు ల పరిరక్షణ లో ఎంతో కీలకమైనవి. బిల్లు కు పార్లమెంటు ఆమోదముద్ర వేసిందీ అంటే ఈ చట్టం అమలు లోకి వచ్చే తేదీ ని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. దీనితో ఒక నేశనల్ బోర్డు ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. క్లినిక్ల లో పని చేసే వారు పాటించవలసిన ప్రవర్తన నియమావళి ని ఈ నేశనల్ బోర్డు నిర్దేశిస్తుంది. క్లినిక్ల లో మౌలిక సదుపాయాలు, ప్రయోగశాల, రోగనిర్ధారణ పరికరాలు క్లిని క్లు, అసిస్టెడ్ రీప్రడక్టివ్ టెక్నాలజీ బ్యాంక్ల లో నియమితులయ్యే నిపుణుల కు సంబంధించిన కనీస ప్రమాణాల ను నిర్ణయించడానికి ఇది ఉపకరిస్తుంది. కేంద్ర ప్రభుత్వం నోటిఫికేశన్ ను ఇచ్చిన మూడు మాసాల లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు రాష్ట్ర బోర్డుల ను, రాష్ట్ర ఆథారిటిల ను ఏర్పాటు చేయవలసివుంటుంది. నేశనల్ బోర్డ్ రూపొందించిన విధానాలు ప్రణాళికల ను రాష్ట్రం లో అనుసరించవలసిన బాధ్యత రాష్ట్ర బోర్డు కు ఉంటుంది. ఈ బిల్లు నేశనల్ రిజిస్ట్రీ, రిజిస్ట్రేశన్ ఆథారిటి ఏర్పాటు కు వీలు కల్పిస్తుంది. సెంట్రల్ డేటా బేస్ ను నిర్వహించడానికి, నేశనల్ బోర్డ్ పనితీరు లో సహాయపడటానికి ఇది వీలు కల్పిస్తుంది. పుట్టబోయే బిడ్డ ఎవరు అనే దాని ని గురించి వెల్లడించడం, మానవ భ్రూణాలు లేదా బీజకణాల విక్రయం, ఇటువంటి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను నడుపుతున్న ఏజెన్సీలు/ ముఠాలు/ సంస్థల కు కఠిన శిక్ష ను విధించాలని బిల్లు ప్రతిపాదించింది. లాభాలు ఈ చట్టం ప్రధాన ప్రయోజనం ఏమిటంటే ఇది దేశం లో అసిస్టెడ్ రీప్రడక్టివ్ టెక్నాలజీ సేవల ను నియంత్రిస్తుంది. ఫలితం గా పిల్లలు లేని జంట లు, ఎఆర్ టి పద్ధతుల లో గల నైతిక విధానాల పై మరింత భరోసా/ నమ్మకం తో ఉండడానికి హామీ ని ఇస్తుంది. పూర్వరంగం అసిస్టెడ్ రీప్రడక్టివ్ టెక్నాలజీ రెగ్యులేశన్ బిల్లు, 2020 అనేది మహిళల పునరుత్పాదక హక్కు ల పరిరక్షణ కు కేంద్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదించిన వరుస చట్టాల లో అత్యంత తాజా బిల్లు. ఈ బిల్లు దేశం లో అసిస్టెడ్ రీప్రడక్టివ్ టెక్నాలజీ సర్వీసెస్ కు సంబంధించి సురక్షితమైన, నైతికత తో కూడిన పద్ధతుల ను అనుసరించడానికి అవసరమైన నిబంధనల ను రూపొందిస్తుంది. ఈ బిల్లు ద్వారా నేశనల్ బోర్డు, రాష్ట్రాల బోర్డు లు, నేశనల్ రిజిస్ట్రీ, రాష్ట్రాల రిజిస్ట్రేశన్ ఆథారిటి లు అసిస్టెడ్ రీప్రడక్టివ్ టెక్నాలజీ క్లినిక్ లు, అసిస్టెడ్ రీప్రడక్టివ్ టెక్నాలజీ బ్యాంకు ల పర్యవేక్షణ ను, నియంత్రణ ను చేపడుతాయి. గడచిన కొద్ది సంవత్సరాల లో అసిస్టెడ్ రీప్రడక్టివ్ టెక్నాలజీ బాగా వృద్ధి లోకి వచ్చింది. ఎఆర్ టి సెంటర్ ల ఏర్పాటు లో, ప్రతి సంవత్సరం ఎఆర్టి సైకిల్స్ నిర్వహణ సంఖ్యలో అత్యధిక వృద్ధి కలిగిన దేశాల లో ఒక దేశం గా భారతదేశం ఉంది. ఇన్ విట్రో ఫర్టిలైజేశన్ తో పాటు అసిస్టెడ్ రీప్రడక్టివ్ టెక్నాలజీ సంతాన లేమి తో బాధపడుతున్న ఎంతో మంది కి ఆశల ను రేకెత్తిస్తున్నది. అయితే ఇందులో పలు న్యాయపరమైన, నైతిక పరమైన, సామాజిక అంశాలు కూడా ఇమిడివున్నాయి. అంతర్జాతీయ ఫర్టిలిటీ పరిశ్రమ లో భారతదేశం ఒక ప్రముఖ కేంద్రం గా మారింది. పునరుత్పాదక వైద్య పర్యటన ముఖ్యమైంది గా మారుతున్నది. భారతదేశం లోని క్లినిక్ లు దాదాపు అన్ని ఎఆర్ టి సర్వీసుల ను అంటే గామేట్ డొనేశన్, ఇంట్రా యూటరాయిన్ ఇన్ సెమినేశన్ ఐవిఎఫ్, ఐసిఎస్ ఐ, పిజిడి, జెస్టేశనల్ సరగేసి వంటి వాటి ని అందిస్తున్నాయి. భారతదేశం లో ఇందుకు సంబంధించి ఎన్నో కార్యకలాపాలు సాగుతున్నప్పటికీ ఇప్పటికి కూడాను ప్రోటోకాల్స్ స్టాండర్ డైజేశన్ జరగలేదు. రిపోర్టింగ్ ఇప్పటికీ తగినంత గా లేదు. అసిస్టెడ్ రీప్రడక్టివ్ టెక్నాలజీ సర్వీసు ల నియంత్రణ ప్రధానం గా సంబంధిత మహిళలు, పిల్లలు దోపిడీ కి గురి కాకుండా చూసేందుకు అవసరం. ఓవుసైట్ దాత కు బీమా రక్షణ ను కల్పించవలసి ఉంది. మల్టిపుల్ ఎంబ్రియో ఇంప్లాంటేశన్ నుండి రక్షణ కల్పించాలి. అలాగే అసిస్టెడ్ రీప్రడక్టివ్ టెక్నాలజీ ద్వారా జన్మించిన పిల్లల కు, బాయోలోజికల్ పిల్లల తో సమానమైన అన్ని రకాల హక్కుల ను కల్పించాలి. వీర్య కణం, ఓవుసైట్, ఎంబ్రియో ల క్రియో నిల్వ ను ఎఆర్ టి బ్యాంకు లు నియంత్రించవలసి ఉంది. అసిస్టెడ్ రీప్రడక్టివ్ టెక్నాలజీ ద్వారా జన్మించే బిడ్డ ప్రయోజనం కోసం ప్రీ జెనిటిక్ ఇంప్లాంటేశన్ టెస్టింగ్ ను ఈ బిల్లు తప్పనిసరి చేయాలని నిర్దేశిస్తున్నది. సరగేసి రెగ్యులేశన్ బిల్లు 2020 భారతదేశం లో సరగేసి ని నియంత్రించే ఉద్దేశ్యం తో సరగేసి బిల్లు, 2020 ప్రతిపాదిస్తున్నది. ఇందుకు సంబంధించి కేంద్ర స్థాయి లో నేశనల్ బోర్డు, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల లో రాష్ట్ర బోర్డులు, తగిన ఆథారిటిల ను ఈ బిల్లు ప్రతిపాదిస్తున్నది. ఈ బిల్లు ను సెలక్టు కమిటీ పరిశీలించి 2020 ఫిబ్రవరి 5వ తేదీ న తన నివేదిక ను రాజ్య సభ కు సమర్పించింది. ఈ చట్టం వల్ల ప్రధాన ప్రయోజనం, ఇది దేశం లో సరగేసి సేవల ను నియంత్రిస్తుంది. వాణిజ్యపరమైన సరగేసి ని నిషేధించనున్నారు. మానవ భ్రూణాలు, బీజకణాల అమ్మకాలు, కొనుగోళ్లు, భారతీయ వివాహిత దంపతుల విషయం లో ఎథికల్ సరగేసి, భారతీయ సంతతి కి చెందిన దంపతులు, భారతీయ ఒంటరి మహిళలు కొన్ని షరతుల కు లోబడి అనుమతించడం జరుగుతుంది. ఆ రకం గా అనైతిక సరగేసి విధానాల ను ఇది నియంత్రించడం తో పాటు, సరగేసి ని వ్యాపారం చేయడాన్ని నిరోధిస్తుంది. సరగేట్ తల్లులు, సరగేసి ద్వారా పుట్టిన పిల్లల ను దోపిడి కి గురి చేయడాన్ని ఇది నిషేధిస్తుంది. మెడికల్ టర్ మినేశన్ ప్రెగ్నన్సి సవరణ బిల్లు 2020 మెడికల్ టర్ మినేశన్ ఆఫ్ ప్రెగ్నన్సి చట్టం, 1971 కొన్ని సందర్భాల లో రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీశనర్ లు, దీనితో సంంధం ఉన్న ఫార్మాటర్ల ద్వారా గర్భ విచ్చిత్తి కి అవకాశం కల్పించేందుకు ఉద్దేశించినది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల లో అబార్షన్ అవసరమైన మహిళల కు సురక్షితమైన, తక్కువ ఖర్చు తో అబార్షన్ సేవల ను అందుబాటు లోకి తీసుకు రావలసిన అవసరాన్ని ఈ చట్టం గుర్తించింది. దీనితో పాటు, మహిళల పై లైంగిక నేరం కారణం గా గర్భం దాల్చడం, గర్భస్థ పిండం లో అసాధారణ స్థితి వంటి సందర్భాల లో ప్రస్తుతం అబార్షన్కు అనుమతిస్తున్న పరిమితి నెలలు దాటిన సమయంలో గర్భిణులు అబార్షన్ చేయించుకొనేందుకు అనుమతించాలంటూ సర్వోన్నత న్యాయస్థానం లో, వివిధ రాష్ట్రాల ఉన్నత న్యాయస్థానాల లో పలు రిట్ పిటిశన్ లు దాఖలు అయి వున్నాయి. వీటన్నిటి ని దృష్టి లో పెట్టుకొని, ప్రతిపాదిత చట్టాలు మహిళల పునరుత్పాదక హక్కు ల విషయం లో, మారుతున్న సామాజిక పరిస్థితుల కు, సాంకేతిక పురోగతి కి అనుగుణం గా రక్షణల ను కల్పించనున్నాయి.
pib-192589
8b08260644b9bd22d028fbd0ca9a7151e412e95ad19c8e9e2077410ab366fdd7
tel
రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ జన్ ఔషధి కేంద్రాలలో ఈ ఆర్థిక సంవత్సరం రూ.484 కోట్ల రికార్డు అమ్మకాలు నాణ్యమైన జనరిక్ .షధాలను విక్రయించే దేశంలోని అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసిన 7064 ప్రధాన మంత్రి భారతీయ జన్ ఔషధి కేంద్రాలలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రికార్డు స్థాయిలో రూ.484 కోట్ల అమ్మకాలు జరిగాయి. భారతీయ జన్ ఔషధి కేంద్రాలలో నాణ్యమైన జనరిక్ మందుల అమ్మకాలు జరుగుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరం గణాంకాలతో పోలిస్తే ఇది 60% అధికం. జన్ ఔషధి కేంద్రాల్లో మందుల కొనుగోలు ద్వారా దేశ పౌరులకు దాదాపు రూ.3000 కోట్ల మేర సొమ్ము పొదుపు చేయడానికి దోహదం చేసింది. కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి శ్రీ సదానంద గౌడ ఈ రోజు ఈ విషయాన్ని కర్ణాటకలోని వెల్లడించారు. గతే ఏడాది భారత ప్రభుత్వం జన్ ఔషధి కేంద్రాలకు రూ.35.51 కోట్ల నిధుల్ని మంజూరు చేసింది. ఫలితంగా దేశ పౌరులకు దాదాపు రూ.2600 కోట్ల మేర పొదుపు జరిగింది. ఫలితంగా ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయికి పౌరులకు రూ.74 మేర పొదుపు చేకూరింది. జన్ ఔషధి కేంద్రాల వల్ల పౌరులకు గుణకార ప్రభావం కలిగిందని శ్రీ గౌడ అన్నారు. మన దేశ వ్యాప్తంగా మహిళల సాధికారత దిశగా అడుగులు వేస్తున్నామని ఇప్పటి వరకు 10 కోట్లకు పైగా జన్ ఔషధి “సువిధా” శానిటరీ ప్యాడ్లను ఒక్క రూపాయికి ఒక్కటి చొప్పున అమ్ముతున్నట్లు మంత్రి ప్రకటించారు. జన్ ఔషధి “సువిధా” శానిటరీ ప్యాడ్ల కోసం ప్రభుత్వం గత డిసెంబరు రూ.3.6 కోట్ల అర్డర్ను చేసింది. 30 కోట్ల జన్ ఔషధి “సువిధా” శానిటరీ ప్యాడ్లకు టెండర్ ఖరారు చేయబడింది. కర్ణాటక గురించి ప్రత్యేకంగా మాట్లాడిన శ్రీ గౌడ మాట్లాడుతూ, ప్రస్తుతం కర్ణాటకలోని 788 ప్రధాన మంత్రి భారతీయ జన్ ఔషధి కేంద్రాలు పౌరులకు సరసమైన ధరలకు మేటి-నాణ్యమైన జనరిక్ ఔషధాల్ని అందిస్తూ వారికి సేవలు అందిస్తున్నాయి. ఈ ఏడాది మార్చి నాటికి రాష్ట్రంలో మొత్తం 800 పీఎమ్బీజేకేలను ప్రారంభించాలనే లక్ష్యాన్ని సాధించడం కర్ణాటక లక్ష్యం. హెల్త్కేర్ రంగంలో విస్తృత ఔషధాలతో ప్రత్యేక పురోగతి సాధించిన కర్ణాటకలోని పీఎంబీజేపీ కేంద్రాల ద్వారా 2021 మార్చి నాటికి రూ.125 కోట్ల అమ్మకాలను లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా తెలిపారు.
pib-54582
dd0b1cd6eece580f1765157e41e0d31b23756bfd8026c95a7fa8bc04a8a794de
tel
సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ ' 2047 లో భారతదేశం ఎలా ఉండాలి అన్న అంశాన్ని 2023 నాటి యువత నిర్ధారించాలి' కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ శాంతి స్థాపన సయోధ్య సాధన; యుద్ధాలకు తావు లేని భవిష్యత్తు అనే అంశంపై ఏర్పాటైన యూత్ 20 సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ జితేంద్ర సింగ్ ' 2047 లో భారతదేశం ఎలా ఉండాలి అన్న అంశాన్ని 2023 నాటి యువత నిర్ధారించాలి' అని కేంద్ర శాస్త్ర సాంకేతిక, భూ శాస్త్ర , పీఎంవో లో సహాయ మంత్రి, సిబ్బంది వ్యవహారాలు , ప్రజా ఫిర్యాదులు, పెన్షన్, అణుశాస్త్రం, అంతరిక్ష వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఈ రోజు జమ్మూ విశ్వవిద్యాలయంలో శాంతి స్థాపన సయోధ్య సాధన; యుద్ధాలకు తావు లేని భవిష్యత్తు అనే అంశంపై ఏర్పాటైన యూత్ 20 సదస్సులో డాక్టర్ జితేంద్ర సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 'దేశానికి స్వాతంత్ర్యం సాధించిన తర్వాత మూడు తరాలు గడిచిపోయాయి. దేశంలో శక్తి సామర్ధ్యాలను కొరత లేదు. వాటిని సద్వినియోగం చేసుకోవడం ఒక సమస్యగా మారింది. అయితే, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మారింది. తమలో దాగివున్న శక్తి సామర్ధ్యాలను ప్రదర్శించే అవకాశం యువతకి లభించింది. భారతదేశం @ 2047 నిర్మాణంలో నేటి యువత కీలకం గా ఉంటారు.నేడు ముప్పై ఏళ్లు నిండిన వారు ప్రధాన పౌరులు అవుతారు' అని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. జీ-20 అధ్యక్ష పదవి చేపట్టిన భారతదేశానికి 2023 ఒక ముఖ్యమైన సంవత్సరం అని డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశానికి సుస్థిర ప్రభుత్వాన్ని అందించారని పేర్కొన్న డాక్టర్ జితేంద్ర సింగ్ దేశంలో ప్రతి సవాలును సమర్థంగా ఎదుర్కొంటూ దేశ భవిష్యత్తు నిర్మాణానికి కృషి చేస్తున్న పాలన సాగుతుందన్నారు. 2023 నాటి మోదీ పాలనకు 2023 యువతకు మధ్య ఉన్న పరస్పర సంబంధం ఏమిటో ఈరోజు సమావేశం దృష్టి సారించాలని ఆయన సూచించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో 2014 లో బాధ్యతలు చేపట్టిన సమయంలో ప్రభుత్వం పేదల అభ్యున్నతి, మహిళా సాధికారత, యువత అభ్యున్నతికి కృషి చేయాలని నిర్ణయించిందని మంత్రి తెలిపారు. 2014కు ముందు దేశంలో నిరాశ, నిస్పృహ పరిస్థితి నెలకొని ఉందని మంత్రి అన్నారు. 2014 మే 26న ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ నరేంద్ర మోదీ ఇకపై దేశం నిరాశావాదం నుంచి ఆశావాదం వైపు ప్రయాణం సాగిస్తుందని ప్రకటించి తమ ప్రభుత్వ విధానాన్ని ప్రకటించారని డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు. తమ ప్రభుత్వం యువతకు ప్రాధాన్యత ఇస్తుందని శ్రీ మోడీ చేసిన ప్రకటన పట్ల అనేక మంది విశ్వసించలేదు అని మంత్రి అన్నారు. 9 సంవత్సరాల పాలనలో శ్రీ నరేంద్ర మోదీ చెప్పిన మాటకు కట్టుబడి పాలన సాగించి దేశానికి మాటల ప్రభుత్వాన్ని కాకుండా చేతల ప్రభుత్వాన్ని అందించారని డాక్టర్ జితేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు. 2014లో అధికారంలోకి వచ్చిన రెండు మూడు నెలల తర్వాత సర్టిఫికెట్లను గెజిటెడ్ అధికారులు ధృవీకరించే విధానానికి స్వస్తి పలికిన అంశాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన సంవత్సరం తర్వాత దేశంలో ఉద్యోగ నియామకాల్లో ఇంటర్వ్యూలు రద్దు చేస్తునట్టు ప్రకటించి శ్రీ మోదీ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారని మంత్రి అన్నారు. ఫేస్ రికగ్నిషన్ విధానం ద్వారా దేశంలో పెన్షన్ చెల్లించే విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపిన శ్రీ జితేంద్ర సింగ్ దీనివల్ల వృద్ధ పౌరులు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాల్సిన అవసరం ఉండదని అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు ఆన్లైన్ విధానంలో పారదర్శకత, జవాబుదారీతనంప్రజల భాగస్వామ్యంతో అమలు జరుగుతున్నాయని తెలిపారు. మానవ ప్రమేయం కనీస స్థాయికి తగ్గిందన్నారు. యువతను విశ్వసించే ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న వాస్తవాన్ని ప్రభుత్వ కార్యక్రమాలు అమలు జరుగుతున్న తీరు తెలియజేస్తున్నాయన్నారు. ఫిర్యాదుల పరిష్కారం కోసం దేశంలో అమలు జరుగుతున్న కార్యక్రమాల వివరాలను డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు. ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని సీపీ గ్రామ్స్ విధానం అమలు చేస్తున్నామన్నారు. ప్రస్తుత ప్రభుత్వం రాకముందు ప్రతి సంవత్సరం కేవలం 2 లక్షల ఫిర్యాదులు అందుతుండగా, ఈ ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని అనుసరించి ప్రతి సంవత్సరం 20 లక్షల ఫిర్యాదులు అందుతున్నాయని చెప్పారు. కాలపరిమితితో కూడిన పరిష్కార విధానం అమలు చేస్తున్న ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని పొందిందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. యువతకు త్వరలో 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని కొన్ని నెలల క్రితం దేశానికి వాగ్దానం చేసిన ప్రధాని మోదీ తన వాగ్దానం నిలబెట్టుకుని తాను చెప్పినట్టే చేస్తానని మరియు ప్రతి దాన్ని “ముమ్కిన్” చేయగల సామర్థ్యం తనకు ఉందని రుజువు చేశారు అని మంత్రి అన్నారు. ప్రధాని మోడీ మొదటి నుంచి యువతకు సంబంధించిన సమస్యలు, ఆందోళనలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. యువతకు జీవనోపాధి, ప్రభుత్వ ఉద్యోగాల కల్పన , ఆదాయం కోసం కొత్త మార్గాలు, అవకాశాలు కల్పించడానికి ప్రధాని నిరంతరం ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. అవినీతి నిరోధక చట్టం, 1988 ను తన ప్రసంగంలో ప్రస్తావించిన డాక్టర్ జితేంద్ర సింగ్ 30 సంవత్సరాల తర్వాత 2018లో ప్రభుత్వం చట్టాన్ని సవరించి లంచం తీసుకోవడంతోపాటు లంచం ఇవ్వడాన్ని కూడా నేరంగా పరిగణించడంతో పాటు అనేక కొత్త నిబంధనలను ప్రవేశ పెట్టిందన్నారు. వ్యక్తులు కార్పొరేట్ సంస్థలు చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడకుండా సవరణలు సహకరిస్తాయన్నారు. 2015 స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీయే “స్టార్ట్అప్ ఇండియా స్టాండ్అప్ ఇండియా” అంటూ ఇచ్చిన పిలుపును గుర్తు చేసిన డాక్టర్ జితేంద్ర సింగ్ దేశవ్యాప్తంగా ఉద్యమంగా మారిందన్నారు. ప్రధానమంత్రి పిలుపుతో భారతదేశంలో స్టార్టప్ల సంఖ్య 2014లో 300 నుండి 400 కి పెరిగి నేడు 75,000కు పైగా పెరిగిందన్నారు. స్టార్టప్ రంగంలో భారతదేశం ప్రపంచంలో 3వ స్థానంలో ఉందని ఆయన తెలిపారు. అంతేకాకుండా, 2014లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అందించిన సహకారం, కల్పించిన వసతుల వల్ల దేశంలో బయోటెక్ స్టార్టప్ల సంఖ్య గత 8 సంవత్సరాలలో 50 నుంచి 5,000కు పెరిగిందన్నారు. 2025 నాటికి వీటి సంఖ్య 10,000 చేరే అవకాశం ఉందన్నారు. 2014 నాటికి కేవలం 10 బిలియన్ డాలర్లుగా ఉన్న బయో ఎకానమీ నేడు 80 బిలియన్ డాలర్ల స్థాయికి చేరిందని, 2025 నాటికి 100 బిలియన్ డాలర్లు చేరాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నామని డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు. ఉత్తరాఖండ్తో సహా హిమాలయ రాష్ట్రాలు సుగంధ స్టార్టప్లకు కేంద్రంగా మారాయని మంత్రి అన్నారు. , "పర్పుల్ రివల్యూషన్" లేదా "అరోమా మిషన్ " ద్వారా జమ్మూ,కాశ్మీర్ స్టార్ట్అప్ ఇండియాకు సహకారం అందిస్తోందని ఆయన అన్నారు. అరోమా మిషన్ దేశవ్యాప్తంగా స్టార్టప్లు, వ్యవసాయదారులను ఆకర్షిస్తోంది అని అన్నారు. ఈ రంగంలో 44,000 మందికి పైగా శిక్షణ పొందారని, అనేక కోట్ల మంది రైతుల ఆదాయం పెరిగిందని మంత్రి తెలిపారు. ఈశాన్య ప్రాంత అభివృద్ధికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. 100 ఏళ్ల నాటి భారతీయ అటవీ చట్టం పరిధి నుంచి ఇంట్లో పండించే వెదురును మినహాయించాలని శ్రీ మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందన్నారు. వెదురు రంగంలో వ్యాపారాన్ని సులభతరం చేయడంలో ప్రభుత్వ నిర్ణయం సహాయ పడిందన్నారు. విస్తారమైన సముద్ర వనరులు అన్వేషించడానికి గత ప్రభుత్వాలు చర్యలు తీసుకోలేదని డాక్టర్ జితేంద్ర సింగ్ ఆరోపించారు. శ్రీ నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా సముద్ర వనరులు అన్వేషణ, వినియోగం కోసం ప్రణాళిక రూపొందించారని మంత్రి తెలిపారు. దేశంలో నీలి ఆర్థిక వ్యవస్థకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి సాంప్రదాయిక విద్యా రంగంలో వచ్చిన మార్పులను డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు. 2014 ప్రారంభంలో దేశంలో 725 విశ్వవిద్యాలయాలు మాత్రమే ఉన్నాయన్నారు. ప్రతి వారం 1 కొత్త విశ్వవిద్యాలయం చొప్పున ప్రారంభించిన ప్రభుత్వం గత 9 సంవత్సరాల కాలంలో దేశంలో కొత్తగా 300 విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. 2004 నుంచి 2014 మధ్య దేశంలో 145 వైద్య కళాశాలలు ప్రారంభమయ్యాయని డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు. రోజుకు 1 వైద్య కళాశాల , రోజుకు 2 డిగ్రీ కళాశాల చొప్పున 260 కి పైగా వైద్య కళాశాలలు ప్రారంభించామని మంత్రి తెలిపారు. ప్రతి ఒక్కరికి విద్య అందుబాటులో ఉంది అని మంత్రి అన్నారు. సౌకర్యాలు అందుబాటులో లేనందున ఎవరూ విద్యకు దూరం కాకూడదు అన్నది తమ ప్రభుత్వ విధానం అని స్పష్టం చేశారు. జమ్మూ సెంట్రల్ యూనివర్శిటీ ఉత్తర భారతదేశంలో మొట్టమొదటి అంతరిక్ష బోధన విభాగాన్ని ప్రారంభించిందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.విద్య నుంచి డిగ్రీని డి-లింకింగ్ చేయడం నూతన జాతీయ విద్యా విధానం 2020 లక్ష్యాలలో ఒకటి అని చెప్పిన మంత్రి డిగ్రీని విద్య తో అనుసంధానించడం వల్ల మన విద్యా వ్యవస్థ,సమాజం నష్టపోయాయని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.విద్యా విధానం వల్ల చదువుకున్న నిరుద్యోగుల సంఖ్య పెరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలో భారతదేశం ఒక భాగంగా మారిపోయిందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా జీవించడానికి, ప్రపంచ సవాళ్లు ఎదుర్కోవడానికి భారతదేశం సిద్ధంగా ఉండాలన్నారు. వాతావరణ మార్పు, క్లీన్ ఎనర్జీ మొదలైన ప్రపంచ సమస్యల పరిష్కారానికి చర్యలు అవసరమన్నారు. గ్రీన్ హైడ్రోజన్ ప్రాధాన్యతను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుర్తించి దీనికి అనుగుణంగా ప్రణాళిక రూపొందించారని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. సమీప భవిష్యత్తులో గ్రీన్ హైడ్రోజన్ ప్రధాన ఎగుమతిదారుల్లో భారతదేశం ఒకటిగా ఉంటుందన్నారు. . జీ-20 కింద ఏర్పాటైన ఎనిమిది అధికారిక ఎంగేజ్మెంట్ గ్రూపులలో యూత్20 ఒకటని మంత్రి తెలిపారు. జీ-20 ప్రభుత్వాలు, ఆయా దేశాల్లో నివసిస్తున్న యువత మధ్య సంబంధాలు మెరుగు పరచడానికి యూత్-20 కృషి చేస్తుందని మంత్రి తెలిపారు. 2023 లో భారతదేశం నిర్వహించే వై-20 ఇండియా సదస్సు భారతదేశం అమలు చేస్తున్న యువత-కేంద్రీకృత చర్యలు వివరిస్తుందన్నారు.సదస్సు ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువతకు భారతదేశం విలువలు, విధానపరమైన చర్యలు తెలుసుకోవడానికి సదస్సు అవకాశం కల్పిస్తుందన్నారు. భారతదేశ భవిష్యత్తులో తమ పాత్ర ఏ విధంగా ఉండాలి అన్న అంశాన్ని యువత తమకు తాము నిర్ణయించుకుని లక్ష్య సాధన కోసం కృషి చేయాలని డాక్టర్ జితేంద్ర సింగ్ సూచించారు. దేశ భవిష్యత్తు కోసం తమ శక్తి సామర్ధ్యాలు పూర్తిగా ఉపయోగపడేలా యువత తమను తాము రూపొందించుకుని "నేను భారతదేశానికి@100 రూపశిల్పిని " అని గుర్తించి ముందుకు సాగాలని మంత్రి కోరారు.
pib-222617
b06e251551d5ab54f8331dd45ff6eb6e409151d33585b289746b1e9bdbc252e8
tel
మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా మహిళలకు రక్షణ కార్యాలయాల్లో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా మహిళలకు రక్షణ కల్పించడం మరియు దానికి సంబంధించిన ఫిర్యాదుల నివారణ మరియు పరిష్కారం కోసం - "పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల చట్టం, 2013" ను ప్రభుత్వం రూపొందించింది. ప్రభుత్వ, ప్రైవేట్, వ్యవస్థీకృత లేదా అసంఘటిత రంగంలో ఏ రకమైన పనిచేస్తున్నా, వారి హోదాతో సంబంధం లేకుండా, వారి వయస్సుతో సంబంధం లేకుండా మహిళలందరికీ ఈ చట్టం వర్తిస్తుంది. లైంగిక వేధింపుల నుండి సురక్షితమైన, భద్రతతో కూడిన పని వాతావరణాన్ని కల్పించడానికి, అన్ని ప్రభుత్వ లేదా ప్రైవేటు కార్యాలయాల యజమానులపై, ఈ చట్టాన్ని అమలు చేయవలసిన బాధ్యత ఉంటుంది. తద్వారా, ఉద్యోగులు / కార్మికుల సంఖ్య 10 కన్నా ఎక్కువగా ఉన్న ప్రతి సంస్థ యజమాని, ఒక అంతర్గత కమిటీ ను ఏర్పాటు చేయవలసి ఉంటుంది. అదేవిధంగా, పది మంది కంటే తక్కువ మంది కార్మికులు ఉన్న సంస్థల నుండి ఫిర్యాదులను స్వీకరించడానికి లేదా యజమాని పై ఫిర్యాదు చేయడానికి వీలుగా, ప్రతి జిల్లాలో స్థానిక కమిటీ ని ఏర్పాటు చేయడానికి, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉంటుంది. కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి. స్మృతి జుబిన్ ఇరానీ, ఈ రోజు రాజ్యసభకు సమర్పించిన లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయం తెలియజేశారు.
pib-100750
69872fefaf4ceeda021dda4731f657118105354baa49fbe295c34a521dffdabb
tel
కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ దేశంలో కార్మికుల ఫిర్యాదులను పరిష్కరించడానికి సమన్వయంతో కృషి చేయడానికి ఒక నోడెల్ అధికారిని నియమించాలని రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలను కోరిన శ్రీ సంతోష్ గాంగ్వార్. కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కోడానికి ప్రకటించిన లాక్ డౌన్ సందర్భంగా దేశంలో కార్మికుల ఫిర్యాదులను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం నెలకొల్పిన కంట్రోల్ రూములతో సమన్వయంతో పనిచేయడానికి కార్మిక శాఖ నుండి ఒక నోడెల్ అధికారిని నియమించాలని రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్ర కార్మిక, ఉపాధి శాఖల సహాయమంత్రి శ్రీ సంతోష్ గాంగ్వార్ కోరారు. ఈ మేరకు ఆయన అన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల కార్మిక శాఖా మంత్రులకు నిన్న ఒక లేఖ వ్రాస్తూ, కార్మిక శాఖ లోని ఆ అధికారులు దేశవ్యాప్తంగా ఉన్న 20 కంట్రోలు రూములతో సన్నిహిత సంబంధం కలిగి ఉండాలని సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో కృషి చేయవలసిన అవసరాన్ని శ్రీ గాంగ్వార్ నొక్కి చెబుతూ - " కార్మికుల ఫిర్యాదులు పరిష్కరించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలని కోరడమైనది." - అని అన్నారు. కోవిడ్-19 నేపథ్యంలో ఎదురౌతున్న కార్మికుల సమస్యల పరిష్కారానికి చీఫ్ లేబర్ కమీషనర్ నేతృత్వంలో పాన్ ఇండియా ప్రాతిపదికన కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ ఇటీవల 20 కంట్రోల్ రూములను నెలకొల్పింది. ప్రారంభంలో ఈ కంట్రోల్ రూములు కేంద్రం పరిధిలోని వేతనాలకూ, వలస కార్మికులకూ సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించేవి. అయితే, గత కొన్ని రోజులుగా ఈ కంట్రోల్ రూముల పని తీరు గమనిస్తే, నిన్నటి దాకా 20 కంట్రోల్ రూములలో దాఖలైన మొత్తం 2,100 ఫిర్యాదులలో, 1400 పిర్యాదులు వివిధ రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించినవే ఉన్నాయి. ఈ నేపథ్యంలో, కార్మిక వ్యవహారాలు ఉమ్మడి విషయమైనందున, ఈ ఫిర్యాదుల పరిష్కారానికి వివిధ రాష్ట్ర / కేంద్ర పాలిట ప్రాంతాల ప్రభుత్వాలతో సరైన సమన్వయము ఏర్పాటు చేయడం చాలా ముఖ్యమని భావించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నియమించిన అధికారుల వివరాలతో పాటు ఈ 20 కంట్రోల్ రూముల జాబితాను కూడా మంత్రి ఈ సందర్భంగా వివిధ రాష్ట్ర / కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు పంపించారు.
pib-183173
0afb8ce21efb255b54ad65393e5f90c9facae6a29a53fa0d122c31bd12d9e4c4
tel
ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ 'ఆత్మనిర్భర్ భారత్ యాప్ ఆవిష్కరణ పోటీ'కి 6940 దరఖాస్తులు 'ఆత్మనిర్భర్ భారత్ యాప్ ఆవిష్కరణ పోటీ'ని, ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఈనెల 4వ తేదీన ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలు, స్టార్టప్ సంస్థల నుంచి భారీగా ఉత్సాహభరిత స్పందన వచ్చింది. దరఖాస్తుల గడువు ఈనెల 26వ తేదీతో ముగిసింది. 8 విభాగాల్లో మొత్తం 6940 దరఖాస్తులు వచ్చాయి. వ్యక్తిగతంగా 3939 దరఖాస్తులు, సంస్థల నుంచి 3001 దరఖాస్తులు వీటిలో ఉన్నాయి. వ్యక్తిగతంగా వచ్చిన దరఖాస్తుల్లో.., 1757 యాప్లు వినియోగానికి సిద్ధంగా ఉండగా, మిగిలిన 2182 వృద్ధి దశలో ఉన్నాయి. సంస్థలు సమర్పించిన వాటిలో 1742 యాప్లు సిద్ధంగా ఉండగా, మిగిలిన 1259 వృద్ధి దశలో ఉన్నాయి. విభాగాల వారీగా చూస్తే... వ్యాపార రంగంలో 1142, ఆరోగ్య రంగంలో 901, ఈ లెర్నింగ్ కింద 1062, సామాజిక మాధ్యమాల విభాగంలో 1155, ఆటల విభాగంలో 326, కార్యాలయం& ఇంటి నుంచే పని విభాగంలో 662, వార్తల రంగంలో 237, వినోద రంగంలో 320 యాప్లు ఉన్నాయి. ఇతర విభాగాల కింద 1135 యాప్లు వచ్చాయి. వీటిలో 271 యాప్లకు లక్ష కంటే ఎక్కువ డౌన్లోడ్లు, 89 యాప్లకు పది లక్షలను మించి డౌన్లోడ్లు ఉన్నాయి. మారుమూల ప్రాంతాలు, చిన్న పట్టణాల నుంచి కూడా దరఖాస్తులు వచ్చాయి. పోటీ కోసం వచ్చిన యాప్ల సంఖ్య మనదేశంలో ఉన్న ప్రతిభకు నిదర్శనం. మన దేశాన్ని అత్యుత్తమ స్థాయిలో నిలపడానికి భారతీయ సాంకేతిక వృద్ధిదారులు, పారిశ్రామికవేత్తలు, సంస్థలకు ఇది సరైన అవకాశం. వివిధ ప్రమాణాల ఆధారంగా, నిపుణుల కమిటీలు ఈ యాప్లను పరిశీలిస్తున్నాయి. ఆత్మనిర్భర్ భారత్ వ్యవస్థ, భారతీయ సాంకేతిక వృద్ధి అంకురాల విలువను చాటగల సామర్థ్యాన్ని కలిగివుంది. ఎన్నో ట్రిలియన్ డాలర్ల విలువైన యాప్ ఆర్థిక వ్యవస్థలోకి అడుగిడడానికి వాటికి సాయపడుతుంది. అత్యధిక యాప్ డౌన్లోడ్లు ఉన్న మూడు అత్యుత్తమ సంస్థలు, ఈ ఏడాది దాదాపు రెండు ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువను కలిగివున్నాయి. దీంతోపాటు, వేగంగా వృద్ధి చెందుతున్నాయి.
pib-185792
8fe1ac25b1039158577d0518f75d66e83f38ea9003e15b10c64c3f64d605d669
tel
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ దేశంలో కోవిడ్ చికిత్సలో ఉన్నవారి సంఖ్య క్రమంగా తగ్గుతూ 1.41 లక్షలకు చేరిక 33 రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో చికిత్సలో ఉన్నది 5,000 లోపు 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో గత 24 గంటలలో మరణాలు సున్నా 66 లక్షలకంటే ఎక్కువమందికి కోవిడ్ టీకాలు భారతదేశంలో కోవిడ్ తో బాధపడుతూ చికిత్స అందుకుంటున్నవారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం చికిత్సలో ఉన్నవారి సంఖ్య తగ్గుతూ ప్రస్తుతం 1,41,511 కి చేరింది. ఇది మొత్తం పాజిటివ్ కే సులలో కేవలం 1.30%. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ధోరణికి అనుగుణంగా 33 రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో చికిత్సలో ఉన్నది 5,000 లోపు మాత్రమే. డామన్, డయ్యూ, దాద్రా, నాగర్ హవేలి లో ఒక్క కేసు కూడా లేదు. గత 24 గంటలలో 11,067 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 13,087 మంది కోలుకున్నారు. దీనివలన చికిత్సలో ఉన్నవారి సంఖ్య నికరంగా 2,114 కేసులు తగ్గాయి. రెండు రాష్ట్రాలకు మొత్తం చికిత్సలో ఉన్న కేసుల్లో 71% వాటా ఉంది. గత 24 గంటలలో 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఒక్క మరణం కూడా నమోదు కాలేదు. అవి: ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, జమ్మూ-కశ్మీర్, జార్ఖండ్, పుదుచ్చేరి, మణిపూర్, నాగాలాండ్, లక్షదీవులు, మేఘాలయ, సిక్కిం, అండమాన్, నికోబార్ దీవులు, లద్దాఖ్, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, డయ్యూ-డామన్, దాద్రా-నాగర్ హవేలి భారతదేశంలో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 1,05,61,608 కాగా, కోలుకున్నవారి శాతం 97.27%. 2021 ఫిబ్రవరి 10 ఉదయం 8గంటలకు 66,11,561 మంది కోవిడ్ టీకాలు అందుకున్నారు. | | క్రమ సంఖ్య | | రాష్ట్రం/కేంద్రపాలిప్రాంతం | | టీకా లబ్ధిదారులు | | 1 | | అండమాన్, నికోబార్ దీవులు | | 3,413 | | 2 | | ఆంధ్రప్రదేశ్ | | 3,25,538 | | 3 | | అరుణాచల్ ప్రదేశ్ | | 13,480 | | 4 | | అస్సాం | | 1,08,887 | | 5 | | బీహార్ | | 4,15,989 | | 6 | | చండీగఢ్ | | 6,458 | | 7 | | చత్తీస్ గఢ్ | | 1,98,567 | | 8 | | దాద్రా,నాగర్ హవేలి | | 1,697 | | 9 | | డామన్, డయ్యూ | | 843 | | 10 | | ఢిల్లీ | | 1,32,046 | | 11 | | గోవా | | 8,929 | | 12 | | గుజరాత్ | | 5,72,412 | | 13 | | హర్యానా | | 1,80,663 | | 14 | | హిమాచల్ ప్రదేశ్ | | 61,271 | | 15 | | జమ్మూ, కశ్మీర్ | | 74,219 | | 16 | | జార్ఖండ్ | | 1,43,401 | | 17 | | కర్నాటక | | 4,41,692 | | 18 | | కేరళ | | 3,22,016 | | 19 | | లద్దాఖ్ | | 2,309 | | 20 | | లక్షదీవులు | | 920 | | 21 | | మధ్యప్రదేశ్ | | 3,80,285 | | 22 | | మహారాష్ట్ర | | 5,36,436 | | 23 | | మణిపూర్ | | 11,078 | | 24 | | మేఘాలయ | | 9,069 | | 25 | | మిజోరం | | 11,046 | | 26 | | నాగాలాండ్ | | 5,826 | | 27 | | ఒడిశా | | 3,42,254 | | 28 | | పుదుచ్చేరి | | 4,301 | | 29 | | పంజాబ్ | | 87,181 | | 30 | | రాజస్థాన్ | | 4,91,543 | | 31 | | సిక్కిం | | 6,961 | | 32 | | తమిళనాడు | | 1,85,577 | | 33 | | తెలంగాణ | | 2,43,665 | | 34 | | త్రిపుర | | 51,449 | | 35 | | ఉత్తరప్రదేశ్ | | 6,73,542 | | 36 | | ఉత్తరాఖండ్ | | 85,359 | | 37 | | పశ్చిమ బెంగాల్ | | 4,04,001 | | 38 | | ఇతరములు | | 67,238 | | మొత్తం | | 66,11,561 ఇప్పటివరకు మొత్తం టీకాలు వేయించుకున్నవారి సంఖ్య 66,11,561 కాగా, వారిలో 56,10,134 మంది ఆరోగ్య సిబ్బంది, 10,01,427 మంది కరోనా యోధులు ఉన్నారు. ఇప్పటివరకు 1,34,746 శిబిరాలు నిర్వహించారు. 25వ రోజైన ఫిబ్రవరి 9న దేశవ్యాప్తంగా 3,52,553 మంది టీకాలు తీసుకున్నారు. వారిలో ఆరోగ్య సిబ్బంది 1,28,032 కాగా, కరోనా యోధులు వస్తోందిగా 2,24,521మంది. వీరికోసం నడిపిన శిబిరాలు 7,990. రోజూ టీకాలు తీసుకుంటున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. కొత్తగా కోలుకున్నవారిలో 81.68% మంది కేవలం 6 రాష్ట్రాలకు చెందినవారు కాగా కేరళలో అత్యధికంగా ఒకే రోజు 6,475 మంది కోలుకున్నారు. మహారాష్ట్రలో 2,554 మంది, కర్నాటకలో 513 మంది కోలుకున్నారు. కొత్తగా పాజిటివ్ నిర్థారణ అయినవారిలో 83.31% మంది ఆరు రాష్ట్రాలకు చెందినవారున్నారు. కేరళలో అత్యధికంగా 5,214 కేసులు రాగా, మహారాష్ట్రలో 2,515 మంది, తమిళనాడులో 469 మంది పాజిటివ్ గా తేలారు. గత 24 గంటలలో 94 మంది కోవిడ్ బాధితులు చనిపోయారు.. ఆరు రాష్ట్రాల్లోనే 80.85% మరణాలు నమోదయ్యాయి.. అత్యధికంగా మహారాష్ట్రలో 35 మంది, ఆ తరువాత కేరళలో 19 మంది, పంజాబ్ లో 8 మంది చనిపోయారు.
pib-219353
c782c9acd0a33456dfa29b1bbde78d16f39410e6e9ca513da663853a194f342a
tel
పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ మేరీ లైఫ్ యాప్ను ప్రారంభించిన శ్రీ భూపేందర్ యాదవ్ పర్యావరణ పరిరక్షణకు వ్యక్తిగత మరియు సామాజిక చర్యలను ప్రోత్సహించడానికి ప్రధానమంత్రి స్ఫూర్తితో ప్రపంచ ప్రజా ఉద్యమం మిషన్ లైఫ్లో జరుగుతున్న పురోగతిని ట్రాక్ చేయడానికి నిర్మాణాత్మక మార్గాన్ని రూపొందించడంలో మేరీ లైఫ్ యాప్ సహాయపడుతుంది: శ్రీ యాదవ్ జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వాతావరణ మార్పుల కోసం యువత కార్యాచరణను ఉత్ప్రేరకపరచడానికి, కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ “మేరీ లైఫ్” అనే మొబైల్ అప్లికేషన్ను ప్రారంభించారు. కాప్ 26లో ప్రధానమంత్రి ఊహించిన లైఫ్ అనే భావనతో ఈ యాప్ స్ఫూర్తి పొందింది. ఇది బుద్ధిహీనమైన మరియు వ్యర్థమైన వినియోగానికి బదులుగా బుద్ధిపూర్వక మరియు ఉద్దేశపూర్వక వినియోగాన్ని నొక్కి చెబుతుంది. ఈ సందర్భంగా శ్రీ యాదవ్ మాట్లాడుతూ ఈ యాప్ పౌరులు, ముఖ్యంగా యువత పర్యావరణాన్ని కాపాడే శక్తిని చాటిచెబుతుందని అన్నారు. ఈ యాప్ ద్వారా రోజువారీ జీవితంలో సాధారణ చర్యలు పెద్ద వాతావరణ ప్రభావాన్ని చూపుతాయని కూడా ఆయన పేర్కొన్నారు. పోర్టల్ మరియు యాప్ కలిసి లైఫ్ కోసం జాతీయ ఉద్యమాన్ని నడిపిస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. మిషన్ లైఫ్ ని ప్రధానమంత్రి 20 అక్టోబర్ 2022న గుజరాత్లోని కెవాడియాలో ప్రారంభించారు మరియు సులభమైన చర్యల ద్వారా వ్యక్తులలో ప్రవర్తన మార్పులను తీసుకురావడంపై దృష్టి సారిస్తున్నారు. పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ జాతీయ స్థాయి సమన్వయం మరియు మిషన్ లైఫ్ అమలు కోసం నోడల్ మంత్రిత్వ శాఖగా వ్యవహరిస్తొంది. వారి అమలు ప్రయత్నాలలో భాగంగా, మంత్రిత్వ శాఖ కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, సంస్థలు మరియు ప్రైవేట్ సంస్థలను వారి కార్యకలాపాలను శ్రీ భూపేందర్ యాదవ్ తో సమం చేయడానికి మరియు వ్యక్తులు చేపట్టగల స్థిరమైన చర్యల గురించి అవగాహన కల్పించడానికి సమీకరించింది. పాన్-ఇండియా న్యాయవాదం మరియు లైఫ్ గురించి అవగాహనను మరింత ఉత్ప్రేరకపరచడానికి, ప్రస్తుతం నెల రోజుల పాటు భారీ సమీకరణ డ్రైవ్ జరుగుతోంది మరియు 5 జూన్ 2023న ప్రపంచ పర్యావరణ దినోత్సవం యొక్క మెగా వేడుకలో ముగుస్తుంది. లైఫ్ లో జరుగుతున్న పురోగతిని ట్రాక్ చేయగల నిర్మాణాత్మక రిపోర్టింగ్ ఆకృతిని రూపొందించడానికి మంత్రిత్వ శాఖ రెండు ప్రత్యేక పోర్టల్లను అభివృద్ధి చేసింది. మిషన్ లైఫ్ పోర్టల్ ఓపెన్ యాక్సెస్ మరియు లైఫ్ కోసం మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిన 100+ క్రియేటివ్లు, వీడియోలు మరియు నాలెడ్జ్ మెటీరియల్లను డౌన్లోడ్ చేయడానికి ఉపయోగించవచ్చు. మంత్రిత్వ శాఖలు మరియు సంస్థల కోసం ఈవెంట్ నివేదికలను అప్లోడ్ చేయడానికి మరియు మాస్ మొబిలైజేషన్ డ్రైవ్ పురోగతిని సంగ్రహించడానికి మేరీ లైఫ్ పోర్టల్ అభివృద్ధి చేయబడింది. 10 రోజుల్లో, భారతదేశం అంతటా 1,00,000 కంటే ఎక్కువ లైఫ్-సంబంధిత సంఘటనలు జరిగాయి, భూమికి అనుకూల చర్యలు తీసుకోవడానికి 1.7 మిలియన్ల మంది వ్యక్తులను సమీకరించారు. వీటిలో క్లీన్నెస్ డ్రైవ్లు, సైకిల్ ర్యాలీలు, ప్లాంటేషన్ డ్రైవ్లు, లైఫ్ మారథాన్లు, ప్లాస్టిక్ కలెక్షన్ డ్రైవ్లు, కంపోస్టింగ్ వర్క్షాప్లు మరియు లైఫ్ ప్రతిజ్ఞ తీసుకోవడం వంటివి ఉన్నాయి. అనేక పాఠశాలలు మరియు కళాశాలలు వీధి నాటకాలు, వ్యాసాలు, పెయింటింగ్లు మరియు యువజన పార్లమెంటులు వంటి సాంస్కృతిక పోటీలను కూడా నిర్వహిస్తున్నాయి. పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీమతి లీనా నందన్ సమక్షంలో మేరీ లైఫ్ యాప్ ప్రారంభం జరిగింది; శ్రీ సి.పి. గోయల్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్ మరియు స్పెషల్ సెక్రటరీ మరియు యూనిసెఫ్ ఇండియా, యూత్ డెవలప్మెంట్ మరియు పార్ట్నర్షిప్ల జెన్ యు చీఫ్ దువారాఖ శ్రీరామ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మేరీ లైఫ్ యాప్ మిషన్ లైఫ్లో జరుగుతున్న పురోగతిని ట్రాక్ చేయడానికి నిర్మాణాత్మక మార్గాన్ని రూపొందించడంలో సహాయపడుతుంది. విజయవంతమైన సైన్-అప్ తర్వాత, వినియోగదారులు ఈ క్రింది 5 థీమ్ల క్రింద లైఫ్ సంబంధిత పనుల శ్రేణిలో పాల్గొనేలా మార్గనిర్దేశం చేయబడతారు. అవి, శక్తిని ఆదా చేయడం, నీటిని ఆదా చేయడం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను తగ్గించడం, స్థిరమైన ఆహార వ్యవస్థలను స్వీకరించడం మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించడం. గేమిఫైడ్ అనుభవం ద్వారా, యాప్ 5 కోసం 5 ఛాలెంజ్లను స్వీకరించడానికి ప్రజలను ప్రోత్సహిస్తుంది- జూన్ 5 నాటికి ఐదు జీవిత చర్యలను తీసుకోండి. యాప్ గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉంది. జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2023 సందర్భంగా భారీ సమీకరణతో కార్యక్రమం ముగుస్తుంది. ఈ సంవత్సరం థీమ్ ప్లాస్టిక్ కాలుష్యానికి పరిష్కారాలు, ఈ అంశం మిషన్ లైఫ్ యొక్క 7 థీమ్లలో ఒకదానితో సమలేఖనం చేయబడింది: “ఒకేసారి ఉపయోగించే ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని తగ్గించడం”. అస్సాంలోని కర్బీ తెగల విద్యార్థులకు మిషన్ లైఫ్ గురించి అవగాహన ఆంధ్రప్రదేశ్లోని కొండవీడులో ప్లాస్టిక్ సేకరణ ప్రచారం జమ్మూ & కాశ్మీర్లోని నగ్రిమల్పోరా గ్రామంలో క్లీన్లీనెస్ డ్రైవ్ ఉత్తరప్రదేశ్లోని సహరన్పూర్లో మిషన్ లైఫ్ సైకిల్ ర్యాలీ లడఖ్లోని లేహ్ మెయిన్ మార్కెట్లో మిషన్ లైఫ్ కింద అవగాహన & యాక్షన్ డ్రైవ్ కేరళలోని కోజికోడ్ జిల్లాలో బీచ్ క్లీనింగ్ క్యాంపెయిన్ నిర్వహించబడింది ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో లైఫ్ ప్లెడ్జ్ జోన్ సెటప్ సిక్కింలోని గ్యాంగ్టక్లో మిషన్ లైఫ్ అవగాహన ప్రచారం న్యూ ఢిల్లీలో లైఫ్లో ఆన్-ది-స్పాట్ పెయింటింగ్ పోటీ రాజస్థాన్లోని సికార్లో లైఫ్ వర్క్షాప్ నిర్వహించారు పంజాబ్లోని లూథియానాలో పోస్టర్ మేకింగ్ పోటీ భువనేశ్వర్లోని రీజనల్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీని సందర్శించే సందర్శకులు లైఫ్ ప్రతిజ్ఞ తీసుకుంటున్నారు.
pib-207571
b0df83286af997bcfb37aef8a35813844c6f934a726c29f0b1ac98b2ab7598e3
tel
ఆర్థిక మంత్రిత్వ శాఖ రైల్వేల కోసం రికార్డ్ స్థాయిలో రూ.2.40 లక్షల కోట్ల మూలధన వ్యయం 100 కీలక రవాణా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు గుర్తింపు మౌలిక సదుపాయాల సమన్వయ బృహత్ జాబితాపై నిపుణుల సంఘం సమీక్ష అభివృద్ధి & ఉపాధి మీద మౌలిక సదుపాయాలు, ఉత్పాదక సామర్థ్యంలో పెట్టుబడులు గణనీయ ప్రభావం చూపుతాయి. మహమ్మారి కాలం నాటి స్తబ్ధత తర్వాత ప్రైవేట్ పెట్టుబడులు మళ్లీ పెరుగుతున్నాయి. ఇవాళ పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ 2023-24 ప్రసంగం సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. రైల్వేలు రైల్వేల కోసం ₹2.40 లక్షల కోట్ల మూలధన వ్యయం చేసినట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. 2013-14లో చేసిన వ్యయం కంటే ఈ వ్యయం దాదాపు 9 రెట్లు ఎక్కువని వెల్లడించారు. రవాణా & ప్రాంతీయ అనుసంధానత ఓడరేవులు, బొగ్గు, ఉక్కు, ఎరువులు, ఆహార ధాన్యాల రంగాల్లో మొదటి మైలురాయి నుంచి చివరి మైలురాయి అనుసంధానత వరకు వంద కీలక రవాణా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను గుర్తించడం జరిగింది. ప్రైవేట్ రంగం నుంచి ₹15,000 కోట్లు సహా మొత్తం ₹75,000 కోట్ల పెట్టుబడితో ప్రాధాన్యత క్రమంలో వీటిని పూర్తి చేయడం జరుగుతుంది. ప్రాంతీయ ఆకాశ మార్గ అనుసంధానతను మెరుగుపరచడానికి అదనంగా యాభై విమానాశ్రయాలు, హెలిపోర్టులు, వాటర్ ఏరోడ్రోమ్లు, అధునాతన ల్యాండింగ్ క్షేత్రాలను ఏర్పాటు చేస్తామని ఆర్థిక మంత్రి తెలిపారు. మౌలిక సదుపాయాల సమన్వయ బృహత్ జాబితా మౌలిక సదుపాయాల సమన్వయ బృహత్ జాబితాను నిపుణుల సంఘం సమీక్షిస్తుందని శ్రీమతి సీతారామన్ చెప్పారు. అమృత కాలానికి తగిన వర్గీకరణ, ఆర్థిక సాయాల విధివిధానాలను సంఘం సిఫారసు చేస్తుందని వెల్లడించారు.
pib-200261
822dfe1058361919dc589415d0dc62d47c0e0ad38e5b69981ca0891c00266195
tel
అంతరిక్ష విభాగం పరిశోధన లో సహకరించుకోవడం కోసం ఇండియన్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ ఎండ్ టెక్నాలజీ కి, నెదర్లాండ్స్ కు చెందిన డెఫ్ట్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ కు మధ్య సంతకాలు అయిన అవగాహన పూర్వక ఒప్పంద పత్రాని కి కు మంత్రిమండలి తెలిపిన ఆమోదానికి సంబంధించి ఇండియన్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ ఎండ్ టెక్నాలజీ కి, నెదర్లాండ్స్ కు చెందిన ద డెఫ్ట్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ కి చెందిన విద్యార్థులు, ఫేకల్టీ సభ్యుల ద్వారా విద్య సంబంధి కార్యక్రమాల ను, పరిశోధన కార్యకలాపాల ను చేపట్టడానికి గాను ఆ రెండు సంస్థల లోను గత ఏప్రిల్ 9వ తేదీ నాడు మరియు గత మే 17వ తేదీ నాడు సంతకాలు జరిగి, ఇ-మెయిల్ మాధ్యమం ద్వారా ఇచ్చి పుచ్చుకొన్న అవగాహన పూర్వక ఒప్పంద పత్రాని కి కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. ఎమ్ఒయు తాలూకు వివరాలు: - విద్యార్థుల ఆదాన ప్రదాన కార్యకమం: ఉభయ పక్షాలు అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిల లోను, డాక్టరేట్ స్థాయి లోను విద్యార్థుల ను పరస్పరం ఆదాన, ప్రదానాలు చేసుకొనే వీలు ఉంది. రెండు పక్షాలు పరస్పరం చర్చించుకొని ఈ పథకం లో భాగం గా అధ్యయనం చేపట్టవలసిన రంగాల పై, క్రెడిట్ ల పై నిర్ణయం తీసుకొంటాయి. రెండు పక్షాలు డిగ్రీ శిక్షణ కోసం ఉద్దేశించినటువంటి ఒక ‘ప్రాక్టీకమ్ ఎక్స్ చేంజ్ ప్రోగ్రామ్’ లో భాగం గా ఆతిథేయి భాగస్వామి యొక్క శిక్షణ ప్రణాళిక ను, నియమాల ను అనుసరించవలసి ఉంటుంది. - రెండేసి డిగ్రీ లు/ రెండు రకాల డిగ్రీ ల కార్యక్రమం: ఉభయ పక్షాలు అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ని గాని, లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ని గాని ప్రదానం చేసే ఉద్దేశ్యం తో విద్యార్థుల కోసం ప్రత్యేకించినటువంటి ఒక పాఠ్యక్రమాన్ని తీర్చిదిద్దేందుకు వీలు ఉంటుంది. ఇది మాతృ సంస్థ ప్రదానం చేసే ప్రారంభిక డిగ్రీ కి అదనం గా ఉంటుంది. - ఇంటర్న్ శిప్స్ - ప్రాజెక్ట్ వర్కు: రెండు పక్షాలు ఇంజినీరింగ్ ప్రాజెక్టు అసైన్ మెంట్ లతో ముడిపడ్డ పరిశోధనల ను సిద్ధం చేయవచ్చు; తీర్చిదిద్దవచ్చును. వీటి ని విద్యార్థుల ద్వారా భాగస్వామ్య సంస్థ లో వారు స్వల్ప కాలికమైనటువంటి ప్రవాస కాలం లో ను, దీర్ఘ కాలికమైనటువంటి ప్రవాసం లోను చేపట్టడానికి అవకాశం ఉంటుంది. - ఫేకల్టీ ఎక్స్ చేంజ్ ప్రోగ్రామ్: ఇరు పక్షాలు ‘ ఫేకల్టీ ఎక్స్ చేంజ్ ప్రోగ్రామ్ ’ విషయ మై పరిశీలన జరపవచ్చును. ఆ దశ లో వారి ఫేకల్టీ మెంబరు భాగస్వామ్య సంస్థ లో విభిన్నమైనటువంటి పాఠ్యక్రమాల ను అందిస్తారు. దీనికి గాను పాఠ్యక్రమం లో ఏమేమి ఉండాలి అనేది సంయుక్తం గా అభివృద్ధిపరచడం జరుగుతుంది. - సంయుక్త పరిశోధన: రెండు సంస్థల కు చెందిన ఫేకల్టీ సభ్యులు ఉమ్మడి ఆసక్తి కలిగిన రంగాల లో సంయుక్త పరిశోధన కార్యక్రమాన్ని గుర్తించేందుకు అవకాశం ఉంటుంది. ప్రయోజనాలు: ఈ ఒప్పందం పై సంతకాలు జరగడం వల్ల ఇక సహకారం పట్ల ఆసక్తి వ్యక్తం అయ్యే ఈ కింది రంగాల లో ముందంజ వేసేందుకు మార్గం సుగమమం అవుతుంది. ఆయా రంగాలు ఏమేమిటి అంటే, ఫేకల్టీ సభ్యుల, విద్యార్థుల, పరిశోధకుల తో పాటు విజ్ఞాన శాస్త్ర సంబంధి సామగ్రి, ప్రచురణలు మరియు సమాచారాన్ని ఒక పక్షానికి మరొక పక్షం ఇచ్చిపుచ్చుకోవడం లో తోడ్పాటు లభించగలదు. కలసి పరిశోధనలకు సంబంధించిన సమావేశాలను నిర్వహించడం, పిహెచ్. డి కార్యక్రమం, రెండేసి డిగ్రీలు/ రెండు డిగ్రీల కార్యక్రమం కూడా. ఈ ఒప్పందం ద్వారా నెదర్లాండ్స్ కు చెందిన అతి పురాతనమైన మరియు అన్నింటి కంటే పెద్దదైన డచ్ సార్వజనిక సాంకేతిక విజ్ఞాన విశ్వవిద్యాలయం అయినటువంటి ఇడబ్ల్యుఐ, టియూ డెఫ్ట్ తో సహకారానికి పూచీ లభించినందువల్ల విజ్ఞాన శాస్త్రం మరియు సాంకేతిక విజ్ఞాన రంగం లో పరిశోధన పరంగా ఒక సంయుక్త ప్రక్రియ ను అభివృద్ధిపరచేందుకు వీలు చిక్కుతుంది. దీని ద్వారా దేశం లో అన్ని వర్గాల కు, ప్రాంతాల కు లబ్ధి చేకూరుతుంది. సంతకాలు అయిన ఈ ఒప్పందం ద్వారా విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక విజ్ఞాన రంగం లో కొత్త కొత్త పరిశోధక కార్యకలాపాల ను మరియు ఎప్లికేశన్ సంబంధి సంభావనల ను వెదకేందుకు చాలా ప్రోత్సాహం లభించనుంది.
pib-120617
dc23067e17a9b22033ef96d7938662adb8dc49d6c229632703cd984dabe23832
tel
ప్రధాన మంత్రి కార్యాలయం గుజరాత్లోని గాంధీనగర్ మహాత్మా మందిర్కన్వెన్షన్ వద్దజరిగిన డిఫెన్స్ ఎక్స్పో 22ను ప్రారంభించిన ప్రధానమంత్రి హిందూస్థాన్ ఎయిరో నాటిక్స్లిమిటెడ్ రూపొదించిన దేశీయ శిక్షణ విమానం హెచ్ టిటి -40ని ఆవిష్కరించిని ప్రధానమంత్రి మిషన్ డిఫెస్పేస్ను ప్రారంభించిన ప్రధానమంత్రి దీశా ఎయిర్ఫీల్డ్కు శంకుస్థాపన “భారతీయ కంపెనీలు మాత్రమే పాల్గొంటున్న తొలి డిఫెన్స్ ఎక్స్ పో ఇది. ఇందులో ఇండియాలో తయారైన పరికరాలను మాత్రమే ప్రదర్శనకు ఉంచారు.” డిఫెన్స్ ఎక్స్ పో ఇండియాపై అంతర్జాతీయంగా ఉన్న నమ్మకానికి నిదర్శనం ఇండియా -ఆఫ్రికాలమధ్య సంబంధాలు మరింత బలపడి, కొత్త పుంతలు తొక్కుతున్నాయి. దీశాలో ఆపరేషనల్ బేస్ ఏర్పాటుతో మన బలగాల ఆకాంక్షలు నేడు నెరవేరాయి అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానంలో ఎదురయ్యే సవాళ్లను త్రివిధ దళాలు సమీక్షించి , గుర్తించాయి. “స్పేస్ టెక్నాలజీ భారతదేశపు ఉదార అంతరిక్ష దౌత్యానికి కొత్త నిర్వచనాన్ని ఇస్తోంది.,” రక్షణ రంగంలో, నవభారతదేశం అంతర్జాలం, ఆవిష్కరణ, అమలు మంత్రంతో ముందుకు దూసుకువెళుతోంది. “ మనం రాగల సంవత్సరాలలో 5 బిలియన్ డాలర్ల లక్ష్యాన్ని అంటే 40 వేల కోట్ల రూపాయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ, గుజరాత్ గాంధీనగర్లోని మహాత్మామందిర్కన్వెన్షన్ , ఎగ్జిబిషన్ సెంటర్ వద్ద డిఫెఎక్స్పో 22ను ఈరోజు ప్రారంభించారు. ఇండియన్ పెవిలియన్ వద్ద ప్రధానమంత్రి హెచ్ టిటి -40 ని ఆవిష్కరించారు. ఇది హిందూస్థాన్ ఏరో నాటిక్స్ లిమిటెడ్ రూపకల్పన చేసిన శిక్షణ ఎయిర్ క్రాఫ్ట్. ఈ కార్యక్రమం సందర్భంగా ప్రధానమంత్రి డిషన్ డిఫె స్పేస్, ను కూడా ప్రారంభించారు. అలాగే గుజరాత్లోని దీశా వైమనాకి స్థావరానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రధానమంత్రి, ఆత్మనిర్భర్ భారత్ కు చెందిన ఈ కార్యక్రమానికి అతిథులను ప్రధానమంత్రిగా, గుజరాత్ బిడ్డగా స్వాగతం పలుకుతున్నట్టు చెప్పారు.. డిఫెన్స్ ఎక్స్ పో 2022 నిర్వహణ గురించి చెబుతూ ప్రధానమంత్రి, నవభారత దేశ సామర్ధ్యానికి ఇది ప్రతీక అన్నారు. అమృత్ కాల్ లో చెప్పుకున్న సంకల్పానికి ప్రతిరూపం అని అన్నారు. రాష్ట్రాల సహకారం, దేశ ప్రగతి రెండింటి సమ్మేళనమే ఇది అని ఆయన అన్నారు. యువత కలలు, శక్తి , సామర్ధ్యాలు, సంకల్పాలు ఇందులో ఉన్నాయని అన్నారు. ఆశావహదృక్పథం, స్నేహపూర్వక దేశాలకు అవకాశాలు ఇందులో కనిపిస్తాయన్నారు. డిఫెక్స్పో ఎడిషన్ ప్రత్యేకతలను ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, ఇది తొలి డిఫెన్స్ ఎక్స్పో అని, భారతీయ కంపెనీలు ఇందులో పాల్గొంటున్నాయని చెప్పారు. ఇండియాలో తయారైనవి మాత్రమే ఇందులో ప్రదర్శనకు ఉంచినట్టు చెప్పారు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ పుట్టిన భూమి నుంచి భారతదేశ సామర్ధ్యాలను మనం ప్రపంచం ముందు ఉంచుతున్నామని ఆయన అన్నారు. ఈ ఎక్స్పో లో 1300 మందికి పైగా ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారు. ఇందులో ఇండియా రక్షణ పరిశ్రమ ఎగ్జిబిటర్లు, భారత రక్షణ పరిశ్రమతో అనుసంధానమైన సంయుక్త రంగ సంస్థలు, ఎం.ఎస్.ఎం.ఇలు, వందకు పైగా స్టార్టప్ సంస్థలు ఉన్నాయి. ఒక సింగిల్ ఫ్రేమ్లో భారత దేశ సామర్ధ్యం, అవకాశాలు ఇక్కడ కళ్లకు కట్టినట్టు కనిపిస్తాయని ప్రధానమంత్రి అన్నారు.మున్నెన్నడూ లేనంతగా 400 ఎం.ఒ.యులపై సంతకాలు జరగనున్నట్టుకూడా ప్రధానమంత్రి చెప్పారు. ఈ ఎక్స్ పోకు వివిధ దేశాలనుంచి వచ్చిన సానుకూల స్పందనను ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, ఇండియా తన కలలకు ఒక రూపాన్ని ఇస్తున్నప్పుడు ఆఫ్రికానుంచి 53 మిత్ర దేశాలు తమతో అడుగు ముందుకువేస్తున్నట్టు ప్రధానమంత్రి చెప్పారు. ఈ సందర్బంగా రెండో ఇండియా - ఆఫ్రికా రక్షణ చర్చలు జరగనున్నట్టు ఆయన తెలిపారు. ఇండియా- ఆఫ్రికాలమధ్య సంబంధాలు కాలపరీక్షకు నిలిచినవని ఆయన అన్నారు. కాలం గడిచేకొద్దీ ఈ సంబంధాలు మరింత బలపడి కొత్త పుంతలు తొక్కుతున్నాయన్నారు. ఆఫ్రికా-గుజరాత్ మధ్య గల ప్రాచీన సంబంధాలను ప్రధానమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆఫ్రికాలోని తొలి రైల్వే లైన్ల ఏర్పాటులో గుజరాత్ లోని కచ్ ప్రాంత ప్రజలు పాల్గొన్నట్టు తెలిపారు. ఆఫ్రికాలో నిత్యజీవితంలో వాడే చాలా పదాలకు మూలాలు ఆఫ్రికాలోని గుజరాతీ కమ్యూనిటీ వాడే పదాలలో ఉన్నాయని ఆయన అన్నారు. మహాత్మాగాంధీ వంటి ప్రపంచ నేతకు గుజరాత్ జన్మభూమి అయితే వారి తొలి కర్మభూమి ఆఫ్రికా అని ఆయన అన్నారు. ఇప్పటికీ భారత విదేశాంగ విధానంలో ఆఫ్రికాతో సంబంధం కీలకమైనదని ఆయన అన్నారు. కరోనా సమయంలో ప్రపంచం మొత్తం వాక్సిన్ గురించి ఆందోళన చెందితే, ఇండియా ఆఫ్రికాలోని మన మిత్ర దేశాలకు ప్రాధాన్యత ప్రాతిపదికన వాక్సిన్ను అందజేసినట్టు ప్రధానమంత్రి తెలిపారు. రెండో ఇండియన్ ఒషన్ రీజియన్ ప్లస్ సదస్సును ఈ డిఫెక్స్పో సందర్భంగా నిర్వహించనున్నారు. ఇది ఐఓఆర్ప్లస్ దేశాల మదద్య శాంతి, సుస్థిరత ప్రగతి సుసంపన్నతలను పెంపొందించేందుకు సమగ్ర చర్చకు వీలుకల్పించనుంది. ఈ ప్రాంతంలోని అందరికీ భద్రత, పురోగతి ఉండాలన్న ప్రధానమంత్రి దార్శనికతకు అనుగుణంగా ఈ సమగ్ర చర్చలు జరగనున్నాయి.అంతర్జాతీయ భద్రతనుంచి అంతర్జాతీయ వాణిజ్యం, సముద్రయాన భద్రత వంటివి అంతర్జాతీయంగా అత్యంత ప్రాధాన్యతగల అంశాలుగా రూపుదిద్దుకున్నాయని ప్రధానమంత్రి అన్నారు. వాణిజ్య నౌకాయానం కూడా గ్లోబలైజేషన్ కాలంలో బాగా పెరిగిందని ఆయన అన్నారు. ఇండియాపై ప్రపంచం ఆకాంక్షలు బాగా పెరిగాయని అంటూ ప్రధానమంత్రి, ఆ ఆకాంక్షలను ఇండియా తప్పకుండా నెరవేరుస్తుందని ప్రపంచానికి హామీ ఇస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ డిఫెన్స్ ఎక్స్పో ఇండియాపై అంతర్జాతీయంగా ఉన్న విశ్వాసానికి నిదర్శనమని ప్రదానమంత్రి చెప్పారు. గుజరాత్లోని దీశా ఎయిర్ఫీల్డ్కు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు.ఈ వైమానిక స్థావరం దేశ భద్రతా వ్యవస్థకు అదనంగా వచ్చి చేరుతున్నట్టుచెప్ఆపరు. దీశా ఎయిర్ఫీల్డ్ సరిహద్దులకు దగ్గరగా ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, పశ్చిమ సరిహద్దులలో ఎలాంటి దుశ్చర్యనైనా తిప్పికొట్టేందుకు ఇండియా సన్నద్ధత మరింత పెరిగినట్టు ప్రధనామంత్రి తెలిపారు. మేం అధికారంలోకి వచ్చాక, దీశాలో ఆపరేషనల్ బేస్ ఏర్పాటుచేయాలనుకున్నాం. ఈ స్థావరం ఏర్పాటుతో బలగాల ఆకాంక్ష నేడు నెరవేరినట్టయింది. ఈ ప్రాంతం దేశ భద్రతలో కీలకకేంద్రం కానున్నదని ప్రధానమంత్రి చెప్పారు. భవిష్యత్తులో ఏదైనా బలమైన దేశం అనేదానికి అర్థం ఆ దేశ స్పేస్ టెక్నాలజీ ఒక ఉదాహరణ కానున్నదని ప్రధానమంత్రి అన్నారు.ఈ రంగానికి సంబంధించిన వివిధ సవాళ్లను త్రివిధ దళాలూ సమీక్షించి , వాటిని గుర్తించినట్టు ప్రధానమంత్రి చెప్పారు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు మనం కృషి చేయవలసి ఉందని ఆయన అన్నారు. మిషన్ డిఫెన్స్ స్పేస్ గురించి ఆయన చెబుతూ, ఇది ఈ రంగంలో ఆవిష్కరణలను ప్రోత్సహించడంతోపాటు, మన బలగాలను బలోపేతం చేస్తుందని, నూతన , వైవిధ్యంతో కూడిన పరిష్కారాలను అందిస్తుందని ఆయన అన్నారు. అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం భారతదేశ ఉదార అంతరిక్ష దౌత్యానికి కొత్తనిర్వచనం ఇవ్వనున్నదని అన్నారు. ఇది కొత్త అవకాశాలను సృష్టించనున్నదని కూడా చెప్పారు. ఎన్నో ఆఫ్రికా దేశాలు, ఎన్నో ఇతర చిన్న దేశాలు దీనినుంచి ప్రయోజనం పొంతున్నాయని ప్రధానమంత్రి చెప్పారు. 60 కిపైగా వర్ధమాన దేశాలతో ఇండియా తన అంతరిక్ష విజ్ఞానాన్ని పంచుకుంటున్నట్టు ఆయన తెలిపారు."దక్షిణాసియా ఉపగ్రహం ఇందుకు గొప్ప ఉదాహరణ . వచ్చే ఏడాది నాటికి పది ఏసియాన్ దేశాలు కూడా ఎప్పటికప్పుడు భారత ఉపగ్రహ సమాచారాన్ని అందుకోగలుగుతాయి. అభివృద్ధి చెందిన దేశాలైన యూరప్ అమెరికాలుకూడా మన ఉపగ్రహ సమాచారాన్ని ఉపయోగించుకుంటున్నాయి" అని ప్రధానమంత్రి అన్నారు. సంకల్పం. నూతన ఆవిష్కరణ, ఇంకా ఆచరణ అనే మంత్రం తో న్యూ ఇండియా రక్షణ రంగం లో ముందుకు పోతోందని ప్రధాన మంత్రి అన్నారు. 8 సంవత్సరాల క్రితం వరకు చూస్తే, భారతదేశాన్ని ప్రపంచం లో అతి పెద్ద రక్షణ రంగ సంబంధి దిగుమతి దారు దేశం గా పరిగణించేవారు, అయితే న్యూ ఇండియా సంకల్పాన్ని, ఇచ్ఛా శక్తి ని చాటుకొంది; మరి ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రస్తుతం రక్షణ రంగం లో ఒక సాఫల్య గాథ గా మారుతోంది అని ఆయన అన్నారు. ‘‘మన రక్షణ సంబంధి ఎగుమతులు గత 5 సంవత్సరాల లో 8 రెట్లు వృద్ధి చెందాయి. మేం రక్షణ పరికరాల ను, ఉపకరణాల ను ప్రపంచం లో 75 కు పైగా దేశాల కు ఎగుమతి చేస్తున్నాం. 2021-22 సంవత్సరం లో భారతదేశం నుండి రక్షణ సంబంధి ఎగుమతులు $ 1.59 బిలియన్ డాలర్ కు అంటే దాదాపు 13 వేల కోట్ల రూపాయల విలువ గల స్థాయి కి చేరుకొన్నాయి. రాబోయే కాలం లో 5 బిలియన్ డాలర్ లకు అంటే 40 వేల కోట్ల రూపాయల విలువ గల స్థాయి కి చేరుకోవాలి అని మేం లక్ష్యం గా పెట్టుకొన్నాం’’ అని ఆయన అన్నారు. ప్రపంచం భారతదేశం యొక్క సాంకేతిక విజ్ఞానం పైన ప్రస్తుతం ఆధారపడుతోంది, భారతదేశం యొక్క సైన్యాలు వాటి సామర్థ్యాలను నిరూపించుకోవడం దీనికి కారణం. భారతదేశ నౌకాదళం ఐఎన్ఎస్- విక్రాంత్ వంటి అత్యాధునిక విమాన వాహక నౌకల ను తన జట్టు లోకి చేర్చుకొంది. ఈ ఇంజీనియరింగ్ అద్భుతాన్ని, ఈ ఉత్కృష్ట కార్యాన్ని కొచిన్ శిప్ యార్డ్ లిమిటెడ్ దేశీయ సాంకేతిక పరిజ్ఞానం తో ఆవిష్కరించింది. భారత వాయుసేన ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం లో భాగం గా అభివృద్ధి పరచినటువంటి తేలికపాటి పోరాట ప్రధానమైన ప్రచండ్ హెలికాప్టర్స్ ను అక్కున చేర్చుకోవడం అనేది భారతదేశం యొక్క రక్షణ రంగం సత్తా కు ఒక స్పష్టమైన ఉదాహరణ గా ఉంది అని ఆయన వివరించారు. భారతదేశం యొక్క రక్షణ రంగాన్ని స్వయంసమృద్ధమైంది గా తీర్చిదిద్దడాన్ని గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ సామగ్రి తాలూకు రెండు జాబితాల ను కూడా సైన్యాలు ఖరారు చేశాయి; ఈ సామగ్రి ని దేశం లోపలే సేకరించడం జరుగుతుంది అని వెల్లడించారు. ఆ కోవ కు చెందిన 101 పరికరాల జాబితా ను ఈ రోజు న విడుదల చేయడం జరుగుతున్నది. ఈ నిర్ణయాలు సైతం ఆత్మ నిర్భర భారతదేశం శక్తి సామర్థ్యాల ను పట్టి చూపుతున్నాయి. ఈ జాబితా కు తరువాయి గా ఇదే తరహా లో రక్షణ రంగాని కి చెందినటువంటి 411 పరికరాల ను ఒక్క మేక్ ఇన్ ఇండియా పరిధి లోనే కొనుగోలు చేయడం జరుగుతుంది అని ఆయన అన్నారు. అంత భారీ బడ్జెటు భారతదేశం యొక్క కంపెనీ ల పునాది ని పటిష్ఠపరచి ఆ కంపెనీల ను కొత్త శిఖరాల కు తీసుకు పోతుంది అని ప్రధాన మంత్రి తెలిపారు. దీని ద్వారా అత్యధిక ప్రయోజనాన్ని పొందేది దేశం లోని యువతే అని ఆయన అన్నారు. రక్షణ రంగ సరఫరాల లో కొన్ని కంపెనీ లు సృష్టించిన గుత్తాధిపత్యం స్థానం లో ప్రస్తుతం ఆధారపడదగిన ఐచ్ఛికాలు అనేకం మొగ్గ తొడుగుతున్నాయి అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. ‘‘భారతదేశంలోని యువత రక్షణ పరిశ్రమ లో ఈ తరహా గుత్తాధిపత్యాన్ని బద్దలు కొట్టడం అనే శక్తి ని ప్రదర్శించింది. మరి మన యువత యొక్క ఈ ప్రయాస ప్రపంచ హితం కోసం అని చెప్పాలి’’ అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. దీని నుండి గొప్ప ప్రయోజనాలను వనరుల లేమి కారణం గా భద్రత పరం గా వెనుకబడిపోయిన ప్రపంచం లోని చిన్న దేశాలు ఇక మీదట అందుకోగలుగుతాయి అని ఆయన నొక్కిచెప్పారు. ‘‘రక్షణ రంగాన్ని అనంతమైన అవకాశాలు, సకారాత్మక సంభావ్యత లు కలిగినటువంటి రంగం గా భారతదేశం చూస్తున్నది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. రక్షణ రంగం లో ఉన్న పెట్టుబడి అవకాశాల ను గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ ఉత్తర్ ప్రదేశ్ లో, తమిళ నాడు లో రెండు డిఫెన్స్ కారిడార్ లను భారతదేశం నిర్మిస్తోంది; భారతదేశం లో పెట్టుబడి పెట్టడం కోసం ప్రపంచం లోని పెద్ద పెద్ద కంపెనీ లు అనేకం తరలి వస్తున్నాయి అని ఆయన అన్నారు. ఈ రంగం లో సూక్ష్మ, లఘు, మధ్యతరహా వ్యాపార సంస్థ లకు ఉన్న సత్తా ను కూడా ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ పెద్ద కంపెనీ ల పెట్టుబడి కి వెనుక దన్నుగా నిలచే సరఫరా వ్యవస్థ ను ఏర్పరచడం లో మా యొక్క ఎమ్ఎస్ఎమ్ఇ లు అండదండల ను అందిస్తాయి అని ఆయన అన్నారు. ‘‘ఈ రంగం లో ఆ స్థాయి పెట్టుబడులు యువత కోసం ఇదివరకు ఎన్నడూ ఆలోచన అయినా చేయనటువంటి విధం గా ఉద్యోగావకాశాల ను పెద్ద ఎత్తున కల్పించనున్నాయి’’ అని ప్రధాన మంత్రి అన్నారు. డిఫెన్స్ ఎక్స్ పో లో భాగం పంచుకోవడానికి వచ్చినటువంటి అన్ని కంపెనీల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి పిలుపును ఇస్తూ, భారతదేశం యొక్క భవిష్యత్తు ను కేంద్ర స్థానం లో నిలుపుతూ ఈ అవకాశాల కు రూపు రేఖల ను ఇవ్వవలసిందంటూ విజ్ఞప్తి చేశారు. ‘‘మీరు వినూత్న ఆవిష్కరణ లు చేయండి. ప్రపంచం లో అత్యుత్తమం గా నిలుస్తాం అంటూ ఒక ప్రతిజ్ఞ ను స్వీకరించండి. ఒక బలమైనటువంటి, అభివృద్ధి చెందినటువంటి భారతదేశాని కి రూపు రేఖల ను ఇవ్వండి. మిమ్మల్ని ఎల్లవేళ లా సమర్థించడానికి సిద్ధం గా నేను ఉంటాను’’ అని చెబుతూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు. ఈ కార్యక్రమం లో పాలుపంచుకొన్న వారిలో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్, గుజరాత్ గవర్నర్ శ్రీ ఆచార్య దేవ్ వ్రత్, రక్షణ శాఖ కేంద్ర మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింహ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జెనరల్ శ్రీ అనిల్ చౌహాన్, సైనిక దళాల ప్రధాన అధికారి జెనరల్ శ్రీ మనోజ్ పాండే, వాయు సేన ప్రధాన అధికారి ఎయర్ చీఫ్ మార్షల్ శ్రీ వి.ఆర్. చౌధరి, నౌకాదళం ప్రధాన అధికారి అడ్మిరల్ శ్రీ ఆర్. హరి కుమార్ లతో పాటు రక్షణ రంగ విషయాల లో భారత ప్రభుత్వానికి కార్యదర్శి డాక్టర్ శ్రీ అజయ్ కుమార్ తదితరులు ఉన్నారు. పూర్వరంగం ప్రధాన మంత్రి డిఫ్ ఎక్స్ పో 22 ను ప్రారంభించారు. ప్రధాన మంత్రి డిఫ్ ఎక్స్ పో 22 ను ప్రారంభిస్తారు. ‘పాథ్ టు ప్రైడ్’ ఇతివృత్తం లో భాగంగా నిర్వహిస్తున్న ఈ ఎక్స్ పో, ఇండియన్ డిఫెన్స్ ఎక్స్ పో లో ఇంత వరకు ఎన్నడూ లేనంత పెద్ద భాగస్వామ్యానికి సాక్షి కానుంది. మొట్టమొదటిసారిగా విదేశీ ఓఈఎమ్ లయొక్క భారతదేశ అనుబంధ సంస్థ లు, భారతదేశంలో నమోదయిన కంపెనీ డివిజన్ లు, భారతీయ కంపెనీతో జాయింట్ వెంచర్ కలిగివున్న ఎగ్జిబిటర్ లు సహా ప్రత్యేకంగా భారతీయ కంపెనీల కోసమే ఉద్దేశించిన రక్షణ సంబంధి ప్రదర్శన ను ఇక్కడ ఏర్పాటు చేయడమైంది. ఈ కార్యక్రమం భారతదేశం లోని రక్షణ సంబంధి తయారీ కౌశలం ఏ మేరకు విస్తరించింది, దాని స్థాయి ఎలాంటిదో కళ్ళకు కట్టనుంది. ఈ ఎక్స్ పో లో ఒక ఇండియా పెవిలియన్ మరియు స్టేట్ పెవిలియన్ లు ఏర్పాటు కానున్నాయి. ఇండియా పెవిలియన్ లో ప్రధాన మంత్రి హిందూస్థాన్ ఎయరోనాటిక్స్ లిమిటెడ్ రూపొందించిన స్వదేశీ శిక్షణ విమానం హెచ్ టిటి- 40 ని ఆవిష్కరించనున్నారు. ఈ విమానం లో అత్యాధునిక యుద్ధ వ్యవస్థలను జతపరచడంతో పాటుగా విమాన చోదకులకు అనుకూలంగా ఉండేటటువంటి సదుపాయాలను కలిపి రూపుదిద్దడం జరిగింది. ఇదే కార్యక్రమం లో భాగం గా ప్రధాన మంత్రి మిషన్ డిఫ్ స్పేస్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమం లక్ష్యం ఏమిటి అంటే అది రక్షణ బలగాల కోసమని పరిశ్రమ మరియు స్టార్ట్- అప్స్ ల అండదండల తో అంతరిక్ష రంగానికి సంబంధించి వినూత్నమైన సాల్యూశన్స్ ను అభివృద్ధి పరచాలి అనేదే. ప్రధాన మంత్రి గుజరాత్ లోని దీసా వాయు క్షేత్రాని కి కూడా శంకుస్థాపన చేశారు. ఈ ఫార్వర్డ్ ఎయర్ ఫోర్స్ బేస్ దేశం లో భద్రత పరమైన స్వరూపాని కి పటిష్టత ను సంతరిస్తుంది. ఈ ఎక్స్ పో లో ‘ఇండియా- ఆఫ్రికా: అడాప్టింగ్ స్ట్రేటిజి ఫార్ సినర్గైజింగ్ డిఫెన్స్ అండ్ సిక్యోరిటి కో ఆపరేశన్’ ఇతివృత్తం తో జరిగే రెండో ఇండియా - ఆఫ్రికా డిఫెన్స్ డైలాగ్ కూడా చోటు చేసుకుంటుంది. రెండో ఇండియన్ ఓశన్ రీజియన్ ప్లస్ కాన్ క్లేవ్ ను కూడా ఈ ఎక్స్ పో లో నిర్వహించడం జరుగుతుంది. ఇది శాంతి, వృద్ధి, స్థిరత్వం మరియు సమృద్ధి లను ప్రధానమంత్రి యొక్క ‘సాగర్ దృష్టి కోణాని కి అనుగుణం గా ఐఒఆర్ + దేశాల పరమైన రక్షణ సహకారాన్ని వృద్ధి పరచడానికి ఒక సమగ్రమైన చర్చ జరిగేందుకు వేదిక ను సమకూర్చనుంది. ఈ ఎక్స్ పోలోనే మొట్టమొదటి సారి గా రక్షణ రంగం కోసం ఇన్వెస్టర్స్ మీట్ ను కూడా నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా ఇది వందకు పైగా స్టార్ట్- అప్ లు వాటి యొక్క నూతన ఆవిష్కరణల ను ‘మంథన్ 2022’ లో ప్రదర్శించేందుకు ఒక అవకాశాన్ని చేజిక్కించుకోనున్నాయి. అలాగే ఈ ఎక్స్ పో లో ఐడిఇఎక్స్ అనే రక్షణ రంగ సంబంధి వినూత్నమైన కార్యక్రమం కూడా చోటుచేసుకొంటుంది. ఈ కార్యక్రమం లో ‘బంధన్’ కార్యక్రమం మాధ్యమం ద్వారా 451 భాగస్వామ్యాలు కూడా ప్రారంభం కాగలవు.
pib-77376
a1e325a68f4c4bf50a1220fb3122f66706912ed2e220970df2873b24373b70e8
tel
మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కేరళలో 'ప్రధాన మంత్రి జన్ వికాస్ కార్యక్రమం' మైనారిటీలు సహా సమాజంలోని ఆర్థికంగా బలహీన, తక్కువ ప్రాధాన్యత కలిగిన వర్గాలతో పాటు ప్రతి వర్గం సంక్షేమం, అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలను అమలు చేస్తోంది. నైపుణ్యాభివృద్ధి & వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ, జౌళి మంత్రిత్వ శాఖ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, మహిళ & శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ద్వారా వివిధ సంక్షేమ పథకాలను అందిస్తోంది. ప్రత్యేకంగా, కేంద్రం నోటిఫై చేసిన ఆరు మైనారిటీ వర్గాల ప్రజల సామాజిక-ఆర్థిక, విద్య సాధికారత కోసం దేశవ్యాప్తంగా వివిధ పథకాలను మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది. 'ప్రధాన మంత్రి జన్ వికాస్ కార్యక్రమం' కింద, కేరళ రాష్ట్రానికి 2020-21 నుంచి 2022-23 కాలంలో రూ.129.93 కోట్ల విలువైన మొత్తం 19 సామాజిక మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్లకు ఆమోదం లభించింది. సామాజిక-ఆర్థిక వ్యత్యాసాలను తగ్గించడానికి, దేశంలోని 1300 గుర్తించిన ప్రాంతాల్లో ప్రధాన మంత్రి జన్ వికాస్ కార్యక్రమాన్ని మే 2018 నుంచి అమలులోకి తీసుకువచ్చారు. దేశంలోని గుర్తించిన ప్రాంతాల్లో అభివృద్ధి లోటును పూడ్చడంలో ఈ పథకం సహాయపడిందని, పాఠశాల మౌలిక సదుపాయాలను పెంచడానికి, అదనపు తరగతి గదుల నిర్మాణానికి, కొత్త వసతి గృహాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు , ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు , పారిశ్రామిక శిక్షణ సంస్థలు , పాలిటెక్నిక్లు, నైపుణ్య శిక్షణ కేంద్రాల నిర్మాణాలకు దోహదపడిందని 2020-2021 సంవత్సరంలో నీతి ఆయోగ్ నిర్వహించిన పీఎంజేవీకే మూల్యాంకన అధ్యయనంలో వెల్లడైంది. 2018-19లో ఈ కార్యక్రమం పునర్నిర్మాణం ద్వారా మహిళ కేంద్రీకృత ప్రాజెక్టులపై ఎక్కువ దృష్టి సారించడంతో గణనీయమైన అభివృద్ధి సాధ్యమైంది. అన్ని రాష్ట్రాలు/యూటీలలోని మైనారిటీ వర్గాలకు ప్రాజెక్ట్లు చేరేలా చూసేందుకు పథకం పరిధిని పెంచాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసింది. కేరళ రాష్ట్రంలో పీఎంజేవీకే కింద, గత మూడేళ్లలో, అంటే 2019-20 నుంచి 2021-22, ప్రస్తుత సంవత్సరం 2022-23లో 41 ప్రాజెక్ట్లు/యూనిట్లకు ఆమోదం లభించింది. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమర్పించిన సమాచారం ప్రకారం, 4 ప్రాజెక్టులు/యూనిట్లు పూర్తయ్యాయి, 14 ప్రాజెక్టులు/యూనిట్ల పనులు కొనసాగుతున్నాయి. 23 ప్రాజెక్టులు/యూనిట్లలో పనులు ఇంకా ప్రారంభం కాలేదు. కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ ఈరోజు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం రూపంలో ఈ సమాచారాన్ని అందించారు.
pib-204222
fd72a452b1f21d0d60b053d58f0feca3f69ad59cf3ed2d7c2de5642f77cdf685
tel
ప్రధాన మంత్రి కార్యాలయం కామన్ వెల్థ్ గేమ్స్ 2022 లో మహిళ ల క్రికెట్ జట్టు వెండి పతకాన్ని గెలుచుకొన్నందుకు జట్టు సభ్యురాళ్ళ కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి బర్మింగ్ హమ్ లో నిర్వహిస్తున్న కామన్ వెల్థ్ గేమ్స్ 2022 లో మహిళ ల క్రికెట్ జట్టు వెండి పతకాన్ని గెలుచుకొన్నందుకు జట్టు లోని సభ్యురాళ్ళ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో - ‘‘క్రికెట్ మరియు భారతదేశం అనేవి విడదీయలేని అటువంటివి గా ఉన్నాయి. మన మహిళ ల క్రికెట్ జట్టు కామన్ వెల్థ్ గేమ్స్ లో మొదటి నుంచి కూడా ఉత్కృష్టమైన క్రికెట్ ను ఆడడం తో పాటుగా ప్రతిష్టాత్మకమైనటువంటి రజత పతకాన్ని స్వదేశాని కి తీసుకు వస్తున్నారు; క్రికెట్ క్రీడ లో ఇది మొట్టమొదటి కామన్ వెల్థ్ గేమ్స్ పతకం కావడం తో, ఇది ఎప్పటికీ ప్రత్యేకమైంది గా ఉండబోతోంది. జట్టు సభ్యురాళ్ళు అందరి కి ఒక ఉజ్వలమైన భవిష్యత్తు లభించాలి అని కోరుకొంటూ, వారికి ఇవే శుభాకాంక్షలు.’’ అని పేర్కొన్నారు.
pib-291469
0315ec87ede1b22aab99a27ad74772c3fac0dfc49d6807f41f42c81ee4c0e8fa
tel
ప్రధాన మంత్రి కార్యాలయం భారతదేశాన్ని ఆరోగ్యవంతమైంది గా నిలిపే దిశ లో ఆరోగ్య సంరక్షణ కార్యకర్త లుచేస్తున్న ప్రయాసల ను ప్రశంసించిన ప్రధాన మంత్రి ప్రజల కు టీకా మందు ను ఇప్పించడం లో భారతదేశం వేసిన ముందంజల ను నేశనల్వేక్సీనేశన్ డే సందర్భం లో ప్రధాన మంత్రి గుర్తు కు తీసుకు వచ్చారు భారతదేశాన్ని ఆరోగ్యవంతమైంది గా నిలబెట్టే దిశ లో ఆరోగ్య సంరక్షణ శ్రమికులు అందరు చేసిన కృషి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసల ను తెలియ జేశారు. నేశనల్ వేక్సీనేశన్ డే సందర్భం లో ఒక ఆరోగ్యవంతమైనటువంటి భారతదేశాన్ని నిర్మించే అంశం పట్ల వచనబద్ధత ను కూడా ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు; అంతేకాకుండా, ప్రజల కు టీకా మందు ను ఇప్పించడం లో భారతదేశం యొక్క ముందంజల ను ఆయన గుర్తు కు తీసుకు వచ్చారు. ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమం శాఖ కేంద్ర మంత్రి శ్రీ మన్ సుఖ్ మాండవీయ చేసిన అనేక ట్వీట్ లకు ప్రధాన మంత్రి ప్రస్పందిస్తూ - ‘‘భారతదేశాన్ని ఆరోగ్యవంతమైంది గా నిలబెట్టే దిశ లో మన ఆరోగ్య సంరక్షణ శ్రమికులు చేస్తున్న కృషి కి గాను ఇవే అభినందన లు. ప్రజల కు టీకామందు ను ఇప్పించడం లో భారతదేశం వేసిన ముందడుగుల ను సైతం నేశనల్ వేక్సీనేశన్ డే నాడు మనం జ్ఞప్తి కి తెచ్చుకోవడం తో పాటు గా ఒక ఆరోగ్యవంతమైనటువంటి భారతదేశాన్ని ఆవిష్కరించడం కోసం మన నిబద్ధత ను కూడా పునరుద్ఘాటించుదాం.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
pib-244
8d1a814d538b538477f848ec258318c3a25a55e6ecbf46a76f1e18308b5d1e7c
tel
ఆర్థిక మంత్రిత్వ శాఖ జీఎస్టీ పరిహారం కోసం అన్ని రాష్ట్రాలు ఆప్షన్ -1 ను ఎంచుకున్నాయి - తాజాగా ఝార్ఖండ్ ఆప్షన్-1 ఎంపిక చేసుకుంది - జీఎస్టీ అమలు కొరతను తీర్చడానికి ఝార్ఖండ్ రాష్ట్రం ప్రత్యేక రుణాలు తీసుకునే వెసులుబాటు కింది రూ.1,689 కోట్లు పొందుతుంది - అదనంగా రూ.1765 కోట్ల ఋణం తీసుకునేందుకు ఝార్ఖండ్ కి అనుమతి లభించింది జిఎస్టి అమలు వల్ల ఏర్పడిన రెవిన్యూ లోటును తీర్చుకోడానికి మొత్తం 28 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలు ఆప్షన్-1కె వెళ్లాలని నిర్ణయించాయి. మిగిలి ఉన్న ఒక్క రాష్ట్రమూ ఝార్ఖండ్ కూడా ఇప్పుడు ఆప్షన్-1నే ఎంపిక చేసుకున్నట్టు తన అంగీకారం తెలిపింది. శాసనసభ కలిగి, జిఎస్టి సభ్యులైన 3 కేంద్ర పాలిత ప్రాంతాలు ఇప్పటికే ఆప్షన్-1 వైపే మొగ్గు చూపాయి. జీఎస్టీ అమలు వల్ల తలెత్తే కొరత మొత్తాన్ని రుణం తీసుకోవడానికి ఆప్షన్ -1 ను ఎంచుకునే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రుణాలు తీసుకునే విండోను ఏర్పాటు చేసింది. ఈ విండో 2020 అక్టోబర్ 23 నుండి పనిచేస్తోంది, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఐదు వాయిదాలలో రాష్ట్రాల తరఫున రూ .30,000 కోట్లు అప్పుగా తీసుకొని ఆప్షన్ -1 ను ఎంచుకున్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇచ్చింది. ఇప్పుడు జార్ఖండ్ రాష్ట్రం కూడా ఈ విండో ద్వారా సేకరించిన నిధులను తదుపరి రౌండ్ రుణాలు నుండి ప్రారంభిస్తుంది. తదుపరి విడత రూ .6,000 కోట్లు 2020 డిసెంబర్ 7 న రాష్ట్రాలు / యుటిలకు విడుదల అవుతాయి. ఆప్షన్ -1 నిబంధనల ప్రకారం, జీఎస్టీ అమలు వల్ల తలెత్తే కొరతను తీర్చడానికి రుణాలు తీసుకోవడానికి ప్రత్యేక విండో సదుపాయాన్ని పొందడంతో పాటు, స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి లో 0.50% తుది విడత రుణం తీసుకోవడానికి బేషరతుగా అనుమతి పొందటానికి రాష్ట్రాలకు అర్హత ఉంది. ఇది 2020 మే 17 న ఆత్మ నిర్భర్ అభియాన్ కింద భారత ప్రభుత్వం అనుమతించిన 2% అదనపు రుణంలోనిది. ఇది ప్రత్యేక విండో రూ .1.1 లక్షల కోట్లకు పైగా ఉంది. ఆప్షన్ -1 ఎంపిక అందిన తరువాత, జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వానికి రూ .1,765 కోట్ల అదనపు రుణాలు తీసుకోవడానికి భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జిఎస్డిపిలో 0.50 శాతం అదనపు రుణాలు, ప్రత్యేక విండో ద్వారా సేకరించిన నిధులు 04.12.2020 వరకు రాష్ట్రాలు / యుటిలకు చేరాయి | | S. No. | | Name of State / UT | | Additional borrowing of 0.50 percent allowed to States | | Amount of fund raised through special window passed on to the States/ UTs | | 1 | | Andhra Pradesh | | 5051 | | 804.15 | | 2 | | Arunachal Pradesh| | 143 | | 0.00 | | 3 | | Assam | | 1869 | | 346.12 | | 4 | | Bihar | | 3231 | | 1358.54 | | 5 | | Chhattisgarh # | | 1792 | | 0.00 | | 6 | | Goa | | 446 | | 292.20 | | 7 | | Gujarat | | 8704 | | 3208.80 | | 8 | | Haryana | | 4293 | | 1514.40 | | 9 | | Himachal Pradesh | | 877 | | 597.47 | | 10 | | Jharkhand# | | 1765 | | 0.00 | | 11 | | Karnataka | | 9018 | | 4317.39 | | 12 | | Kerala | | 4,522 | | 328.20 | | 13 | | Madhya Pradesh | | 4746 | | 1580.51 | | 14 | | Maharashtra | | 15394 | | 4167.99 | | 15 | | Manipur| | 151 | | 0.00 | | 16 | | Meghalaya | | 194 | | 38.89 | | 17 | | Mizoram| | 132 | | 0.00 | | 18 | | Nagaland| | 157 | | 0.00 | | 19 | | Odisha | | 2858 | | 1329.97 | | 20 | | Punjab | | 3033 | | 475.80 | | 21 | | Rajasthan | | 5462 | | 907.12 | | 22 | | Sikkim| | 156 | | 0.00 | | 23 | | Tamil Nadu | | 9627 | | 2171.90 | | 24 | | Telangana | | 5017 | | 299.88 | | 25 | | Tripura | | 297 | | 78.90 | | 26 | | Uttar Pradesh | | 9703 | | 2090.21 | | 27 | | Uttarakhand | | 1405 | | 806.10 | | 28 | | West Bengal | | 6787 | | 252.22 | | | | Total : | | 106830 | | 26966.76 | | 1 | | Delhi | | Not applicable | | 2040.77 | | 2 | | Jammu & Kashmir | | Not applicable | | 790.53 | | 3 | | Puducherry | | Not applicable | | 201.94 | | | | Total : | | Not applicable | | 3033.24 | | | | Grand Total | | 106830 | | 30000.00These States have ‘NIL’ GST compensation gap # Funds will be released starting after next round of borrowing.
pib-203322
991063b45dfbdcd4099122dcdee946fd652020f19e21047343868371249d0f00
tel
మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ రూర్కీ ఐ.ఐ.టి.లో కొత్త లెక్చర్ హాల్, సెంట్రలైజ్డ్ హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండీషనింగ్ వ్యవస్థ, అధునాతన ఎస్.టి.పి. ప్రారంభం. లాంఛనంగా ప్రారంభించిన కేంద్ర మంత్రి రమేశ్ పోఖ్రియాల్ మానవాళికి, జంతువుల మధ్య సంఘర్షణ సమస్యకు తగిన పరిష్కారాన్ని రూర్కీ ఐ.ఐ.టి. కనుగొనాలి. శాస్త్రీయమైన, సామాజిక బాధ్యత నిర్వహణకు కృషి చేయాలి రూర్కీలోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆవరణలో నిర్మించిన కొత్త లెక్చర్ హాల్. సముదాయాన్ని, సెంట్రలైజ్డ్ హీటింగ్ , వెంటిలేషన్, ఎయిర్ కండీషనింగ్ వ్యవస్థలను, మురుగునీటి శుద్ధి ప్లాంటును కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ‘నిశాంక్’ ఆన్ లైన్ ద్వారా ప్రారంభించారు. కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సంజయ్ ధోత్రే కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రూర్కీ ఐ.ఐ.టి. డైరెక్టర్ ప్రొఫెసర్ అజిత్ కె. చతుర్వేది, డిప్యూటీ డైరెక్టర్ ప్రొఫెసర్ మనోరంజన్ పరీదా, ఐ.ఐ.టి.లోని వివిధ అధ్యయన విభాగాల, అధ్యయన కేంద్రాల డీన్స్, అసోసియేట్ డీన్స్, అధిపతులు, ఇన్ చార్జి ప్రొఫెసర్, జాయింట్ రిజిస్ట్రార్, డిప్యూటీ రిజిస్ట్రార్ తదితరుల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రమేశ్ పోఖ్రియాల్ మాట్లాడుతూ,.. భారతదేశానికే గర్వకారణంగా రూర్కీ ఐ.ఐ.టి. నిలిచిందని, ఆసియాలోలోనే అతి ప్రాచీన సాంకేతిక పరిజ్ఞాన సంస్థల్లో ఇదీ ఒకటని అన్నారు. దేశంలోని అగ్రశ్రేణి సాంకేతిక పరిజ్ఞాన సంస్థల్లో ఒకటైన రూర్కీ ఐ.ఐ.టీ., విద్యారంగంలో ప్రతిభావంతమైన సంస్థగా ఉన్నత ప్రమాణాన్ని సృష్టించిందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలలు గన్న ‘నవ భారతావని’ నిర్మాణానికి ఈ సంస్థ ఎంతో క్రీయాశీలమైన సేవలందిస్తోందన్నారు. జీవవైవిధ్యంతో సుసంపన్నమైన హిమాలయ ప్రాంతంలో రూర్కీ ఐ.ఐ.టి. ఉందన్నారు. అయితే,.. ఇక్కడ మానవాళికి, జంతువులతో సంఘర్షణ సాధారణమైపోయిందని, ఈ సమస్యకు తగిన పరిష్కారాన్ని రూర్కీ ఐ.ఐ.టి. కనుగొనాలని, శాస్త్రీయమైన, సామాజిక బాధ్యతను నిర్వహణకోసం ఐ.ఐ.టి. కృషి చేయాలని కేంద్రమంత్రి సూచించారు. దేశంలోని యువత కొత్త తరం మేధావివర్గంగా ఎదిగేందుకు అవసరమైన ప్రణాళికా వ్యవస్థను 2020వ సంవత్సరపు కొత్త విద్యావిధానం రూపొందించిందని పోఖ్రియాల్ తన ప్రసంగంలో ప్రధానంగా ప్రస్తావించారు. వేగంగా మారుతున్న ప్రపంచ పరిణామాలను, భవిష్యత్తు సవాళ్లను, అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యా వ్యవస్థలో గణనీయమైన మార్పుకోసం ప్రభుత్వం ఎంతో కృషి చేసిందన్నారు. నూతన విద్యావిధానం అమలుతో విద్యార్థులు మరింత జ్ఞానసంపన్నులవుతారని, దేశ ప్రగతికి బాటలు వేస్తారని, డిజిటల్ ఇండియాగా, స్వావలంబనతో దేశాన్ని తీర్చిదిద్దుతారని అన్నారు. కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి ధోత్రే మాట్లాడుతూ,..విద్యలో నాణ్యతను పెంపొందించే కృషిలో మౌలిక సదుపాయాల పాత్ర కీలకమని, రూర్కీ ఐ.టి.ఐ.లో కొత్తగా ప్రారంభించిన లెక్చర్ హాల్ సముదాయం, సెంట్రలైజ్డ్ హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండీషనింగ్ వ్యవస్థ, మురుగునీటి శుద్ధి ప్లాంటు.. మౌలిక సదుపాయాల స్థాయిని మరింత పెంపొందిస్తాయన్నారు. సంస్థ భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాల్లో ప్రపంచ ప్రమాణాలను అందుకోవడానికి ఈ సదుపాయాలు దోహదపడతాయని అన్నారు. భవష్యత్తులో చేపట్టబోయే అన్ని కార్యక్రమాల్లో రూర్కీ ఐ.ఐ.టీ. విజయం సాధించాలన్న ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు. రూర్కీ ఐ.ఐ.టి.లో లెక్చర్ హాల్ సముదాయ నిర్మాణాన్ని 2016లో, రూ. 80.25కోట్ల ఖర్చుతో చేపట్టారు. మొత్తం 13,254చదరపు మీటర్ల విస్తీర్ణంలో, 4,400మంది సామర్థ్యంతో దీన్ని నిర్మించారు. 250మంది సామర్థ్యంతో కూడిన ఒక్కో తరగతి గది చొప్పున మొత్తం ఏడు గదులకు ఇందులో సదుపాయం కల్పించారు. 150మంది సామర్థ్యంతో కూడిన 11 తరగతి గదులను, 24మంది విద్యార్థులతో కూడిన 24 తరగతి గదులను కూడా ఏర్పాటు చేశారు. కొత్తగా నిర్మించిన సెంట్రలైజ్డ్ హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండీషనింగ్ వ్యవస్థ ద్వారా ఒకటవ, రెండవ లెక్చర్ హాల్ భవన సముదాయాలకు సదుపాయం కలుగుతుంది. అలాగే, కాన్వొకేషన్ హాలుకు చిల్ట్ వాటర్ కూలింగ్ పరిజ్ఞాన సేవలు అందుతాయి. ఈ ప్రాజెక్టు వ్యయాన్ని దాదాపు రూ. 14.35కోట్లుగా అంచనా వేశారు. ఈ మొత్తం వ్యవస్థకు బిల్డింగ్ మేనేజిమెంట్ వ్యవస్థ ద్వారా రిమోట్ కంట్రోల్ తో నియంత్రించే సదుపాయం ఉండటం విశేషం. ఇంధనాన్ని గరిష్టస్థాయిలో వినియోగించుకునే రీతిలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో దీన్ని రూపొందించారు. ఇక మురుగు నీటి, వృధా నీటి శుద్ధీకరణ ప్లాంటును , రోజుకు 30లక్షల లీటర్ల మురుగునీటి శుద్ధి సామర్థ్యంతో నిర్మించారు. రూర్కీ ఐ.ఐ.టి. ఆవరణలోని సి-క్లాస్ క్లబ్ సమీపంలో సోలానీ కుంజ్ వద్ద 1800చదరపు మీటర్ల విస్తీర్ణంలో, రూ. 27.73కోట్ల మొత్తం వ్యయంతో నిర్మించారు. సీక్వెన్సింగ్ బ్యాచ్ రియాక్టర్ ప్రక్రియను వినియోగించుకుని ఈ ఎస్.టి.పి. పనిచేస్తుంది. ఇది నివాస ప్రాంతంలో ఉన్నందున ఎలాంటి దుర్వాసన రాకుండా అదనపు నియంత్రణ ఏర్పాట్లతో ఏర్పాటు చేయడం మరో ప్రత్యేకత. అధునాతనమైన ప్రోగ్రామబుల్ లాజిక్ కంట్రోలర్ , సూపర్వైజరీ కంట్రోల్, డాటా అక్విజిషన్ వ్యవస్థలను ఈ ప్లాంటుకు అమర్చారు. రూర్కీ ఐ.ఐ.టి. డైరెక్టర్ ప్రొఫెసర్ చతుర్వేది మాట్లాడుతూ,..తమ సంస్థలో కొత్తగా నిర్మించిన మూడు ముఖ్యమైన ప్రాజెక్టులను ప్రారంభించడానికి తమ విలువైన సమయాన్ని కేటాయించిన కేంద్ర మంత్రికి, కేంద్ర సహాయ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. రూర్కీ ఐ.ఐ.టి. ప్రగతి సాధనలో వారి ఆశీర్వాదాలు ఇలాగే కొనసాగాలని తాము కోరుకుంటున్నట్టు చెప్పారు.
pib-264438
439f36214ff3b3839a92f108458a763aeaffdfaf94ce7dc69a595e48eb500e21
tel
ప్రధాన మంత్రి కార్యాలయం ఆసియా క్రీడల్లో మహిళల ‘50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్’లో స్వర్ణపతక విజేత సిఫ్త్ కౌర్ సమ్రాకు ప్రధానమంత్రి అభినందన ఆసియా క్రీడల మహిళా ‘50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్’ పోటీలో స్వర్ణ పతక విజేత సిఫ్త్ కౌర్ సమ్రాను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. ఈ మేరకు ‘ఎక్స్’ పోస్టు ద్వారా పంపిన సందేశంలో: న్న “ఆసియా క్రీడల్లో మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ పోటీలో స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించిన సిఫ్త్ సమ్రాకు @SiftSamra అభినందనలు. అందునా ఈ పోటీలో ఆమె సరికొత్త రికార్డు సృష్టించడం ఆనందాన్ని రెట్టింపు చేసింది. ప్రతి భారతీయుడికీ స్ఫూర్తినిచ్చేలా దేశానికి ఘనత తెచ్చిపెట్టిన సమ్రా 3 zkభవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధించాలని ఆశిస్తూ ఆమెకు నా శుభాకాంక్షలు” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. (
pib-163056
c0db65bcab5b56affc2f8b2b2e611bb4650a783a48f0156a6839fb36bce79cc7
tel
ప్రధాన మంత్రి కార్యాలయం రాష్ట్రపతి పుట్టినరోజు నాడు ఆమె కు శుభాకాంక్షల నుతెలియజేసిన ప్రధాన మంత్రి రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారి కి శుభాకాంక్షల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో - ‘‘రాష్ట్రపతి గారి కి ఇవే జన్మదిన శుభాకాంక్ష లు. మన ప్రజల సంక్షేమార్థం జ్ఞానాని కి, గరిమ కు మరియు వచనబద్ధత కు ఒక కిరణం లా ఉంటూ దేశ ప్రగతి ని పెంపొందింప చేయడం కోసం ఆవిడ చేస్తున్నటువంటి ప్రయత్నాల కు గాను ఆమె ను ప్రశంసించడం జరుగుతోంది. ఆమె యొక్క అంకిత భావం మనలకు అందరికి ప్రేరణ ను అందిస్తూనే ఉంటుంది. ఆమె కు మంచి ఆరోగ్యం మరియు దీర్ఘాయుష్షు కలుగు గాక. @rashtrapatibhvn’’ అని పేర్కొన్నారు.
pib-247957
8e8c704363d356280a10b4339ecf45bbfc6899f44b6cebba98925cdbe0aee747
tel
| ప్రధాన మంత్రి కార్యాలయం | భారత-లక్సెంబర్గ్ వర్చువల్ సదస్సు పై సంయుక్త ప్రకటన - భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్రమోదీ మరియు లక్సెంబర్గ్ ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ జేవియర్ బెట్టెల్, 2020 నవంబర్, 19వ తేదీన, మొట్టమొదటి భారత-లక్సెంబర్గ్ వర్చువల్ సదస్సులో పాల్గొన్నారు. - ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, చట్ట పాలన, మానవ హక్కులపై గౌరవం యొక్క భాగస్వామ్య సూత్రాలు, విలువలు ఆధారంగా, భారతదేశం మరియు లక్సెంబర్గ్ మధ్య ఉన్న అద్భుతమైన సంబంధాలను ఇద్దరు ప్రధానమంత్రులు నొక్కిచెప్పారు. - 1948 లో దౌత్య సంబంధాలు ఏర్పడినప్పటి నుండి ఏడు దశాబ్దాలకు పైగా ఇరు దేశాల మధ్య హృదయ పూర్వక మరియు స్నేహపూర్వక సంబంధాల అభివృద్ధిని నాయకులిద్దరూ సంతృప్తిగా గుర్తించారు. ఈ కాలంలో ద్వైపాక్షిక సంబంధాలు గణనీయంగా విస్తరించాయని వారు అంగీకరించారు, అయితే వాణిజ్యం, ఆర్ధిక వ్యవహారాలూ, ఉక్కు, అంతరిక్షం, ఐ.సి.టి, ఆవిష్కరణలు, తయారీ, ఆటోమోటివ్, స్థిరమైన అభివృద్ధి, పునరుత్పాదక ఇంధనంతో సహా, మరియు వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా పోరాటం వంటి రంగాలలో మెరుగైన సహకారం ద్వారా సంబంధాల సామర్థ్యాన్ని పెంపొందించుకోవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు. - భారతదేశం మరియు లక్సెంబర్గ్ మధ్య ఉన్నత స్థాయి పర్యటనలను వారు సంతృప్తిగా సమీక్షించారు. ఈ సందర్భంలో, గౌరవనీయులు గ్రాండ్ డ్యూక్ భారత సందర్శన గురించి ప్రస్తావించారు. ఈ పర్యటన కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఈ సంవత్సరం ప్రారంభంలో వాయిదా వేయవలసి వచ్చింది. అయితే, మహమ్మారి పరిస్థితిలో మెరుగుదల తరువాత, పరస్పర అనుకూలమైన తేదీ కోసం వారు ఎదురు చూస్తున్నట్లు ప్రకటించారు. - పరస్పర ఆసక్తి ఉన్న ప్రపంచ సమస్యలపై భారతదేశం మరియు లక్సెంబర్గ్ మధ్య పెరుగుతున్న సమ్మేళనాలను ఇరువురు నాయకులు అంగీకరించారు. ఇరు దేశాల మధ్య లోతైన అవగాహన మరియు సహకారాన్ని పెంపొందించుకోవాలనే నిబద్ధతను వారు పరస్పరం తెలియజేసుకున్నారు. ఈ సందర్భంలో, భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు లక్సెంబర్గ్ యొక్క విదేశీ, యూరోపియన్ వ్యవహారాల మంత్రిత్వ శాఖల మధ్య సాధారణ ద్వైపాక్షిక సంప్రదింపులను సంస్థాగతీకరించడాన్ని వారు స్వాగతించారు. ఆర్థిక సంబందాలు - ఇరు దేశాల మధ్య పెరుగుతున్న ఆర్థిక సంబంధాన్ని ఇరువురు ప్రధానమంత్రులు స్వాగతించారు. భారతదేశం మరియు లక్సెంబర్గ్ దేశాల కంపెనీలు పరస్పరం రెండో దేశాలలో తమ ఉనికిని విస్తరించుకుంటున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంలో, వారు వ్యాపార సహకారం కోసం కొత్త అవకాశాలను చూడటానికి అంగీకరించారు. భారతీయ మరియు లక్సెంబర్గ్ కంపెనీల మధ్య పరస్పర వ్యాపార సహకారానికి మద్దతు ఇవ్వడానికి మరియు అభివృద్ధి చేయడానికి ఇన్వెస్ట్ ఇండియా మరియు లక్సిన్నోవేషన్ మధ్య సహకార ఒప్పందం కుదుర్చుకోవడాన్ని ప్రధానమంత్రులు ఇద్దరూ స్వాగతించారు. - ఉక్కు రంగంలో భారతదేశం మరియు లక్సెంబర్గ్ మధ్య దీర్ఘకాల సహకారాన్ని కూడా ఇద్దరు ప్రధానమంత్రులు గమనించారు. ఆర్థిక సంబంధాన్ని విస్తరించడానికి మరిన్ని అవకాశాలను అన్వేషించాలని నాయకులు ఎస్.ఎం.ఈ. లు మరియు అంకురసంస్థలతో సహా వ్యాపారాలకు పిలుపునిచ్చారు. గంగా ప్రక్షాళణ పధకం తో సహా పర్యావరణం, స్వచ్ఛమైన ఇంధనం మరియు స్థిరమైన సాంకేతిక పరిజ్ఞానాలకు సంబంధించిన భారతదేశం యొక్క వివిధ కార్యక్రమాలపై లక్సెంబర్గ్ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని వారు గుర్తించారు. - ఆర్థిక మరియు వాణిజ్య సంబంధాలను సమీక్షించడానికి భారతదేశం మరియు బెల్జియం-లక్సెంబర్గ్ ఆర్ధిక సంఘం మధ్య 17వ ఉమ్మడి ఆర్థిక కమిషన్ కోసం నాయకులు ఎదురు చూశారు. - సరఫరా వ్యవస్థ మరింత స్థితిస్థాపకంగా, వైవిధ్యంగా, బాధ్యతాయుతంగా మరియు స్థిరంగా మార్చడానికి జరుగుతున్న ప్రయత్నాల గురించి ఇరువురు నాయకులు తమ అభిప్రాయాలను పరస్పరం ఇచ్చి పుచ్చు కున్నారు. గత దశాబ్దాలుగా, సరఫరా వ్యవస్థలు చాలా క్లిష్టంగా, ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న విభిన్న వాటాదారుల మీద ఆధారపడి ఉన్నాయని వారు గుర్తించారు. భవిష్యత్-ప్రూఫింగ్ గ్లోబల్ సప్లై చైన్ల సవాలు పరస్పర ఆధారపడటం మరియు ఎక్కువ స్థితిస్థాపకత మధ్య సున్నితమైన పరస్పర చర్యను నిర్ధారించడం అని, ముఖ్యంగా వేల్యూ చైన్ లో పాల్గొన్న వాటాదారులందరిలో సమన్వయం అవసరం అని, ఇరువురు నాయకులు అంగీకరించారు. ఆర్ధిక వ్యవహారాలు - హరిత ఫైనాన్సింగ్ యొక్క ప్రాముఖ్యత తగ్గుతున్న తరుణంలో, హరిత వృద్ధి మరియు స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించడానికి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు ఇండియా ఇంటర్నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ తో లక్సెంబర్గ్ స్టాక్ ఎక్స్ఛేంజ్, సహకార ఒప్పందాలు కుదుర్చుకోవడాన్ని ఇరువురు నాయకులు స్వాగతించారు. నియంత్రణ సాధికార సంస్థలైన "కమిషన్ డి సర్వైలన్స్ డ్యూ సెక్టూర్ ఫైనాన్షియర్" మరియు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ల మధ్య ప్రతిపాదిత ఒప్పందం ఆర్థిక రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత పటిష్ఠపరుస్తుందనే అభిప్రాయాన్ని వారు పరస్పరం పంచుకున్నారు. ఈ సందర్భంలో, ఆర్థిక సేవల విషయంలో సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి వారు తమ నిబద్ధతను వ్యక్తం చేశారు. యూరప్ లో ప్రముఖ అంతర్జాతీయ ఆర్థిక కేంద్రంగా ఉన్న లక్సెంబర్గ్, భారతదేశ ఆర్థిక సేవల పరిశ్రమను అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానించడంతో పాటు, యూరప్ పెట్టుబడిదారులతో సహా పెట్టుబడిదారులను చేరుకోవడంలో సహాయపడటానికి ఒక ముఖ్యమైన సంధాన కర్తగా పనిచేయగలదని ప్రధాన మంత్రి బెట్టెల్ ప్రముఖంగా పేర్కొన్నారు. - హరితపరమైన మరియు మరింత స్థిరమైన ఆర్థిక వ్యవస్థ వైపు ప్రపంచ పరివర్తనకు మద్దతు ఇవ్వడానికి ఆర్థిక పరిశ్రమ పాత్రను ఇరువురు నాయకులు అంగీకరించారు. ఈ విషయంలో, స్థిరమైన ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడానికి మరియు సులభతరం చేయడానికి ఉమ్మడి కార్యక్రమాలను గుర్తించి అభివృద్ధి చేయడానికి వారు అంగీకరించారు. వీటితో పాటు, ఇద్దరు ప్రధానమంత్రులు ఆర్థిక రంగంలో ఆవిష్కరణ మరియు డిజిటలైజేషన్ యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. ఇరు దేశాల ఆర్థిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మరియు అంకురసంస్థల సంఘాలను అనుసంధానించే సామర్థ్యాన్ని కూడా వారు గుర్తించారు. అంతరిక్ష మరియు డిజిటల్ సహకారం - భారతదేశం మరియు లక్సెంబర్గ్ మధ్య, ఉపగ్రహ ప్రసారం మరియు సమాచార మార్పిడితో సహా, కొనసాగుతున్న అంతరిక్ష సహకారాన్ని ఇరువురు నాయకులు సానుకూలంగా గమనించారు. లక్సెంబర్గ్ కేంద్రంగా ఉన్న అంతరిక్ష సంస్థలు తమ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రయోగించడానికి భారతదేశ సేవలను ఉపయోగించుకోవడం ప్రారంభించాయని, వారు సంతృప్తితో గుర్తించారు. లక్సెంబర్గ్ కు చెందిన 4 ఉపగ్రహాలను కలిగి ఉన్న పి.ఎస్.ఎల్.వి-సి.49 మిషన్ను, 2020 నవంబర్, 7వ తేదీన ఇస్రో విజయవంతంగా ప్రయోగించడాన్ని వారు స్వాగతించారు. ప్రస్తుతం రెండు ప్రభుత్వాల మధ్య చర్చలో ఉన్న, శాంతియుత ప్రయోజనాల కోసం బాహ్య అంతరిక్షం యొక్క అన్వేషణ మరియు ఉపయోగాల విషయంలో సహకార పరికరాన్ని ముందస్తుగా ఖరారు చేయాలని ఇరువురు నాయకులు ఎదురుచూశారు. - కోవిడ్-19 డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేసిందని ఇరువురు నాయకులు అంగీకరించారు. ఈ విషయంలో వారు డిజిటల్ డొమైన్ మరియు దాని అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలలో సహకారం యొక్క అవసరాన్ని నొక్కి చెప్పారు. భారతదేశం మరియు లక్సెంబర్గ్ రెండూ వరుసగా "డిజిటల్ ఇండియా" కార్యక్రమం మరియు "డిజిటల్ లక్సెంబర్గ్" చొరవ ద్వారా డిజిటలైజేషన్ను ప్రోత్సహిస్తున్నాయని వారు గుర్తించారు. రెండు కార్యక్రమాల మధ్య కలయికలను అన్వేషించడానికి కూడా వారు అంగీకరించారు. ఉన్నత విద్య మరియు పరిశోధన - నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్, లక్సెంబర్గ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మరియు లక్సెంబర్గ్ సెంటర్ ఫర్ సిస్టమ్స్ బయోమెడిసిన్ వంటి భారతీయ భాగస్వామి సంస్థల మధ్య న్యూరో-డీ-జెనరేటివ్ వ్యాధుల రంగంలో కొనసాగుతున్న సహకారాన్ని నాయకులు సంతృప్తిగా గుర్తించారు. బొంబాయి, కాన్పూర్, మద్రాసు, నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియాలో ప్రస్తుతం ఉన్న ఐఐటిలతో లక్సెంబర్గ్ విశ్వవిద్యాలయం అనుసంధానాలను వారు గుర్తించారు. రెండు దేశాలలో ఉన్నత విద్య మరియు పరిశోధన సంస్థల మధ్య సహకారాన్ని మరింత విస్తరించడానికి కూడా వారు అంగీకరించారు. సంస్కృతి మరియు ప్రజలతో సంబంధాలు - ప్రస్తుత ప్రపంచ వాతావరణంలో భారతదేశం మరియు లక్సెంబర్గ్ రెండూ అహింస యొక్క నీతిని పంచుకుంటాయని ఇరువురు నాయకులు పేర్కొన్నారు. ఈ విషయంలో, మహాత్మా గాంధీ 150వ జన్మదినోత్సవం సందర్భంగా లక్సెంబర్గ్ 2019 లో స్మారక తపాలా బిళ్ళను జారీ చేయడాన్ని ప్రధానమంత్రి మోదీ స్వాగతించారు. ఈ స్మారక స్టాంప్ రూపకల్పన లక్సెంబర్గ్ నగరంలోని మునిసిపల్ పార్కులో ఉన్న మహాత్మా గాంధీ యొక్క కాంస్య విగ్రహం ఆధారంగా జరిగిందనీ, ఆ విగ్రహాన్ని భారత ఆధునిక కళాకారుడు అమర్ నాథ్ సెహగల్ రూపొందించారనీ, భారతదేశం మరియు లక్సెంబర్గ్ మధ్య ఆయన రెండు దశాబ్దాలు జీవించారనీ ప్రధానమంత్రి బెట్టెల్ తెలియజేశారు. - ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి ప్రజల మధ్య సంబంధాల మార్పిడిని పెంచడం చాలా అవసరమని ఇరువురు ప్రధానమంత్రులు అంగీకరించారు. ఈ విషయంలో, లక్సెంబర్గ్ లోని ప్రవాస భారతీయుల సానుకూల సహకారాన్ని వారు స్వాగతించారు, ఇది వేగంగా పెరుగుతోంది మరియు దాని గొప్ప వైవిధ్యాన్ని పెంచుతోంది. చైతన్యాన్ని మరింత బలోపేతం చేయడానికి, వారు వలస మరియు మొబిలిటీ ఒప్పందం, అదే విధంగా, భారతదేశం మరియు బెనెలక్స్ మధ్య దౌత్య మరియు అధికారిక / సేవా పాస్పోర్టులను కలిగి ఉన్నవారికి వీసాల మినహాయింపుపై ఒక ఒప్పందం యొక్క శీఘ్ర ముగింపు కోసం తమ ఉద్దేశాన్ని పంచుకున్నారు. కోవిడ్ -19 మహమ్మారి - కొనసాగుతున్న కోవిడ్-19 మహమ్మారి, దాని ఆరోగ్యం మరియు సామాజిక-ఆర్థిక పరిణామాలతో సహా నాయకులు చర్చించారు. మహమ్మారిని ఎదుర్కోవటానికి తమ సంకల్పం వ్యక్తం చేశారు. కోవిడ్-19 తరువాత స్థిరమైన సామాజిక-ఆర్ధిక పునరుద్ధరణను నిర్ధారించడానికి, ఆర్థికాభివృద్ధి, ఆర్థిక స్థితిస్థాపకతను ఉత్తేజపరిచేందుకు మహమ్మారికి సమర్థవంతంగా స్పందించాల్సిన అవసరాన్ని వారు నొక్కిచెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వంటి సంబంధిత అంతర్జాతీయ సంస్థల ద్వారా సహా ఉచిత, పారదర్శక మరియు సత్వర పద్ధతిలో సమాచారాన్ని పంచుకోవడం మరియు అంతర్జాతీయ ప్రతిస్పందనను మెరుగుపరచడం, సంసిద్ధత మరియు ప్రతిస్పందన సామర్థ్యాలను బలోపేతం చేయడానికి భారత-ఈ.యు భాగస్వామ్య పరిధిలో తమ సహకారాన్ని కొనసాగించడానికి వారు అంగీకరించారు. ఈ.యు - భారత సంబంధాలు - సురక్షితమైన, పచ్చదనం మరియు మరింత స్థిరమైన ప్రపంచానికి దోహదం చేసినందుకు, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, చట్ట పాలన మరియు మానవ హక్కులపై గౌరవం యొక్క భాగస్వామ్య సూత్రాలు మరియు విలువలతో పాతుకుపోయిన భారత-ఈ.యు. వ్యూహాత్మక భాగస్వామ్యం యొక్క ప్రాముఖ్యతను ఇరువురు నాయకులు అంగీకరించారు. ఈ నేపథ్యంలో, 2020 జూలై, 15వ తేదీ న జరిగిన విజయవంతమైన ఇండియా-ఈ.యు. వర్చువల్ సదస్సు పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేశారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సాధారణ ఆసక్తి ఉన్న ప్రాంతాల్లో సహకారాన్ని బలోపేతం చేయడం ద్వారా మరియు సమగ్ర, స్థిరమైన మరియు నియమాల ఆధారిత అనుసంధానత ద్వారా, ఇండియా-ఈ.యు. సంబంధాన్ని మరింత తీవ్రతరం చేయడానికి వారు మద్దతు తెలిపారు. బలమైన భారత-ఈ.యు. సంబంధాలకు మద్దతుగా యూరోపియన్ యూనియన్ వ్యవస్థాపక సభ్యులలో ఒకరిగా లక్సెంబర్గ్ పోషించిన నిర్మాణాత్మక పాత్రను ప్రధానమంత్రి మోదీ ప్రశంసించారు. ఈ సందర్భంలో, ప్రధానమంత్రి బెట్టెల్ భారతదేశం-ఈ.యు. సంబంధాలను మరింత తీవ్రతరం చేయడానికి, లక్సెంబర్గ్ జతచేసిన అధిక ప్రాధాన్యతను నొక్కిచెప్పారు. భారతదేశం మరియు ఇయు రెండూ ఒకదానికొకటి భద్రత, శ్రేయస్సు మరియు స్థిరమైన అభివృద్ధిపై సాధారణ ఆసక్తిని కలిగి ఉన్నాయని వారు గుర్తించారు. - కోవిడ్-19 తరువాత ఆర్థిక పునరుద్ధరణ నేపథ్యంలో భారతదేశం-ఈ.యు. ఆర్థిక సంబంధాలను అభివృద్ధి చేయడం ముఖ్యమని నాయకులు అంగీకరించారు. ఈ సందర్భంలో, సమతుల్య, ప్రతిష్టాత్మక, పరస్పర ప్రయోజనకరమైన స్వేచ్ఛా వాణిజ్యంతో పాటు పెట్టుబడి ఒప్పందాల కోసం పనిచేయడానికి వారు తమ నిబద్ధతను వ్యక్తం చేశారు. బహుపాక్షిక సహకారం - సమర్థవంతమైన మరియు సంస్కరించబడిన బహుపాక్షికతను మరియు ఐక్యరాజ్యసమితి మరియు ప్రపంచ వాణిజ్య సంస్థ తో దాని ప్రధాన భాగంలో నియమాల ఆధారిత బహుపాక్షిక క్రమాన్ని ప్రోత్సహించడానికి నాయకులు తమ సంకల్పం వ్యక్తం చేశారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల అమలు, పర్యావరణ పరిరక్షణతో పాటు వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో సహకరించడానికి తమ నిబద్ధతను వారు ధృవీకరించారు. - ఈ సందర్భంలో, ఈ ఒప్పందానికి అనుగుణంగా జాతీయంగా నిర్ణయించిన సహాయానికి సంబంధించి పారిస్ ఒప్పందాన్ని అమలు చేయడానికి నాయకులు తమ నిబద్ధతను వ్యక్తం చేశారు. సౌరశక్తిని విస్తరించడాన్ని ప్రోత్సహించడానికి అంతర్జాతీయ సౌర కూటమి లోనూ, అదేవిధంగా, పర్యావరణపరంగా స్థిరమైన పెట్టుబడుల వైపు ప్రైవేట్ పెట్టుబడులను సమీకరించటానికి స్థిరమైన ఆర్ధిక సహాయం కోసం అంతర్జాతీయ వేదిక లోనూ, తమ సహకారాన్ని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశ్యాన్ని ఇరువురు నాయకులు పరస్పరం తెలియజేసుకున్నారు. అంతర్జాతీయ సౌర కూటమిలో చేరాలన్న, లక్సెంబర్గ్ ఉద్దేశాన్ని ప్రధానమంత్రి బెట్టెల్ ప్రకటించారు. - వీటితో పాటు, కొత్తగా నివారించడానికి మరియు ఇప్పటికే ఉన్న విపత్తు ప్రమాదాన్ని తగ్గించడానికి విపత్తు ప్రమాదాన్ని తగ్గించడానికి సెండాయ్ ముసాయిదాను అమలు చేయడానికి వారు సహకారం కోసం తమ సంసిద్ధతను వ్యక్తం చేశారు. ఈ విషయంలో, విపత్తు నిరోధక మౌలిక సదుపాయాల కూటమి లో భారతదేశం-ఈ.యు. సహకారం కోసం ఎదురు చూసింది. - 2021-2022 కాలానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత స్థానానికి భారత ఎన్నికను ప్రధానమంత్రి బెట్టెల్ స్వాగతించారు. శాశ్వత మరియు తాత్కాలిక సభ్యత్వం యొక్క రెండు వర్గాలలో దాని విస్తరణతో సహా, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి యొక్క సంస్కరణకు లక్సెంబర్గ్ యొక్క మద్దతును ఆయన పునరుద్ఘాటించారు. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం 75వ సెషన్ లో నిర్ణీత కాలపరిమితిలో దృఢమైన ఫలితాలను సాధించాలనే ఏకైక లక్ష్యంతో టెక్స్ట్ ఆధారిత చర్చలను ప్రారంభించే దిశగా అంతర్-ప్రభుత్వ చర్చల ప్రక్రియను నిర్ణయాత్మకంగా ముందుకు తీసుకెళ్లవలసిన అవసరాన్ని ఇరు పక్షాలు అంగీకరించాయి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి యొక్క శాశ్వత సభ్యత్వం కోసం భారతదేశం యొక్క అభ్యర్థిత్వానికి లక్సెంబర్గ్ యొక్క మద్దతును, ప్రధాన మంత్రి బెట్టెల్, ఈ సందర్భంగా, పునరుద్ఘాటించారు. క్షిపణి సాంకేతికత నియంత్రణ వ్యవస్థ లోకి భారతదేశం ప్రవేశించడంలో లక్సెంబర్గ్ పోషించిన ముఖ్యమైన పాత్ర మరియు అణు సరఫరాదారుల సమూహం లో భారతదేశం పాల్గొనడానికి నిరంతర మద్దతుతో సహా, వివిధ అంతర్జాతీయ మరియు బహుపాక్షిక సంస్థలకు భారతదేశం అభ్యర్థిత్వం కోసం లక్సెంబర్గ్ అందించిన మద్దతుపై ప్రధానమంత్రి మోదీ భారతదేశం తరఫున ప్రగాఢమైన ప్రశంసలను వ్యక్తం చేశారు. 2022-2024 కాలానికి ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలికి లక్సెంబర్గ్ అభ్యర్థిత్వంతో సహా ఐక్యరాజ్యసమితిలో లక్సెంబర్గ్ అభ్యర్థిత్వాలకు భారతదేశం మద్దతు ఇవ్వడం పట్ల లక్సెంబర్గ్ తరఫున ప్రధాని బెట్టెల్ ప్రగాఢ ప్రశంసలను వ్యక్తం చేశారు. - సరిహద్దు ఉగ్రవాదంతో సహా అంతర్జాతీయ ఉగ్రవాదం యొక్క నిరంతర బెదిరింపులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, ఇరువురు నాయకులు ఉగ్రవాదాన్ని అన్ని రకాలుగా మరియు వ్యక్తీకరణలలో ఖండించారు. ఉగ్రవాదాన్ని నిరోధించడానికి, ఎదుర్కోడానికి, ఐక్యరాజ్యసమితి తో పాటు ఆర్ధిక కార్యాచరణ బృందం వంటి వేదికలపై అంతర్జాతీయ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి భారతదేశం మరియు లక్సెంబర్గ్ మధ్య నిరంతర సహకారం అవసరమని వారు అంగీకరించారు. ముగింపు - భారతదేశం మరియు లక్సెంబర్గ్ మధ్య జరిగిన మొదటి శిఖరాగ్ర సమావేశం ద్వైపాక్షిక సంబంధాలలో కొత్త దశను సూచిస్తుందని ఇద్దరు ప్రధానమంత్రులు అంగీకరించారు. ద్వైపాక్షిక సంబంధాలను విస్తృతం చేయడం, తీవ్రతరం చేయడం, పరస్పర మరియు ప్రపంచ ప్రయోజన విషయాలపై ప్రాంతీయ, బహుపాక్షిక వేదికలలో సంప్రదింపులు మరియు సమన్వయాన్ని పెంచే దిశగా వారు తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు. ప్రధాని మోడిని లక్సెంబర్గ్ సందర్శించవలసిందిగా ప్రధాని బెట్టెల్ ఆహ్వానించారు.
pib-226815
68e917fbb9ae91ef588b71013eeb234108f81517c7a3d359390b6c67daa71834
tel
గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర బృందం పర్యటన మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు జరుగుతున్న తీరును పరిశీలించేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నియమించిన కేంద్ర బృందం తెలంగాణ రాష్ట్రంలో 2022 జూన్ తొమ్మిది నుంచి 12 వరకు పర్యటించింది. తన పర్యటనలో కేంద్ర బృందం పలు అంశాలను గుర్తించింది. అనుమతి లేని పనులు చేపట్టడం , చిన్న తరహా నీటి చెరువుల్లో పూడిక తీయడం, మైదాన ప్రాంతాల్లో కందకాలు చేపట్టడం వంటి పనులను మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టినట్టు కేంద్ర బృందం పర్యటన లో వెల్లడైంది. కొండ ప్రాంతాలకు మాత్రమే అనువైన కందకాల తవ్వకాలను విభజించి మైదాన ప్రాంతాల్లో అమలు చేసినట్టు కేంద్ర బృందం గుర్తించింది. ఉన్నత స్థాయిలో సాంకేతిక అనుమతులు పొందకుండా మార్గదర్శకాలు ఉల్లంఘించి పనులు చేపట్టేందుకు వీటిని విభజించి నిర్మించారని కేంద్ర బృందం గుర్తించింది. నిబంధనలకు విరుద్ధంగా, అవకతవకలతో పనులు చేపట్టినట్టు గుర్తించిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు జరుగుతున్న తీరును మరింత లోతుగా పరిశీలించేందుకు మరికొన్ని బృందాలను పంపాలని నిర్ణయించింది. బృందాలు సమర్పించే నివేదికలు ఆధారంగా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో జరుగుతున్న అవకతవకలపై దిద్దుబాటు చర్యలను అమలు చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో 15 జిల్లాల్లో కేంద్ర బృందాలు పర్యటిస్తాయి. నిజామాబాద్, పెద్దపల్లి,మెదక్,సిద్ధిపేట,సూర్యాపేట,కరీంనగర్,నాగర్ కర్నూల్,నిర్మల్,జయశంకర్ భూపాలపల్లి,మహబూబాబాద్,సంగారెడ్డి,రంగారెడ్డి,ఆదిలాబాద్,రాజన్న సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో కేంద్ర బృందాలు పర్యటిస్తాయి. డైరెక్టర్/డిప్యూటీ కార్యదర్శి హోదా కలిగిన అధికారి అధ్యక్షతన ఏర్పాటయ్యే బృందంలో ఒక ఇంజినీరుతో సహా ముగ్గురు సభ్యులు ఉంటారు. ఒకో జిల్లాలో రెండు బ్లాకుల్లో ఉండే 4-6 గ్రామ పంచాయతీ లలో కేంద్ర బృందం పర్యటించి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన చెరువుల పూడికతీత, కందకాల నిర్మాణం, రోడ్ల వెంబడి మొక్కలు నాటడం లాంటి పనులను పరిశీలిస్తుంది. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పారదర్శకత , జవాబుదారితనం అంశాలపై దృష్టి సారించి కేంద్ర బృందాలు తమ పర్యటన సాగిస్తాయి. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు జరుగుతున్న తీరును ఎప్పటికప్పుడు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సమీక్షిస్తూ వస్తోంది. క్షేత్ర స్థాయిలో పథకం సక్రమంగా లక్ష్యాల మేరకు అమలు జరిగేలా చూసి, లోటుపాట్లను సవరించి మార్గదర్శకాల మేరకు పథకం పారదర్శకంగా అమలు జరిగేలా చూసేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ చర్యలు అమలు చేస్తున్నది. మార్గదర్శకాలు, నిబంధనలకు లోబడి పథకం అమలు జరిగేలా చూసే ప్రాథమిక బాధ్యత రాష్ట్రంపై ఉంటుంది. దీనికోసం రాష్ట్ర రాజధానిలో పటిష్ట పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసి, రాష్ట్ర స్థాయి అధికారి తనిఖీ చేయడం సామాజిక ఆడిట్ నిర్వహించడం, వివాదాల పరిష్కారానికి అధికారి నియామకం లాంటి చర్యలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాల్సి ఉంటుంది. ఈ వ్యవస్థలు సక్రమంగా పని చేయకపోవడం ఆందోళన కలిగించే అంశంగా మారింది.
pib-153808
b4afd84aebfc0f65492560aa0878629ec936f3681e1d6a7eb2be56f5666f07b7
tel
ఆర్థిక మంత్రిత్వ శాఖ జీ.ఎస్.టి. పరిహార కొరతను తీర్చడానికి, "బ్యాక్ టు బ్యాక్" ఋణంగా, రాష్ట్రాలకు 6వ విడత 6,000 కోట్ల రూపాయలు విడుదల ఇప్పటివరకు మొత్తం 36,000 కోట్ల రూపాయలు విడుదల రాష్ట్రాలకు మంజూరు చేసిన 1,06,830 కోట్ల రూపాయల అదనపు ఋణ అనుమతికి, ఇది అదనం జీ.ఎస్.టి. పరిహార కొరతను తీర్చడానికి, ఆర్ధిక మంత్రిత్వశాఖ ఈ వారం వాయిదా కింద రాష్ట్రాలకు 6,000 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఇందులో, జి.ఎస్.టి. మండలిలో సభ్యత్వం కలిగిన 23 రాష్ట్రాలకు 5,516.60 లక్షల రూపాయలూ, శాసనసభతో ఉన్న మూడు కేంద్రపాలిత ప్రాంతాలకు 483.40 కోట్ల రూపాయలూ, విడుదల చేశారు. మిగిలిన 5 రాష్ట్రాలు, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మిజోరం, నాగాలాండ్, సిక్కింలకు జీ.ఎస్.టి. అమలు కారణంగా ఆదాయంలో అంతరం లేదు. జీ.ఎస్.టి. అమలు కారణంగా ఆదాయంలో సంభవించే 1.10 కోట్ల రూపాయల కొరతను తీర్చడం కోసం, ప్రత్యేక రుణాలు తీసుకునే విండో ద్వారా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల తరపున భారత ప్రభుత్వం, ఈ మొత్తాన్ని తీసుకుంటోంది. రాష్ట్రాలకు అందించిన అటువంటి నిధులలో భాగంగా ఈ వారం 6 వ విడత నిధులు విడుదలయ్యాయి. ఈ వారం, ఈ మొత్తాన్ని, 4.2089 శాతం వడ్డీ రేటుతో ఋణంగా తీసుకున్నారు. ప్రత్యేక రుణాలు తీసుకునే విండో ద్వారా, సగటున 4.7106 శాతం వడ్డీ రేటుతో, కేంద్ర ప్రభుత్వం, ఇప్పటి వరకు, 36,000 కోట్ల రూపాయలను రుణంగా తీసుకుంది. జీ.ఎస్.టి. అమలు కారణంగా ఆదాయంలో కొరతను తీర్చడానికి ప్రత్యేక రుణాలు తీసుకునే విండో ద్వారా నిధులను అందించడంతో పాటు, జి.ఎస్.టి. పరిహార కొరతను తీర్చడానికి ఆప్షన్ -1 ను ఎంచుకునే రాష్ట్రాలకు, అదనపు ఆర్థిక వనరులను సమీకరించడంలో వారికి సహాయపడటానికి వీలుగా, రాష్ట్ర ప్రభుత్వం జి.ఎస్.డి.పి. లో 0.5 శాతానికి సమానమైన అదనపు రుణాలు తీసుకోవడానికి భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇప్పటివరకు, ఈ నిబంధన ప్రకారం, 28 రాష్ట్రాలకు 1,06,830 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. 28 రాష్ట్రాలకు మంజూరు చేసిన అదనపు రుణాలు మరియు ప్రత్యేక విండో ద్వారా సేకరించిన మరియు ఇప్పటివరకు రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు విడుదల చేసిన నిధుల మొత్తం వివరాలను అనుబంధంలో పొందుపరచడం జరిగింది. రాష్ట్రాల వారీగా, జి.ఎస్.డి.పి. లో 0.50 శాతం చొప్పున అనుమతించిన అదనపు రుణాలు మరియు ప్రత్యేక విండో ద్వారా సేకరించి, 09.12.2020 తేదీ వరకు, రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలకు విడుదల చేసిన నిధుల వివరాలు | | క్రమ సంఖ్య | | రాష్ట్రం / కేంద్ర పాలిత ప్రాంతం పేరు | | 0.50 శాతం చొప్పున రాష్ట్రాలకు అనుమతించిన అదనపు ఋణం | | ప్రత్యేక విండో ద్వారా సేకరించి, రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలకు విడుదల చేసిన నిధులు | | 1 | | ఆంధ్రప్రదేశ్ | | 5051 | | 929.97 | | 2 | | అరుణాచల్ ప్రదేశ్| | 143 | | 0.00 | | 3 | | అస్సాం | | 1869 | | 400.24 | | 4 | | బీహార్ | | 3231 | | 1571.14 | | 5 | | ఛత్తీస్ గఢ్ | | 1792 | | 169.26 | | 6 | | గోవా | | 446 | | 337.93 | | 7 | | గుజరాత్ | | 8704 | | 3710.87 | | 8 | | హర్యానా | | 4293 | | 1751.33 | | 9 | | హిమాచల్ ప్రదేశ్ | | 877 | | 690.95 | | 10 | | ఝార్ఖండ్ | | 1765 | | 91.95 | | 11 | | కర్ణాటక | | 9018 | | 4992.85 | | 12 | | కేరళ | | 4,522 | | 642.12 | | 13 | | మధ్యప్రదేశ్ | | 4746 | | 1827.79 | | 14 | | మహారాష్ట్ర | | 15394 | | 4820.05 | | 15 | | మణిపూర్| | 151 | | 0.00 | | 16 | | మేఘాలయ | | 194 | | 44.99 | | 17 | | మిజోరాం| | 132 | | 0.00 | | 18 | | నాగాలాండ్| | 157 | | 0.00 | | 19 | | ఒడిశా | | 2858 | | 1538.05 | | 20 | | పంజాబ్ | | 3033 | | 930.88 | | 21 | | రాజస్థాన్ | | 5462 | | 1157.77 | | 22 | | సిక్కిం| | 156 | | 0.00 | | 23 | | తమిళనాడు | | 9627 | | 2511.68 | | 24 | | తెలంగాణ | | 5017 | | 429.45 | | 25 | | త్రిపుర | | 297 | | 91.20 | | 26 | | ఉత్తరప్రదేశ్ | | 9703 | | 2417.25 | | 27 | | ఉత్తరాఖండ్ | | 1405 | | 932.19 | | 28 | | పశ్చిమ బెంగాల్ | | 6787 | | 493.45 | | | | మొత్తం : | | 106830 | | 32483.36 | | 1 | | ఢిల్లీ | | వర్తించదు | | 2360.08 | | 2 | | జమ్మూ-కశ్మీర్ | | వర్తించదు | | 914.22 | | 3 | | పుదుచ్చేరి | | వర్తించదు | | 242.34 | | | | మొత్తం : | | వర్తించదు | | 3516.64 | | | | మొత్తం | | 106830 | | 36000.00ఈ రాష్ట్రాలకు జి.ఎస్.టి. పరిహార కొరత "లేదు"
pib-48830
05b50496935ccff1dd78c400bd958449d7d3121e4a7cec18165a16746a819995
tel
వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ భారత్-అరబ్ దేశాల నడుమ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం భారత-సంయుక్త అరబ్ దేశాల సమగ్ర ఆర్థిక ఒప్పందం కింద మొట్టమొదటిసారి సరుకుల రవాణాకు పచ్చజెండా చూపిన వాణిజ్య శాఖ కార్యదర్శి శ్రీ బివిఆర్ సుబ్రహ్మణ్యం. భారతదేశం- సంయుక్త అరబ్ దేశాల నడుమ ఒప్పందాన్ని కీలకమైనదిగా పేర్కొన్న కార్యదర్శి; దేశాల మధ్య వాణిజ్యంకై అనుకూల పవనాలు 2022 ఫిబ్రవరి 18 న రెండు దేశాల మధ్య చారిత్రాత్మకమైన భారత్-అరబ్ దేశాల సమగ్ర ఆర్థిక ఒప్పందం ఈరోజు అమల్లోకి వచ్చింది. ఈరోజు న్యూఢిల్లీలోని కస్టమ్స్ హౌస్లో జరిగిన కార్యక్రమంలో వాణిజ్య శాఖ కార్యదర్శి శ్రీ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఇండియా-సంయుక్త అరబ్ దేశాల సిఇపి ఒప్పందం కింద భారతదేశం సంయుక్త అరబ్ దేశాలకు ఉత్పత్తులతో కూడిన మొదటి సరుకులను లాంఛనంగా రవాణా చేసింది ఒప్పందాన్ని అమలు చేసే భారత ప్రభుత్వ గౌరవనీయ వాణిజ్య కార్యదర్శి శ్రీ BVR సుబ్రహ్మణ్యం, రత్నాలు, ఆభరణాల రంగం నుంచి ముగ్గురు ఎగుమతిదారులకు ధృవీకరణ పత్రాలను అందజేశారు. ఈ ఒప్పందం ప్రకారం ఇప్పుడు కస్టమ్స్ డ్యూటీ లేకుండా మొదటిసారి భారత దేశ సరుకు ఈరోజు, 01 మే 2022న దుబాయ్కి చేరుకుంటుంది. రత్నాలు & ఆభరణాల రంగం అరబ్- భారతదేశం ఎగుమతులు గణనీయమైన ప్రాముఖ్యత కలిగి ఉంది. మన భారత - అరబ్ దేశాల CEPA భారతీయ ఉత్పత్తులను అనుసరించి పొందిన సుంకాల రాయితీల నుండి ఈ రంగం గణనీయంగా ప్రయోజనం పొందుతుంది. 97% టారిఫ్ లైన్లపై UAE అందించిన ప్రిఫరెన్షియల్ మార్కెట్ యాక్సెస్ నుండి భారతదేశం ప్రయోజనం పొందుతుంది, విలువ పరంగా UAE కి 99% భారతీయ ఎగుమతుల ప్రాతినిధ్యం ఉంది, రత్నాలు, వస్త్రాలు, పాదరక్షలు, క్రీడా వస్తువులు, ప్లాస్టిక్లు, ఫర్నిచర్, వ్యవసాయ కలప ఉత్పత్తులు, ఇంజనీరింగ్ ఉత్పత్తులు, ఔషధాలు, వైద్య పరికరాలు ఇంకా సేవలలో వాణిజ్యానికి సంబంధించి, భారతీయ సర్వీస్ ప్రొవైడర్ల 11 విస్తృత సేవా రంగాల ద్వారా సుమారు 111 ఉప-రంగాలకు మెరుగైన ప్రాప్యతను కలిగి ఉన్నారు. CEPA ద్వారా రాబోయే ఐదేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్య విలువ 100 బిలియన్ అమెరికన్ డాలర్ల పైగా, సేవలలో వాణిజ్యం 15 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వాణిజ్య శాఖ కార్యదర్శి ఇరు దేశాల మధ్య భాగస్వామ్యానికి వ్యాపారానికి ఉన్న అవకాశాలను ఎత్తిచూపుతూ, ఈ మార్పు తక్కువ సమయంలో జరిగినందున కొత్త ఒరవడికి నాంది పలుకుతుంది అన్నారు ఈ ఒప్పందం 100 బిలియన్ డాలర్ల అంచనాతో తదనుగుణ వాణిజ్యాన్ని లక్ష్యంగా చేసుకున్నప్పటికీ, మార్కెట్ పరిమాణం అరబ్ దేశాలు భారతదేశానికి అందించే ప్రాప్యతను దృష్టిలో ఉంచుకుని, లక్షాలు కంటే చాలా ఎక్కువ సాధించవచ్చని వారన్నారు. ఈ ఒప్పందం రెండు దేశాల నాయకుల దార్శనికత పరిణామమని భారతదేశానికి, సంయుక్త అరబ్ దేశాల ప్రపంచానికి ఇది మార్గదర్శి అని వాణిజ్య కార్యదర్శి పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో భారత పోటీతత్వం అవసరాన్ని నొక్కిచెప్పిన ఆయన , మన సామర్థ్యాలను పెంపొందించుకోవాల్సిన అవసరం ఎత్తి చూపారు. రవాణా ఖర్చులు తగ్గించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, తద్వారా కొత్త ప్రాధాన్యతా ప్రాంతాలనుంచి వచ్చే ఉత్పత్తులు పోటీతత్వంతో ఉండవచ్చని అవకాశాలను అంచనా వేశారు. భారతదేశం చాలా వేగంగా ఇతర దేశాల వాణిజ్య ఒప్పందాలపై కసరత్తు చేస్తుందని, బ్రిటన్ , యురోపియన్ యూనియన్లతో ఈ ఫలితాలి ఆశించి చర్చలు కొనసాగుతున్నాయని వాణిజ్య కార్యదర్శి ప్రస్తావించారు. అటువంటి వాణిజ్య ప్రయోజనాలను ఎగుమతిదారులకు అందించేందుకు సామాన్యుల భాషలో సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉందని, తద్వారా వారు ఒప్పందంలోని నిబంధనలను సాధ్యమైనంత అవగాహన చేసుకుని , సాధ్యమైనంత ఉత్తమంగా ఉపయోగించుకుంటారని, మార్కెట్ ఇంటెలిజెన్స్, సమాచారం ప్రాముఖ్యత గుర్తించిన ప్రభుత్వం, భవిష్యత్తులో ఈ మార్గంలో దృష్టి సారిస్తుందని, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు సద్వినియోగం చేసుకోవాలని వారు హితవు పలికారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 670 బిలియన్ డాలర్ల ఎగుమతుల విలువతో GDP లో 22-23% గా ఉందని పేర్కొన్న శ్రీ సుబ్రహ్మణ్యం, ఆర్థిక వ్యవస్థలో ఎగుమతులు వృద్ధికి ప్రపంచానికే కీలకమైన దేశంగా భారతదేశం నిలుస్తుందన్నారు. 2047 లో భారతదేశ భవిష్యత్తు కోసం ఒక విజన్ను వచ్చే 25 ఏళ్లలో మనం 40 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతామని. వాణిజ్య ప్రచారం పై దృష్టి సారించి రేపటి సవాళ్లను భవిష్యత్తులో సిద్ధంగా ఉండేందుకు వాణిజ్య శాఖ కూడా తనను తాను సిద్ధం చేసుకుంటోందని వివరించారు. సంతోష్ కుమార్ సారంగి, డైరెక్టర్ జనరల్, విదేశీ వాణిజ్యం సూర్జిత్ భుజబల్, ప్రధాన కస్టమ్స్ కమిషనర్ ; సంజయ్ బన్సల్, కస్టమ్స్ కమిషనర్ ఇతర పరిశ్రమ / ఎగుమతిదారుల సంఘం మీడియా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు..
pib-230848
c18fb2143ba85058eb9d0ca8d05a5d3966f6ce5593ed661bd1036dd366847aae
tel
PIB Headquarters కోవిడ్-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం (కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా పీఐబీ వాస్తవాలను తనిఖీచేసిన అంశాలు ఇందులో లభ్యమవుతాయి) - గత 24 గంటల్లో 34,602మంది కోలుకోగా ఒకేరోజు వ్యాధి నయమైనవారి సంఖ్యరీత్యా కొత్త రికార్డు. - దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 8 లక్షలకుపైగా నమోదు. - కోవిడ్-19 మరణాలు స్థిరంగా తగ్గుతూ 2.38 శాతానికి పతనం. - దేశంలో 1,290 ప్రయోగశాలల్లో రోగ నిర్ధారణ; నేటిదాకా 1.5 కోట్లకుపైగా నమూనాల పరీక్ష. - అందుబాటు ధర ఔషధాలపై అంతర్జాతీయ ఆటంకాల తొలగింపునకు శ్రీ పీయూష్ గోయల్ పిలుపు. - మహమ్మారి వేళ భారతీయుల్లో రోగనిరోధకత దిశగా తోడ్పడంది దృఢత్వంపై వారికిగల అవగాహనే: శ్రీ కిరణ్ రిజిజు. వరుసగా మూడోరోజు రికార్డు స్థాయిలో 34,602 మందికి కోవిడ్ వ్యాధి నయం; మొత్తం కోలుకున్నవారి సంఖ్య 8 లక్షలకుపైగా నమోదు; మరణాలు స్థిరంగా తగ్గుతూ 2.38 శాతానికి పతనం దేశంలో కరోనా వైరస్ బారినపడి కోలుకుంటున్నవారి సంఖ్య నిరాటంకంగా పెరుగుతోంది. ఈ మేరకు ఇవాళ వరుసగా మూడోరోజు... 24 గంటల్లో అత్యధికంగా 34,602 మందికి వ్యాధినయం కాగా, మరో కొ్త రికార్డు నమోదైంది. దీంతో ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 8 లక్షలుదాటి 8,17,208కు చేరడంతో కోలుకునేవారి జాతీయ సగటు ఒక్కసారిగా 63.45 శాతానికి పెరిగి కొత్త ఎత్తులు అందుకుంది. కోలుకుంటున్నవారి సంఖ్య నిరంతరం పెరుగుతున్న కారణంగా ఇక చికిత్సలోగల కేసులు-కోలుకున్న కేసులమధ్య అంతరం 3,77,073కు పెరిగింది. కోవిడ్-19 బారినుంచి బయటపడుతున్నవారి సంఖ్య స్థిరంగా పెరుగుతున్నందువల్ల మరణాల సగటు గణనీయంగా తగ్గుతూ ప్రస్తుతం 2.38 శాతానికి పతనమైంది. మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1641010 ప్రయోగశాలల మౌలిక సౌకర్యం పెరుగుదలలో వేగంతో ‘పరీక్ష-అన్వేషణ-చికిత్స’ వ్యూహానికి బలం; ఇప్పటిదాకా 1.5 కోట్లకుపైగా కోవిడ్-19 నమూనాల పరీక్ష దేశవ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 3,52,801 రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించిన నేపథ్యంలో ఇప్పటిదాకా పరీక్షించిన నమూనాల సంఖ్య 1.5 కోట్లకుపైగా నమోదైంది. త్రిముఖ వ్యూహం నేపథ్యంలో భారత్లో నేడు ప్రతి 10 లక్షల జనాభాకు రోజువారీ పరీక్షిస్తున్న నమూనాల సంఖ్య 11,179.83కు పెరిగింది. ప్రస్తుతం ప్రభుత్వ రంగంలో 897, ప్రైవేటు రంగంలో 393 వంతున దేశంలో ప్రయోగశాలల సంఖ్య ప్రగతిశీలంగా పెరుగుతోంది. మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1640964 షాంఘై సహకార సంస్థ ఆరోగ్య మంత్రుల సమావేశంలో భారత కోవిడ్ నియంత్రణ వ్యూహంపై ప్రసంగించిన డాక్టర్ హర్షవర్ధన్ కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఇవాళ ‘షాంఘై సహకార సంస్థ డిజిటల్ మాధ్యమ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారతదేశంలో కోవిడ్-19 నియంత్రణ దిశగా తీసుకున్న చర్యల గురించి వెల్లడించారు. ఈ మేరకు ప్రభుత్వం దశలవారీగా, క్రమబద్ధంగా చర్యలు తీసుకుందని, ప్రయాణ సంబంధ సూచనల జారీ, సరిహద్దులలో నిఘా, సామాజిక ఆధారిత నిఘా, కేసుల పెరుగుదలకు అనుగుణంగా ప్రయోగశాలలు-ఆస్పత్రుల సామర్థ్యం పెంపు, వ్యాధి వ్యాప్తి ముప్పు తదితరాలపై సాంకేతికపరంగా మార్గదర్శకాలతో ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పించడం వంటి చర్యలను ప్రభుత్వం చేపట్టిందని వివరించారు. మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1640964 అందుబాటు ధర ఔషధాల లభ్యతపై అంతర్జాతీయ ఆటంకాల తొలగింపునకు శ్రీ పీయూష్ గోయల్ పిలుపు అంతర్జాతీయ వాణిజ్యంలో అన్ని దేశాలూ పారదర్శకతకు ప్రాధాన్యమివ్వాలని, విశ్వసనీయతను పెంచుకుంటూ ఇతర దేశాలతో వాణిజ్య భాగస్వాములుగా తమ కీలకపాత్రను కోల్పోకుండా జాగ్రత్త వహించాలని భారత వాణిజ్య-పరిశ్రమల మంత్రి శ్రీ పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. నిన్న వాస్తవిక సాదృశ మాధ్యమంద్వారా నిర్వహించిన బ్రిక్స్ వాణిజ్య మంత్రుల 10వ సమావేశంలో ఆయన ప్రసంగించారు. మహమ్మారి నుంచి కోలుకునే ప్రక్రియలో వాణిజ్య రంగం తన పాత్రను సమర్థంగా పోషించే దిశగా భాగస్వామ్య దేశాలన్నీ విశ్వసనీయంగా, పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. ప్రస్తుత సంక్షోభం ప్రపంచ దుర్బలత్వాన్ని తేటతెల్లం చేయడంద్వారా పరస్పరం మద్దతు అవకాశాల అన్వేషణ పరిస్థితులవైపు నెట్టిందని గుర్తుచేశారు. మేధో సంపద హక్కుల పరిరక్షణ పేరిట ప్రపంచ వాణిజ్య సంస్థ నిర్దేశించిన అసంబద్ధ నిబంధనలవల్ల అందుబాటు ధరతో ఔషధాల లభ్యతను దుర్లభం చేస్తున్న ఆటంకాలను తొలగించాలని మంత్రి పిలుపునిచ్చారు. కోవిడ్-19 వ్యాధి చికిత్సకు అవసరమైన కీలక ఔషధాలు, వైద్య పరికరాలు లభ్యతకు మేధోసంపద హక్కుల పరిరక్షణ నిబంధనలు అడ్డుపడరాదని స్పష్టం చేశారు. మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1640867 కొన్ని దేశాల నుంచి బహిరంగ కొనుగోళ్లపై ఆంక్షలు విధించిన ప్రభుత్వం భారతదేశంతో భూభాగ సరిహద్దులున్న దేశాల నుంచి బహిరంగ కొనుగోళ్లపై ఆంక్షలు విధించే దిశగా కేంద్ర ప్రభుత్వం సాధారణ ద్రవ్య నిబంధనలు-2017ను సవరిస్తున్నట్లు ఉత్తర్వులలో పేర్కొంది. దేశ రక్షణ, జాతీయ భద్రతసహా ప్రత్యక్షంగా/పరోక్షంగా సంబంధిత విషయాలలో జాగరూకత దృష్ట్యా ఈ చర్య తీసుకుంది. ఈ ఉత్తర్వుల ప్రకారం.. భారత్తో భూ సరిహద్దుగల దేశాలనుంచి కొనుగోలుదారులు సముచిత భారత ప్రాధికార సంస్థవద్ద నమోదై ఉంటే మాత్రమే వస్తుసేవల కొనుగోళ్లు చేయడానికి లేదా వివిధ పనులు చేపట్టడానికి అర్హులు. దీనికి సంబంధించి పరిశ్రమలు-అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం ఏర్పాటుచేసిన రిజిస్ట్రేషన్ కమిటీయే సముచిత ప్రాధికార సంస్థగా వ్యవహరిస్తుంది. అంతేకాకుండా విదేశాంగ, దేశాయాంగ మంత్రిత్వ శాఖలనుంచి రాజకీయ-భద్రతానుమతి కూడా తప్పనిసరి. మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1640778 ‘సుదృఢ భారతం’పై కామన్వెల్త్ సెక్రటరీ జనరల్ ప్రశంస; మహమ్మారివేళ భారతీయుల రోగనిరోధకతకు ఈ అవగాహనే తోడ్పడింది: శ్రీ కిరణ్ రిజిజు కేంద్ర యువజన వ్యవహారాలు-క్రీడలశాఖ మంత్రి శ్రీ కిరణ్ రిజిజు కామన్వెల్త్ దేశాల మంత్రుల స్థాయి సమావేశంలో దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా పాల్గొన్నారు. కోవిడ్-19 మహమ్మారి అనంతర కాలంలో క్రీడాపొటీల పునరుద్ధరణపై భారత్ దృక్పథాన్ని కామన్వెల్త్ దేశాలతో పంచుకోవడం, సమష్టి క్రీడా విధాన రూపకల్పన లక్ష్యంగా ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ కిరణ్ రిజిజు భారతదేశంలో కోవిడ్-19 నియంత్రణ దిశగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేపట్టిన చర్యలను వివరిస్తూ... ‘సుదృఢ భారతం’ ఉద్యమం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ ఉద్యమం ఫలితంగా భారతీయులలో కలిగిన అవగాహన కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రజల రోగనిరోధకత పెంపునకు ఎంతగానో తోడ్పడిందని ఆయన పేర్కొన్నారు. ఆ మేరకు నిపుణులు, ఆరోగ్యం, పౌష్టికాహారం, వ్యాయామం తదితరాలపై సూచనలివ్వగా అన్ని వయసుల వారూ వీటిని విజయవంతంగా ఉపయోగించుకున్నారని తెలిపారు. మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1640935 “భారత్లోనే ఉండండి-భారత్లోనే చదవండి” ఇతివృత్తంగా మేధోమథన సదస్సు నిర్వహించిన కేంద్ర హెచ్ఆర్డి మంత్రి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ ‘నిశాంక్’ ఇవాళ న్యూఢిల్లీలో “భారత్లో ఉంటూ-భారత్లోనే చదువు” ఇతివృత్తంగా తమ శాఖ పరిధిలోని స్వయంప్రతిపత్తిగల/సాంకేతిక విద్యా సంస్థల అధిపతులతోపాటు సీనియర్ అధికారులతో మేధోమథన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ- కోవిడ్ మహమ్మారి పరిస్థితులవల్ల విదేశాల్లో విద్యాభ్యాసం చేయదలచిన చాలామంది విద్యార్థులు స్వదేశంలోనే ఉండి-ఇక్కడే చదువుకోవాలని నిర్ణయించుకున్నట్లు గుర్తుచేశారు. అలాగే ప్రస్తుతం విదేశాల్లో ఉండి, చదువు పూర్తిచేయడం కోసం స్వదేశానికి తిరిగి వస్తున్నవారి సంఖ్య కూడా పెరుగుతున్నదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వారందరి చదువుల అవసరాలు తీర్చేవిధంగా హెచ్ఆర్డి మంత్రిత్వశాఖ అన్నివిధాలా కృషిచేయాలని మంత్రి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో యూజీసీ చైర్మన్ నేతృత్వాన ఓ కమిటీ కూడా ఏర్పాటు కానుంది. మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1640975 జెన్నోవా బయోఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ చేపట్టిన నవ్య ఎంఆర్ఎన్ఏ ఆధారిత కోవిడ్-19 నమూనా టీకా ‘హెచ్జీసీవో19’ అభివృద్ధికి ప్రారంభ నిధి సమకూర్చిన బయోటెక్నాలజీ శాఖ భారతదేశంలో ‘మొట్టమొదటి’ ఎంఆర్ఎన్ఎ ఆధారిత టీకా తయారీ వేదికకు బయోటెక్నాలజీ శాఖ పరిధిలోని బిఐఆర్ఏసీ వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు జెన్నోవా బయోఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ చేపట్టిన నవ్య ఎంఆర్ఎన్ఏ ఆధారిత కోవిడ్-19 నమూనా టీకా ‘హెచ్జీసీవో19’ అభివృద్ధికి ప్రారంభ నిధి సమకూర్చింది. మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1640927 సీఎస్ఐఆర్ ఆవిష్కరించిన ‘ఫావిపిరవిర్’ చౌక తయారీ ప్రక్రియతో త్వరలో అందుబాటులోకి రానున్న పునర్నిర్మిత ఔషధం పేటెంట్ హక్కులు ముగిసిన వైరస్ నిర్మూలన ఔషధం ‘ఫావిపిరవిర్’ కోవిడ్-19 రోగులకు.. ప్రత్యేకించి స్వల్ప, ఓ మోస్తరు లక్షణాలున్నవారి చికిత్స సంబంధిత ప్రయోగాత్మక పరీక్షలలో సమర్థ పనితీరు కనబరచింది. ఈ నేపథ్యంలో సీఎస్ఐఆర్ ఆధ్వర్యంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సంస్థ స్థానికంగా లభించే ఔషధ ముడిపదార్థాలతో ఈ మందును చౌకగా రూపొందించే ప్రక్రియను ఆవిష్కరించింది. ప్రస్తుతం దీన్ని మన దేశంలోని ప్రముఖ ఔషధ తయారీ సంస్థ ‘సిప్లా లిమిటెడ్’కు బదలాయించింది. తదనుగుణంగా ఈ ఔషధ ఉత్పత్తిని పెంచిన సిప్లా సంస్థ దీన్ని చికిత్సకు అందుబాటులో ఉంచడం కోసం డీసీజీఐ అనుమతి కోసం ఎదురుచూస్తోంది. మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1640816 భారత-ఇజ్రాయెల్ రక్షణశాఖ మంత్రుల మధ్య టెలిఫోన్ సంభాషణ రక్షణశాఖ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ ఇవాళ ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి గౌరవనీయ లెఫ్టినెంట్ జనరల్ బెంజమిన్ గాంజ్తో టెలిఫోన్ద్వారా సంభాషించారు. రెండు దేశాలమధ్య వ్యూహాత్మక రక్షణ సహకారం ప్రగతిపై ఈ సందర్భంగా వారిద్దరూ సంతృప్తి వ్యక్తం చేశారు. అదే సమయంలో రక్షణరంగ సంబంధాలను మరింత బలోపేతం చేయడానికిగల అవకాశాలపై వారు చర్చించారు. కోవిడ్-19 మహమ్మారిపై పోరులో భాగంగా రెండు దేశాలూ సంయుక్తంగా చేపట్టిన పరిశోధనల ప్రగతిపైనా వారు సంతృప్తి వెలిబుచ్చారు. మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1640972 అసోం, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో వరద బాధితులకు భారత రెడ్క్రాస్ సొసైటీ సహాయ సామగ్రి రవాణాకు జెండా ఊపిన రాష్ట్రపతి భారత రాష్ట్రపతి శ్రీ రామ్నాథ్ కోవింద్ ఇవాళ కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ సమక్షంలో రాష్ట్రపతి భవన్ నుంచి 9 ట్రక్కుల రెడ్క్రాస్ సొసైటీ సహాయ సామాగ్రిని జండా ఊపి పంపించారు. వరద బాధితులకు పంపిణీ కోసం భారత రెడ్క్రాస్ సొసైటీ కి అధ్యక్ష హోదాలో రాష్ట్రపతి ఈ వాహనాలను సాగనంపారు. ఈ సహాయ సామగ్రిలో టార్పాలిన్లు, గుడారాలు, చీరలు, ధోవతులు, నూలు కంబళ్లు, వంటపాత్రలు, దోమతెరలు, దుప్పట్లు, బకెట్లు, రెండు నీటిశుద్ధి యూనిట్లు తదితరాలున్నాయి. వీటితోపాటు కోవిడ్-19 సంబంధిత సర్జికల్ మాస్కులు, పీపీఈ కిట్లు, గ్లోవ్స్, ముఖ కవచాలు వంటి రక్షణ పరికరాలు కూడా ఉన్నాయి. మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1640923 పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం - చండీగఢ్: కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్లో కోవిడ్ సంక్రమణ నివారణ జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిందిగా పత్రికా-ప్రసార మాధ్యమాలకు నగరపాలన యంత్రాంగాధిపతి విజ్ఞప్తి చేశారు. ఈ దిశగా ప్రభుత్వం జారీచేసే ప్రకటనలు, సందేశాలు మాత్రమే సరిపోవని ఆయన పేర్కొన్నారు. ఈ త్రిముఖ నగరంలో మాస్కు ధారణ, సామాజిక దూరం పాటించడంపై ప్రజలలో అవగాహన కల్పనకు సానుకూల-చురుకైన పాత్ర పోషించాలన్నారు. - పంజాబ్: ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రకటించిన కొత్త మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలో ఏకాంత గృహవాసం నిర్దేశాలను ఉల్లంఘించే కోవిడ్-19 రోగులు రూ.5000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. కాగా, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 951 మంది ఏకాంత గృహవాస వైద్య పర్యవేక్షణలో ఉన్నారు. మరోవైపు సామాజిక దూరం నిబంధనలను ఉల్లంఘిస్తున్న రెస్టారెంట్లు, వాణిజ్య ఆహార ప్రదేశాల యజమానులకూ రూ.5000 జరిమానా విధిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు, రాష్ట్రంలో మహమ్మారి వ్యాప్తి నిరోధం దిశగా విధించిన ఆంక్షలను ధిక్కరించేవారికి ఇదొక హెచ్చరిక కానుంది. - హర్యానా: రాష్ట్రంలో కోవిడ్ మహమ్మారి ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా మాస్కులు, ముఖ కవచాలు, చేతి తొడుగులు తదితరాలను సురక్షితంగా పారవేయడంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు హర్యానా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఒక కార్యక్రమం ప్రారంభించింది. - కేరళ: రాష్ట్రంలో ఇవాళ మూడు మరణాలు నమోదవడంతో మొత్త మృతుల సంఖ్య 53కు చేరింది. కాగా, కోళికోడ్లోని చెకియాడ్ పంచాయతీలో కోవిడ్ సామాజిక వ్యాప్తి అంచున ఉందని ఆరోగ్యశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఓ డాక్టర్ వివాహం సందర్భంగా ఆయనసహా పెళ్లికి హాజరైన 23 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. అలాగే కోట్టయం వైద్య కళాశాలలో ఇద్దరు పీజీ వైద్యులు వ్యాధిగ్రస్తులతో పరిచయంవల్ల కోవిడ్ బారినపడ్డారు. రాష్ట్రంలో మరోసారి దిగ్బంధం విధింపునకు తాము వ్యతిరేకమని అఖిలపక్ష సమావేశానికి ముందే సీపీఎం ప్రకటించింది. అవసరమైతే, స్థానిక స్థాయిలో కఠినచర్యలు తీసుకోవచ్చునని సూచించింది. కేరళలో నిన్న అత్యధికంగా 1078 కేసులు నమోదవగా వీటిలో 798 పరిచయాలద్వారా సోకాయి. మరో 65 కేసులకు మూలాలు తెలియలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో 9,458మంది చికిత్స పొందుతుండగా 1,58,117మంది పరిశీలనలో ఉన్నారు. - తమిళనాడు: రాష్ట్రంలోని రాజ్భవన్లో 84 మంది సిబ్బందిసహా భద్రత, అగ్నిమాపక సేవా సిబ్బంది కూడా కరోనావైరస్ బారినపడ్డారు. మరోవైపు కోవిడ్ వ్యాధి నివారణకు తాము రూపొందించిన ‘కరోనిల్’ ఆయుర్వేద ఔషధం విక్రయాలపై తాత్కాలిక నిలిపివేతను రద్దుచేయాలని కోరుతూ పతంజలి సంస్థ మద్రాస్ హైకోర్టులో అభ్యర్థన దాఖలు చేసింది. కాగా, వ్యాపార చిహ్నం ఉల్లంఘన కింద చెన్నైలోని పారిశ్రామిక పరికరాల శుభ్రత సంస్థ పతంజలిపై పిటిషన్ దాఖలు చేసింది. తమిళనాడు దక్షిణ జిల్లాల్లో కేసులు పెరగడంతో చెన్నైకి డిప్యుటేషన్పై పంపిన ప్రభుత్వ వైద్యులు తిరిగి వారి సాధారణ పని ప్రదేశాలకు వెళ్లిపోవాలని ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలో నిన్న 6472 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసులు 1,92,964కు పెరిగాయి; అలాగే మరో 88 మరణాలతో మృతుల సంఖ్య 3,232కు చేరింది. చెన్నైలో కేసుల సంఖ్య ప్రస్తుతం 90,000 స్థాయిని దాటింది. - కర్ణాటక: మొట్టమొదటి స్వదేశీ నాన్-ఇన్వేజివ్ వెంటిలేటర్ ‘స్వస్థాయు’పై బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో వైద్యపరమైన పరీక్షలు నిర్వహిస్తారు. రాష్ట్రంలో కోవిడ్ దిగ్బంధంవల్ల ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయిన ఎస్సీ-ఎస్టీలకు స్వయంఉపాధికోసం ప్రభుత్వం త్వరలో ఆర్థిక సహాయం అందించనుంది. కోవిడ్ పడకల లభ్యతపై ఆన్లైన్ పోర్టల్లో తాజా సమాచారం ఉంచాలని అన్ని ఆసుపత్రులకు ఆదేశాలివ్వాలని కర్ణాటక హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. రాష్ట్రంలో నిన్న 5030 కొత్త కేసులు, 97 మరణాలు నమోదయ్యాయి. కొత్త కేసులలో బెంగళూరు నగరంలో 2207 నమోదైన నేపథ్యంలో రాష్ట్రంలో మొత్తం కేసులు80,863కు చేరాయి; వీటిలో యాక్టివ్ కేసులు: 49,931; మరణాలు: 1616గా ఉన్నాయి. - ఆంధ్రప్రదేశ్: కరోనా కేసులు, మరణాలు పెరుగుతున్నందున జూలై 26 నుంచి జిల్లాలో దిగ్బంధం విధిస్తారన్న సోషల్ మీడియా ప్రచారాన్ని కృష్ణా జిల్లా కలెక్టర్ ఖండించారు. ఇదంతా కేవలం వదంతి మాత్రమేనని, సదరు వార్తలు నిరాధారమని ఆయన స్పష్టం చేశారు. కాగా, నెల్లూరు జిల్లాలో ఇవాళ్టినుంచి దిగ్బంధం విధించబడింది. అయితే, ప్రజల సౌకర్యార్థం వాణిజ్య దుకాణాలు మధ్యాహ్నం 1:00 గంటవరకు తెరచి ఉంచేందుకు ప్రభుత్వం అనుమతించింది. తిరుపతిలో రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఇవాళ రుయా ఆసుపత్రివద్ద రోగ నిర్ధారణ పరీక్ష కోసం బారులుతీరారు. రాష్ట్రంలో నిన్న 7998 కొత్త కేసులు, 61 మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం మొత్తం కేసులు: 72,711; యాక్టివ్ కేసులు: 34,272; మరణాలు: 884గా ఉన్నాయి. - తెలంగాణ: హైదరాబాద్లో కోవిడ్-19 రోగులకు చికిత్స అందిస్తున్న ప్రైవేటు ఆసుపత్రులు, రోగ నిర్ధారణ ప్రయోగశాలలు అక్రమాలకు పాల్పడితే వాటిని మూసివేసేందుకు వెనుకాడబోమని తెలంగాణ ఆరోగ్యశాఖ అధికారులు హెచ్చరించారు. కాగా, రాష్ట్రంలో నిన్న 1567 కొత్త కేసులు, 9 మరణాలు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 1661 మంది కోలుకున్నారు. ఇక కొత్త కేసులలో 662 జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయి. మొత్తం కేసులు: 50,826; యాక్టివ్ కేసులు: 11,052; మరణాలు: 447; డిశ్చార్జి కేసులు: 39,327గా ఉన్నాయి. - మహారాష్ట్ర: సెంట్రల్ రైల్వే ప్రవేశపెట్టిన స్పర్శరహిత టికెట్ తనిఖీ వ్యవస్థ వంటి వినూత్న ఆవిష్కరణను కోవిడ్ నివారణలో వినియోగించడంపై ముంబై నగరపాలక సంస్థ యోచిస్తోంది. కాగా, ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ వద్ద టికెట్ తనిఖీ సిబ్బంది కోసం సెంట్రల్ రైల్వే ముంబై డివిజన్ ‘చెకిన్-మాస్టర్’ పేరిట యాప్ను ప్రవేశపెట్టింది. దీని సాయంతో ప్రయాణికుల టికెట్లను సురక్షిత దూరం నుంచి తనిఖీ చేయవచ్చు. త్వరలో అమలు చేయబోయే తదుపరి దశలో ఆటోమేటిక్ క్యూఆర్-కోడ్ ఆధారిత టికెట్ తనిఖీ వ్యవస్థను ప్రవేశ/నిష్క్రమణ ద్వారాలవద్ద ఏర్పాటుచేయాలని యోచిస్తున్నారు. ఇప్పటిదాకా ముంబైలో నమోదైన మొత్తం 1.05 లక్షల కేసులలో ప్రస్తుతం 22,800 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రం మొత్తంమీద యాక్టివ్ కేసులు:1.40 లక్షలుగా ఉంది. - గుజరాత్: రాష్ట్రంలో గురువారం 1,078 కేసుల నమోదుతో మొత్తం కేసులు 52,477కు చేరాయి. గుజరాత్లో ఒకేరోజు అత్యధికంగా కేసుల రికార్డు మరోసారి నమోదైంది. కాగా, 12,348 యాక్టివ్ కేసులతో దేశంలో చురుకైన కేసుల విషయంలో గుజరాత్ ఎనిమిదో స్థానంలో ఉంది. రాష్ట్రంలో గురువారం 28 మరణాలు సంభవించగా మొత్తం మృతుల సంఖ్య 2,257కు పెరిగింది. - రాజస్థాన్: రాష్ట్రంలో ఈ ఉదయంవరకు 375 కొత్త కేసులు, 4 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 33,595కు, మృతుల సంఖ్య 598కి చేరాయి. ఇవాళ అల్వార్ జిల్లాలో ఒకేరోజు 224 కేసులు నమోదయ్యాయి. - మధ్యప్రదేశ్: రాష్ట్రంలో కరోనా సంక్రమణ ఫలితంగా ఈ ఏడాది రక్షాబంధన్, ఈద్-ఉల్-జుహా పండుగలను బహిరంగంగా నిర్వహించబోరు. కాగా, భోపాల్ పురపాలిక పరిధిలో 10 రోజులపాటు రాత్రి 8.00 నుంచి పూర్తి దిగ్బంధం విధించబడుతుంది. అయితే- మందులు, కూరగాయలు, పండ్లు, పాలు వంటి నిత్యావసరాల సరఫరా కొనసాగుతుంది. గత 24 గంటల్లో మధ్యప్రదేశ్లో 632 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసులు 25,474కు చేరాయి. అయితే, యాక్టివ్ కేసుల సంఖ్య 7,355గా ఉంది. - ఛత్తీస్గఢ్: రాష్ట్రంలో గురువారం 371 కొత్త కేసులతో మొత్తం కేసులు 6,370కి చేరాయి. కొత్త కేసులలో ఒక్క రాయ్పూర్లో మాత్రమే 205 నమోదయ్యాయి, కబీర్థామ్ 34, రాజ్నందగావ్ 23 కేసులతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. - అరుణాచల్ ప్రదేశ్: రాష్ట్రంలోని ఇటానగర్ రాజధాని ప్రాంతంలో 20 కోవిడ్ ప్రతిస్పందన బృందాలు ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షను నిర్వహిస్తున్నాయి. ఈ మేరకు ఏర్పాటు చేసిన శిబిరాల్లో 2672 మందికి పరీక్ష చేశాయి. వీరిలో 30 మందికి కోవిడ్ నిర్ధారణ కాగా, వారందరికీ చికిత్స ప్రారంభించారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 42 మంది కోలుకోగా, ప్రస్తుతం 654 మంది చికిత్స పొందుతున్నారు. - మణిపూర్: రాష్ట్రంలో దిగ్బంధం కొనసాగుతున్న దృష్ట్యా ఇది ముగిసేదాకా అన్ని 'అప్పీల్', 'ఫిర్యాదు'ల కేసులపై విచారణను వాయిదా వేస్తున్నట్లు మణిపూర్ సమాచార కమిషన్ ప్రకటించింది. - మిజోరం: రాష్ట్రంలోని 8 జిల్లాల్లో కోవిడ్ నిర్బంధవైద్య కేంద్రాల కోసం మిజోరం ముఖ్యమంత్రి శ్రీ జొరమ్తంగా రూ. 3.85 కోట్లు మంజూరు చేశారు. - నాగాలాండ్: రాష్ట్రంలో 63 కొత్త కేసులు నమోదవగా వీటిలో దిమాపూర్ 41, కోహిమాలో 21, పెరెన్లో ఒకటి వంతున ఉన్నాయి. నాగాలాండ్లో మొత్తం 1,237 కేసులకుగాను ఇప్పటిదాకా 530 మంది కోలుకోగా 707 మంది చికిత్స పొందుతున్నారు. FACTCHECK
pib-58662
49a5ebfccead41ee67c441121bd4b478f8049f0d9cabf9c490ca34b8fb89460e
tel
మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ భారతదేశపు మొదటి బన్ని గేదె ఐవిఎఫ్ దూడకు జన్మనిచ్చింది. దేశంలో పశు సంపదను మెరుగుపరచడానికి గేదెల ఐవిఎఫ్ను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది దేశంలో బన్ని అనే గేదె జాతికి చెందిన మొదటి ఐవిఎఫ్ దూడ పుట్టడంతో భారతదేశ ఓపియూ-ఐవిఎఫ్ విధానం తదుపరి స్థాయికి చేరుకుంది. ఈ మొదటి ఐవిఎఫ్ బన్ని దూడ రైతు వినయ్ ఎల్.వాలా ఇంటి వద్ద ఏర్పాటు చేసిన 6 బన్ని ఐవిఎఫ్ గర్భాలలో జన్మించింది. గుజరాత్లోని సోమనాథ్ జిల్లాలో ధనేజ్ వద్ద అతనికి చెందిన సుశీల ఆగ్రో ఫామ్ ఉంది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ డిసెంబర్ 15, 2020న గుజరాత్లోని కచ్ ప్రాంతాన్ని సందర్శించిన సందర్భంగా బన్ని గేదె జాతి గురించి మాట్లాడారు. మరుసటి రోజు, అంటే డిసెంబర్ 16, 2020, ఓవమ్ పిక్-అప్ మరియు ఆస్పిరేషన్ ప్రక్రియలు బన్ని గేదెల యొక్క విట్రో ఫలదీకరణం ప్రణాళిక చేయబడింది. వినయ్కి చెందిన సుశీల వ్యవసాయ క్షేత్రాలకు చెందిన 3 బన్ని గేదెలను శాస్త్రవేత్తలు ఎంపిక చేసుకున్నారు. గుజరాత్లోని సోమనాథ్ జిల్లాలోని ధనేజ్కు చెందిన వాలా చెందిన ఫామ్లో ఈ మూడు బన్ని గేదెల నుండి 29 ఓసైట్లను ఇంటర్వెజినల్ కల్చర్ డివైజ్ కి గురి చేశారు. వాటిలో ఒకదాని నుండి మొత్తం 20 ఓసైట్లు ఐవిసికి లోబడి ఉన్నాయి. వాస్తవానికి, ఒక దాత నుండి 20 ఓసైట్లు 11 పిండాలకు కారణమయ్యాయి. పిండం బదిలీ 9 పిండాలతో జరిగింది, దీని ఫలితంగా 3 ఐవిఎఫ్ గర్భాలు వచ్చాయి. రెండవ దాత నుండి మొత్తం 5 ఓసైట్లు 5 పిండాలకు కారణమయ్యాయి . ఐదు పిండాలలో, నాలుగు ఈటికి ఎంపిక చేయబడ్డాయి. దీని ఫలితంగా 2 గర్భాలు ఏర్పడ్డాయి. మూడవ దాత యొక్క 4 ఓసైట్స్ నుండి, 2 పిండాలు అభివృద్ధి చేయబడ్డాయి మరియు పిండం బదిలీ ఫలితంగా ఒక గర్భం వచ్చింది. మొత్తంమీద, 18 పిండాలు 29 ఓసైట్స్ నుండి అభివృద్ధి చేయబడ్డాయి. 15 పిండాల ఈటి ఫలితంగా 6 బన్ని గర్భాలు వచ్చాయి . ఈ 6 గర్భాలలో, మొదటి ఐవిఎఫ్ బన్నీ దూడ ఈరోజు జన్మించింది. ఇది దేశంలోనే తొలి బన్ని బఫెలో ఐవిఎఫ్ దూడ. ప్రభుత్వం మరియు శాస్త్రవేత్తలు సంయుక్తంగా గేదెల ఐవిఎఫ్ రంగంలో గొప్ప సామర్థ్యాన్ని చూస్తున్నారు మరియు దేశంలో పశు సంపదను మెరుగుపరచడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
pib-94896
81a50d027132eebf8fee86da0b93c1920d380d90c9db760d1013fd9eb6748b9d
tel
రక్షణ మంత్రిత్వ శాఖ ఎన్డీసీ డైమండ్ జూబ్లీ వెబ్నార్ 05-06 నవంబర్ 2020 డైమండ్ జూబ్లీ వేడుకల్లో భాగంగా నేషనల్ డిఫెన్స్ కాలేజీ నవంబర్ 5,6 తేదీల్లో నిర్వహించిన రెండు రోజుల వెబ్నార్ ఈ రోజు ముగిసింది. “ఇండియా'స్ నేషనల్ సెక్యూరిటీ: ద వే అహెడ్” అనే అంశంపై జరిగిన వెబ్నార్లో జాతీయ భద్రతా సమస్యలపై జాతీయ మరియు అంతర్జాతీయ వక్తలు పాల్గొని ఆ ఆంశంపై విస్తృతమైన సమగ్రమైన దృక్పథాన్ని ఆవిష్కరించారు. చివరి రోజు ముఖ్యాంశంపై డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ ప్రసంగించారు. ఆ తరువాత సర్వీస్ చీఫ్స్ & హోం సెక్రటరీ ప్రసంగించారు. “ఇండియాస్ సెక్యూరిటీ హారిజన్: ది కమింగ్ డికేడ్” పేరుతో జరిగిన సెషన్లో సమకాలీన సవాళ్లను ఎదుర్కొనేందుకు సాయుధ దళాలలో జరుగుతున్న నిర్మాణాత్మక సంస్కరణలను సిడిఎస్ వివరించారు. సైనిక మరియు బ్యూరోక్రసీ నేతల వ్యూహాత్మక సంబంధాలలో జాతీయ రక్షణ కళాశాల పాత్రను, మరియు ఆ సవాళ్లను ఎదుర్కోవడంలో చూపిన చొరవను అభినందించారు. మార్పును స్వీకరించడం, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోండం మరియు ఎక్కువ కార్యాచరణ సామర్థ్యం సాధించడానికి సాయుధ దళాలకు సమయం అవసరమని చెప్పారు. తదనంతరం చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్, ది చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ మరియు వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్.. భారతదేశానికి సంబంధించిన భవిష్యత్తు భద్రతా సవాళ్ళ గురించి మరియు భవిష్యత్ యుద్ధాలలో సముద్ర, వాయు మరియు పదాతి దళాల ప్రాముఖ్యత గురించి సమగ్రవిశ్లేషణను అందించారు. అంతర్గత భద్రతా సవాళ్లు మరియు కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య ప్రతిస్పందనను సమన్వయం చేయడానికి జరుగుతున్న కార్యక్రమాలను వివరించిన హోంశాఖ కార్యదర్శి శ్రీ ఎకె భల్లా ప్రసంగంతో సెషన్ ముగిసింది. రక్షణ కార్యదర్శి శ్రీ అజయ్ కుమార్ ప్రసంగంతో వెబ్నార్ ముగిసింది. వెబ్నార్లో పాల్గొని సంక్లిష్ట సమస్యలపై దాపరికం అభిప్రాయాలను వెల్లడించినందుకు మరియు విభిన్న దృక్పథాలను అందించినందుకుగానూ వక్తలకు కమాండెంట్ నేషనల్ డిఫెన్స్ కాలేజ్ ఎయిర్ మార్షల్ డి చౌదరి, ఎవిఎస్ఎమ్, విఎమ్, విఎస్ఎమ్ ముగింపు ఉపన్యాసం ద్వారా కృతజ్ఞతలు తెలిపారు.
pib-294828
41d83c4d54ec1e189cbf1e16b3adf6be91d3b3c7e223455605d8effc31ae3109
tel
నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ విద్యుత్ మంత్రిత్వ శాఖ, నూతన & పునరుత్పాదక ఇంధన శాఖల కేబినెట్ మంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించిన రాజ్కుమార్ సింగ్ విద్యుత్ మంత్రిత్వ శాఖ, నూతన & పునరుత్పాదక ఇంధన శాఖ కేబినెట్ మంత్రిగా రాజ్ కుమార్ సింగ్ గురువారం పదవీబాధ్యతలు స్వీకరించారు. తనపై అత్యంత నమ్మకాన్ని ఉంచి, ఈ బాధ్యతలను తనకు అప్పగించినందుకు ప్రధానమంత్రికి కృతజ్ఞతలు చెప్తూ, తాను అందుకు తగినట్టుగా విధులు నిర్వర్తిస్తానని ఆర్.కె. సింగ్ అన్నారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో కొద్ది సేపు మాట్లాడుతూ, ప్రధానమంత్రి పెట్టిన విద్యుద్దీకరణ లక్ష్యాలను తాము అనుకున్న సమయానికన్నా ముందే సాధించామని, విద్యుత్, ఇంధన రంగాలకు చెందిన ఫలాలు సాధారణ పౌరులకు అందేలా కృషి చేస్తానని సింగ్ చెప్పారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని సీనియర్ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు.
pib-18396
91fbc0491412b12a411c7f6d5e302c02eda9ad34c3bb181e2618d89300429176
tel
పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ ఢిల్లీ-ఎన్.సి.ఆర్. లో తక్షణమే అమల్లోకి వచ్చిన - సవరించిన గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ మూడవ దశ ముఖ్యాంశాలుగత 24 గంటల్లో ఢిల్లీ-ఎన్.సీ.ఆర్. లో గాలి నాణ్యత గణనీయంగా క్షీణించిన నేపథ్యంలో జి.ఆర్.ఏ.పి. కింద చర్యల కోసం సి.ఏ.క్యూ.ఎం. సబ్ కమిటీ అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది.'తీవ్రమైన' గాలి నాణ్యత కోసం, జి.ఆర్.ఏ.పి. మూడవ దశ కింద సూచించిన అన్ని చర్యలు - ఎన్.సి.ఆర్. లో తక్షణమే అమల్లోకి వచ్చే విధంగా సంబంధిత అన్ని ఏజెన్సీలు సరైన శ్రద్ధతో అమలు చేయాలి; మొదటి, రెండవ దశ చర్యలను బలోపేతం చేయాలి గత 24 గంటల్లో ఢిల్లీ-ఎన్.సీ.ఆర్. లో గాలి నాణ్యత గణనీయంగా క్షీణించిన దృష్ట్యా, ఎన్.సి.ఆర్. మరియు పరిసర ప్రాంతాల్లో గాలి నాణ్యత యాజమాన్య కమిషన్ కు చెందిన గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ కింద చర్యలను ప్రారంభించే సబ్-కమిటీ ఈరోజు అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు ఢిల్లీ మొత్తం గాలి నాణ్యత సూచీ 407 మార్కు దాటింది, ఇది స్థానికంగా నెలకొన్న వాతావరణ పరిస్థితుల ప్రభావం కావచ్చు. 14.11.2022 తేదీ నుంచి ఢిల్లీ-ఎన్.సి.ఆర్. ప్రాంతంలో మొత్తం గాలి నాణ్యతపై మూడవ దశ కింద చర్యల ఉపసంహరణ ప్రభావంతో పాటు జి.ఆర్.ఏ.పి. మొదటి, రెండవ దశ కింద అమలై కొనసాగుతున్న నియంత్రణ / నివారణ చర్యలను కమిషన్ సమగ్రంగా సమీక్షించింది. అకస్మాత్తుగా నెలకొన్న ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా, గాలి నాణ్యత మరింత క్షీణించకుండా నిరోధించేందుకు ముందస్తు చర్యగా మొత్తం ఎన్.సి.ఆర్. ప్రాంతంలో తక్షణ ప్రభావంతో జీ.ఆర్.ఆ.పి. మూడవ దశను మళ్లీ అమలు చేయడం అవసరమని, మొత్తం గాలి నాణ్యతా ప్రమాణాలను నిశితంగా సమీక్షిస్తున్న సమయంలో భావించినట్లు, ఈ సమావేశంలో సబ్కమిటీ పేర్కొంది. డైనమిక్ మోడల్ తో పాటు, వాతావరణ / వాతావరణ సూచన ప్రకారం, ఈ ఆకస్మిక స్పైక్ బహుశా స్థానికీకరించిన కారకాల వల్ల కావచ్చు, అందువల్ల గాలి నాణ్యత మరింత క్షీణించకుండా, అదేవిధంగా, ఢిల్లీ ఏ.క్యూ.ఐ. లో హెచ్చు తగ్గులు లేకుండా చూసే ప్రయత్నంలో భాగంగా, జి.ఆర్.ఏ.పి. - 'తీవ్రమైన' గాలి నాణ్యత మూడవ దశ కింద ఊహించిన విధంగా అన్ని చర్యలను తిరిగి ప్రారంభించాలని సబ్-కమిటీ పిలుపు నిచ్చింది. ఇది జి.ఆర్.పి. మొదటి, రెండవ దశ, మూడవ దశ లో పేర్కొన్న నివారణ / నియంత్రణ చర్యలకు అదనం. దీని ప్రకారం, ఇప్పటికే అమలులో ఉన్న జి.ఆర్.ఏ.పి. మొదటి, రెండవ దశ నివారణ / నిర్బంధ చర్యలతో పాటు, జి.ఆర్.ఏ.పి. మూడవ దశ ప్రకారం 9-అంశాల కార్యాచరణ ప్రణాళిక మొత్తం ఎం.సి.ఆర్. లో నేటి నుండి తక్షణ ప్రభావంతో అమల్లోకి వస్తుంది. ఈ 9-అంశాల కార్యాచరణ ప్రణాళిక లో ఎన్.సి.ఆర్., డి.పి.సి.సి. కి చెందిన వివిధ ఏజెన్సీలు, పి.సి.బి.లు అమలు చేయాల్సిన, నిర్ధారించవలసిన దశలు ఉన్నాయి. ఈ దశలు: 1. యంత్రాల సహాయంతో, వాక్యూమ్ ఆధారంగా రోడ్లను ఊడ్చే ప్రక్రియను తీవ్రతరం చేయడం 2. వేడిగా ఉండే ప్రదేశాలు, రాకపోకలు ఎక్కువగా ఉండే రహదారులు, నిర్దేశించిన ప్రదేశాలు, పల్లపు ప్రదేశాలలో సేకరించిన దుమ్మును సరిగ్గా పారవేయడంతో పాటు, రహదారులపై, ట్రాఫిక్ రద్దీకి ముందు, దుమ్ము ను నిరోధించే చర్యలతో పాటు, రోజువారీ నీటిని చిలకరించడం. 3. ప్రజా రవాణా సేవలను తీవ్రతరం చేయడం. రద్దీ లేని సమయాల్లో ప్రయాణాన్ని ప్రోత్సహించడానికి ఆ సమయాల్లో రేట్లు తగ్గించే విధానాన్ని ప్రవేశపెట్టడం. 4. నిర్మాణం, కూల్చివేత కార్యకలాపాలు: ఈ దిగువ పేర్కొన్న వర్గాల ప్రాజెక్టులు మినహా మొత్తం ఎన్.సి.ఆర్. లో నిర్మాణ, కూల్చివేత కార్యకలాపాలపై కఠినమైన నిషేధాన్ని అమలు చేయాలి: ఏ) రైల్వే సేవలు / రైల్వే స్టేషన్లు బి) మెట్రో స్టేషన్లతో సహా మెట్రో రైలు సేవలు. సి) విమానాశ్రయాలు, అంతర్ రాష్ట్ర బస్సు టెర్మినల్స్. డి) జాతీయ భద్రత / రక్షణ సంబంధిత కార్యకలాపాలు / జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రాజెక్టులు సి) ఆసుపత్రులు/ ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు. ఎఫ్) రహదారులు, రోడ్లు, ఫ్లైఓవర్లు, ఓవర్ బ్రిడ్జిలు, విద్యుత్ సరఫరా లైన్లు, పైప్ లైన్లు మొదలైన లీనియర్ పబ్లిక్ ప్రాజెక్టులు. జి) మురుగునీటి శుద్ధి కర్మాగారాలు, నీటి సరఫరా ప్రాజెక్టులు మొదలైన పారిశుద్ధ్య ప్రాజెక్టులు. హెచ్) పైన పేర్కొన్న వర్గాలకు చెందిన ప్రాజెక్టులకు ప్రత్యేకమైన, అనుబంధంగా ఉన్న ప్రాజెక్టుల అనుబంధ కార్య కలాపాలు. గమనిక: పైన పేర్కొన్న మినహాయింపులు సి&డి వ్యర్ధ పదార్థాల నిర్వహణ నియమాలు, (Visitor Counter : 109
pib-184965
cb0ce86b8aaa85b207a8356e10a49e8b2a1df320726ca767d1906daeb084d174
tel
సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తో లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ ఆర్. కె. మాథుర్ భేటీ; కేంద్రపాలిత ప్రాంతంలో కోవిడ్ పరిస్థితి మరియు అభివృద్ధి కార్యకలాపాలపై చర్చ కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తో లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ ఆర్. కె. మాథుర్ మంగళవారం ఢిల్లీలో సమావేశమై కోవిడ్ పరిస్థితిపై మరియు కొత్తగా ఏర్పాటు చేసిన లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతంలో అభివృద్ధి కార్యకలాపాల పునరుద్ధరణ తదితర అంశాలపై చర్చలు జరిపారు. రోజువారీ కార్యకలాపాలతో పాటు కోవిడ్ మహమ్మారి కాలంలో కేంద్ర సహాయం అందించడంలో మద్దతు ఇచ్చినందుకు అయన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్ మహమ్మారి వ్యాప్తి చెందకుండా జాగరూకతతో వ్యవహరించి అదుపు చేయడంలో విజయం సాధించినందుకు కేంద్ర ప్రభుత్వం తరపున డాక్టర్ జితేంద్ర సింగ్ కేంద్రపాలిత ప్రాంత పరిపాలకవర్గాన్ని ప్రశంసించారు. ఇరాన్ యాత్రకు వెళ్లి వచ్చినవారివల్ల లద్దాఖ్ లో ఉన్నట్టుండి కరోనా పాజిటివ్ కేసులు పెరగడం మొత్తం దేశ ప్రజలను కలవరపెట్టిందని అయితే పరిపాలకవర్గం మరియు పౌర సమాజం సావధానంతో వ్యవహరించడం వల్ల దేశంలో అందరికన్నా ముందుగా లద్దాఖ్ క్రమంగా కరోనా దాడినుంచి బయట పడిందని మంత్రి అన్నారు. లద్దాఖ్ మరియు ఈశాన్య భారతం చుట్టూ ఉన్న ప్రాంతాలకు ప్రాధాన్యం ఇవ్వవలసిందిగా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి డాక్టర్ జితేంద్ర సింగ్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని ఆదేశాల ఫలితంగా లాక్ డౌన్ అమలు చేయడానికి ముందే ఆ ప్రాంతాలకు విమానాల ద్వారా సరుకులను రవాణా చేయడం మొదలైంది. దాని ఫలితంగా ఇప్పుడు రేషన్, కూరగాయలు, పళ్ళు మామూలుగా ఈ సమయంలో లద్దాఖ్ లో ఉండవలసిన నిల్వలకన్నా ఎక్కువ పరిమాణంలో ఉన్నాయని ఆయన అన్నారు. లేహ్ , కార్గిల్ డిప్యూటీ కమిషనర్లు, ఆ రెండు జిల్లాల ఎస్ ఎస్ పీల పనితీరును కూడా మంత్రి ప్రశంసించారు. వివిధ సమస్యలపై రోజువారీ పరిస్థితిని గురించి వారు ఎప్పటికప్పుడు సమాచారం అందించడం వల్ల సమన్వయంతో వైద్య పరికరాలు సరఫరా చేయడం మరియు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలను తరలించడం సాధ్యమైందని మంత్రి వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితిని గురించి శ్రీ మాథుర్ మంత్రికి వివరించారు. ఇప్పుడు అభివృద్ధి పనులను పునరుద్ధరించే ప్రయత్నం జరుగుతోందని తెలిపారు. కోవిడ్ మహమ్మారి కారణంగా జాప్యమైన విద్యుత్ ఉత్పత్తి మరియు నిర్మాణ పనులకు సంబంధించిన ప్రాజెక్టులను గురించి కూడా ఆయన చర్చించారు. వాటిని త్వరలో పునరుద్ధరించడం జరుగుతుందని తెలిపారు. లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతం కోసం ప్రతిపాదిత ప్రాజెక్టులలో శాస్త్ర పారిశ్రామిక పరిశోధనా మండలి ప్రణాళిక సిద్ధం చేసిన 'లేహ్ బెర్రీ' ల ప్రాసెసింగ్ ప్రాజెక్టు కూడా ఉంది. (Visitor Counter : 210
pib-21470
b59383b3b151115b343f077cc84693091c06023c182be254d6de0f3ca77f8e53
tel
హోం మంత్రిత్వ శాఖ తన 18వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విపత్తు నిర్వహణలో స్వచ్ఛంద సేవను వేడుకగా జరుపుకున్న నేషనల్ డిశాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ నేషనల్ డిశాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ బుధవారం నాడు న్యూఢిల్లీలో తన 18వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంది. నివారణ, ఉపశమన, సంసిద్ధత, ప్రతిస్పందన వ్యూహ సంస్కృతి ద్వారా సంపూరణ, క్రియయాశీల, బహుళ విపత్తు ఆధారిత, సాంకేతికతలను అభివృద్ధి చేయడం ద్వారా సురక్షితమైన, విపత్తులను తట్టుకునే భారతదేశాన్ని నిర్మించడమే ఎన్డిఎంఎ దార్శనికత. ఈ ఏడాది వ్యవస్థాపక దినోత్సవ ఇతివృత్తం వాలంటీరిజం ఇన్ డిశాస్టర్ మేనేజ్మెంట్ . ఆపద మిత్రుల అస్తిత్వం సేవ, సమర్పణ & పరోపకారమని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హోం వ్యవహారాల సహాయమంత్రి శ్రీ నిత్యానందరాయ్ అన్నారు. స్వయం-సమృద్ధ భారతదేశంను సృష్టించాలన్నప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ దార్శనికతకు అనుగుణంగా స్వచ్ఛంద సేవకత మనతోనే ప్రారంభమవుతుందని, తక్షణ అవసరమైన సురక్షిత, బలమైన భారతదేశాన్ని నిర్మించేందుకు సమాజాలు ఏకతాటిపైకి రావాలని ఆపదా మిత్రులు సూచించారని ఆయన అన్నారు. నేడు ఎన్డిఎంఎ - సిడిఆర్ ఐ వంటి వివిధ అంతర్జాతీయ విపత్తు నిర్వహణా సంస్థలలో భారత్కు ప్రాతినిధ్యం వహించిందని, అంతేకాక పలు జీవితాలను కాపాడేందుకు వీలు కల్పించే ఆవిష్కరణ, సాంకేతికత, నిర్మాణాత్మకమైన, సురక్షితమైన రేపటి కోసం ప్రణాళికల వంటి అంశాలలో పలు కోణాలలో 31 దేశాలకు భారతదేశం నాయకత్వం వహిస్తోందన్నారు. ఒక దశాబ్దం కిందట మరణాల రేటు చాలా ఎక్కువగా ఉండేదని, కానీ ఎన్డిఎంఎ విపత్తు నిర్వహణకు నాయకత్వం వహిస్తున్నందున, ప్రాణ నష్టం భారీగా తగ్గిందని, నేడు రక్షణ/ కాపాడేందుకు చేపట్టే చర్యలు మరింత ఆధునికమైనవి అయినప్పటికీ, కోల్పోయిన జీవితాల గత రికార్డుతో పోలిస్తే ఇది చాలా తక్కువ అని ఆయన అభిప్రాయపడ్డారు. స్వయం సేవకత అన్న ఇతివృత్తాన్ని అంగీకరిస్తూ, ఏ విపత్తులోనైనా ప్రభుత్వ యంత్రాంగం ఎంత త్వరితగతిన స్పందించినా, బాహ్య సహాయం బాధిత ప్రజలను చేరుకోవడానికి సమయం పడుతుందని, ఈ సమయంలో తీసుకునే సమయమే జీవితాలను, జీవనోపాధిని కాపాడడానికి కీలకమని హోం వ్యవహారాల సహాయం మంత్రి శ్రీ అజయ్ కుమార్ మిశ్రా అన్నారు. కనుక, సరైన శిక్షణ, సన్నద్ధత ఉన్నప్పుడు తక్షణ, తొలి ప్రతిస్పందన అన్నది నష్టాలను తగ్గించడంలో కీలకపాత్ర పోషించగల స్వచ్ఛంద సేవకులు బాధిత సమాజం నుంచే వస్తారన్నారు. విపత్తు నిర్వహణపై జాతీయ విధానం 2009లో విపత్తు నిర్వహణలో స్వయం సేవకత అవసరాన్ని సూచించినప్పటికీ, విపత్తు ప్రమాదాన్ని తగ్గించే అజెండాలో తన పది అంశాలను ఉద్ఘాటించారని ఆయన అన్నారు. ఇందులో భాగంగా స్థానిక సామర్ధ్యాల నిర్మాణం, చొరవలు, విపత్తు ప్రమాద నిర్వహణలో స్వయం సేవకతను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారన్నారు. ఈ నేపథ్యంలోనే కేవలం ఉపశమనం కేంద్రీకృత విధానం నుంచి తమ దృష్టిని విస్త్రతం చేసిపునర్నిర్మాణం, పునరావాసపరంగా నివారణ, ఉపశమనంతో కూడిన క్రియాశీల వైఖరిని అనుసరించాలని ప్రధానమంత్రి మోదీ ఎన్డిఎంఎను కోరిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ వేడుకలలో కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, బీహార్, అస్సాం, ఉత్తర్ప్రదేశ్కు చెందిన శిక్షితులైన ఆపదామిత్ర వాలంటీర్లతో పాటుగా, నేషనల్ కేడెట్ కోర్ , నేషనల్ సర్వీస్ స్కీం , నెహ్రూ యువ కేంద్ర , సివిల్ డిఫెన్స్ అండ్ భారత్ స్కౌట్ & గైడ్ కు చెందిన కేడెట్లు, వాలంటీర్లు హాజరై, తమ వ్యక్తిగత పరికరాలను ను, జిల్లా స్థాయి ఇఇఆర్ఆర్ పరికరాలను ఆవరణలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా జరిగిన సాంకతిక సెషన్లలో విపత్తు నిర్వహణలో స్వయం సేవకు సంబంధించిన చర్చలు, అనుభవాలు పంచుకోవడం జరిగింది. విపత్తు నిర్వహణలో స్వయం సేవకతకు సంబంధించిన ఉత్తమ ఆచరణలను పాల్గొన్న రాష్ట్రాలు ఇతరులతో పంచుకున్నాయి. స్వచ్ఛంద సంస్థలైన , సీడ్స్ , స్ఫియర్ ఇండియా, వరల్డ్ విజన్ ఇండియా, యాక్షన్ ఎయిడ్ ఇండియా స్వయం సేవకత ద్వారా విపత్తు నిర్వహణపై తమ కేస్ స్టడీలను సమర్పించాయి. అనంతరం, వర్తమానంలో, భవిష్యత్తులో విపత్తు నిర్వహణలో ఎన్ఎస్ఎస్, ఎన్సిసి, ఎన్వైకె, ఎన్ఎస్జి కు చెందిన కేడెట్లు / వాలంటీర్ల పాత్ర సాధ్యతపై చర్చ నిర్వహించారు. అనంతరం, ప్రధానమంత్రి ముఖ్య సలహాదారు డాక్టర్ పి.కె. మంత్రి అధ్యక్షతన జరిగిన ముగింపు సభలో ఎన్డిఎంఎ, ఆపదామిత్ర, ఇతర వాలంటీర్ల కృషి విపత్తు నిర్వహణలో అంతర్భాగంగా ఆయన వర్ణించారు.
pib-189986
e9b0b600008d599080bcd5144ea2470161d82022f25338d67e5a77b645ee1bf9
tel
రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ వింటేజ్ మోటారు వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియకు చట్టబద్ధత పాతకాలపు వాహనాల వారసత్వాన్ని కాపాడడం, ప్రోత్సహించడమే లక్ష్యంగా వింటేజ్ మోటారు వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను చట్టబద్ధం చేసినట్లు కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఇప్పటిదాకా వింటేజ్ వాహనాల రిజిస్ట్రేషన్ను క్రమబద్దీకరించేలా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ఎటువంటి నియమ నిబంధనలు లేవన్నారు. ఈ కొత్త నిబంధనల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిచేసుకునే వెసులుబాటు ఉండడంతోపాటు ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేయబడిన వాహనాల పాత సంఖ్యను నిలుపుకోవడంతోపాటు తాజా రిజిస్ట్రేషన్ల కోసం వీఏ సిరీస్ వంటి విశిష్ట లక్షణాలు ఈ కొత్త నిబంధనల్లో ఉన్నాయన్నారు. భారతదేశంలో వింటేజ్ మోటారు వాహనాల వారసత్వాన్ని కాపాడడం, ప్రోత్సహించడమే లక్ష్యంగా 1989నాటి కేంద్ర మోటారు వాహనాల నిబంధనలను కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వశాఖ సవరించింది. విశిష్ట లక్షణాలు గుర్తించదగిన స్థాయిలో ఓవరాలింగ్ చేయబడని యాభై సంవత్సరాల వయసు పైబడిన అన్నిరకాల ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలు వింటేజ్ మోటారు వాహనాలనుగా నిర్వచించబడతాయి. ఇన్స్యూరెన్స్ పాలసీ, ఫీజు, దిగుమతి చేసుకున్న వాహనమైతే ఎంట్రీ బిల్లు, అప్పటికే రిజిస్ట్రేషన్ చేసిన వాహనమైతే పాత రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ తదితర పత్రాలతో కూడిన ఫామ్ 20 ప్రకారం వింటేజ్ వాహనాలను రిజిస్ట్రేషన్ లేదా రీరిజిస్ట్రేషన్ చేయబడుతుంది. రాష్ట్ర రిజిస్ట్రేషన్ అథారిటీ 60 రోజుల్లో ఫారం 23ఏ ప్రకారం రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ జారీ చేస్తుంది. ఇప్పటికే నమోదు చేసుకున్న వాహనాలు వాటి అసలు రిజిస్ట్రేషన్ మార్క్ను నిలుపుకోగలవు. అయినప్పటికీ, తాజా రిజిస్ట్రేషన్ కోసం, రిజిస్ట్రేషన్ మార్క్ “XX VA YY” గా కేటాయించబడుతుంది, ఇక్కడ VA అంటే పాతకాలపు, XX అంటే స్టేట్ కోడ్, YY రెండు అక్షరాల సిరీస్ మరియు “8” అనేది రాష్ట్ర రిజిస్ట్రేషన్ అథారిటీ 0001 నుండి 9999 వరకు కేటాయించిన సంఖ్య. నూతన నిబంధనల ప్రకారం కొత్త రిజిస్ట్రేషన్ కోసం ఫీజు రు.20,000, రీ రిజిస్ట్రేషన్ కోసం రూ. 5,000గా నిర్ణయించారు. వింటేజ్ మోటారు వాహనాలు సాధారణ, వాణిజ్య ప్రయోజనాల కోసం రోడ్లపై నడపబడవు.
pib-277454
be30a5b111f32ab5c44ea3b85369e7ea1be075b12c808f15cf789b472444978c
tel
ప్రధాన మంత్రి కార్యాలయం వందో కిసాన్ రైలు కు జెండా ను చూపిన ప్రధాన మంత్రి వ్యావసాయక ఉత్పత్తులకు విలువ ను జోడించడానికి సంబంధించిన ప్రోసెసింగ్ పరిశ్రమ కు మేము ప్రాధాన్యాన్ని ఇస్తాము: ప్రధాన మంత్రి వ్యవసాయం లో ప్రైవేటు పెట్టుబడి రైతులకు సహాయకారి కాగలదు: ప్రధాన మంత్రి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మహారాష్ట్ర లోని సంగోలా నుంచి పశ్చిమ బంగాల్ లోని శాలిమార్ కు నడిచే వందో కిసాన్ రైలు కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ఈ రోజు న జెండా ను చూపారు. కేంద్ర మంత్రులు శ్రీ నరేంద్ర సింహ్ తోమర్, శ్రీ పీయూష్ గోయల్ లు కూడా ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ సందర్భం లో ప్రధాన మంత్రి మాట్లాడుతూ, కిసాన్ రైలు సర్వీసు దేశ రైతుల ఆదాయాన్ని పెంచే దిశ లో ఒక పెద్ద అడుగు అంటూ అభివర్ణించారు. కరోనా మహమ్మారి కాలం లో సైతం గత నాలుగు నెలల్లో 100 కిసాన్ రైళ్ళ ను ప్రవేశపెట్టడం పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ విధమైన సేవ వ్యవసాయానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థ లో ఒక పెద్ద మార్పు ను కొని తెస్తుందని, అంతేకాకుండా దేశం లో శీతలీకరణ సదుపాయం తో కూడిన సరఫరా వ్యవస్థ శక్తి ని కూడా పెంచుతుందని ఆయన చెప్పారు. కిసాన్ రైలు ద్వారా సరకుల చేరవేత కు ఎలాంటి కనీస రాశి ని ఖరారు చేయలేదని, అత్యంత చిన్న పరిమాణం లో ఉండే ఉత్పత్తి కూడా తక్కువ ధర కే సరైన విధం గా పెద్ద బజారు కు చేరగలుగుతుందని కూడా ఆయన తెలిపారు. కిసాన్ రైలు పథకం రైతులకు సేవ చేయాలన్న ప్రభుత్వ వచనబద్ధత ను చాటడం ఒక్కటే కాకుండా మన రైతులు కొత్త బాధ్యతలను అందుకోవడానికి ఎంత వేగం గా సన్నద్ధులు అవుతారో అనే దానికి కూడా ఒక నిదర్శనం గా ఉందని ప్రధాన మంత్రి అన్నారు. రైతులు వారి పంటలను ప్రస్తుతం ఇతర రాష్ట్రాల లో కూడా అమ్ముకోగలుగుతారని, ఈ ప్రక్రియ లో రైతుల రైలు తో పాటు వ్యావసాయక విమానాలు లది ప్రధాన పాత్ర అని ఆయన అన్నారు. కిసాన్ రైలు అంటే, అది త్వరగా పాడయిపోయే ఫలాలు, కాయగూరలు, పాలు, చేపల వంటి సరకులను పూర్తి భద్రత తో చేరవేసే ఒక చలనశీల శీతలీకరణ నిలవ సదుపాయమే అని ఆయన అన్నారు. ‘‘భారతదేశం లో ఎల్లప్పుడూ ఒక పెద్ద రైల్వే నెట్ వర్క్ అంటూ ఉంది; స్వాతంత్య్రం రావడానికంటే ముందు కూడా అది ఉంది. శీతలీకరణ నిలవ సంబంధిత సాంకేతిక విజ్ఞానం కూడాను అందుబాటు లో ఉండింది. ఇప్పుడు మాత్రమే ఈ బలాన్ని కిసాన్ రైల్ మాధ్యమం ద్వారా సరైన విధం గా వినియోగించుకోవడం జరుగుతున్నది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. కిసాన్ రైలు వంటి సదుపాయం పశ్చిమ బంగాల్ కు చెందిన లక్షల కొద్దీ చిన్న రైతులకు ఒక భారీ సౌకర్యం అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ సౌకర్యం అటు రైతులకు, ఇటు స్థానికంగా చిన్న వ్యాపారస్తులకు కూడా అందుబాటు లో ఉందని ఆయన అన్నారు. వ్యవసాయ రంగ నిపుణులతో పాటు, ఇతర దేశాలకు చెందిన అనుభవాలను, కొత్త సాంకేతిక విజ్ఞానాన్ని భారతదేశ వ్యవసాయ రంగం లోకి తీసుకురావడం జరుగుతోందని ఆయన అన్నారు. రైల్వే స్టేశన్ ల పరిసర ప్రాంతాల లో పెరిశబుల్ రైల్ కార్గో సెంటర్ లను నిర్మించడం జరుగుతోంది. వాటిలో రైతులు వారి ఉత్పత్తి ని నిలవ చేసుకోవచ్చును. వీలైనన్ని ఎక్కువ పండ్లను, కాయగూరలను కుటుంబానికి అందించాలన్నదే ఈ ప్రయాస గా ఉంది. రసం, పచ్చడి, సాస్, చిప్స్ వగైరా అదనపు ఉత్పత్తి ఆయా ఉత్పత్తులలో నిమగ్నం అయిన నవ పారిశ్రామికుల చెంతకు చేరాలి అని ప్రధాన మంత్రి అన్నారు. నిలవ సౌకర్యం తో కూడిన మౌలిక సదుపాయాల పైన, వ్యవసాయ ఉత్పత్తుల లో విలువ జోడింపునకు సంబంధించిన ప్రోసెసింగ్ పరిశ్రమలపైన శ్రద్ధ తీసుకోవడం ప్రభుత్వ ప్రాథమ్యం గా ఉందంటూ ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. ఆ తరహా లో సుమారు 6500 పథకాలకు పిఎమ్ కృషి సంపద యోజన లో భాగం గా మెగా ఫూడ్ పార్క్స్, కోల్డ్ చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎగ్రో ప్రోసెసింగ్ క్లస్టర్ లలో భాగం గా ఆమోదించడం జరిగింది అని ఆయన అన్నారు. 10,000 కోట్ల రూపాయలను ఆత్మ నిర్భర్ అభియాన్ ప్యాకేజీ లో భాగం గా మైక్రో ఫూడ్ ప్రోసెసింగ్ ఇండస్ట్రీస్ కోసం మంజూరు చేయడమైందని ఆయన అన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు, రైతులు, యువతీయువకుల భాగస్వామ్యం, సమర్ధనలే ప్రభుత్వ ప్రయత్నాలు సఫలం కావడానికి కారణం అవుతాయి అని శ్రీ మోదీ అన్నారు. వ్యవసాయ ప్రధాన వ్యాపారాలలోనూ, వ్యవసాయ ప్రధాన మౌలిక సదుపాయాల కల్పన లోనూ మహిళా స్వయంసహాయ సమూహాల వంటి సహకార సమూహాలు, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ వంటివి ప్రాధాన్యాన్ని పొందుతాయని ఆయన చెప్పారు. ఇటీవలి సంస్కరణలు వ్యవసాయ సంబంధ వ్యాపారం విస్తరించడానికి దారి తీస్తాయని, వాటి తాలూకు అతి పెద్ద లబ్ధిదారులు గా ఈ సమూహాలు ఉంటాయని ఆయన చెప్పారు. వ్యవసాయ రంగం లో ప్రైవేటు పెట్టుబడి ఈ సమూహాలకు సహాయం అందించాలన్న ప్రభుత్వ ప్రయత్నానికి మద్ధతు గా ఉండగలదని ఆయన అన్నారు. “మేము భారతదేశ వ్యవసాయ రంగాన్ని, కిసాను ను బలపరచే మార్గం లో ముందుకు సాగిపోతూనే ఉంటాము” అని ప్రధాన మంత్రి అన్నారు.
pib-209405
0736af7fda2d254940ae148b7ffb8d6be952f10c53c85225ab8ef435930d214f
tel
ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ జాతీయ ఎఐ పోర్టల్ - www.ai.gov.in ను ప్రారంభించి ఐటీ మంత్రి స్కూలు విద్యార్థుల్లో ఎఐపై ఆదరణ పెంచడానికి ఉద్దేశించిన ఇంటెల్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించి మంత్రి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండో టెర్మ్ పాలనలోకి వచ్చి ఏడాది అయిన సందర్భంగా జాతీయ ఎఐ పోర్టల్ - www.ai.gov.in ను కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ, న్యాయ శాఖ మంత్రి శ్రీ రవిశంకర్ ప్రసాద్ ప్రారంభించారు. (కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ శాఖ, ఐటీ పరిశ్రమలు కలిసి ఈ పోర్టల్ ను ఉమ్మడిగా అభివృద్ధి చేశాయి. దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించిన అన్ని కార్యకలాపాలను ఈ పోర్టల్ ద్వారానే నిర్వహిస్తారు. ఎఐకి సంబంధించి మన దేశంనుంచి వెలువడే సమస్త విషయాలు ఇందులోనే వుండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీన్ని కేంద్ర ప్రభుత్వ ఇ- గవర్నెన్స్ విభాగం, నాస్కామ్ లు ఉమ్మడిగా నిర్వహిస్తాయి. ఈ సందర్భంగా యువతకు పనికి వచ్చే విధంగా యువతకోసం బాధ్యతాయుతమైన ఎఐ పేరుతో ఒక కార్యక్రమాన్ని ప్రారంబించారు. దేశంలోని యువత డిజిటల్ పరంగా ఎదగడానికి వీలుగా వారు భవిష్యత్ లో అన్ని విధాలుగా సిద్ధంగా వుండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వివిధ ప్రభుత్వ సంస్థలు, ఇంటెల్ ఇండియా కలిసి ఈ కార్యక్రమాన్ని రూపొందించి నిర్వహిస్తున్నాయి. యువతకోసం బాధ్యతాయుతమైన ఎఐ అనే కార్యక్రమంద్వారా వారిలో నైపుణ్యాలను పెంచడం జరుగుతుంది. సామాజికంగా ప్రభావితం చూపే పరిష్కారాలను యువత కనుగొనడం జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు మేలు చేయాలనే ఉద్దేశ్యంతో దీన్ని రూపొందించారు. తద్వారా వారు నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులుగా అవతరిచాలనేది లక్ష్యం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధిలో భారతదేశం తప్పకుండా అగ్రభాగాన నిలవబోతుందని కేంద్ర మంత్రి శ్రీ రవిశంకర్ ప్రసాద్ అన్నారు. యువతలో ఇంటర్ నెట్కు ఆదురణ పెరగడం, డాటా ఉపయోగం బాగా పెరుగుతుండడంవల్ల ఎఐ విషయంలో భారతదేశం ఈ రంగంలో ఉన్నతమైన రీతిలో అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. భారతదేశ ఎఐ విధానం అనేది ప్రజలను సాధికారులను చేసే విధంగా వుంటుంది తప్ప వారిని నిరుపయోగులుగా చేసే విధంగా వుండదని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ శాఖ సహాయ మంత్రి శ్రీ సంజయ్ ధోత్రే కూడా పాల్గొన్నారు. కరోనా మహమ్మారి వైరస్ కారణంగా ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పలు రంగాల్లో ఉపయోగపడుతోందని అన్నారు. ఈ సంక్షోభ పరిస్థితులనుంచి గట్టెక్కించడానికి ఎఐని విరివిగా వాడడం జరుగుతోందని అన్నారు.
pib-11639
699169778866fe92a7e16084d9e92a26ec4a4eea208b7e1d77ba387530b2138c
tel
రక్షణ మంత్రిత్వ శాఖ విశాఖపట్నం లో సంఘావరోధ స్థలాన్నిఏర్పాటు చేసిన భారతీయ నౌకాదళం సిఒవిఐడి-19 వ్యాప్తి చెందకుండా దాని పై దేశం లో చేపట్టిన నిరోధక చర్యల ను బలపరచడం లో భాగం గా భారతీయ నౌకాదళం విశాఖపట్నం లోని ఈస్టర్న్ నేవల్ కమాండ్ పరిధి లో ఉన్నటువంటి ఐఎన్ఎస్ విశ్వకర్మ లో ఒక సంఘావరోధ శిబిరాన్ని ఏర్పాటు చేసింది. ఈ శిబిరాన్నికోవిడ్-19 బాధిత దేశాల నుండి ఖాళీ చేయిస్తున్న భారత జాతీయుల కోసం ఏర్పాటు చేయడమైంది. ఈ సంఘావరోధ శిబిరం లో సుమారు 200 మంది కి తగ్గ సకల సదుపాయాలతోను, ఏర్పాట్లతోను ఆశ్రయాన్నిచ్చే విధం గా పూర్తి స్థాయి హంగుల ను సమకూర్చడం జరిగింది. ఈ శిబిరం లో వసతి ని పొందే వ్యక్తుల ను నిశితం గా పర్యవేక్షించనున్నారు. భారత ప్రభుత్వ ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ విభాగం నిర్దేశించిన ప్రోటోకాల్స్ కు అనుగుణం గా ఇఎన్సి యొక్క వైద్య వృత్తి నిపుణులు మరియు నౌకాదళ సిబ్బంది తో కూడిన ఒక బృందం వీరి పట్ల శ్రద్ధ వహిస్తుంది. ఒక ముందు జాగ్రత్త చర్య లో భాగం గా, నిర్వాసిత వ్యక్తుల ను పద్నాలుగు రోజుల పాటు సాటి సమాజం తో కలవనీయకుండా విడి గా ఉంచుతారు. వైరస్ వ్యాప్తి ని నివారించడం కోసం రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య సంబంధ అధికారుల తో, జిల్లా పాలన యంత్రాంగం తో ఇఎన్ సి క్రియాశీల సహకారాన్ని అందిస్తోంది.(Visitor Counter : 107
pib-60594
053f87308f41cd36f3dfb8fc25112edf1fb8fbb525b621d1826f709ba93daefc
tel
రక్షణ మంత్రిత్వ శాఖ పదాతి దళ 76వ దినోత్సవాన్ని జరుపుకున్న భారత సైన్యం భారత సైన్యం లో అతిపెద్ద పోరాట విభాగమైన పదాతిదళం దేశానికి అందించిన సేవలు గుర్తించడానికి ప్రతి సంవత్సరం అక్టోబరు 27న పదాతి దళ దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతోంది. అక్టోబర్ 27 వ తేదీ భారతదేశ చరిత్రలో అత్యంత ప్రత్యేకమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. 1947 అక్టోబర్ 27వ తేదీన భారత సైన్యంలోని పదాతి దళం శ్రీనగర్ విమానాశ్రయంలో దిగింది. శ్రీనగర్ విమానాశ్రయంలో దిగిన పదాతి దళం శివార్ల నుంచి ఆక్రమణదారులను తరిమి కొట్టింది. తన ధైర్య సాహసాలతో పదాతి దళం పాకిస్తాన్ మద్దతుతో జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్రాన్ని ఆక్రమించడానికి జరిగిన గిరిజనుల దాడిని తిప్పి కొట్టి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని రక్షించింది. 2022 పదాతి దళ దినోత్సవ వేడుకల్లో భాగంగా జాతి సేవలో అత్యున్నత త్యాగం చేసిన పదాతి దళానికి చెందిన అమరులకు నివాళులు అర్పిస్తూ ఈ రోజు నేషనల్ వార్ మెమోరియల్ వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచారు. డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ అనిల్ చౌహాన్, లెఫ్టినెంట్ జనరల్ బి ఎస్ రాజు, వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, రెజిమెంట్స్ కల్నల్లతో కలిసి పుష్పగుచ్ఛాలు ఉంచారు. పదాతి దళానికి ఎనలేని సేవలు అందించిన లెఫ్టినెంట్ కల్నల్ రామ్ సింగ్ సహారన్ కీర్తి చక్ర , సబ్ మేజర్ గౌరవ కెప్టెన్ యోగేంద్ర సింగ్ యాదవ్ పరమవీర చక్ర మరియు సెప్ సర్దార్ సింగ్ వీర్ చక్ర లు అనుభవజ్ఞుల తరపున పుష్పగుచ్ఛాలు ఉంచారు. శ్రీనగర్ లో పదాతి దళం దిగి 76 సంవత్సరాలు పూర్తైన సందర్భాన్ని పురస్కరించుకుని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఉధంపూర్ , అహ్మదాబాద్ , వెల్లింగ్టన్ , షిల్లాంగ్ నుంచి ద్విచక్ర వాహన ర్యాలీలు ప్రారంభమయ్యాయి. నేషనల్ వార్ మెమోరియల్ వద్ద ర్యాలీ ని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ప్రారంభించారు. పదాతి దళ సైనికుల పరాక్రమానికి, త్యాగాలకు నివాళులు అర్పించేందుకు బయలుదేరిన సిబ్బంది మార్గమధ్యలో వీర్ నారీలు, అనుభవజ్ఞులు, ఎన్సిసి క్యాడెట్లు మరియు విద్యార్థులతో మాట్లాడారు.10 రోజుల పాటు 8000 కిలోమీటర్లకు పైగా దూరాన్ని అధిగమించారు. పదాతి దళ దినోత్సవం సందర్భంగా పదాతి దళం డైరెక్టర్ జనరల్ సిబ్బందికి అభినందనలు తెలిపారు. శౌర్యం, త్యాగం, విధి పట్ల నిస్వార్థ భక్తి మరియు వృత్తి నైపుణ్యం యొక్క ప్రధాన విలువకు తమను తాము పునరంకితం చేసుకోవాలని మరియు దేశ సమగ్రత మరియు సార్వభౌమత్వాన్ని రక్షించే వారి సంకల్పంలో తిరుగులేని విధంగా ఉండాలని తన సందేశంలో పదాతి దళం డైరెక్టర్ జనరల్ ఉద్బోధించారు.
pib-196425
d86af39acc393b8a74e7b295f9fcc5544e8e304df14c2034cc53e7b707cd2fb6
tel
ప్రధాన మంత్రి కార్యాలయం శివగిరి మఠం పూర్వ అధిపతి స్వామి ప్రకాశానంద జీ కన్నుమూత పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి శివగిరి మఠం పూర్వ అధిపతి స్వామి ప్రకాశానంద జీ మృతి పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. (‘‘ స్వామి ప్రకాశానంద జీ ఒక జ్ఞాన జ్యోతి. అంతేకాదు, ఆధ్యాత్మిక జ్యోతి కూడాను. ఆయన నిస్వార్థ సేవా కార్యాలు నిరుపేదల కు సాధికారిత ను కల్పించాయి. శ్రీ నారాయణ గురు పవిత్ర ఆశయాల కు లోకప్రియత్వాన్ని సాధించి పెట్టడం లో స్వామి ప్రకాశానంద జీ అగ్రగామి గా నిలచారు. స్వామి ప్రకాశానంద జీ మరణం తో నేను ఎంతో వేదన కు లోనయ్యాను. ఓమ్ శాంతి’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
pib-48685
19105a315c8d97075a483e6464b81d3c75dc56b0d1b930a0af93c0f21233fdbd
tel
జల శక్తి మంత్రిత్వ శాఖ మణిపూర్ ముఖ్యమంత్రితో కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి వీసీ సమావేశం 2022 నాటికి రాష్ట్రంలోని అన్ని గ్రామీణ గృహాలకు కుళాయి సదుపాయం కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి శ్రీ గజేంద్ర శేఖావత్, మణిపూర్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్ బీరెన్ సింగ్తో దృశ్య మాధ్యమిక వేదిక ద్వారా ఒక సమావేశం నిర్వహించారు. జల్ జీవన్ మిషన్ అమలుకు సంబంధించిన వివిధ అంశాలపై కేంద్ర మంత్రి ముఖ్యమంత్రితో చర్చించారు. గ్రామాలలో ఇంటింటికీ కుళాయి సదుపాయాన్ని కల్పించడంతో పాటుగా..రాష్ట్రాల నీటి సరఫరా పథకాల గురించి విశ్లేషించేందుకు గాను కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖలోని తాగు నీరు మరియు పారిశుద్ధ్య శాఖ గడిచిన మూడు నెలలుగా రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతల వారితో విస్తృతంగా సంప్రదింపులు జరుపుతూ వస్తోంది. ఇందులో భాగంగానే కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి శ్రీ గజేంద్ర శేఖావత్ తాజాగా మణిపూర్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్ బీరెన్ సింగ్తో వీసీ సమావేశం నిర్వహించారు. దేశంలోని ప్రతి గ్రామీణ గృహానికి తాగునీరు నిమిత్తం తగిన నీటి సరఫరా ఉన్న కుళాయి సదుపాయం ఉండేలా చూసేందుకు గాను భారత ప్రభుత్వం ఆయా రాష్ట్రాల వారి భాగస్వామ్యంతో 'జల్ జీవన్ మిషన్' అనే ప్రధాన కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ప్రజలకు సరసమైన సేవా డెలివరీ ఛార్జీలతో నిరంతరాయంగా మరియు దీర్ఘ కాలిక ప్రాతిపదికన తగిన పరిమాణంలో గ్రామీణులకు త్రాగునీరు అందిచడంతో పాటు వారి జీవన ప్రమాణాలలో మెరుగుదలే లక్ష్యంగా 'జల్ జీవన్ మిషన్' కార్యక్రమం కొనసాగుతోంది. ప్రస్తుత కోవిడ్ - 19 పరిస్థితిలో గ్రామీణ గృహాలకు కుళాయి సదుపాయాన్ని ప్రాధాన్యత ప్రాతిపదికన అందించేందుకు గాను కేంద్ర ప్రభుత్వ ప్రయత్నం చేస్తోంది. దీని వల్ల గ్రామీణ ప్రాంతంలోని ప్రజలు నీటిని తీసుకురావడానికి సామూహిక కుళాయిల వద్దకు వెళ్లవలసిన అవసరం లేకుండా చేయాలన్నది సర్కారు లక్ష్యం. (2022 నాటికి రాష్ట్రంలోని అన్ని గృహాలకు కుళాయి సదుపాయం కల్పిస్తామని సీఎం హామీ దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న గృహాలు పైపు నీటి సరఫరా ద్వారా ఈ పథకంలో కవర్ చేయబడతాయి. తద్వారా పేద మరియు అట్టడుగు వర్గం ప్రజలు తమ ఇంటి ప్రాంగణంలోనే కుళాయి కనెక్షన్లు పొందగలుగుతారు. ఈ నేపథ్యంలో 2024 నాటికి దేశంలోని మొత్తం గ్రామీణ ప్రాంతాల్లోని నివాసాలకు తగిన కుళాయి సదుపాయం కల్పించాలన్నది జాతీయ లక్ష్యం. కాగా.. మణిపూర్ 2021- 22 నాటికే రాష్ట్రంలోని నూటికి నూరు శాతం కుళాయి సదుపాయం అందించి జాతీయ లక్ష్యం కంటే ముందే లక్ష్యాన్ని చేరేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇలా చేయడం ద్వారా, ప్రతి గ్రామీణ గృహాలకు ట్యాప్ కనెక్షన్ అందించే ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని సాధించిన ఈశాన్యంలో మొట్టమొదటి రాష్ట్రంగా మణిపూర్ రాష్ట్రం నిలువనుంది. నీటి నిర్వహణ కమిటీలను ఏర్పాటు చేయాలి.. మణిపూర్ రాష్ట్రంలో 4.51 లక్షల గ్రామీణ గృహాలు ఉండగా.. వీటిలో 0.32 లక్షలకు ఎఫ్హెచ్టీజీలు ఉన్నాయి. మిగిలిన 4.19 లక్షల గృహాలకు 2020-21 ఏడాది 2 లక్షల గృహాలకు కుళాయి కనెక్షన్లు అందించాలని మణిపూర్ యోచిస్తోంది. ప్రస్తుత సంవత్సరం ఒక జిల్లా మరియు 15 బ్లాక్స్ మరియు 1,275 గ్రామాలకు నూటికి నూరు శాతం కుళాయి సదుపాయం కల్పించాలని ఈ రాష్ట్రం యోచిస్తోంది. 2020-21లో ఇందుకు రూ.1 131.80 కోట్ల నిధులు కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వపు వాటా కలుపుకొని రూ.216.2 కోట్ల మేర నిధుల లభ్యత రాష్ట్ర ప్రభుత్వానికి అందుబాటులో ఉండనుంది. భౌతిక, ఆర్థిక పనితీరు ఆధారంగా రాష్ట్రానికి అదనపు కేటాయింపులు ఉంటాయి. 15వ ఆర్థిక కమిషన్ నిధుల కింద రూ.177 కోట్ల మేర నిధులు పీఆర్ఐలకు కేటాయించబడ్డాయని కేంద్ర మంత్రి తెలిపారు. ఇందులో దాదాపు 50 శాతం వరకు నిధులను నీటి సరఫరా మరియు పారిశుద్ధ్యం కోసం ఉపయోగించాల్సి ఉన్నందున నిధుల్ని గ్రామీణ నీటి సరఫరా, మురుగు నీరు నిర్వహణ కోసం ఉపయోగించుకునేలా ప్రణాళిక చేయాలని కేంద్ర మంత్రి మణిపూర్ ముఖ్యమంత్రిని అభ్యర్థించారు. ముఖ్యంగా నీటి సరఫరా పథకాల యొక్క దీర్ఘకాలిక నిర్వహణను నిర్ధారించేందుకు ఈ నిధులను వినియోగించాలని ఆయన కోరారు. గ్రామ పంచాయతీ యొక్క ఉప కమిటీగా కనీసం 50 శాతం మహిళా సభ్యులతో గ్రామ నీటి & పారిశుద్ధ్య కమిటీ / పానీ సమితీలను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి మణిపూర్ సీఎంకు సూచించారు. ఈ కమిటీలు గ్రామ నీటి ప్రణాళికల రూపకల్పన, అమలు మరియు నిర్వహణతో పాటుగా గ్రామీణ నీటి సరఫరా మౌలిక వసతుల నిర్వహణపు బాధ్యతల్ని సదరు కమిటీకి అప్పగించాలని సూచించారు. అన్ని గ్రామాలు విలేజ్ యాక్షన్ ప్లాన్ లను సిద్ధం చేయవలసిన అవసరం ఉందన్నారు. ఇది తాగు నీటి వనరుల అభివృద్ధి / వృద్ధి, నీటి సరఫరా, సరైన మురుగు నీటి నిర్వహణ మరియు ఇతర అన్ని విధాల నీటి నిర్వహణ అంశాలను ఇది కలిగి ఉంటుందని తెలియజేయడమైంది. జల్ జీవన్ మిషన్ను ప్రజల ఉద్యమంగా మార్చడానికి మిషన్పై అవిభక్తమైన దృష్టి పెట్టడంతో పాటుగా సామాజిక పరమైన సమీకరణతో పాటు ఐఇసీ ప్రచారం చేపట్టాలని మణిపూర్ ముఖ్యమంత్రి అభ్యర్థించారు. అన్ని తాగునీటి వనరుల్లో రసాయన పారామితులను గురించి తెలుసుకొనేందుకు గాను ప్రతి సంవత్సరం రెండుసార్లు బాక్టీరియా కాలుష్య పరిమాణపు పరీక్షలను జరపాల్సిన అవసరముందని ప్రధానంగా ప్రస్తావించడమైంది. క్షేత్రస్థాయి పరీక్షా వస్తు సామగ్రి ద్వారా నీటి నాణ్యతను పర్యవేక్షించడానికి ప్రతి గ్రామంలోనూ కనీసం ఐదుగురికి ముఖ్యంగా మహిళలకు ప్రాధాన్యతనిస్తూ శిక్షణనివ్వాలని రాష్ట్రం కోరింది. కోవిడ్ మహమ్మారి వ్యాప్తి నెలకొని ఉన్న ప్రస్తుత పరిస్థితిలో గ్రామీణ ప్రాంతాలలో గృహ కుళాయి సదుపాయాలను అందించేందుకు చేస్తున్న ప్రయత్నాలు కచ్చితంగా మహిళలు, బాలికల నీటి కష్టాలను దూరం చేయడంతో పాటుగా.. వారు సురక్షిత, గౌరవ ప్రదమైన జీవితాన్ని గడపేలా జీవన సౌలభ్యాన్ని మెరుగుపరుచనుంది.
pib-49230
25361e453c685f701c9801fe0c3d66ea97e68e4026dd694d8b6b37320a78b475
tel
నీతి ఆయోగ్ సుస్థిర వ్యవసాయం కోసం భూసార ఆరోగ్య నిర్వహణపై జాతీయ సదస్సు నిర్వహించిన నీతి ఆయోగ్, జిజ్ ఇండియా ప్రపంచ భూసార దినోత్సవం సందర్భంగా సుస్థిర వ్యవసాయం కోసం భూసార ఆరోగ్య నిర్వహణపై నీతి ఆయోగ్ జాతీయ సమావేశాన్ని నిర్వహించింది. జర్మనీ ఫెడరల్ మినిస్ట్రీ ఫర్ కోఆపరేషన్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ తరపున నీతి ఆయోగ్, డ్యూయిష్ గెసెల్స్చాఫ్ట్ ఫర్ ఇంటర్నేషనల్ జుసమ్మెనార్బీట్ సంయుక్తంగా ఈ కాన్క్లేవ్ను నిర్వహించాయి. ఈ సమావేశం భారతదేశం, ప్రపంచవ్యాప్తంగా కీలకమైన కార్యక్రమాలను అర్థం చేసుకోవడానికి విధాన నిర్ణేతలు, శాస్త్రీయ సమాజం, పౌర సమాజం, వివిధ రంగాల చేసే న్యాయవాదులను ఒకచోట చేర్చింది. కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మాట్లాడుతూ, పర్యావరణాన్ని పరిరక్షించే చర్యలను ప్రోత్సహించడంలో ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తోందని, జర్మన్ ప్రభుత్వ సహకారంతో, భూసార ఆరోగ్యం, స్థిరమైన వ్యవసాయ పద్ధతులను మెరుగుపరచడానికి రోడ్మ్యాప్ను అభివృద్ధి చేయడంలో తాము సహకారం అందిస్తామని అన్నారు. అంతకుముందు డిసెంబర్ 2021లో, వ్యవసాయ రంగంలో నేల క్షీణతను అరికట్టడానికి, ప్రత్యామ్నాయ మార్గాన్ని ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి అందించారు. సహజ, రసాయన రహిత, పంట-వైవిధ్య వ్యవసాయం వైపు వెళ్లాలని ప్రధానమంత్రి పిలుపు, ఉత్పాదకతను పెంచడానికి, జీవావరణ శాస్త్రాన్ని మెరుగుపరచడానికి, దేశవ్యాప్తంగా నేలల ఆరోగ్యంపై దృష్టి పెట్టవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఈ విషయాన్ని పునరుద్ఘాటిస్తూ నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బెరీ మాట్లాడుతూ, “ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సహజ, స్థిరమైన వ్యవసాయాన్ని ప్రోత్సహించడంపై ఎక్కువ దృష్టి పెట్టారని, ఆరోగ్యకరమైన నేల నిర్వహణ, దీర్ఘకాలిక ఆహార భద్రతను నిర్ధారించడానికి భారతదేశం, జర్మనీ కలిసి పనిచేయడం చూసి సంతోషిస్తున్నానని తెలిపారు. "ఆరోగ్యకరమైన నేల నిర్వహణను నిర్ధారించడానికి, వ్యవసాయ రసాయనాల వినియోగాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది; ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాల కోసం వెతకాలి. వ్యవసాయ రసాయనాలు ఉత్పాదకతను మెరుగుపరుస్తాయి, అవి నేల క్షీణతకు కూడా దారితీస్తాయి. అందువల్ల వాస్తవ ఉత్పత్తి వ్యయం పెరుగుతోంది” అని నీతి ఆయోగ్ సభ్యుడు ప్రొఫెసర్ రమేష్ చంద్ అన్నారు. నీతి ఆయోగ్ సీనియర్ అడ్వైజర్ డాక్టర్ నీలం పటేల్ ఎరువులను తెలివిగా ఉపయోగించడం కోసం సాయిల్ హెల్త్ కార్డ్ డేటాను ఐటీని ఉపయోగించడం గురించి మాట్లాడారు. విభిన్న సుస్థిర వ్యవసాయ పద్ధతులకు సంబంధించిన శాస్త్రీయ ధ్రువీకరణ కోసం పరిశోధనల ఆవశ్యకతను ఆమె నొక్కి చెప్పారు. నేల క్షీణత, జీవవైవిధ్య నష్టం, వాతావరణ మార్పుల సవాళ్లను ఎదుర్కోవడానికి భారతదేశం మరియు జర్మనీ ఇప్పటికే భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి, స్థితిస్థాపక వ్యవసాయం, వ్యవసాయ పర్యావరణ శాస్త్రం వంటి ఆహార వ్యవస్థల కోసం సమగ్ర పరిష్కారాలను ప్రోత్సహించడం ద్వారా. మే 2022లో, భారతదేశం, జర్మనీలు వ్యవసాయ పర్యావరణ శాస్త్రం, సహజ వనరుల స్థిరమైన నిర్వహణపై ఉమ్మడి ప్రకటనపై సంతకం చేశాయి. దీని ద్వారా, రెండు దేశాల విద్యాసంస్థలు, రైతులతో సహా అభ్యాసకుల మధ్య ఉమ్మడి పరిశోధన, జ్ఞాన-భాగస్వామ్యం, ఆవిష్కరణలు ప్రోత్సహించారు. జర్మనీ ఫెడరల్ మినిస్ట్రీ ఆఫ్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ ఈ చొరవ కింద ప్రాజెక్ట్ల కోసం ఆర్థిక, సాంకేతిక సహకారం కోసం 2025 నాటికి 300 మిలియన్ యూరోల వరకు అందించాలని భావిస్తోంది. నీతి ఆయోగ్, బిఎంజెడ్ కూడా సహకారాల కోసం ఉద్దేశ్య ప్రకటనపై సంతకం చేశాయి, వ్యవసాయ జీవావరణ శాస్త్రం ప్రాధాన్యతా రంగాలలో ఒకటి. పౌష్టికాహార భద్రత, ఆకుపచ్చ, సమ్మిళిత ఆర్థిక అభివృద్ధి ద్వారా గ్రామీణ జీవనోపాధిని మెరుగుపరచడం వంటి స్థితిస్థాపకమైన, స్థిరమైన ఆహార వ్యవస్థల వైపు పరివర్తనను ఉత్ప్రేరకపరిచేందుకు ఈ ద్వైపాక్షిక కార్యక్రమాలలో నేటి కాన్క్లేవ్ భాగం.
pib-186242
d5413fe763e2d1da4e1f0a5466355ccb496e5f28876333b7f8e1a0fdf4fd56aa
tel
ప్రధాన మంత్రి కార్యాలయం ఆల్ ఇండియా మేయర్స్ కాన్ఫరెన్స్ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి మేయర్ లు వారి నగరాల కు కొత్త శక్తి ని ఇవ్వడం కోసం తీసుకోదగ్గ అనేక చర్యలను గురించి ఆయన ప్రస్తావించారు ‘‘ఈ ఆధునికీకరణ యుగం లో మన నగరాల ప్రాచీనత కు సమానమైన ప్రాముఖ్యం ఉంది’’ ‘‘మన నగరాల ను పరిశుభ్రమైనవి గాను, ఆరోగ్యదాయకమైనవి గాను ఉంచేందుకు మనంప్రయత్నాలు చేయాలి’’ ‘‘నదుల ను నగర జీవనం యొక్క కేంద్ర స్థానం లోకి తీసుకు రావాలి. ఇది మీ నగరాల కు ఒక కొత్త జీవ శక్తి ని అందిస్తుంది’’ ‘‘మన నగరాలు మన ఆర్థిక వ్యవస్థ కు చోదక శక్తి గా ఉన్నాయి. నగరాన్ని ఒకహుషారైన ఆర్థిక వ్యవస్థ కు నిలయం గా మనం మలచాలి’’ ‘‘మన అభివృద్ధి నమూనా లో ఎమ్ఎస్ఎమ్ఇలను ఏ విధం గా బలపరచాలో పరిశీలించవలసినఅవసరం ఉంది’’ ‘‘వీధి వ్యాపారుల కు ఉన్న ప్రాముఖ్యాన్ని మహమ్మారి చాటిచెప్పింది. వారు మన యాత్ర లోఒక భాగం గా ఉన్నారు. వారి ని మనం వెనుకపట్టునవదలివేయలేం’’ ‘‘కాశీ కోసం మీరు ఇచ్చే సూచనల కు నేను కృతజ్ఞుడి నై ఉంటాను. మరి నేను మీకుతొలి విద్యార్థి ని అవుతాను’’ ‘‘సర్ దార్ పటేల్ గారు అహమదాబాద్ కు మేయర్ గా పని చేశారు. మరి దేశం ఆయన ను ఈ నాటి కి కూడాను స్మరించుకొంటున్నది’’ ఆల్ ఇండియా మేయర్స్ కాన్ఫరెన్స్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించారు. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ తో పాటు, కేంద్ర మంత్రి శ్రీ హర్ దీప్ సింహ్ పురి ఈ కార్యక్రమం లో పాలుపంచుకొన్నారు. సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, ప్రాచీన నగరం అయిన వారాణసీ లో ఇటీవలి పరిణామాల ను గురించి ప్రస్తావించారు. కాశీ అభివృద్ధి యావత్తు దేశాని కి ఒక మార్గ సూచీ కాగలదు అంటూ తాను చేసిన ప్రకటన ను ఆయన గుర్తు కు తెచ్చుకొన్నారు. మన దేశం లో చాలా వరకు నగరాలు సాంప్రదాయక నగరాలు. అవి ఒక సంప్రదాయ పద్ధతి లో అభివృద్ధి జరిగిన నగరాలు అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ ఆధునికీకరణ యుగం లో ఈ నగరాల ప్రాచీనత కూడా అంతే ప్రాముఖ్యాన్ని కలిగి ఉంది అని ఆయన పేర్కొన్నారు. ఈ నగరాలు వారసత్వాన్ని, స్థానిక నైపుణ్యాల ను ఏ విధం గా పరిరక్షించుకోవాలో మనకు బోధించ గలుగుతాయి అని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఉన్న నిర్మాణాల ను నాశనం చేయడం ఒక మార్గం కాదు కానీ పరిరక్షణ, ఇంకా కొత్త బలాన్ని ఇచ్చే అంశాల పైన శ్రద్ధ వహించాలి అని ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు. ఆధునిక కాలాల అవసరాల ప్రకారం ఇది జరగాలి అని ఆయన అన్నారు. స్వచ్ఛత కోసం నగరాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ అవసరం అని ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు. స్వచ్ఛత ను సాధించడం కోసం శ్రేష్ఠ ప్రయాసల కు నడుంకడుతున్న నగరాల తో పాటు గా ఉత్తమ ప్రదర్శన ను నమోదు చేస్తున్న నగరాల ను గుర్తించడం కోసం కొత్త కేటగిరీల ను ఏర్పరచ గలమా ! అంటూ ఆయన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. స్వచ్ఛత కు తోడు గా నగరాల సుందరీకరణ గురించి సైతం ఆయన పట్టుబట్టారు. ఈ విషయం లో మేయర్ లు వారి వారి నగరాల లోని వార్డు ల మధ్య ఆరోగ్యకరమైన స్పర్ధ తాలూకు భావన ను రేకెత్తింప చేయాలి అని ఆయన కోరారు. ప్రధాన మంత్రి తన ‘మన్ కీ బాత్’ కార్యక్రమం లో ఇచ్చిన ఉపన్యాసాల లో పదే పదే ప్రస్తావస్తూ వస్తున్నటువంటి స్వాతంత్య్ర సమరం ఇతివృత్తం గా సాగే ముగ్గు ల పోటీ లు, పాట ల పోటీ లు, లాలి పాట పోటీ ల వంటి ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కు సంబంధించిన కార్యక్రమాల ను కూడా నిర్వహించవలసింది గా మేయర్ లకు ఆయన సూచించారు. నగరాల జన్మ దినాల ను మేయర్ లు కనుగొని, వాటిని వేడుక గా నిర్వహించాలి అని కూడా మంత్రి సలహా ఇచ్చారు. నదులు ఉన్నటువంటి నగరాల లో నదీ ఉత్సవం జరపాలన్నారు. నదుల కీర్తి ని వ్యాప్తి చేయవలసిన అవసరం ఉంది. అలా చేస్తే ప్రజలు ఆయా నదుల పట్ల గర్వపడి మరి వాటి ని స్వచ్ఛం గా ఉంచుతారు అని ఆయన అన్నారు. ‘‘నదుల ను నగర జీవనాని కి కేంద్ర స్థానం లోకి తిరిగి తీసుకు రావాలి. ఇది మీ నగరాల కు ఒక కొత్త ప్రాణ శక్తి ని ప్రసాదిస్తుంది’’ అని మంత్రి అన్నారు. ఒకసారి వాడిన ప్లాస్టిక్ ను ఆ తరువాత నిర్మూలించడాని కి సంబంధించిన ప్రచార ఉద్యమాని కి నూతన చైతన్యాన్ని ఇవ్వండి అంటూ మేయర్ లకు ఆయన విజ్ఞప్తి చేశారు. వ్యర్థ: నుంచి సంపద ను సృష్టించే మార్గాల కోసం వెతకండి అని మేయర్ లకు ఆయన చెప్పారు. ‘‘మన నగరం స్వచ్ఛం గా, అదే జోరు లో ఆరోగ్యం గా కూడాను ఉండాలి, మన ప్రయాస కు ఇది కీలకం కావాలి’’ అని ఆయన అన్నారు. మేయర్ లు వారి నగరాల లోని ఇళ్ళ లో, వీధుల లో ఎల్ఇడి బల్బుల ను విరివి గా వాడుక లోకి తీసుకు వచ్చేటట్లు చూడాలి అని ఆయన కోరారు. దీని ని ఒక ఉద్యమం తరహా లో చేపట్టండి అంటూ వారికి ఆయన సూచించారు. ఇప్పటికే అమలులో ఉన్నటువంటి పథకాల ను కొత్త కొత్త ఉపయోగాల కోసం వాడుకొనేటట్లు గాను, ఆయా పథకాల ను ముందుకు తీసుకు పోయేటట్లు గాను మనం ఎల్లప్పుడూ ఆలోచన లు చేస్తూ ఉండాలి అని ఆయన అన్నారు. నగరం లోని ఎన్ సిసి విభాగాల ను సంప్రదించి, నగరాల లోని విగ్రహాల ను శుభ్రపరచడం కోసం బృందాల ను ఏర్పాటు చేయాలని, ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ స్ఫూర్తి తో మహనీయుల కు సంబంధించిన ఉపన్యాస కార్యక్రమాల ను ఏర్పాటు చేయాలని ఆయన మేయర్ ల కు సలహా ను ఇచ్చారు. అదే విధం గా, మేయర్ లు వారి నగరం లో ఒక ప్రదేశాన్ని గుర్తించి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ను జ్ఞప్తి కి తెచ్చేటటువంటి ఒక కట్టడాన్ని పిపిపి పద్ధతి లో నిర్మించాలి అని ఆయన అన్నారు. ‘ఒక జిల్లా, ఒక ఉత్పత్తి’ కార్యక్రమాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, మేయర్ లు వారి నగరాల యొక్క విశిష్టమైన గుర్తింపు ప్రస్ఫుటం అయ్యేలా ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి ఉత్పాదన లేదా నగరం లోని ప్రదేశం వంటి వాటిని ప్రచారం లోకి తీసుకు రావడానికి యత్నించాలి అని ప్రధాన మంత్రి అన్నారు. పట్టణ జీవనం తాలూకు వేరు వేరు అంశాల కు సంబంధించి ప్రజానుకూల ఆలోచనల ను అభివృద్ధి పరచవలసింది గా వారిని ప్రధాన మంత్రి కోరారు. సార్వజనిక రవాణా వినియోగాన్ని మనం ప్రోత్సహించవలసిన అవసరం ఉంది అని ఆయన అన్నారు. మేయర్ లు వారి నగరం లో ప్రతి ఒక్క సదుపాయాన్ని ‘సుగమ్య భారత అభియాన్’ లో భాగం గా దివ్యాంగుల కు అనుకూలమైనవి గా మలచేందుకు శ్రద్ధ తీసుకోవాలి అని ఆయన విజ్ఞప్తి చేశారు. ‘‘మన నగరాలు మన ఆర్థిక వ్యవస్థ కు చోదక శక్తి గా ఉన్నాయి. మనం ఒక చైతన్యభరితమైనటువంటి ఆర్థిక వ్యవస్థ కు నిలయం గా నగరాన్ని తీర్చిదిద్దాలి’’ అని ఆయన అన్నారు. ఆర్థిక కార్యకలాపాల కు ఆహ్వానం పలికే మరియు అటువంటి కార్యకలాపాల ను ప్రోత్సహించే ఒక ఇకోసిస్టమ్ ను నిర్మించడం కోసం అన్ని సదుపాయాల ను ఏక కాలం లో అభివృద్ధి పరుస్తూ ఒక సంపూర్ణమైన వ్యవస్థ ను ఆవిష్కరించండి అని వారి కి ఆయన సూచించారు. మన అభివృద్ధి నమూనా లో ఎమ్ఎస్ఎమ్ఇ లను బలపరచవలసిన అవసరం ఎంతైనా ఉంది అని ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు. ‘‘వీధి వ్యాపారస్తులు మన యాత్ర లో ఒక భాగం. మనం వారి కష్టాల ను అడుగడుగునా గమనించాలి. వారి కోసం మేం పిఎమ్ స్వనిధి యోజన ను ప్రవేశపెట్టాం. ఈ పథకం చాలా బాగుంది. మీ నగరం లో ఉన్న వీధి వ్యాపారుల జాబితా ను తయారు చేసి, మొబైల్ ఫోన్ ద్వారా లావాదేవీల ను జరపడాన్ని గురించి వారికి నేర్పించండి. ఇది మరింత ఉత్తమమైన విధానం లో బ్యాంకు ల నుంచి వారు ఆర్థిక సహాయం పొందేందుకు తోడ్పడుతుంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. మహమ్మారి కాలం లో వీధి వ్యాపారుల కు ఉన్న ప్రాముఖ్యం ఏమిటన్నది చాలా స్పష్టం గా అగుపించింది అని ఆయన అన్నారు. ప్రధాన మంత్రి తన ప్రసంగం చివర లో, కాశీ అభివృద్ధి కోసం మేయర్ లను వారి వారి అనుభవాల నుంచి సూచనల ను, సలహాల ను ఇవ్వవలసిందని అభ్యర్ధించారు. ‘‘మీరు చేసే సూచనల కు నేను కృతజ్ఞుడినై ఉంటాను. అలాగే, నేను మీ తొలి విద్యార్థి ని అవుతాను’’ అని ప్రధాన మంత్రి అన్నారు. సర్ దార్ పటేల్ గారు అహమదాబాద్ మేయర్ గా సేవల ను అందించారు. మరి దేశం ఆయన ను ఈనాటి కి కూడా ను గుర్తు కు తెచ్చుకొంటున్నది అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘దేశ ప్రజల కు సేవ చేయగలిగే అవకాశాన్ని మీరు దక్కించుకొనే ఒక సార్ధక రాజకీయ జీవనం లోకి అడుగు పెట్టడానికి దోహదం చేసే ఒక మెట్టు గా మేయర్ పదవి కాగలుగుతుంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
pib-224048
1ca94d0956f11a74ce5b59ad2377941e1a121ca5999e34ddf51c200d8dcad89c
tel
యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ భారత్ కు చేరుకున్న మీరాబాయి చాను కి ఘన స్వాగతం ప్రారంభం రోజునే పతాకాన్ని సాధించిన చాను దేశం మొత్తానికి ఒక స్ఫూర్తినిచ్చింది : శ్రీ అనురాగ్ ఠాకూర్ ఒలింపిక్ క్రీడా వేదికపై మెరిసిన తార మీరాబాయిని ఒక ప్రత్యేక వేడుక సందర్బంగా ఘనంగా సత్కరించిన క్రీడల శాఖ మంత్రి చాను విజయం ద్వారా 'టాప్స్' కార్యక్రమం దేశంలో క్రీడల అభివృద్ధికి, మన క్రీడాకారులు పతకాలు సాధించడానికి ఎటువంటి కీలకమైన పాత్ర పోషించిందో స్పష్టం అయింది: క్రీడల శాఖ మంత్రి . నాకు ప్రభుత్వం అందించిన సహకారానికి కృతజ్ఞురాలును, ఈ విధంగా సహకారం లేనట్టయితే ఒలింపిక్ పతకం దిశగా నా పయనం సాధ్యం అయ్యేది కాదు: మీరాబాయి చాను. టోక్యో ఒలింపిక్స్లో భారతదేశం మొదటి పతక విజేత సైఖోమ్ మీరాబాయి చాను, ఆమె కోచ్ విజయ్ శర్మ నిన్న సాయంత్రం దేశానికి తిరిగి వచ్చారు. వీరోచితంగా విజయం సాధించి వచ్చిన వారిద్దరికి ఘాన స్వాగతం లభించింది. కేంద్ర క్రీడా మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ తన నివాసంలో మీరాబాయి చాను ను సత్కరించారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి శ్రీ కిరెన్ రిజిజు, ఈశాన్య ప్రాంత పర్యాటక, సంస్కృతి, అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి, కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాలు, ఆయుష్ మంత్రి శ్రీ షర్బానంద సోనోవాల్, క్రీడలు, యువజన వ్యవహారాల సహాయ మంత్రి శ్రీ నిసిత్ ప్రమాణిక్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళల 49 కిలోల వెయిట్ లిఫ్టింగ్లో రజత పతకం సాధించిన చాను ప్రఖ్యాత స్ట్రెంగ్త్, కండిషనింగ్ కోచ్ డాక్టర్ ఆరోన్ హార్స్చిగ్తో ప్రత్యేక శిక్షణ కు మే 1 న అమెరికాకు బయలుదేరిన తరువాత తిరిగి భారత్ కి ఇదే. కోవిడ్ -19 కేసుల పెరుగుదల కారణంగా భారతదేశం నుండి వచ్చే వారికి అమెరికాలో ఆంక్షలు ఉన్నప్పటికీ, చాను అతి తక్కువ సమయంలోనే వెళ్లడానికి ప్రభుత్వం వేగంగా ఏర్పాట్లు చేసింది. “ఇది నాకు ఒక కల. నిజమైంది. నేను ఈ క్షణం కోసం కొన్నేళ్లుగా శిక్షణ పొందుతున్నాను. ఒలింపిక్ లో అంతా సవ్యంగా సాగంది, నేను ఎంతో సంతోషిస్తున్నాను” అని పట్టరాని ఆనందంతో చెప్పింది చాను. ప్రభుత్వం సకాలంలో అండగా నిలిచి సహకారాన్ని అందించినందుకు, ముఖ్యంగా రెండు సార్లు అమెరికా వెళ్ళడానికి తగు ఏర్పాట్లు చేసినందుకు కృతజ్ఞతలు అని చాను తెలిపారు. "నా భుజానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి గత సంవత్సరం అమెరికా పర్యటన ఈ పతకం సాధించే నా ప్రయాణంలో కీలకమైనది. ప్రభుత్వం అందించిన అన్ని సహకారాలకు నేను కృతజ్ఞురాలను. ఆ సహకారం లేకుండా ఒలింపిక్ పతకం కోసం ఈ ప్రయాణం సాధ్యం కాదు. టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ నా కెరీర్, పతకాల అవకాశాలను పెంచిందని నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను" అని మీరాబాయి చాను వివరించారు. టోక్యోలో జరిగిన పతక బహుకరణ కార్యక్రమంలో భారత జెండా రెపరెపలాడినపుడు, జాతీయగీతం ఆలపించినపుడు మిరాబాయి చాను విజయం గర్వంతో నిండిన 130 కోట్ల మంది భారతీయుల విజయం అని శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ అభినందించారు. ప్రారంభ రోజున భారతీయురాలు పతకం సాధించడం ఒలింపిక్ చరిత్రలో ఇదే మొదటిసారి. మన అథ్లెట్ల అభివృద్ధికి, భారతదేశం పతక ఆశలను పెంచడంలో టాప్స్ కార్యక్రమం ఎలా కీలక పాత్ర పోషించిందో కూడా ఆమె విజయం చూపిస్తుంది. మోడీ ప్రభుత్వం క్రీడా ప్రతిభను పెంపొందించుకుంటూ, అత్యున్నత స్థాయిలో రాణించడానికి ప్రతి సదుపాయాన్ని కల్పిస్తుంది. ఆమె ఒలింపిక్ లో ప్రదర్శించిన క్రీడా స్ఫూర్తి మొత్తం దేశం ఆశయాలకు నిలిచింది. ఆమె ఈశాన్యం నుండి అథ్లెట్లకు స్ఫూర్తినిస్తుంది” అని శ్రీ అనురాగ్ ఠాకూర్ ప్రశంసించారు. కేంద్ర న్యాయ, న్యాయశాఖ మంత్రి శ్రీ కిరెన్ రిజిజు మాట్లాడుతూ, టోక్యోకు బయలుదేరే ముందు, ఆమె దేశానికి పతకం తెస్తామని మేము మాట్లాడుకున్న సందర్బంగా ఆమె హామీ ఇచ్చింది. దానిని నిజం చేసింది. ఆమె భారతదేశానికి తెచ్చిన కీర్తి, గౌరవం వెనుక ఎన్నో సంవత్సరాల పట్టుదల, అంకితభావం, అవిరామమైన కృషి ఉంది.. అని కేంద్ర మంత్రి రిజిజు అన్నారు. కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి మాట్లాడుతూ “ మన దేశ బిడ్డలు తల్లి భారతి గర్వించేలా ప్రదర్శించిన తీరుకు నేనెంతో గర్వపడుతున్నాను. మెడలో వెండి పతకం ధరించి విజయ వేదిక పై నిలబడి మీరాబాయి ప్రతి భారతీయుడి హృదయాలను గెలుచుకుంది. ఆమె కేవలం క్రీడా ప్రపంచానికే కాదు, కలలు, లక్ష్యాలతో ఉన్న ప్రతి యువకుడికి ప్రేరణగా నిలుస్తుంది. ఈశాన్య రాష్ట్రాల్లో క్రీడలు, ఫిట్నెస్ కార్యకలాపాల పట్ల ఉత్సాహాన్ని పెంపొందించుకోడానికి ఈ అవకాశాన్ని వినియోగించాలని నేను కోరుకుంటున్నాను. ఈ చురుకైన క్రీడా సంస్కృతి భారతదేశానికి కీర్తిప్రతిష్టలు తీసుకువస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను” అని అన్నారు. అపూర్వమైన విజయం సాధించిన మీరాబాయి ని కేంద్ర మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ అభినందించారు. దేశానికి మీరాబాయి స్ఫూర్తినిచ్చారని, ఇందుకు తామంతా గర్విస్తున్నామని అన్నారు. ఛాంపియన్ వెయిట్ లిఫ్టర్ పై శ్రీ ప్రమాణిక్ ప్రశంసల జల్లు కురిపించారు. “చాలా సంవత్సరాల కృషి కారణంగా ఈ పతకం సాధించింది మీరాబాయి. వెయిట్ లిఫ్ట్ చేస్తూ చాను ప్రదర్శించిన క్రీడా స్ఫూర్తి 135 కోట్ల మంది భారతీయులలో ఎంతో గర్వాన్నినింపింది. కానీ ఈ ప్రయాణం ఇక్కడితో ఆగదని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. దేశ ప్రజల ఆశీస్సులతో రాబోయే సంవత్సరాల్లో మీరాబాయి ఇంకా పతకాలు సాధిస్తుంది ” అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
pib-150062
58c6ee5b58f5973b5562ed4eeb0f8c283f094635b48c03832fd7df2198dbb972
tel
మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆస్ట్రేలియా తన సహభాగి అయిన గౌరవనీయ జేసన్ క్లేర్తో కలిసి 6వ ఆస్ట్రేలియా ఇండియా ఎడ్యుకేషన్ కౌన్సిల్కు సహాధ్యక్షత వహించి, ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించిన శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ విద్య, స్కిల్లింగ్లలో సహకారాన్ని మరింతపెంచుకునేందుకు అంగీకరించిన ఇరు వర్గాలు భారత్లో తమ క్యాంపస్లను ఏర్పాటు చేసుకునేందుకు అవకాశాలను అన్వేషించవలసిందిగా ఆస్ట్రేలియా విద్యా సంస్థలను ఆహ్వానించిన శ్రీ ప్రధాన్ భారతీయ విద్యార్ధుల పెండింగ్ వీసాల సమస్యను లేవనెత్తిన శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ఆస్ట్రేలియా సమస్థాయి మంత్రి గౌరవనీయ జేసన్ క్లేర్తో కలిసి ఆస్ట్రేలియా ఇండియా ఎడ్యుకేషన్ కౌన్సిల్ 6 సమావేశానికి సహ అధ్యక్షత వహించడమే కాక ద్వైపాక్షిక సమావేశాన్ని కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ నేడు నిర్వహించారు. ద్వైపాక్షిక సమావేశం సందర్భంగా మంత్రులు విద్య, నైపుణ్యాల అభివృద్ధి, పరిశోధన, ఆవిష్కరణ, వ్యవస్థాపకతలలో సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఫలవంతమైన చర్చలు జరిపారు. అలాగే, ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయాలను, స్కిల్లింగ్ సంస్థలను భారత్లో క్యాంపస్లను ఏర్పాటు చేసి, భారతీయ సంస్థలతో సహకారానికి గల అవకాశాలను అన్వేషించవలసిందిగా శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ఆహ్వానించారు. గౌరవనీయ జేసన్ క్లేర్ను ఈ ఏడాది చివరిలోగా భారత్ పర్యటనకు రావలసిందిగా ఆహ్వానించారు.భారత్- ఆస్ట్రేలియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి విద్యను కీలక స్తంభంగా చేసే ఉద్దేశ్యంతో అభ్యాసం, నైపుణ్యాలు, పరిశోధనలలో సహకారాన్ని విస్తరించేందుకు మంత్రులిద్దరూ అంగీకారానికి వచ్చారు. ఆస్ట్రేలియా- ఇండియా ఎడ్యుకేషన్ కౌన్సిల్ 6వ సమావేశంలో మాట్లాడుతూ, విద్య, నైపుణ్యాల అభివృద్ధి, పరిశోధనా ప్రాధాన్యతల చర్యలను బలోపేతం చేసేందుకు, సంబంధాలను ముందుకు తీసుకువెళ్ళేందుకు ఎఐఇసి అత్యంత ప్రభావవంతమైన ఫోరం అని శ్రీ ప్రధాన్ అన్నారు. వచ్చే ఏడాది ఎఐఇసి 7వ సమావేశాన్ని భారత్లో నిర్వహించవలసిందిగా ఆయన ఆస్ట్రేలియా బృందాన్ని ఆహ్వానించారు. ఆయుర్వేద, యోగ, వ్యవసాయం తదితర రంగాలలో ఇరు దేశాల మధ్య పరిశోధనకు సహకారం అవసరాన్ని శ్రీ ప్రధాన్ నొక్కి చెప్పారు. మైనింగ్, లాజిస్టిక్స్ నిర్వహణ తదితరాలలో నైపుణ్యాల ప్రమాణీకరణకు సహకారానికి ఆయన పిలుపు ఇచ్చారు. భారత్ డిజిటల్ యూనివర్సిటీని, గతి శక్తి యూనివర్సిటీని ఏర్పాటు చేసిందని, దీనికి సంబంధించిన పాఠ్యాంశాలను, ఇతర అంశాలను ఇరు దేశాలు కలిసి పని చేసి నిర్ణయించవచ్చని ఆయన అన్నారు. దీనితోపాటుగా, ఆస్ట్రేలియాకు వెళ్ళే భారతీయ విద్యార్దుల పెండింగ్ వీసాల సమస్యను కూడా శ్రీ ప్రధాన్ లేవనెత్తారు. కాగా, పెండింగ్ వీసాల వ్యవహారాన్ని వేగవంతం చేయడంలో సహకరిస్తామని ఆస్ట్రేలియా మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం, ఇరువురు మంత్రులు సంయుక్త విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఇరు దేశాలలో నియంత్రణా వాతావరణంపై భాగస్వామ్య అవగాహనను పెంపొందించుకునేందుకు, సంస్థల ద్విమార్గ చలనశీలతను ప్రోత్సహించేందుకు దేశాంతర విద్యపై వర్కింగ్ గ్రూపు ఏర్పాటును ప్రకటించారు. జ్ఞాన వారధులను నిర్మించేందుకు, పరస్పర వృద్ధి, సుసంపన్నత కోసం విద్య, నైపుణ్యాలు, పరిశోధనలలో ఆస్ట్రేలియాతో ద్వైపాక్షిక చర్చలను, చర్యలను గాఢం చేసేందుకు భారత్ కట్టుబడి ఉందని శ్రీ ప్రధాన్ పునరుద్ఘాటించారు. ఎమ్మెల్సీ, ఎన్ఎస్డబ్ల్యు విద్యా మంత్రి గౌరవనీయ సారా మిచెల్ తో కలిసి శ్రీ ప్రధాన్ ఒక పాఠశాలను సందర్శించనున్నారు. ఆయన సిడ్నీలో గల టిఎఎఫ్ఇ ఎన్ఎస్ఎఫ్, యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ ను సందర్శించి, ఆస్ట్రేలియా ప్రభుత్వ విద్యా విభాగపు సీనియర్ ప్రతినిధులు, వైస్ ఛాన్సలర్లతో ముచ్చటిస్తారు.
pib-10592
9c77721cf028590b329c5cee794b0e0e07d8b1064601bb3f7cfc7369ec8549e2
tel
సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ ప్రాచుర్యం పొందిన రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ కు సంకేతంగా, 98వ మన్ కీ బాత్ ఎపిసోడ్లో ప్రస్తావించిన హర్యానా, భివానీలోని దుల్హేడీ గ్రామానికి చెందిన స్వచ్ఛత కె సిపాయీలను సత్కరించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించిన కెవిఐసి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ ప్రాచుర్యం పొందిన రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ కు సంకేతంగా హర్యానా, భివానీలోని దుల్హేదీ గ్రామంలో ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని మన్ కీ బాత్ 98వ ఎపిసోడ్లో భారత ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక కార్యక్రమమైన ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం గురించి ప్రజలలో అవగాహన కల్పించేందుకు, దానితో పాటుగా స్వచ్ఛత కీ సిపాయీలను సత్కరించేందుకు నిర్వహించారు. ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ చైర్మన్ శ్రీ మనోజ్ కుమార్ పిఎంఇజిపి అవగాహనా కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, ఖాదీ స్వయం సమృద్ధిని సాధించేలా చేయడంలో ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం ప్రముఖ పాత్ర పోషించిందని అభిప్రాయపడ్డారు. యువత కేవలం ఉపాధిని కోరేవారిగా కాక ఉపాధినిచ్చేవారిగా, ఇతర యువతకు స్ఫూర్తిగా ఉండేలా చేయడం గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీజీ దార్శనికత అని ఆయన అన్నారు. ఈ అవగాహనా శిబిరంలో సమీప గ్రామాలకు చెందిన రెండువేల మంది ప్రజలు పాల్గొన్నారు. ఇటీవలే తన మన్ కీ బాత్ 98వ ఎపిసోడ్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ హర్యానాలోని దుల్హేడీ గ్రామానికి చెందిన పారిశుద్ధ్య సిపాయిలను ప్రస్తావించి, ప్రశంసించారు. దుల్హేడీ గ్రామానికి చెందిన యువత యువ స్వచ్ఛత ఏవం జన సేవా సమితి పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసి, నగరంలోని భిన్న ప్రాంతాల నుంచి టన్నుల కొద్దీ చెత్తను తొలగించారు. దుల్హేడీ గ్రామానికి చెందిన పారిశుద్ధ్య సిపాయిలు అందరినీ శ్రీ మనోజ్కుఆర్ అభినందిస్తూ, వారి ప్రాంతంలోని యువతను గరిష్ట సంఖ్యలో పిఎంఇజిపికి అనుసంధానం చేసి ఉపాధి కల్పనకు దోహదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. పిఎంఇజిపి గురించి అవగాహనను కల్పించడంలో, యువతను స్వావలంబన సాధించే దిశగా ప్రేరణను ఇవ్వడం, సమాజాభివృద్ధికి దోహదం చేయడంలో అత్యంత విజయవంతమైన ఈ కార్యక్రమానికి హర్యానా ప్రభుత్వ, బ్యాంకు ప్రతినిధులతో పాటుగా ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్కు చెందిన ఉద్యోగులు అధికారులు హాజరయ్యారు.
pib-163970
0595f85b66ff1de6655eb6d118deb027032a79da979232c38611d2f2ac934a2e
tel
రక్షణ మంత్రిత్వ శాఖ ఐఎంఏ డెహ్రాడూన్ క్యాంపస్లను అనుసంధానం చేసే అండర్పాస్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన రక్షణ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్ డెహ్రాడూన్ లోని ఇండియన్ మిలిటరీ అకాడమీ ప్రాంగణాలకు మార్గం వేసే అండర్పాస్ల నిర్మాణానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రక్షణ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్ శంకుస్థాపన చేశారు. రక్షణ మంత్రి మాట్లాడుతూ, అకాడమీలోని మూడు క్యాంపస్లలో అతుకులు లేని ఈ అండర్పాస్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ రావడానికి 40 సంవత్సరాలు పట్టిందన్నారు. ప్రస్తుతానికి, ట్రైనీ క్యాడెట్లు ఒక వైపు నుండి మరొక వైపుకు సజావుగా దాటడానికి ట్రాఫిక్ ఒక అవరోధంగా ఉన్నాయి. ప్రత్యామ్నాయంగా, ఐఎంఏ క్యాడెట్ల కదలికల సమయంలో స్థానిక ప్రజలకు ఇది ఒక ఇబ్బంది. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ జనాభా పెరగడంతో, ట్రాఫిక్ కదలికలు తరచూ ట్రాఫిక్ జామ్ కు కారణమవుతున్నాయి. అండర్పాస్ల నిర్మాణం ఎన్హెచ్ -72 లో ట్రాఫిక్ ప్రవాహాన్ని సులభతరం చేస్తుంది. డెహ్రాడూన్ ప్రజలతో పాటు, అండర్పాస్లు ఉత్తరాఖండ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ మరియు హర్యానాలోని ఇతర ప్రాంతాల ప్రజలకు కూడా ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయి. జనరల్ క్యాడెట్ల భద్రత మరియు డెహ్రాడూన్ ప్రజల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అండర్పాస్ ప్రతిపాదనను అక్టోబర్ 1978 లో రూపొందించారు. అయితే, యాజమాన్యం మరియు నిధుల యొక్క వివిధ సమస్యల కారణంగా ప్రాజెక్టు పనులు ప్రారంభించబడలేదు. పాసింగ్ అవుట్ పరేడ్ AT-2019 సందర్భంగా, డిసెంబర్ 7, 2019 న, శ్రీ రాజనాథ్ సింగ్ 45 కోట్ల రూపాయల విలువ యొక్క అంగీకారం ను ప్రకటించారు, ఇది అండర్పాస్ల నిర్మాణానికి ప్రారంభం.
pib-23073
9af6f77674effbc501d3ee285dc5453906cd08e3438660f361788c2b4c06bae1
tel
ఉప రాష్ట్రపతి సచివాలయం దేశ ప్రజలందరికీ 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మన రాజ్యాంగం మనకు మార్గదర్శనాన్ని అందించే దారి దీపమే గాక, మన నైతిక వర్తనకూ దిక్సూచి కూడా. ఇది మన దేశ మహోన్నత నిర్మాణానికి, పరిపాలనకు గొప్ప పునాది. మన రాజ్యాంగంలో పొందుపరచిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం మరియు అందరికీ న్యాయం వంటి ప్రతిష్టాత్మకమైన సూత్రాల పట్ల మన విశ్వాసాన్ని పునరుద్ఘాటించడానికి గణతంత్ర దినోత్సవం సరైన సందర్భం. మహోన్నత గణతంత్ర ఆవిర్భావానికి కారణమైన స్వాతంత్ర్య సమరయోధులను, వారి నిస్వార్థ త్యాగాలను స్మరించుకోవాల్సిన సందర్భమిది. ఈ సంతోషకరమైన రోజున, మన గణతంత్ర భారతం సాధించిన విజయాలను చూసి గర్విద్దాం. శాంతియుత, సామరస్యపూర్వక, ప్రగతిశీల భారతదేశ నిర్మాణం దిశగా పునరంకితమవుదాం. జై హింద్!” “मैं 73वें गणतंत्र दिवस समारोह के इस आनंदपूर्ण अवसर पर अपने देश के समस्त नागरिकों को हार्दिक बधाई और शुभकामनाएँ देता हूँ। हमारा संविधान हमारा मार्गदर्शक है और हमारा नैतिक मानदंड है। यह एक ऐसा शास्त्र है जो उस नींव का निर्माण करता है जिस पर हमारा महान राष्ट्र स्थापित है और जिसके द्वारा यह महान राष्ट्र शासित होता है। गणतंत्र दिवस हमारे संविधान में प्रतिष्ठापित स्वतंत्रता, समानता, बंधुत्व और सभी के लिए न्याय के पोषित सिद्धांतों के प्रति अपनी आस्था को दोहराने का उचित अवसर है। यह उन स्वतंत्रता सेनानियों को हार्दिक आभार प्रकट करते हुए याद करने का भी अवसर है जिनके नि:स्वार्थ बलिदानों से इस महान गणतंत्र का जन्म हुआ है। आइए, इस आनंदपूर्ण दिवस पर हम अपने गणतंत्र की उपलब्धियों का गुणगान करें और शांतिपूर्ण, सामंजस्यपूर्ण और प्रगतिशील भारत का निर्माण करने की दिशा में सत्यनिष्ठा से स्वयं को समर्पित करने का संकल्प लें। जय हिंद!” (Visitor Counter : 129
pib-6559
5d423cd726860de1f8f33dc64ae9d95ac03b6f69493d84afa0b76cce2fb2d14b
tel
ప్రధాన మంత్రి కార్యాలయం న్యూఢిల్లీలోని మేజర్ ధ్యాన్చంద్ నేషనల్ స్టేడియంలో ‘ఆది మహోత్సవం’ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు శ్రీ అర్జున్ ముండా, శ్రీ ఫగ్గన్ సింగ్ కులస్తే, శ్రీమతి రేణుకా సింగ్, డాక్టర్ భారతీ పవార్, శ్రీ బిశేశ్వర్ తుడుసహా ఇతర ప్రముఖులు, దేశంలోని వివిధ రాష్ట్రాల్లోగల నా గిరిజన సోదరసోదరీమణులారా! ఆది మహోత్సవం సందర్భంగా మీకందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. స్వాతంత్ర్య అమృత మహోత్సవాల నేపథ్యంలో భారతదేశ ప్రాచీన వారసత్వానికి ప్రతీక ఈ ఆది మహోత్సవం. భారత గిరిజన సంప్రదాయంలోని ఈ అందమైన దృశ్యాలను సంగ్రహంగా చూసే అవకాశం నాకిప్పుడు లభించింది- అనేక రుచులు, విభిన్న వర్ణాలు; ఆకర్షణీయ వస్త్రాలు, అద్భుత సంప్రదాయాలు; అనేక కళలు, కళాఖండాలు; వివిధ అభిరుచులు, వైవిధ్యభరిత సంగీతం! ఒక్కమాటలో చెబితే- భారతదేశ వైవిధ్యం, వైభవం భుజంకలిపి కళ్లముందు సాక్షాత్కరించినట్లు అనిపిస్తోంది. ఇది భారతదేశపు అనంతాకాశం వంటిది.. దాని వైవిధ్యం ఇంద్రధనుస్సులోని సప్తవర్ణాల తరహాలో ఆవిష్కృతమవుతుంది. దీని మరొక విశిష్టత ఏమిటంటే- ఈ విభిన్న రంగులు ఏకమైనపుడు ఓ కాంతి పుంజం ఏర్పడి ప్రపంచానికి ఒక దృక్పథాన్ని, దిశను నిర్దేశిస్తుంది. ఈ అనంత వైవిధ్యాలను ‘ఒకే భారతం - శ్రేష్ట భారతం’ అనే దారంతో ముడిపెడితే భారతదేశ విశ్వరూపం ప్రపంచం ఎదుట సాక్షాత్కరిస్తుంది. అది సాధ్యమైనప్పుడే భారతదేశం సాంస్కృతిక కాంతులు వెదజల్లుతూ ప్రపంచానికి మార్గదర్శకం కాగలదు. ఈ ఆది మహోత్సవం మన ‘భిన్నత్వంలో ఏకత్వం’ స్ఫూర్తికి కొత్త ఔన్నత్యాన్నిస్తోంది. ‘అభివృద్ధి-వారసత్వం’ ఆలోచనకు ఇది జీవకళ తెస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా గిరిజనుల ప్రయోజనాల కోసం కృషి చేస్తున్న నా గిరిజన సోదరసోదరీమణులకు, సంస్థలకు నా అభినందనలు. మిత్రులారా! ఈ 21వ శతాబ్దపు భారతదేశం ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్’ మంత్రంతో ముందడుగు వేస్తోంది. ఒకనాడు ఎంతో దూరంగా కనిపించిన సమాజంలోని ఒక భాగానికి కేంద్ర ప్రభుత్వం ఇవాళ నేరుగా చేరువైంది. సమాజం నుంచి తననుతాను దూరం చేసుకున్నదనే భావనగల ఆ భాగాన్ని ఇప్పుడు ప్రభుత్వం ప్రధాన స్రవంతిలోకి తెచ్చింది. గడచిన 8-9 ఏళ్లలో ఆదివాసీ సమాజ సంబంధిత ఆది మహోత్సవం వంటి కార్యక్రమాలు దేశానికే ప్రాచుర్యం కల్పించేదిగా రూపొందాయి. ఇలాంటి ఎన్నో కార్యక్రమాల్లో నేనూ పాలుపంచుకున్నాను. ఎందుకంటే- గిరిజన సమాజ ప్రయోజనాలు నా విషయంలోనూ వ్యక్తిగత సంబంధాలు-భావనకు సంబంధించినదే. నేను రాజకీయాల్లో లేని సమయంలో, ఓ సామాజిక కార్యకర్తగా ఉన్నప్పుడు అనేక రాష్ట్రాలకు వెళ్లాను.. అక్కడి గిరిజన సమాజాలను సందర్శించి, వారితో మమేకమయ్యే అవకాశం నాకు లభించింది. దేశంలోని నలుమూలలా ఉన్న గిరిజన సమాజాలు, కుటుంబాలతో కొన్ని వారాలపాటు గడిపేవాడిని. ఆ విధంగా మీ సంప్రదాయాలను నిశితంగా గమనించాను.. వాటిని అనుసరించాను, వాటినుంచి ఎంతో నేర్చుకున్నాను. గుజరాత్లోనూ ఉమర్గావ్ నుంచి అంబాజీ వరకూ రాష్ట్ర తూర్పు ప్రాంతంలోని గిరిజన సోదరసోదరీమణుల సేవలో నా జీవితంలోని అత్యంత కీలక కాలం గడిపే అదృష్టం నాకు లభించింది. దేశం గురించి, మన సంప్రదాయాలు-వారసత్వం గురించి గిరిజనుల జీవనశైలి నాకెంతో నేర్పింది. అందుకే మీ మధ్య ఉన్నప్పుడు నాకు ఒక విభిన్న ఆర్ద్రత కలుగుతుంది. మనకు ప్రియమైన వారితో ఇదొక ప్రత్యేక బంధమనే భావన కలుగుతుంది. మిత్రులారా! నేడు దేశం గిరిజన సమాజంతో సగర్వంగా మమేకమై ముందడుగు వేస్తున్న తీరు మునుపెన్నడూ ఎరుగని పరిణామం. వివిధ దేశాల అధినాయకులను కలిసిన సందర్భాల్లో గిరిజన సోదరసోదరీమణులు తయారుచేసిన వస్తువులను వారికి బహూకరించే ప్రయత్నం చేస్తుంటాను. నేడు ప్రపంచవ్యాప్త ప్రధాన వేదికలపై ప్రాతినిధ్యం సందర్భంగా గిరిజన సంప్రదాయాన్ని భారతదేశం తన వారసత్వంగా ఎంతో గర్వంగా ప్రదర్శిస్తుంది. వాతావరణ మార్పు, భూతాపం పెరుగుదల వంటి ప్రపంచ సవాళ్లకు పరిష్కారం నా గిరిజన సంప్రదాయాల జీవనశైలిలోనే ఉందని నేడు భారతదేశం ప్రపంచానికి చాటుతోంది. వారి జీవనశైలిని గమనించడం అన్నది మనకు మార్గాన్వేషణలో తోడ్పడుతుంది. ఇవాళ సుస్థిర ప్రగతి విషయానికొస్తే మన గిరిజన సమాజం నుంచి ప్రపంచం నేర్చుకోవలసింది ఎంతో ఉందని మనం సగర్వంగా చెప్పగలం. ప్రస్తుత తరం చెట్లు, అడవులు, నదులు, పర్వతాలతో కూడిన ప్రకృతితో మమేకం కావడంపై మన గిరిజన సోదరసోదరీమణులు స్ఫూర్తినిస్తున్నారు. ప్రకృతి వనరుల వినియోగంతోపాటు వాటి సంరక్షణ-పరిరక్షణ గురించి వారినుంచి నేర్చుకోవాలి. ఈ వాస్తవాన్నే నేడు ప్రపంచం మొత్తానికీ భారతదేశం చాటి చెబుతోంది. మిత్రులారా! భారతదేశ సంప్రదాయ ఉత్పత్తులకు.. ముఖ్యంగా గిరిజన సమాజం తయారుచేసే వస్తువులకు ఇవాళ దేశదేశాల్లో డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. ఆ మేరకు ఈశాన్య రాష్ట్రాల ఉత్పత్తులు వివిధ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. వెదురు ఉత్పత్తులకు ప్రజాదరణ వేగంగా పెరుగుతోంది. గత ప్రభుత్వ హయాంలో వెదురు నరకడం, ఉపయోగించడంపైగల చట్టపరమైన ఆంక్షలు మీకు గుర్తుండే ఉంటాయి. ఆ పరిస్థితిని చక్కదిద్ది వెదురును గడ్డి జాతులలో చేర్చడం ద్వారా ఆనాటి ఆంక్షలన్నింటినీ రద్దుచేశాం. అందుకే వెదురు ఉత్పత్తులు ఇప్పుడు భారీ పరిశ్రమలో భాగం కాగలిగాయి. గిరిజన ఉత్పత్తులు గరిష్ఠ సంఖ్యలో మార్కెట్లకు చేరుతున్నాయి. వాటికి గుర్తింపుతోపాటు డిమాండ్ పెరగడం లక్ష్యంగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. దీనికి మనముందున్న ప్రత్యక్ష నిదర్శనం ‘వన్ధన్’ పథకం. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో 3000కుపైగా ‘వన్ధన్ వికాస్’ కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇక 2014కు ముందు కనీస మద్దతు ధర పరిధిలోకి వచ్చే చిన్నతరహా అటవీ ఉత్పత్తుల సంఖ్య చాలా స్వల్పం కాగా, ఇప్పుడు 7 రెట్లు పెరిగింది. ఆ మేరకు దాదాపు 90 చిన్నతరహా అటవీ ఉత్పత్తులను ప్రభుత్వం కనీస మద్దతు ధర పరిధిలోకి తెచ్చింది. దేశవ్యాప్తంగా 50,000కుపైగా వన్ధన్ స్వయం సహాయ సంఘాల ద్వారా లక్షలాది గిరిజనులు లబ్ధి పొందుతున్నారు. దేశంలో ఏర్పాటయ్యే స్వయం సహాయ బృందాల పెద్ద నెట్వర్క్ ద్వారా గిరిజన సమాజం కూడా ప్రయోజనం పొందుతోంది. ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో 80 లక్షలకుపైగా ఇలాంటి బృందాలు పనిచేస్తుండగా, వాటిలో మన తల్లిదండ్రుల వంటివారు సహా 1.25 కోట్ల మందికిపైగా గిరిజన సభ్యులున్నారు. తద్వారా గిరిజన మహిళలకూ అధిక ప్రయోజనం కలుగుతోంది. సోదరసోదరీమణులారా! గిరిజన కళలను ప్రోత్సహించడం, గిరిజన యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వడంపైనా ప్రభుత్వం ఇవాళ ప్రధానంగా దృష్టి సారించింది. ఇందులో భాగంగా సంప్రదాయ చేతివృత్తుల వారికోసం ఈ ఏడాది బడ్జెట్లో ‘పీఎం-విశ్వకర్మ’ పథకం ప్రకటించబడింది. ఈ పథకం కింద మీకు ఆర్థిక సహాయం అందుతుంది. అంతేకాకుండా నైపుణ్య శిక్షణ ఇవ్వడంతోపాటు మీ ఉత్పత్తుల విక్రయానికి మద్దతు కూడా లభిస్తుంది. తద్వారా మీ యువతరం ఎంతో ప్రయోజనం పొందుతుంది. అంతేకాదు మిత్రులారా! ఈ కృషి కేవలం కొన్ని ప్రాంతాలకు పరిమితం కాదు. దేశవ్యాప్తంగా వందలాది గిరిజన సమాజాలున్నాయి. వాటన్నిటిలోనూగల విభిన్న సంప్రదాయాలు, నైపుణ్యాలకు తగిన అపార అవకాశాలు అందివస్తాయి. తదనుగుణంగా సరికొత్త గిరిజన పరిశోధన సంస్థలు దేశవ్యాప్తంగా ఏర్పాటవుతాయి. ఈ కృషి ఫలితంగా గిరిజన యువతకు వారి ప్రాంతాల్లోనే వినూత్న అవకాశాలు చేరువ కాగలవు. మిత్రులారా! గుజరాత్ ముఖ్యమంత్రిగా 20 ఏళ్ల కిందట నేను పదవీ బాధ్యతలు చేపట్టినపుడు ఒక వాస్తవాన్ని గుర్తించాను. రాష్ట్రంలో ఇంత పెద్ద గిరిజన సమాజం ఉన్నప్పటికీ గత ప్రభుత్వాలు వారి ప్రాంతాల్లోగల పాఠశాలలకు విజ్ఞానశాస్త్ర కోర్సులకు ప్రాధాన్యం ఇవ్వలేదు. కానీ, ఇప్పుటి పరిస్థితిని ఒక్కసారి ఊహించుకోండి! గిరిజన బిడ్డలు విజ్ఞానశాస్త్రం చదవకపోతే వారు డాక్టర్లు లేదా ఇంజనీర్లు కావడం సాధ్యమా? అందుకే గిరిజన ప్రాంతాలన్నిటా పాఠశాలల్లో విజ్ఞానశాస్త్ర విద్యకు చర్యలు తీసుకోవడం ద్వారా ఈ సవాలును మేం పరిష్కరించాం. దేశంలోని ప్రతి మూలనగల గిరిజన బాలల చదువు-భవిష్యత్తుకు నేనెంతో ప్రాధాన్యం ఇస్తాను. దేశంలో ఇవాళ ఏకలవ్య ఆదర్శ ఆశ్రమ పాఠశాలల సంఖ్య ఐదురెట్లు పెరిగింది. ఈ మేరకు 2004-14 మధ్య పదేళ్లలో 90 పాఠశాలలు మాత్రమే ప్రారంభించారు. కానీ, 2014-22 మధ్య ఎనిమిదేళ్లలో 500కుపైగా పాఠశాలలకు ఆమోదం ఇవ్వగా, ఇప్పటికే 400కుపైగా ప్రారంభమయ్యాయి. ఈ కొత్త పాఠశాలల్లో లక్ష మందికిపైగా గిరిజన విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ పాఠశాలలకు 40 వేల మందికిపైగా ఉపాధ్యాయులు, ఉద్యోగుల నియామకం చేపట్టనున్నట్లు ఈ ఏడాది బడ్జెట్లో ప్రకటించబడింది. షెడ్యూల్డ్ తెగల యువతకు విద్యార్థి ఉపకారవేతనం కూడా రెండు రెట్లు పెరిగింది. ప్రస్తుతం 30 లక్షల మంది విద్యార్థులు దీనిద్వారా ప్రయోజనం పొందుతున్నారు. మిత్రులారా! భాషాపరమైన అవరోధాలతో గిరిజన యువత ఎన్నో కష్టనష్టాలకు గురవుతున్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దడం కోసం మాతృభాషలో విద్యాబోధనకు జాతీయ విద్యావిధానంలో వీలు కల్పించబడింది. ఇకపై మన గిరిజన బాలలు, యువతరం వారి సొంత భాషలో చదుకుంటూ ముందడుగు వేయగలుగుతారు. మిత్రులారా! సమాజంలో అట్టడుగున ఉన్నవారికి దేశం ప్రాధాన్యమిస్తే ప్రగతి ద్వారాలు వాటంతటవే తెరుచుకుంటాయి. కాబట్టే, ‘బడుగు-బలహీన వర్గాలకు ప్రాధాన్యం’ మంత్రంతో మా ప్రభుత్వం దేశాభివృద్ధికి కొత్త కోణాలను జోడిస్తోంది. ప్రగతికాంక్షిత జిల్లాలు, సమితుల అభివృద్ధికి ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు చేపట్టింది. వీటిలో అధికశాతం గిరిజన ప్రాబల్యంగల ప్రాంతాలే. తదనుగుణంగా ఈసారి బడ్జెట్లో షెడ్యూల్డ్ తెగల సంక్షేమానికి కేటాయింపులు 2014తో పోలిస్తే 5 రెట్లు పెరిగాయి. గిరిజన ప్రాంతాల్లో మెరుగైన, ఆధునిక మౌలిక వసతుల కల్పన కొనసాగుతోంది. ఆధునిక అనుసంధానంతో పర్యాటకంతోపాటు ఆదాయ అవకాశాలు కూడా పెరుగుతాయి. ఒకప్పుడు వామపక్ష తీవ్రవాదంతో కునారిల్లిన దేశంలోని వేలాది గ్రామాలు ఇవాళ 4జీ సమాచార సంధానంలో భాగమయ్యాయి. ప్రధాన జీవన స్రవంతికి దూరంగా ఉండటంవల్ల వేర్పాటువాద ఎరకు చిక్కిన యువతరం నేడు ఇంటర్నెట్, మౌలిక సదుపాయాల ద్వారా అనుసంధానం కాగలుగుతున్నారు. ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్’ అన్నదే దీనికి తారకమంత్రం. నేడు ఇది దేశంలోని మారుమూల ప్రాంతాల్లో ప్రతి పౌరునికీ చేరువవుతోంది. ఇది ప్రాచీనత-ఆధునికతల సంగమం.. ఈ పునాదిపైనే సమున్నత నవ భారత సౌధం సగర్వంగా నిలుస్తుంది. మిత్రులారా! సమానత్వం, సామరస్యాలకు దేశమిస్తున్న ప్రాధాన్యం ఎంతటిదో 8-9 ఏళ్లుగా సాగుతున్న గిరిజన సమాజ ప్రయాణం సాక్ష్యమిస్తోంది. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్లలో తొలిసారి దేశ నాయకత్వం గిరిజనం ప్రతినిధి చేతికి అందింది. తొలిసారిగా ఒక గిరిజన మహిళ భారత రాష్ట్రపతిగా అత్యున్నత పదవిని చేపట్టి భారతదేశానికి గర్వకారణమైంది. దేశంలోనే తొలిసారిగా ఇవాళ గిరిజన చరిత్రకు ఇంతటి గుర్తింపు దక్కుతోంది. దేశ స్వాతంత్ర్య పోరాటంలో గిరిజన సమాజం పోషించిన కీలకపాత్ర గురించి మనందరికీ తెలుసు! కానీ, దశాబ్దాల తరబడి చరిత్రలోని ఆ సువర్ణాధ్యాయాలతోపాటు ఆ వీరులను, వారి త్యాగాలను కప్పిపుచ్చే ప్రయత్నాలు సాగుతూ వచ్చాయి. నేడు అమృత మహోత్సవం సందర్భంగా చరిత్రలో కలసిపోయిన అధ్యాయాలను ప్రజల ముందుంచడానికి దేశం చొరవ చూపుతోంది. అలాగే భగవాన్ బిర్సా ముండా జయంతిని దేశం తొలిసారి గిరిజన ఆత్మగౌరవ దినోత్సవంగా నిర్వహించుకుంటోంది. తొలిసారిగా వివిధ రాష్ట్రాల్లో గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల ప్రదర్శనశాలలు ఏర్పాటయ్యాయి. ఇందులో భాగంగా గత సంవత్సరంలోనే రాంచీ, జార్ఖండ్ రాష్ట్రాల్లో భగవాన్ బిర్సా ముండా ప్రత్యేక మ్యూజియాలను ప్రారంభించే అవకాశం నాకు లభించింది. ఇది దేశంలోనే తొలిసారి అయినప్పటికీ, రాబోయే అనేక తరాలపై దీని ముద్ర కనిపిస్తుంది. ఈ స్ఫూర్తి అనేక శతాబ్దాలపాటు దేశానికి దిశానిర్దేశం చేస్తుంది. మిత్రులారా! మనం మన గతాన్ని కాపాడుకుంటూ వర్తమానంలో కర్తవ్య స్ఫూర్తిని శిఖరాగ్రానికి చేర్చాలి. తద్వారా భవిష్యత్ స్వప్నాల సాకారానికి కృషి చేయాలి. ఈ సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఆది మహోత్సవ్ వంటి కార్యక్రమాలు బలమైన మాధ్యమం. దీన్నొక కార్యక్రమంగా ముందుకు తీసుకెళ్లి ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దాలి. ఆ దిశగా వివిధ రాష్ట్రాల్లో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలి. మిత్రులారా! భారతదేశం చొరవతో ఈ ఏడాది ప్రపంచం మొత్తం అంతర్జాతీయ చిరుధాన్య సంవత్సరం నిర్వహించుకుంటోంది. ‘ముతక ధాన్యాలు’గా పిలిచే చిరుధాన్యాలు శతాబ్దాలుగా మన ఆరోగ్య సంరక్షకాలు మాత్రమేగాక మన గిరిజనం ఆహారంలో ప్రధాన భాగం. ఇవాళ భారతదేశం ఈ ముతక ధాన్యాన్ని ఓ రకమైన అద్భుత ఆహారం ‘శ్రీ అన్న’గా గుర్తించింది. ‘శ్రీ అన్న సజ్జ, శ్రీ అన్న జొన్న, శ్రీ అన్న రాగి తదితరాలను ఇందుకు ఉదాహరణలుగా పేర్కొనవచ్చు. ఆది మహోత్సవం నేపథ్యంలో ఇక్కడి ఆహార విక్రయ స్టాళ్లలో ‘శ్రీ అన్న’ రుచి, సువాసనను కూడా మనం తెలుసుకోవచ్చు. గిరిజన ప్రాంతాల ఆహారాన్ని మనమూ వీలైనంతగా ప్రోత్సహించాలి. ఈ చిరుధాన్యాలతో ప్రజలకు ఆరోగ్య ప్రయోజనాలతోపాటు గిరిజన రైతుల ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ సమష్టి కృషితో మనం వికసిత భారతం కలను సాకారం చేసుకోగలమని నేను దృఢంగా విశ్వసిస్తున్నాను. ఇవాళ కేంద్ర మంత్రిత్వ శాఖ ఢిల్లీలో ఒక ప్రధాన కార్యక్రమాన్ని నిర్వహించింది. దేశం నలుమూలల నుంచి వచ్చిన గిరిజన సోదరీసోదరులు తాము తయారుచేసిన విభిన్న వస్తువులను ఇక్కడకు తెచ్చారు, ముఖ్యంగా తాజా వ్యవసాయ ఉత్పత్తులను అందరికీ అందించడానికి వచ్చారు. ఢిల్లీసహా సమీపంలోని హర్యానాలోగల గుర్గావ్, ఉత్తరప్రదేశ్లోని నోయిడా, ఘజియాబాద్ ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి ఈ వేడుకలను సందర్శించాలని నేను బహిరంగంగా అభ్యర్థిస్తున్నాను. మరికొన్ని రోజులపాటు సాగే ఈ వేడుకల్లో మారుమూల అడవుల నుంచి వచ్చిన విభిన్న రకాల శక్తిమంతమైన ఉత్పత్తులు దేశ భవిష్యత్తును ఎలా నిర్మిస్తాయో గమనించండి. ఆరోగ్య స్పృహగల, భోజనాల బల్లవద్ద ప్రతి అంశంపైనా జాగ్రత్త వహించేవారు.. ముఖ్యంగా తల్లులు, సోదరీమణులకు నాదొక విజ్ఞప్తి. ఒక్కసారి ఇక్కడకు వచ్చి చూడండి… మన అడవులు అందించే ఉత్పత్తులు ఎంత ఆరోగ్యకరమైనవో, మరెంత పోషకాలుగలవో నేరుగా గమనించండి. మీరు తప్పకుండా ముగ్ధులవుతారని నా విశ్వాసం. అంతేకాదు… రాబోయే రోజుల్లోనూ మీరు ఆ ఉత్పత్తుల కోసం ఆర్డర్ చేస్తూనే ఉంటారు. ఉదాహరణకు ఈశాన్య ప్రాంతాల్లో.. ముఖ్యంగా మేఘాలయ నుంచి మనకు పసుపు వస్తుంది. ఇందులోగల పోషక విలువలు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో దొరికే పసుపులో ఉండకపోవచ్చు. మనం దీన్నొకసారి వాడితే ఆ వాస్తవం మనకు తెలిసివస్తుంది. ఆ తర్వాత మన వంటింట్లో ఈ పసుపునే వాడాలనే స్థిర నిశ్చయానికి వస్తాం. ఈ నేపథ్యంలో ఇక్కడికి దగ్గరలోగల ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్ ప్రజలు ఇక్కడికి రావాలని నేను ప్రత్యేకంగా అభ్యర్థిస్తున్నాను. అంతేకాకుండా మన గిరిజన సోదరసోదరీమణులు ఇక్కడకు తెచ్చిన ఏ ఒక్క వస్తువూ వారు వెనక్కు తీసుకెళ్లే అవసరం రాకుండా చూడండి. మీ ఆదరణతో ప్రతి వస్తువూ అమ్ముడయ్యేలా చేయండి. ఇది కచ్చితంగా వారిలో కొత్త ఉత్సాహం నింపుతుంది… అంతేగాక మనకు ఎనలేని సంతృప్తినిస్తుంది. రండి… మనమంతా ఒక్కటై ఈ ఆది మహోత్సవాన్ని చిరస్మరణీయ రీతిలో విజయవంతం చేద్దాం. మీకందరికీ నా శుభాకాంక్షలు! అనేకానేక ధన్యవాదాలు! బాధ్యత నిరాకరణ ప్రకటన: ప్రధానమంత్రి హిందీలో ప్రసంగించారు. వాస్తవ ప్రసంగానికి ఇది స్వేచ్ఛానువాదం మాత్రమే.
pib-222437
ee2563292b74cf411b55fff5692c4eb44a49a36d72d2c9c001c2e40099221a56
tel
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అస్సాంలో వర్షాకాలానికి ముందు వరద నిర్వహణపై సంసిద్ధతను సమీక్షించడానికి కేంద్ర మరియు రాష్ట్ర ఏజెన్సీలతో సమావేశమైన కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ సమర్ధవంతమైన ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ నిర్వహణకు కేంద్రం,రాష్ట్రాల మధ్య సహకారం చాలా ముఖ్యం "కేంద్రం మరియు రాష్ట్ర సమన్వయంతో కూడిన వరద నిర్వహణ నమూనా ఉత్తమ ఫలితాలను తీసుకురాగలదు" రాష్ట్రంలో వరదల నిర్వహణకు కేంద్రం అన్ని విధాలా సహకరిస్తుందని హామీ అస్సాంలో రుతుపవనాలకు ముందు వరదల కారణంగా తలెత్తే ఆరోగ్య సంబంధిత సమస్యలపై చర్చించడానికి కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర మరియు రాష్ట్ర ఆరోగ్య సంస్థలతో సమావేశం నిర్వహించారు. అస్సాంలో వరదలను సమర్థవంతంగా నిర్వహించేందుకు కేంద్ర సంస్థలు మరియు రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలు ఏర్పాటు చేసిన ఏర్పాట్లను సమావేశం అంచనా వేసింది. వరదలు మరియు ఇతర అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కేంద్ర మరియు రాష్ట్ర ఆరోగ్య సంస్థల మధ్య బలమైన సమన్వయం అవసరమని డాక్టర్ మాండవ్య హైలైట్ చేశారు. క్రిటికల్ కేర్ ఎక్విప్మెంట్, ఆక్సిజన్, హాస్పిటల్ బెడ్ల సన్నద్ధతతో పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో స్వచ్ఛమైన తాగునీటి లభ్యత అవసరమని ఆయన నొక్కి చెప్పారు.నివారణ ఆరోగ్య సంరక్షణ మరియు వెక్టర్ ద్వారా మరియు నీటి ద్వారా సంక్రమించే వ్యాధులకు సంబంధించి కమ్యూనిటీలలో ఎక్కువ అవగాహన కల్పించాలని ఆయన స్పష్టంచేశారు. అసోంలో పునరావృతమయ్యే వరద పరిస్థితిని ఎదుర్కోవడానికి వరద నిర్వహణ నమూనాలో పని చేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి అధికారులను కోరారు. ఏదైనా ఆరోగ్య అత్యవసర పరిస్థితిని సమర్ధవంతంగా నిర్వహించేలా బెడ్లు, ఆక్సిజన్ మరియు ఇతర ఆరోగ్య సదుపాయాల లభ్యత వంటి అన్ని ముఖ్యమైన సమాచారాన్ని జాబితా చేసే ఆన్లైన్ డేటాబేస్ను సిద్ధం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లలో అవసరమైన మందులు, సరైన వైద్య పరికరాలు మరియు ఇతర సౌకర్యాలు ఉండేలా చూడాలని డాక్టర్ మాండవ్య అధికారులను కోరారు. ఎబి-హెచ్డబ్ల్యుసిలలో ఆరోగ్య కార్యకర్తలందరికీ శిక్షణ ఇవ్వాలని ఆయన ఆదేశించారు. తద్వారా వారు అటువంటి అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడానికి బాగా సన్నద్ధమవుతారు. "ఆశాలు, ఏఎన్ఎంలు, సిహెచ్ఓలు మొదలైనవారు ఏదైనా అత్యవసర పరిస్థితిలో వారి పాత్రలు మరియు బాధ్యతలను తెలుసుకోవాలి. ముందస్తు శిక్షణ అత్యవసర వరద నిర్వహణ సమయంలో ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడంలో వారు ప్రభావవంతంగా ఉన్నారని నిర్ధారిస్తుంది" అని ఆయన పేర్కొన్నారు. అవసరమైన అన్ని మందులు తగినంత స్టాక్లో ఉన్నాయని అస్సాం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ అవినాష్ జోషి తెలియజేశారు. సమీక్షా సమావేశంలో పాల్గొన్న బార్పేట, కమ్రూప్, కాచర్, లఖింపూర్, డిమా హసావో మరియు దిబ్రూఘర్లోని ఆరు జిల్లాల డిప్యూటీ కమిషనర్లు వరదలు వచ్చినప్పుడు సమర్థవంతంగా నిర్వహించేందుకు సన్నద్ధతను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి తమ ప్రాంతీయ కార్యాలయాలు సంసిద్ధతగా ఉన్నాయని ఎంఓహెచ్ఎఫ్డబ్ల్యూ డిజిహెచ్ డాక్టర్ అతుల్ గోయెల్ పేర్కొన్నారు. రాష్ట్రానికి అవసరమైనప్పుడు సహాయం చేయడానికి ఎయిమ్స్ గౌహతి మరియు ఎస్సిడిసి నుండి నిపుణుల బృందాన్ని నియమిస్తామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో వరదల నిర్వహణకు కేంద్రం అన్ని విధాలా సహకరిస్తుందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ శ్రీ అశోక్ బాబు మరియు మంత్రిత్వ శాఖ నుండి సీనియర్ అధికారులు మరియు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ , గౌహతి, ఈశాన్య ఇందిరా గాంధీ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ & మెడికల్ సైన్సెస్ , షిల్లాంగ్ వంటి అనుబంధ సంస్థలు; ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ - రీజినల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ , దిబ్రూఘర్ మరియు రీజినల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారామెడికల్ అండ్ నర్సింగ్ సైన్సెస్ , ఐజ్వాల్ పాల్గొన్నారు.
pib-246301
52d5e697d2e844a9346cc6f5ca33273eeaf1469fe38f2dcceba5114adbdbe6cd
tel
హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ ప్రారంభించబడింది, వివిధ అవార్డుల కోసం నామినేషన్ల ఆహ్వనం భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు / విభాగాలు / ఏజెన్సీ లు తమ తమ రంగాలలో విశిష్టమైన, అసాధారణమైన కృషి చేసిన వ్యక్తులను సత్కరించడానికి అనేక పౌర పురస్కారాలు ఏర్పాటు చేశాయి. వివిధ అవార్డుల కోసం నామినేషన్లు ఆహ్వానించడానికి , ఒక ఉమ్మడి జాతీయ అవార్డుల పోర్టల్ ప్రభుత్వంచే అభివృద్ధి చేయబడింది, దీని వలన భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు/విభాగాలు/ఏజెన్సీల అన్ని అవార్డులు అందజేయబడతాయి . పారదర్శకతతో పాటు ప్రజల భాగస్వామ్యం ఖచ్చితంగా ఒకే డిజిటల్ ప్లాట్ఫారమ్ క్రిందకు తీసుకురావాలనే ఉద్దేశ్యంతో ఈ పోర్టల్ ఏర్పాటు చేయబడింది. భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన వివిధ అవార్డులకు పౌరులు, వ్యక్తులు/సంస్థలను నామినేట్ చేయడానికి వీలు కల్పించడం ఈ పోర్టల్ లక్ష్యం. ప్రస్తుతం, కింది అవార్డుల కోసం నామినేషన్ / సిఫార్సులు ఆహ్వానించబడ్డాయి : i. పద్మ పురస్కారాలు - చివరి తేదీ 15/09/2022 ii. డిజిటల్ ఇండియా పురస్కారాలు - చివరి తేదీ 15/09/2022 iii. నేషనల్ అవార్డ్ ఎక్సలెన్సీ ఇన్ ఫారెస్టీ-2022 iv. నేషనల్ గోపాల రత్న పురస్కారం-2022 (చివరి తేదీ 30 సెప్టెంబర్ 2022 v. నేషనల్ వాటర్ అవార్డ్సు-2022 vi. నారీ శక్తి పురస్కారం-2023- చివరి తేదీ 31/10/2022 vii. సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కారం-2023 చివరి తేదీ 30/09/2022 viii. జీవన్ రక్షా పదక్ - చివరి తేదీ 30/09/2022 పురస్కారాలకు సంబంధించి మరిన్ని వివరాలు, నామినేషన్ల కోసం రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ సందర్శించండి. (Visitor Counter : 118
pib-263940
fe988e2e26f75dd8c9fe072c6e0bedc27ee8618d8158efcb0bf406b69633d1b4
tel
వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ భారతదేశం అంటే అవకాశాలు అని అర్థం; ఇది కేవలం భారతదేశ దశాబ్దం మాత్రమే కాదు, ఇది భారతదేశ శతాబ్దం: స్టాన్ ఫోర్డ్ విద్యార్థులతో కేంద్ర మంత్రి శ్రీ పియూష్ గోయల్ గత కొన్ని సంవత్సరాలుగా భారత దేశం శరవేగంగా మార్పు చెందుతోంది, తన ఆర్థిక వ్యవlస్థను అభివృద్ధి చేసుకుంటోంది, తన వ్యవస్థలను మెరుగు పరుస్తోంది, సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్వయింపచేసుకుంటూ ప్రపంచంలో అత్యుత్తమ వాటి గురించి తెలుసుకుంటున్నది: శ్రీ గోయల్ భారతదేశ ఎల్ ఇ డీ లైటింగ్ విజయ గాథ ఒక అద్భుతమైన దార్శనికత, కృషి , బలమైన నిర్వహణ పద్ధతులను ఉపయోగించిన ఫలితము: శ్రీ గోయల్ 'భారత దేశం' అంటే 'అవ కాశాలు' అని, ఇది కేవలం భారత దేశ దశబ్దమే కాదు శతాబ్దం అని కేంద్ర వాణిజ్య, పరిశ్రమలు, వినియోగ దారుల వ్యవహారాలు, ఆహార ,ప్రజా పంపిణీ , జౌళి శాఖల మంత్రి శ్రీ పీయూష్ గోయల్ అన్నారు. ఈ రోజు శాన్ ఫ్రాన్సిస్కో లోని స్టాన్ ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో అధ్యాపకులు, విద్యార్థులతో శ్రీ పీయూష్ గోయల్ సమావేశమయ్యారు. త్వరితగతిన మార్పు చెందగల, తన ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసుకోగల, వడానికి, తన వ్యవస్థలను మెరుగుపరచుకోగల, సాంకేతిక పరిజ్ఞానం విస్తృతంగా ఉపయోగించగల, ప్రపంచంలోన అత్యుత్తమ వాటి నుండి నేర్చుకోగల బలమైన పునాదిని ఏర్పరచుకోవడంలో భారతదేశం గత కొన్ని సంవత్సరాల సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుందని శ్రీ గోయల్ అన్నారు. దేశంలోని ప్రతి పౌరుడు, దేశంలో పుట్టిన ప్రతి బిడ్డ మెరుగైన జీవితం, ఉజ్వల భవిష్యత్ కు హక్కు కలిగి ఉండేలా భారత దేశం కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 675 బిలియన్ డాలర్లు దాటిన భారత ఎగుమతులను గురించి ప్రస్తావిస్తూ, 2030 నాటికి అంతర్జాతీయ వాణిజ్యాన్ని 2 ట్రిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలని దేశం ఇప్పుడు కోరుకుంటోందని, భారతదేశం తన 100 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకునే సమయానికి అది 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అవుతుందని ఆయన అన్నారు. భారతదేశం ప్రపంచానికి అందించే అవకాశం అలాంటిదని, ఇది కేవలం భారతదేశ దశాబ్దం మాత్రమే కాదని, ఇది భారతదేశ శతాబ్దం అని ఆయన అన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ,స్టార్టప్ ఛాంపియన్ లుగా వేగంగా ఆవిర్భవిస్తున్న భారతదేశ యువతపై తన విశ్వాసాన్ని వ్యక్తం చేసిన శ్రీ గోయల్, భారతదేశ నూతన విద్యావిధానం ఉదార విద్యకు ఒక ఉత్తేజాన్ని ఇస్తోందని, ప్రపంచంలోని అత్యుత్తమ విద్యాసంస్థలతో లోతైన సహకారాన్ని చూస్తోందని అన్నారు. భారతదేశ భవిష్యత్తు కోసం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన దార్శనికతను, ప్రణాళికలను కొన్ని దృఢమైన యాజమాన్య సూత్రాల ఆధారంగా ఆవిష్కరించారు శ్రీ గోయెల్ తెలిపారు. ఎల్ ఇ డీ లైటింగ్ విప్లవాన్ని ఇందుకు నిదర్శనంగా పేర్కొన్న శ్రీ గొయెల్, ఇంధన రంగం సుస్థిరత పై 2014 లో ప్రధాన మంత్రి ప్రత్యేక దృష్టి పెట్టానని, విద్యుత్ రంగంలో పెట్టుబడుల భారాన్ని తగ్గించడానికి, సామాన్యుల విద్యుత్ బిల్లులను తగ్గించడానికి, 2015లో ఎల్ ఈడీ లైటింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారని ఆయన వివరించారు. అత్యంత ఖరీదైన ఎల్ ఈడి దీపాల కొనుగోలుకు సబ్సిడీని ఉపసంహరించుకోవాలన్న ప్రధాన మంత్రి నిర్ణయం ఎల్ ఇడి లైటింగ్ ను ప్రోత్సహించడానికి భారతదేశం చేస్తున్న ప్రయత్నంలో నిర్వచించే క్షణం అని శ్రీ గోయల్ అభిప్రాయపడ్డారు. దిగుమతిదారుల నుండి పంపిణీదారుల నుండి సరఫరాదారుల వరకు ప్రభుత్వం వాటాదారులందరితో విస్తృతంగా నిమగ్నమైంది, కొంతవరకు ఆర్థిక వ్యవస్థలను తీసుకురావడం ద్వారా , సరఫరాదారులు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలను కొంతవరకు సమర్థవంతంగా పరిష్కరించడం ద్వారా ఈ కార్యక్రమం మొదటి సంవత్సరంలోనే ఎల్ఇడి బల్బ్ ధరను విజయవంతంగా 85% తగ్గించిందని ఆయన తెలిపారు. ఎల్ ఇ డి లైటింగ్ కార్యక్రమం విజయవంతం కావడం కోసం భారత దేశం రూట్ కాజ్ అనాలిసిస్ , ఇన్నోవేటివ్ ఫైనాన్సింగ్ మోడల్స్ , ఎకానమీస్ ఆఫ్ స్కేల్ వంటి పలు మేనేజ్ మెంట్ సూత్రాలను విజయవంతంగా ఉపయోగించుకున్నట్లు ఆయన తెలిపారు.ఆ కార్యక్రమం కారణంగా భారతదేశం సుమారు 80 మిలియన్ టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలను ఆదా చేయగలిగిందని, ఒకప్పుడు ఎల్ ఈడీ ల్యాంపుల నికర దిగుమతిదారుగా ఉన్న భారతదేశం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేసే అనేక మంది హై క్వాలిటీ ఎల్ ఇ డీ ల్యాంపుల తయారీదారులను కలిగి ఉందని శ్రీ గోయల్ తెలిపారు. ఈ ఒకే ఒక కార్యక్రమం ద్వారా వచ్చిన భారీ మార్పును ప్రస్తావిస్తూ, భారతదేశం ఇప్పుడు ఇలాంటి వందలాది పరివర్తనాత్మక కార్యక్రమాలను ప్లాన్ చేస్తోందని శ్రీ గోయల్ చెప్పారు. భారతదేశ ఫిన్ టెక్ విజయం గురించి మంత్రి మాట్లాడుతూ, అన్ని డిజిటల్ లావాదేవీలలో దాదాపు 40 శాతం నేడు భారతదేశం వెలుపల జరుగుతున్నాయని, చిన్న విక్రేతలు కూడా డిజిటల్ చెల్లింపులను అంగీకరిస్తున్నారని అన్నారు. భారతదేశం ప్రపంచానికి అందించిన అద్భుతఅవకాశాలను గురించి ప్రస్తావిస్తూ, భారతదేశంతో మమేకం కావాలని, గొప్ప ఆకాంక్షలతో ఒక బిలియన్ కు పైగా ప్రజలతో కలిసి పనిచేయాలని శ్రీ గోయల్ స్టాన్ ఫోర్డ్ లోని విద్యార్థులకు పిలుపునిచ్చారు.
pib-189078
e61c7ce1695f8ccdbe5a9513712f1347fa9a43e3b55dddc823e3395296b74fdf
tel
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మార్చే డు ఫిల్మ్లో ఇండియా పెవిలియన్ను డాక్టర్ ఎల్ మురుగన్ ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా కథ చెప్పడంలో భారతదేశ బలాన్ని సినిమాలు కలిగి ఉన్నాయని తెలిపారు. ప్రపంచం భారతీయ సృజనాత్మకత మరియు సామర్థ్యం యొక్క ఉపరితలంపై మాత్రమే గీతలు పడింది: శ్రీ అనురాగ్ ఠాకూర్ ఈశాన్య ప్రాంతాలకు చెందిన చిత్రనిర్మాతలతో కూడిన ప్రతినిధి బృందాన్ని భారతదేశం మొదటిసారిగా కేన్స్కు పంపింది కేన్స్లో క్లాసిక్స్ విభాగంలో ఎంపికైన ‘ఇషానౌ’, మణిపురి సినిమా డిజిటలైజేషన్ను ప్రకటించిన మంత్రి ఫ్రాన్స్లోని భారత రాయబారి శ్రీ జావేద్ అష్రఫ్, ఎంఐబి జాయింట్ సెక్రటరీ శ్రీ పృథుల్ కుమార్ మరియు భారతీయ చలనచిత్ర పరిశ్రమ తారల సమక్షంలో మార్చే డు ఫిల్మ్లోని కేన్స్లోని ఇండియా పెవిలియన్ను కేంద్ర సమాచార మరియు ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ ఈరోజు ప్రారంభించారు. సినిమా తారలు మరియు అధికారులతో సహా భారతదేశం నుండి వచ్చిన ప్రతినిధులను ఉద్దేశించి డాక్టర్ మురుగన్ మాట్లాడుతూ..ఈ రోజు భారతదేశం 50 భాషలలో 3000 చిత్రాలకు పైగా చిత్రాలతో ప్రపంచంలోనే అతిపెద్ద నిర్మాతగా ఉందని అన్నారు. ఈ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా కథ చెప్పడంలో భారతదేశం యొక్క బలం యొక్క సందేశాన్ని కలిగి ఉంటాయి. ముదుమలైకి చెందిన ఇప్పుడు ప్రసిద్ధి చెందిన ఎలిఫెంట్ విస్పరర్స్ను ఉదాహరణగా పేర్కొంటూ, ఈ రోజు మంచి కంటెంట్కు హద్దులు లేవని, భారతీయ కంటెంట్ ప్రపంచానికి స్థానికంగా మారుతున్న యుగాన్ని మనం చూస్తున్నామని మంత్రి హైలైట్ చేశారు. ప్రపంచ స్థాయిలో భారతీయ చలనచిత్రాలు మరియు చిత్ర నిర్మాతల ఇటీవలి అద్భుతమైన విజయాన్ని డాక్టర్ మురుగన్ గుర్తుచేసుకున్నారు. యానిమేషన్ లేదా విఎఫ్ఎక్స్ క్రెడిట్లలో భారతీయ పేరు లేని చలనచిత్రాన్ని కనుగొనడం ఈ రోజు చాలా కష్టమని అన్నారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమ ఇటీవలి సంవత్సరాలలో కొత్త టెక్నాలజీల ఆగమనం మరియు డిజిటల్ మరియు స్ట్రీమింగ్ ప్లాట్ఫారమ్ల పెరుగుదలతో గణనీయమైన మార్పులకు గురైందన్నారు. భారతీయ మీడియా మరియు ఎంటర్టైన్మెంట్ రంగం 2023లో 11.4% అసాధారణ వృద్ధి రేటును సాధించేందుకు సిద్ధంగా ఉందని, దాని ఆదాయాన్ని 2.36 లక్షల కోట్ల రూపాయలకు పెంచుతుందని మంత్రి పేర్కొన్నారు. ఈ అద్భుతమైన పెరుగుదల భారతదేశం యొక్క ఎం&ఈ పరిశ్రమ పటిష్టతకు మరియు వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ల్యాండ్స్కేప్లో కూడా కొత్త అవకాశాలను సృష్టించగల దాని సామర్థ్యానికి నిదర్శనం. కోవిడ్ మహమ్మారి తర్వాత, భారతదేశంలో 2022 స్థూల బాక్సాఫీస్ ఆదాయాలు, 2021 నాటి ఆదాయాల కంటే దాదాపు మూడు రెట్లు పెరిగి 1.3 బిలియన్ల అమెరికన్ డాలర్లకు పెరిగాయని, 2025 నాటికి 3 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఆయన అన్నారు. భారతదేశంలో చలనచిత్ర పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి మంత్రిత్వ శాఖ తీసుకున్న చర్యల గురించి డాక్టర్ మురుగన్ మాట్లాడుతూ..డిజిటల్ ఇండియా, స్టార్ట్ అప్ ఇండియా, గ్రామీణ టెలికాం కనెక్టివిటీ, విధాన సంస్కరణల ద్వారా డేటా స్థోమత మరియు లభ్యత కోసం సానుకూల వాతావరణాన్ని సృష్టించడం ద్వారా అనేక కార్యక్రమాలు పటిష్టంగా ఉన్నాయని చెప్పారు. సృజనాత్మక ఆర్థిక వ్యవస్థకు పునాది అని చెప్పారు. “ఐటి రంగానికి చెందిన మన సాంకేతిక శక్తి కళాకారుల గొప్ప ప్రతిభతో కలిసిపోయింది, ప్రపంచ సినిమా కోసం కంటెంట్ సృష్టికర్తగా పనిచేయడానికి భారతదేశాన్ని ఉత్తమంగా మార్చింది. ఈ రంగాన్ని ప్రోత్సహించేందుకు మన ప్రభుత్వం టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసింది. ఎవిజిసి కోసం నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా పైప్లైన్లో ఉంది” అని తెలిపారు. భారతదేశాన్ని విదేశీ చిత్రాలకు ఆకర్షణీయమైన చలనచిత్ర గమ్యస్థానంగా నిలిపడంతో పాటు షూటింగ్, కో-ప్రొడక్షన్, యానిమేషన్ మరియు తక్కువ ఖర్చుతో కూడిన పోస్ట్ ప్రొడక్షన్తో సహా అంతర్జాతీయ చలనచిత్ర పరిశ్రమకు భారతదేశాన్ని గమ్యస్థానంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందనినడాక్టర్ మురుగన్ చెప్పారు. గత సంవత్సరం కేన్స్లో కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ చలనచిత్ర ప్రోత్సాహకాలను ప్రకటించిన తర్వాత కేన్స్ 2023లో భారతదేశం యొక్క ఆశాజనకమైన ఉనికి ఈ ఊపును మరింత ముందుకు తీసుకువెళుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. భారతదేశం జీ20 సమ్మిట్కు ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో “మేము సంస్కృతి & పర్యాటక ప్రాముఖ్యతపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాము. అందరికి ఉజ్వల భవిష్యత్తుకు మార్గం సుగమం చేస్తూ, సమగ్రమైన, స్థిరమైన సామాజిక-ఆర్థిక పునరుద్ధరణ మరియు అభివృద్ధికి చోదక శక్తిగా సంస్కృతిని ఉంచడానికి మీడియా మరియు వినోదం యొక్క శక్తిని ఉపయోగించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. ఒకే భూమి -ఒక కుటుంబం - ఒక భవిష్యత్తు అనేది ఖచ్చితంగా ముందుకు సాగే మార్గం అని చెప్పారు. మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ వీడియో సందేశం ద్వారా సభను ఉద్దేశించి ప్రసంగించారు. 'ఫెస్టివల్ డి కేన్స్' కేవలం మన సినిమా శ్రేష్ఠతను ప్రోత్సహించడమే కాకుండా ఇండో-ఫ్రెంచ్ సంబంధాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించిందని మంత్రి తన సందేశంలో వ్యాఖ్యానించారు. ఈ సంవత్సరం మొదటిసారిగా భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాల నుండి ప్రతిభావంతులైన చిత్రనిర్మాతలతో కూడిన అధికారిక ప్రతినిధి బృందాన్ని కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కు పంపామని ఆయన ఉద్ఘాటించారు. భారతదేశం యొక్క గొప్ప సినిమా సంస్కృతి యొక్క లోతు మరియు వైవిధ్యాన్ని కేన్స్కు తీసుకురావాలనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియా ఈ ఏడాది కేన్స్ క్లాసిక్ విభాగంలో ఎంపికైన మణిపురి భాషా చిత్రం ‘ఇషానౌ’ ప్రతికూలతలను డిజిటల్గా మార్చిందని ఆయన ప్రేక్షకులకు తెలియజేశారు. శ్రీ ఠాకూర్ ఇంకా మాట్లాడుతూ..3 సినిమాలు 3 విభిన్న విభాగాలలో షార్ట్లిస్ట్ చేయబడ్డాయి మరియు వాటిలో 2 ఆస్కార్లను తీసుకువచ్చాయి - ప్రపంచం భారతీయ చలనచిత్ర పరిశ్రమ యొక్క సృజనాత్మకత, కంటెంట్ మరియు సాంకేతిక సామర్థ్యాలను ఇప్పుడే చూసింది. శక్తివంతమైన కథనాలు, అత్యాధునిక నైపుణ్యం-ఆధారిత కంటెంట్ క్యూరేషన్ మరియు పోస్ట్-ప్రొడక్షన్ సామర్థ్యాలు మరియు 16 దేశాలతో కో-ప్రొడక్షన్ ఒప్పందాలతో, భారతదేశం చలన చిత్ర పరిశ్రమకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా ఉద్భవించింది. అంతకుముందు, ఫ్రాన్స్లోని భారత రాయబారి శ్రీ జావేద్ అష్రఫ్ తన ప్రసంగంలో కేన్స్ మరియు ఇతర ఉత్సవాల్లో పెద్దగా, మరింత వ్యవస్థీకృత ఉనికిని మరియు భారతీయ చిత్రాలను ప్రోత్సహించడానికి మరింత దూకుడుగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఒక పెద్ద ఉనికి భారతీయ సినిమా స్థాయికి మరియు బలానికి న్యాయం చేస్తుందని ఆయన అన్నారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మార్చే డు ఫిల్మ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మిస్టర్ గుయిలౌమ్ ఎస్మియోల్ మాట్లాడుతూ, బలమైన మార్కెట్గా మరియు చలనచిత్ర పరిశ్రమ స్థాయితో భారతదేశం ప్రపంచ చలనచిత్ర పరిశ్రమకు ముఖ్యమైన దేశమని అన్నారు. నవంబర్, 2023లో గోవాలో నిర్వహించనున్న 54వ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా పోస్టర్ మరియు ట్రైలర్ను కూడా ఈ కార్యక్రమంలో ఆవిష్కరించారు. 76వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం హెచ్ఎంఐబి వీడియో సందేశం నమస్కార్! 76వ ఫెస్టివల్ డి కేన్స్లో మార్చే డు ఫిల్మ్లో ఇండియా పెవిలియన్ ప్రారంభోత్సవం కోసం ఈరోజు ఇక్కడ సమావేశమైన మా ప్రతినిధులకు, గౌరవనీయులైన ప్రముఖులకు, సినీ ప్రపంచంలోని అతిథులకు మరియు స్నేహితులకు హృదయపూర్వక స్వాగతం. నేను వ్యక్తిగతంగా మీ అందరితో కలిసి ఉండాలనుకున్నాను, కానీ నా పనులతో పాటు వివిధ కార్యక్రమాలు అందుకు అవకాశం ఇవ్వకపోవడంతో సాంకేతికతను ఎక్కువగా ఉపయోగించుకుంటున్నాను. భారతదేశం బహుళ సాంస్కృతిక అనుభవాల యొక్క చమత్కారమైన మరియు సంక్లిష్టమైన మొజాయిక్. మనం ప్రపంచంలోని పురాతన నాగరికతలలో ఒకటిగా ఉన్నందుకు గర్విస్తున్నాము; పురాతన విజ్ఞానం, అనేక యుగాల వాస్తుశిల్పం, విశేషమైన వారసత్వం, కాలాతీత సంప్రదాయాలు, అసంఖ్యాకమైన ఆకర్షణలు, గొప్ప సంస్కృతి మరియు సృజనాత్మక కళ. భారతదేశం యొక్క లోతైన సాంస్కృతిక, ఆర్థిక మరియు సామాజిక డ్రైవ్ మరియు అభివృద్ధిని సినిమా విజయవంతంగా సంగ్రహించింది మరియు వివరించింది. మరియు 'ఫెస్టివల్ డి కేన్స్' కేవలం మన సినిమా నైపుణ్యాన్ని ప్రోత్సహించడమే కాకుండా ఇండో-ఫ్రెంచ్ సంబంధాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించింది. వాస్తవానికి గత సంవత్సరం, మార్చి డు ఫిల్మ్లో మన దేశం మొట్టమొదటి 'కంట్రీ ఆఫ్ హానర్'గా నిలిచింది, ఇక్కడ మేము చిత్రనిర్మాతలు మరియు కంటెంట్ సృష్టికర్తలను భారతదేశంలోకి వచ్చి షూట్ చేయడానికి ప్రోత్సహించడానికి రెండు పథకాలను ప్రకటించాము. అవి - ఆడియో-విజువల్ కో-ప్రొడక్షన్ కోసం ప్రోత్సాహక పథకం మరియు భారతదేశంలో విదేశీ చిత్రాల షూటింగ్ కోసం ప్రోత్సాహక పథకం. ఈ సంవత్సరం, ఇండియా పెవిలియన్ కంటెంట్ డెవలప్మెంట్ మరియు పోస్ట్-ప్రొడక్షన్ పరాక్రమంలో మన సామర్థ్యాన్ని పెంచడం ద్వారా భారతదేశ సృజనాత్మక ఆర్థిక వ్యవస్థను ప్రదర్శించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సంవత్సరం మొదటి సారి, మేము కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కు భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాల నుండి ప్రతిభావంతులైన చిత్రనిర్మాతలతో కూడిన అధికారిక ప్రతినిధి బృందాన్ని పంపాము. మేము స్వదేశానికి తిరిగి సినిమా నిర్మాణంలో ప్రాంతీయ వైవిధ్యాన్ని గుర్తించి, ప్రోత్సహిస్తూనే మన దేశ గొప్ప సినిమా సంస్కృతి యొక్క లోతు మరియు వైవిధ్యాన్ని మీ ముందుకు తీసుకురావాలనే ఆలోచన ఉంది. భారత ప్రభుత్వ నిధులతో పనిచేసే నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియా ప్రతికూలతలను డిజిటలైజ్ చేసిందని మీతో పంచుకోవడానికి నేను సంతోషిస్తున్నాను. మణిపురి భాషా చిత్రం ‘ఇషానౌ’ ఈ ఏడాది కేన్స్ క్లాసిక్ విభాగంలో ఎంపికైంది. ఈ సంవత్సరం మరోసారి భారతదేశం మన దేశం యొక్క సినిమా శ్రేష్ఠత, సాంకేతిక నైపుణ్యం, మిశ్రమ సంస్కృతి మరియు కథా సాహిత్యం యొక్క ప్రసిద్ధ వారసత్వం యొక్క ట్రైలర్తో ప్రపంచ ప్రేక్షకులను అబ్బురపరిచింది. 3 సినిమాలు 3 విభిన్న కేటగిరీలలో షార్ట్లిస్ట్ చేయబడ్డాయి మరియు వాటిలో 2 ఆస్కార్లను ఇంటికి తీసుకువచ్చాయి - ప్రపంచం భారతీయ చలనచిత్ర పరిశ్రమ యొక్క సృజనాత్మకత, కంటెంట్ మరియు సాంకేతిక సామర్థ్యాలను ఇప్పుడే తెలుసుకుంది. భారత ప్రభుత్వం, గౌరవనీయులైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ యొక్క డైనమిక్ నాయకత్వంలో సింగిల్-విండో ఫెసిలిటేషన్ మరియు చిత్రీకరణకు అనుమతి మరియు ఏవిజిసిపై టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేయడం వంటి చర్యల ద్వారా చలనచిత్ర రంగంలో అవకాశాలను సులభతరం చేయడానికి మరియు విస్తరించడానికి కృషి చేస్తోంది. శక్తివంతమైన కథనాలు, హై-ఎండ్ నైపుణ్యం-ఆధారిత కంటెంట్ క్యూరేషన్ మరియు పోస్ట్-ప్రొడక్షన్ సామర్థ్యాలు మరియు 16 దేశాలతో కో-ప్రొడక్షన్ ఒప్పందాలతో, భారతదేశం ప్రపంచవ్యాప్తంగా చిత్రనిర్మాతలకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా ఉద్భవించింది. మార్చే డు ఫిల్మ్లోని ఇండియా పెవిలియన్ సృజనాత్మకత మరియు కంటెంట్ క్యూరేషన్పై కొత్త సంభాషణలను రేకెత్తిస్తుంది మరియు భారతదేశం మరియు ప్రపంచం మధ్య సహ-సృష్టి, సహకారం మరియు సహకారాన్ని ప్రోత్సహిస్తుందని నాకు నమ్మకం ఉంది. నేడు, భారతదేశం అవకాశాల ఒయాసిస్ను అందిస్తుంది, స్టోరీ టెల్లర్ల భూమి సినిమా ప్రపంచం దృష్టిలో ఉండటంలో ఆశ్చర్యం లేదు! ఈ ఏడాది చివర్లో గోవాలో జరగనున్న 54వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఆఫ్ ఇండియా లో మీ అందరినీ చూడాలని నేను ఎదురుచూస్తున్నాను. ధన్యవాదాలు! జై హింద్. జై భారత్!
pib-228050
b39c9a80ba4dfa691384b2f54e3c9478cc8ddead09ca6e817f00b4621df49dec
tel
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కోవిడ్-19 పై మంత్రుల బృందం 19వ సమావేశానికి అధ్యక్షత వహించిన - డాక్టర్ హర్ష వర్ధన్. ప్రపంచవ్యాప్తంగా అతి తక్కువ కేసు మరణాల రేటులో ఒకటిగా భారతదేశంలో ఉంది, ఇది క్రమంగా తగ్గుతోంది: డాక్టర్ హర్ష వర్ధన్ గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 6,42,588 కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలు జరిగాయి. కోవిడ్-19 పై ఉన్నత స్థాయి మంత్రుల బృందం 19వ సమావేశానికి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ ఈ రోజు ఇక్కడ వీడియో కాన్ఫరెన్సు ద్వారా అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్; పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ హర్దీప్ ఎస్. పురి; నౌకాయాన శాఖ సహాయ , రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి శ్రీ మనసుఖ్ లాల్ మాండవీయ; కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే; కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ నిత్యానంద రాయ్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో కోవిడ్-19 యొక్క ప్రస్తుత స్థితిని ఈ సందర్భంగా మంత్రుల బృందానికి వివరించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ హర్ష వర్ధన్ మాట్లాడుతూ, "భారతదేశం ఒక మిలియన్ రికవరీల మైలురాయిని సాధించింది, ప్రస్తుతం రికవరీ రేటు 64.54 శాతంగా నమోదయ్యింది. ప్రస్తుతం వైద్య పర్యవేక్షణలో క్రియాశీల కేసులు కేవలం 33.27 శాతం లేదా మొత్తం పాజిటివ్ కేసులలో సుమారు మూడో వంతు మాత్రమే అన్న విషయం స్పష్టమౌతోంది. భారతదేశం యొక్క కేసు మరణాల రేటు కూడా క్రమంగా తగ్గుతోంది, ప్రస్తుతం ఇది 2.18 శాతంగా ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యల్పంగా ఉన్న దేశాలలో ఒకటిగా ఉంది. ” అని పేర్కొన్నారు. భారతదేశంలో చికిత్స పొందుతున్న కేసుల తీవ్రతపై డాక్టర్ హర్ష వర్ధన్ మాట్లాడుతూ, "మొత్తం క్రియాశీల కేసులలో, 0.28 శాతం మంది రోగులు మాత్రమే వెంటిలేటర్లలో ఉన్నారు, 1.61 శాతం మంది రోగులు ఐ.సి.యులో చికిత్స తీసుకుంటున్నారు మరియు 2.32 శాతం మంది మాత్రమే ఆక్సిజన్ అందించవలసిన పరిస్థితిలో ఉన్నారు". అని వివరించారు. భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న పరీక్షా సామర్థ్యం గురించి కేంద్ర ఆరోగ్య మంత్రి వివరిస్తూ, దేశవ్యాప్తంగా మొత్తం 1,331 ప్రయోగశాలల నెట్ వర్కు ద్వారా , గత 24 గంటల్లో దేశంలో రికార్డు స్థాయిలో 6,42,588 పరీక్షలు నిర్వహించినట్లు తెలియజేశారు. దీంతో, దేశవ్యాప్తంగా నిర్వహించిన మొత్తం కోవిడ్ నిర్ధారణ పరీక్షల సంఖ్య 1.88 కోట్ల కంటే ఎక్కువగా నమోదయ్యింది. పి.పి.ఈ.లు, మాస్కులు, వెంటిలేటర్లతో పాటు, హెచ్.సి.క్యూ. వంటి ఔషధాల తయారీకి వివిధ రంగాల్లో దేశీయ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం గురించి కూడా మంత్రుల బృందానికి తెలియజేశారు. ఇక, ఆరోగ్య పరిరక్షణ పరికరాల విషయానికొస్తే, మొత్తం 268.25 లక్షల ఎన్-95 మాస్కులు, 120.40 లక్షల పి.పి.ఈ.లతో పాటు 1083.77 లక్షల హెచ్.సి.క్యూ. మాత్రలను వివిధ రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలు మరియు కేంద్ర ప్రభుత్వ సంస్థలకు పంపిణీ చేశారు. జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ సుజీత్ కె. సింగ్, అత్యధిక కేసుల భారం ఎక్కువగా ఉన్న 10 దేశాలలో రోజువారీ కేసులు, మరణాలు మరియు వృద్ధి రేటుపై ప్రపంచ దేశాలలో ఉన్న పరిస్థితిని వివరించారు. భారతదేశం మొత్తం మీద రికవరీ రేటు 64.54 శాతంగా ఉంది. ఢిల్లీలో అత్యధిక రికవరీ రేటు 89.08 శాతంగా నమోదు కాగా, 79.82 శాతంతో హర్యానా తర్వాతి స్థానంలో ఉన్నట్లు ఆయన మంత్రుల బృందానికి వివరించారు. కర్ణాటక లో అత్యల్ప రికవరీ రేటు 39.36 శాతంగా ఉంది. గ్రామీణ మరియు పట్టణ భారతదేశంలోని కంటైన్మెంటు జోన్లలో స్థానికత మరియు క్రియాశీల కేసులతో పాటు ధృవీకరించబడిన కేసుల పంపిణీ గురించి మంత్రుల బృందానికి తెలియజేశారు. మొదటి 12 స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు లలో నమోదైన వృద్ధి రేటు వివరాలను ఎన్.సి.డి.సి. డైరెక్టర్ ప్రభుత్వానికి వివరించారు. రాష్ట్రాలు / కేంద్రపాలితప్రాంతాల్లో పరీక్షలు మరియు పరీక్షల సానుకూలత రేటు; మరియు మొదటి స్థానంలో ఉన్న 20 జిల్లాలు మరియు కంటైన్మెంట్ జోన్లలో చురుకైన కేసులు మరియు మరణాల వివరాలు కూడా మంత్రుల బృందానికి తెలియజేశారు. భారీ సంఖ్యలో కేసులు నమోదైన జిల్లాలు / నగరాలతో పాటు పూణే, థానే, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలలో ఇటీవలి కాలంలో పెరుగుతున్న మరణాలను తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఎత్తి చూపారు. కంటైన్మెంట్ జోన్లలో సమర్థవంతమైన నిర్వహణ కోసం - వైరస్ వ్యాప్తి చెందిన ప్రాంతాల్లో కఠినమైన నియంత్రణ; విస్తృతమైన రాపిడ్ యాంటిజెన్ పరీక్షలు; తీవ్రమైన, వేగవంతమైన ఇంటింటి శోధన; అనుమానితులకు / ధృవీకరించిన కేసులకు మరిన్ని ఐసోలేషన్ సౌకర్యాలు; ప్రామాణిక చికిత్సా నిర్వహణ విధివిధానాలతో పాటు ఆక్సిజన్ సౌకర్యం మరియు వెంటిలేటర్లు ఉన్న పడకల సంఖ్య పెంపు మరియు ప్రణాళికాబద్ధమైన సెరో-సర్వేల ద్వారా వాస్తవ భారాన్ని అంచనా వేయడం వంటి తీసుకోవలసిన చర్యల ద్వారా వ్యూహాన్ని పునరుద్ధరిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. లక్ష్యంగా ఉన్న ఐ.ఈ.సి. ప్రచారాల ద్వారా జాన్ చేతన మరియు జాన్ భగీదరి వంటి వాటిని ముందుకు వెళ్ళే మార్గాలుగా సూచించారు. స్థానిక వ్యాప్తిని పరిమితం చేయడం; కేసులను ప్రారంభ దశలోనే గుర్తించడం; సాంకేతిక పరిజ్ఞానంతో కాంటాక్ట్ ట్రేసింగ్ను బలోపేతం చేయడం; మరియు సమాజాన్ని భాగస్వామ్యం చేయడం వంటి ప్రయత్నాలతో, అధిక భారం ఉన్న ప్రాంతాల నుండి ఓ మాదిరి కేసుల భారం ఉన్న జిల్లాలు / నగరాల్లోకి, వైరస్ వ్యాప్తి చెందకుండా నివారించడంపై దృష్టి పెట్టాలి. తక్కువ భారం ఉన్న జిల్లాల విషయానికొస్తే, ఇతర ప్రాంతాల నుండి జనాభాలో సంక్రమణను నివారించడానికి - విష జ్వరం వంటి అనారోగ్యం / తీవ్రమైన శ్వాసకోశ అనారోగ్యం నిఘా మరియు లక్ష్య పరీక్షలను బలోపేతం చేయడం; స్థానిక పరిపాలన నిర్దేశించాల్సిన లక్ష్యాలతో కఠినమైన కాంటాక్టులను జాడ కనుగొనడం; మరియు అధిక ప్రమాద జనాభా యొక్క ముందస్తు గుర్తింపు వంటి చర్యలు లక్ష్యంగా చేపట్టాలి. కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఎగుమతి పరిమితి / నిషేధానికి గురైన వివిధ వస్తువులు మరియు వాటి ప్రస్తుత స్థితి గురించి డి.జి.ఎఫ్.టి. శ్రీ అమిత్ యాదవ్, మంత్రుల బృందానికి వివరించారు. విమానాశ్రయాలలో అనుసరిస్తున్న విధివిధానాలు మరియు విదేశాలనుండి వచ్చే ప్రయాణీకుల పరీక్షలను మెరుగుపరచడానికి తీసుకోవలసిన చర్యలపై మంత్రుల బృందం చర్చించింది. ఈ సమావేశంలో - ఆరోగ్యశాఖ కార్యదర్శి శ్రీమతి ప్రీతి సుడాన్; ఓ.ఎస్.డి. శ్రీ రాజేష్ భూషణ్; ఫార్మా కార్యదర్శి శ్రీ పి.డి.వాఘేలా; పౌరవిమానయాన శాఖ కార్యదర్శి శ్రీ ప్రదీప్ సింగ్ ఖరోలా; వాణిజ్యశాఖ కార్యదర్శి శ్రీ అనూప్ వాధ్వాన్; జౌళి శాఖ కార్యదర్శి శ్రీ రవి కపూర్; ఐ.సి.ఎం.ఆర్. డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ; డి.జి.హెచ్.ఎస్. కు చెందిన డాక్టర్ రాజీవ్ గార్గ్; ఏ.ఎఫ్.ఎం.ఎస్. డైరెక్టర్ జనరల్ లెఫ్టనెంట్ జనరల్ అనూప్ బెనర్జీ; ఎం.ఈ.ఏ. అదనపు కార్యదర్శి శ్రీ దమ్ము రవి; మంత్రివర్గ సచివాలయం అదనపు కార్యదర్శి శ్రీ పంకజ్ అగర్వాల్; హోమ్ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ అనిల్ మాలిక్; ఎం.ఓ.హెచ్.ఎఫ్.డబ్ల్యూ. అదనపు కార్యదర్శి శ్రీమతి ఆర్తి అహుజా తో పాటు, ఐ.టి.బి.పి., డి.జి.ఎఫ్.టి., ఎం.ఈ.ఏ. ప్రతినిధులు, మరియు రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు, ఇతర సీనియర్ ప్రభుత్వాధికారులు వీడియో కాన్ఫరెన్సు ద్వారా పాల్గొన్నారు.
pib-218548
3dcd00d3e2b36db3f932c24cdcf93366c10ba59f96c2624e1b92e33132c81754
tel
సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆషాఢ పూర్ణిమ సందర్భంగా ధర్మ చక్ర దినోత్సవ వేడుకలను భారత రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ ప్రారంభించారు మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా మానవ జీవితాలను, ఆర్థిక వ్యవస్థలను నాశనం చేస్తున్నప్పుడు, భగవాన్ బుద్ధుడి సందేశం ఒక దారిచూపేలా పనిచేస్తుంది -శ్రీ రామ్ నాథ్ కోవింద్ బుద్ధుని బోధనలు అనేక సమాజాలు, దేశాల శ్రేయస్సు వైపు మార్గాన్ని చూపుతాయి: శ్రీనరేంద్రమోడి ధర్మ చక్ర దినోత్సవంగా జరుపుకుంటున్న ఆషాఢ పూర్ణిమ వేడుకలను రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ ఈ రోజు న్యూ ఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్ నుండి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ కూడా వీడియో ద్వారా ప్రత్యేక ప్రసంగం చేశారు. మంగోలియా అధ్యక్షుడు శ్రీ ఖల్ట్మాగిన్ బతుల్గా ప్రత్యేక సందేశాన్ని భారతదేశానికి మంగోలియా రాయబారి శ్రీ గోన్చింగ్ గాన్బోయిడ్ చదివి వినిపించారు. సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్, మైనారిటీ వ్యవహారాల సహాయ మంత్రి శ్రీ కిరెన్ రిజుజు కూడా ప్రసంగించారు. రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ మాట్లాడుతూ, 'భగవంతుడు దురాశ, ద్వేషం, హింస, అసూయ మరియు అనేక ఇతర దుర్గుణాలను విడనాడాలని ప్రజలకు సూచించాడు. పశ్చాత్తాపం చెందని మానవజాతి అదే పాత హింస, ప్రకృతి అధోకరణానికి పాల్పడటం ఈ సందేశానికి విరుద్ధంగా ఉంది. కరోనా వైరస్ వ్యాప్తి మందగించిన క్షణం, మన ముందు వాతావరణ మార్పుల గురించి చాలా తీవ్రమైన సవాలు ఉన్నాయన్న విషయం మనందరికీ తెలుసు' అని అన్నారు. ఈ రోజు రాష్ట్రపతి భవన్లో ధర్మ చక్ర దివాస్ సందర్భంగా అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య ఏర్పాటు చేసిన వర్చువల్ కార్యక్రమంలో రాష్ట్రపతి మాట్లాడారు. ధర్మం మూలం భారతదేశం అని గర్విస్తున్నామని రాష్ట్రపతి అన్నారు. భారతదేశం లో. భగవాన్ బుద్ధుని జ్ఞానోదయం, తరువాత నాలుగు దశాబ్దాలు ఆయన చేసిన బోధలు, మేధో ఉదారవాదం, ఆధ్యాత్మిక వైవిధ్యానికి గౌరవం ఇచ్చే భారతదేశ సంప్రదాయానికి అనుగుణంగా ఉన్నాయి. ఆధునిక కాలంలో, ఇద్దరు గొప్ప భారతీయులు - మహాత్మా గాంధీ, బాబాసాహెబ్ అంబేద్కర్ - బుద్ధుడి మాటలలో ప్రేరణ పొంది దేశానికి దిశా, దశా చూపించారు అని రాష్ట్రపతి తెలిపారు. వారి అడుగుజాడలను అనుసరించి, బుద్ధుని పిలుపును ప్రేరణగా తీసుకుని, ఆదర్శవంత మార్గంలో నడవడానికి అందరూ ప్రయత్నించాలి అని రాష్ట్రపతి సూచించారు. Kindly click the link to read for full speech of President of India భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ తన వీడియో ప్రసంగంలో గురు పూర్ణిమ అని కూడా పిలిచే ఆషాఢ పూర్ణిమ సందర్బంగా శుభాకాంక్షలు తెలిపారు బుద్ధుడికి నివాళులర్పించారు. మంగోలియన్ కంజుర్ కాపీలు మంగోలియా ప్రభుత్వానికి అందజేస్తున్నందుకు ఆయన సంతోషం వ్యక్తం చేశారు. భగవాన్ బుద్ధుని బోధన గురించి, అనేక సమాజాలు, దేశాల శ్రేయస్సు వైపు చూపించే మార్గం గురించి ప్రధాన మంత్రి మాట్లాడారు. బౌద్ధమతం ప్రజలు, మహిళలు, పేదలు, శాంతి, అహింసల పట్ల గౌరవం నేర్పుతుందని ఆయన అన్నారు. భగవాన్ బుద్ధుడు ఆశ, ఉద్దేశ్యం గురించి బోధలు చేశారని ఆ రెంటి మధ్య బలమైన సంబంధాన్ని చూసారని ప్రధాని అన్నారు. 21 వ శతాబ్దం గురించి తాను ఎలా ఆశాజనకంగా ఉన్నానో, ఈ ఆశ యువత నుండి పుట్టుకొచ్చిందని ప్రధాని చెప్పారు. ప్రకాశవంతమైన యువ మనస్సులు ప్రపంచ సమస్యలకు పరిష్కారాలను కనుగొనే అతిపెద్ద పర్యావరణ వ్యవస్థలలో భారతదేశం ఒకటి అని ఆయన నొక్కి చెప్పారు. Kindly click the link for full speech of Prime Minister of India ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య కి ఈ సందర్భంగా కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ కృతజ్ఞతలు తెలిపారు. భగవాన్ బుద్ధుడి ఆలోచనలు భౌగోళిక సరిహద్దులను దాటాయని, ఈ రోజు ఆయన సందేశం మొత్తం ప్రపంచాన్నీ అనేక సమస్యల నుండి తేలిక పరుస్తుందని శ్రీ పటేల్ అన్నారు. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మంగోలియన్ కంజుర్ కాపీలను దేశం ముందు, విదేశాలలోను ఉంచిందని ఆయన తెలిపారు. శ్రీ పటేల్ మంగోలియన్ కంజుర్ కాపీలను భారత రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ భారత మంగోలియా రాయబారి కి అందజేశారు శ్రీ పటేల్. దీనికి 108 విభాగాలు ఉన్నాయని, తాము ఐదు సంపుటాలను ముద్రిస్తున్నామని కేంద్ర మంత్రి చెప్పారు. అయితే మొత్తం 108 సంపుటాలను మంగోలియా ఆరామాల వద్ద ఉంచాలన్నదే తమ సంకల్పమని అన్నారు. మంగోలియన్ కంజుర్, 108 సంపుటాలలో సూత్రబద్ధ బౌద్ధ వ్యాఖ్యలు కలిగి ఉన్న పుస్తకాలు మంగోలియాలో అత్యంత ముఖ్యమైన మత గ్రంథం. మంగోలియన్ భాషలో ‘కంజూర్’ అంటే బుద్ధుని మాటల ‘సంక్షిప్త సందేశాలు’. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ప్రేరణతో, మంగోలియన్ కంజుర్ ప్రొఫెసర్ లోకేశ్ చంద్ర మార్గదర్శకత్వంలో మాన్యుస్క్రిప్ట్స్ కోసం నేషనల్ మిషన్ పునర్ముద్రిస్తోంది. మైనారిటీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ కిరెన్ రిజిజు మాట్లాడుతూ, సంస్కృతంలో ధర్మ చక్రం, ప్రవర్త సూత్రాలను ధర్మ చక్రాల మొదటి మలుపు అని కూడా పిలుస్తారు, ఇది నాలుగు గొప్ప సత్యాలు, గొప్ప ఎనిమిది రెట్లు మార్గాలను కలిగి ఉంటుంది. బౌద్ధమతం విలువలు బోధనలు భారతదేశ నీతి, సాంస్కృతిక గుర్తింపునకు చాలా హృద్యంగా ఉన్నాయని శ్రీ రిజిజు అన్నారు. బుద్ధుని జ్ఞానోదయం, మేల్కొలుపుల భూమిగా ఉన్న మన గొప్ప భూమి చారిత్రక వారసత్వం బౌద్ధులతోనే కాకుండా బౌద్ధమతాన్ని అర్థం చేసుకుని అనుసరించే ప్రతి ఒక్కరితో ప్రపంచవ్యాప్తంగా ప్రేమ, కరుణను విలువైన ప్రతి ఒక్కరితో సన్నిహితంగా కలుపుతుందని మంత్రి అన్నారు. ఇది ప్రతి బౌద్ధ దేశంతో మనల్ని చాలా బలంగా బంధం కల్పిస్తుందని తెలుపారు. సమిష్టిగా మానవాళికి అత్యంత పరీక్షా సంవత్సరంగా పిలువబడే అత్యంత శుభమైన పౌర్ణమి రోజులలో ఒకటైన ఆషాఢ పూర్ణిమను సమీపిస్తున్నప్పుడు, మానవాళి అందరికీ పరస్పరం ప్రయోజనకరమైన సహజీవనం, శ్రేయస్సు సాధించడానికి గొప్ప బుద్ధుని సత్య సూత్రాలను, బోధలను సమర్థించే దిశగా కృషి చేయాలి' అని కేంద్ర మంత్రి అన్నారు.
pib-141185
bf243b9a216665aaa923d656bd14da07a203f7ff56e3033a15d8e6751fe0c80e
tel
ప్రధాన మంత్రి కార్యాలయం డబ్ల్యూ.ఐ.పి.ఓ. కు చెందిన గ్లోబల్-ఇన్నోవేషన్-ఇండెక్స్ లో భారతదేశం 40వ ర్యాంక్ కు చేరుకోవడంతో మన ఆవిష్కర్తలను చూసి గర్వపడుతున్న - ప్రధానమంత్రి ప్రపంచ మేధో సంపత్తి సంస్థ కు చెందిన గ్లోబల్-ఇన్నోవేషన్-ఇండెక్స్ లో భారతదేశం 40వ ర్యాంక్ కు చేరుకోవడంతో భారతీయ ఆవిష్కర్తలను చూసి, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గర్వపడుతున్నట్లు చెప్పారు. ఈ విషయమై, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ చేసిన ట్వీట్ ను ఉటంకిస్తూ, ప్రధానమంత్రి ట్వీట్ చేస్తూ, "ఆవిష్కరణ అనేది భారతదేశవ్యాప్తంగా ఒక సంచలనం. మన ఆవిష్కర్తల పట్ల గర్వంగా ఉంది. మనం చాలా దూరం వచ్చాం. ఇంకా నూతన శిఖరాలను చేరుకోవాల్సి ఉంది." అని పేర్కొన్నారు.
pib-118616
bb74622e4afb1a2cb1b8c6579c00da67aa6d160f269f33477f0c80e14a90cdff
tel
జల శక్తి మంత్రిత్వ శాఖ జల్ జీవన్ మిషన్ ద్వారా 3.5 కోట్ల గ్రామీణ కుటుంబాలకు నీటి కనెక్షన్లు 2021 జనవరి 1 నుండి 50 లక్షలకు పైగా నీటి కనెక్షన్లు అందించబడ్డాయి 2024 నాటికి ప్రతి గ్రామీణ గృహానికి కుళాయి ద్వారా నీటి కనెక్షన్ను అందించే లక్ష్యంతో 2019 ఆగస్టు 15 న ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ ప్రకటించిన జల్ జీవన్ మిషన్..3.53 కోట్ల గ్రామీణ గృహ కుళాయి నీటి కనెక్షన్లను అందించడం ద్వారా కొత్త మైలురాయిని చేరుకుంది. 15 ఆగస్టు 2019 నాటికి 18.93 కోట్ల గ్రామీణ కుటుంబాలలో 3.23 కోట్లు కు కుళాయి నీటి కనెక్షన్లు ఉన్నాయి. జల్ జీవన్ మిషన్ ద్వారా 3.53 కోట్ల కుళాయి నీటి కనెక్షన్లను అందించడానికి రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల నిరంతర ప్రయత్నాలు సహాయపడ్డాయి. ప్రస్తుతం 52 జిల్లాలు మరియు 77 వేల గ్రామాలలో నివసిస్తున్న ప్రతి కుటుంబానికి వారి ఇళ్లలో కుళాయి నీటి సరఫరా లభిస్తుంది. ఇప్పుడు 6.76 కోట్లు అనగా 1/3 వ గ్రామీణ కుటుంబాలు కుళాయిల ద్వారా తాగునీటిని పొందుతున్నాయి. 100% కుళాయి నీటి కనెక్షన్ను అందించిన మొట్టమొదటి రాష్ట్రంగా గోవా నిలిచింది తరువాతి స్థానంలో తెలంగాణ ఉంది. రాష్ట్రాలు / యుటిలు ఇప్పుడు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. దేశంలోని ప్రతి ఇంటికి సురక్షితమైన త్రాగునీటిని అందించాలన్న ప్రధాన లక్ష్యానికి కట్టుబడి ఈ పథకం ముందుకు సాగుతోంది. త్రాగునీటిని తగినంత పరిమాణంలో మరియు నిర్ణీత, దీర్ఘకాలిక ప్రాతిపదికన అందించే లక్ష్యంతో జల్ జీవన్ మిషన్ రాష్ట్రాల భాగస్వామ్యంతో పనిచేస్తోంది.'బాటప్-అప్ విధానం' అనుసరించి రాష్ట్రాలు / యుటిలు విస్తృతమైన కార్యాచరణ చేపట్టాయి. దీని ప్రకారం, ప్రతి గ్రామీణ గృహానికి కుళాయి నీటి కనెక్షన్ను అందించే కార్యాచరణ ప్రణాళికను ధృవీకరించారు.ఈ పథకం అమలులో నీటి నాణ్యత ప్రభావిత ప్రాంతాలు, కరువు పీడిత మరియు ఎడారి ప్రాంతాలలో గ్రామం, షెడ్యూల్డ్ కులం / షెడ్యూల్డ్ తెగ మెజారిటీ గ్రామాలు, ఆశాజనక జిల్లాలు మరియు సంసాద్ ఆదర్ష్ గ్రామ యోజన గ్రామాలకు రాష్ట్రాలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ప్రపంచం మొత్తం కోవిడ్ -19 మహమ్మారితో పోరాడుతున్నందున ఇప్పటివరకు జల్ జీవన్ మిషన్ ప్రయాణం సవాళ్లు మరియు అంతరాయాలతో నిండి ఉంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో లాక్డౌన్ సమయంలో అన్ని అభివృద్ధి మరియు నిర్మాణ పనులు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. మహమ్మారితో పోరాడటానికి వ్యక్తుల భద్రత కోసం తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యమైన సాధనంగా మారింది. భౌతిక దూరం మరియు మాస్క్లు ఉపయోగించడం వంటి జాగ్రత్తలను అనుసరించి రాష్ట్రాలు / యుటిలు నీటి సరఫరా మౌలిక సదుపాయాలను నిర్మించడం కొనసాగించాయి. కోవిడ్ -19 ఉన్నప్పటికీ నిరంతర పని గ్రామాలకు ఒక వరం అని నిరూపించబడింది. ఇది వారి గ్రామాలకు తిరిగి వచ్చిన వలసదారులకు ఉపాధి కల్పించింది. గతంలో నగరాల్లో పనిచేసి గ్రామాలకు తిరిగివచ్చిన నిర్మాణ కార్మికులు, మసాన్లు, ప్లంబర్లు, ఫిట్టర్లు, పంప్ ఆపరేటర్లకు ఈ పథకం ద్వారా ఉపాధి లభించింది. రక్షిత మంచినీటి సరఫరా లేని గ్రామాలకు ప్రాంతాలకు త్రాగునీటిని అందించడం జల్ జీవన్ మిషన్ ప్రధాన లక్ష్యం. ప్రధానంగా ఆర్సెనిక్ మరియు ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామీణ నివాసాలకు సురక్షితమైన తాగునీరు అందించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. త్రాగునీటి సామర్థ్యానికి జెజెఎం అధిక ప్రాధాన్యత ఇస్తుంది. కలుషిత నీటి కారణంగా తలెత్తే వ్యాధులను అరికట్టడంతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని ఈ పథకం మెరుగుపరుస్తుంది. రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో నీటి నాణ్యత పరీక్షా ప్రయోగశాలలను అప్గ్రేడ్ చేయడంతో పాటు వాటిని ప్రజల కోసం తెరుస్తున్నాయి. వారు తీసుకువచ్చిన నమూనాలను నామమాత్రపు రేటుతో పరీక్షించటానికి అక్కడ అవకాశం లభిస్తుంది.
pib-289222
6392be237f452efeaedcfb258853e03bd793ad9ce91aa4e67618ed088c91ffca
tel
భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ పిడుగుపాటుపై ముందస్తు హెచ్చరికల వ్యవస్థ! ఉరుములతో కూడిన వర్షం, తత్సంబంధిత వాతావరణ మార్పులు, పరిణామాలపై ఐదు రోజుల ముందస్తు హెచ్చరికలు, సూచనల వ్యవస్థను కేంద్ర భూగోళ విజ్ఞాన మంత్రిత్వ శాఖ జారీ చేస్తుంది. వాతావరణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తాజాగా అందించేలా, వాతావరణ శాఖ ద్వారా ఈ వ్యవస్థను అమలు చేస్తారు. ఇక, పిడుగుపాటు సంభవించబోయే స్థలాన్ని కూడా పసిగట్టగలిగే వ్యవస్థను పుణెలోని భారతీయ ఉష్ణమండల వాతావరణ పరిశోధనా సంస్థ స్థాపించింది. కేంద్ర భూగోళ విజ్ఞాన మంత్రిత్వ శాఖ పరిధిలో స్వతంత్ర ప్రతిపత్తితో ఐ.ఐ.టి.ఎం. పనిచేస్తుంది. పిడుగు పడటానికి ఆస్కారం ఉన్న స్థలాన్ని ఎంతో కచ్చితత్వంతో ముందస్తుగానే పసిగట్టి సూచించగలిగే ఈ వ్యూహాత్మక వ్యవస్థను దేశవ్యాప్తంగా 83చోట్ల ఏర్పాటుచేశారు. ఈ మొత్తం వ్యవస్థకు సంబంధించిన సెంట్రల్ ప్రాసెసర్ ఐ.ఐ.టి.ఎం.లో ఏర్పాటై ఉంటుంది. పిడుగుపాటును పసిగట్టగలిగే వ్యవస్థనుంచి సంకేతాలను అందుకునే ఈ సెంట్రల్ ప్రాసెసర్ పరికరం, 500మీటర్ల కంటే తక్కువ కచ్చితత్వంతో పిడుగుపాటు జరగబోయే స్థలాన్ని కనిపెట్టగలుగుతుంది. ఈ వ్యవస్థనుంచి ఉత్పన్నమైన సమాచారాన్ని ఐ.ఎం.డి.కి, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు పంపిస్తారు. అప్పటికప్పుడు, లేదా అతి సమీప భవిష్యత్తులో సంభవించే పరిణామంపై సమాచారాన్ని అందించేందుకు దీన్ని ఉపయోగిస్తారు. ఐ.ఎం.డి.లోని జాతీయ వాతావరణ సూచనల కేంద్రంనుంచి ఈ సూచనలు, హెచ్చరికలు సబ్ డివిజనల్ స్థాయికి పంపిస్తారు. ఆలాగే వివిధ రాష్ట్రాల వాతావరణ కేంద్రాలు కూడా ఇవే సూచనలను జిల్లాస్థాయికి చేరవేస్తాయి. దీనికి తోడుగా, ఈవ్యవస్థ ద్వారా,... ఉరుములతో కూడిన భారీ వర్షాలు, జల్లులు, వాతావరణ వైపరీత్యాలపై ముందస్తు సూచనలను అందిస్తారు. ప్రతి 3 గంటలకు ఒకసారి రానున్న 3 గంటల్లో సంభవించే వాతావరణ మార్పులపై సూచనలను ఈ ప్రత్యేక వ్యవస్థ ద్వారా, అందిస్తారు. వాతావరణ మార్పులు సంభవించే ప్రాంతాన్ని లేదా జిల్లాను ఆయా రాష్ట్రాల వాతావరణ కేంద్రాలు తెలియజేస్తాయి. ప్రస్తుతానికి, ఈ సదుపాయాన్ని అన్ని జిల్లాలకూ విస్తరింపజేశారు. అంటే, దేశవ్యాప్తంగా 1,084 కేంద్రాలకు ఈ వ్యవస్థను విస్తరింపజేశారు. పిడుగుపాటుకు సంబంధించి ముందస్తు సమాచారంతో దామిని పేరిట ఒక మొబైల్ యాప్.ను పుణె ఐ.ఐ.టి.ఎం. 2020లో రూపొందించింది. దేశవ్యాప్తంగా సంభవించే పిడుగుపాటు పరిణామాలను అన్నింటినీ ఈ యాప్ పర్యవేక్షిస్తూ ఉంటుంది. ఎవరైనా వ్యక్తికి సమీపంలో పిడుగుపడే ఆస్కారం ఉన్న పక్షంలో సదరు వ్యక్తిని ఈ యాప్ ముందస్తుగా అప్రమత్తం చేస్తుంది. 20 కిలోమీటర్లనుంచి 40కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతంలో జి.పి.ఎస్. నోటిఫికేషన్ ద్వారా యాప్ తన ముందస్తు సూచనలతో అప్రమత్తం చేస్తుంది. పిడుగుపాటుకు ఆస్కారం ఉన్న ప్రాంతంలో ఎవరైనా వ్యక్తి ఉన్నట్టయితే, ఈ మొబైల్ యాప్ సదరు వ్యక్తిని ముందస్తుగా అప్రమత్తం చేస్తుంది. పిడుగుపాటుపై వివరణాత్మకమైన సూచనలు, ముందు జాగ్రత్త చర్యలను కూడా అందిస్తుంది. పిడుగుపాటుపై తదుపరి 40 నిమిషాలు వర్తించే హెచ్చరికను కూడా చేస్తుంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే దామిని మొబైల్ యాప్.ను ఐదు లక్షలమందికి పైగా డౌన్ లోడ్ చేసుకున్నారు. వీటన్నింటితోపాటుగా, పిడుగుపాటు, తత్సంబంధిత అంశాల పరిష్కారానికి జాతీయ ప్రకృతి వైపరీత్యాల నిర్వహణా ప్రాధికార సంస్థ పలు చర్యలు తీసుకుంది. ఉరుములలతో కూడిన భారీ వర్షాలు, జల్లులు-పిడుగుపాటు, పెనుగాలులు వంటి పరిణామాల విషయంలో అనుసరించిన పద్ధతులపై కార్యాచరణ ప్రణాళికకోసం మార్గదర్శక సూత్రాలను ఎన్.డి.ఎం.ఎ. 2018-19 సంవత్సరంలో జారీ చేసింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిపాలనా యంత్రాగాలకు సదరు మార్గదర్శక సూత్రాలను పంపించింది. ఎన్.డి.ఎం.ఎ. వెబ్ సైట్లో కూడా ఈ మార్గదర్శక సూత్రాలు పొందుపరిచారు. వీటన్నింటికీ తోడుగా ఈ కింది చర్యలను ఎన్.డి.ఎం.ఎ. తీసుకుంది: - ఉరుములతో కూడిన వర్షాలు, పిడుగుపాటు తదితర పరిణామాలపై ప్రత్యేక సూచనలను, చేయాల్సిన, చేయకూడని పనులపై తగిన సూచనలను ఎవ్.డి,ఎం.ఎ. జారీ చేసింది. సత్వర చర్యకోసం వాటిని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు జారీ చేసింది. - ఉరుములతో కూడిన జల్లులు, పిడుగుపాటు పరిణామాలను ఎదుర్కొనే సన్నద్ధతను, నివారణ చర్యలను గురించి ఎన్.డి.ఎం.ఎ. సమీక్ష జరిపింది. ఇలాంటి వాతావరణ పరిణామాలతో తరచూ ప్రభావితమయ్యే రాష్ట్రాలతో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఈ సమీక్ష నిర్వహించురు. - ఉరుములతో కూడిన జల్లులు, పిడుగుపాటు పరిణామాలపై ముందస్తు హెచ్చరికలను వ్యాప్తి చేయడానికి ఒక ప్రొటోకాల్ వ్యవస్థను ఎన్.డి.ఎం.ఎ. రూపొందించింది. - ఉరుములతో కూడిన వర్షాలు, జల్లులు, పిడుగుపాటు తదితర వాతావరణ పరిణామాల్లో చేయాల్సిన, చేయకూడని పనులకు సంబంధించి పలు సూచనలతో కూడిన ప్రచార సామగ్రిని, కరదీపికలను ఎన్.డి.ఎం.ఎ. తయారు చేసింది. - ప్రత్యేక ప్యానెల్ చర్చ . ‘ఆపదకా సామ్నా’ శీర్షికన దూరదర్శన్ లో కార్యక్రమ నిర్వహణ. - ‘ఉరుములతో కూడిన వర్షాలు-పిడుగుపాటు’ వంటి పరిణామాలపై ప్రజాచైతన్యం కోసం దూరదర్శన్, ఆకాశవాణి-ఎన్.డి.ఎం.ఎ. ఉమ్మడిగా 2021వ సవంత్సరం ఏప్రిల్ నెలలో పలు అవగాహనా కార్యక్రమాలను నిర్వహించాయి. ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంతో పాటుగా, ఈ వాతావరణంతో తరచుగా ప్రభావితమయ్యేందుకు ఆస్కారం ఉన్న రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాలను నిర్వహించారు. - ఉరుములతో కూడిన జల్లులు, పిడుగుపాటు సంబంధిత వాతావరణ పరిణామాలపై సామాజిక మాధ్యమాల్లో అవగాహనా కార్యక్రమాలను కూడా ఎన్.డి.ఎం.ఎ. నిర్వహిస్తూ వస్తోంది. ఈ వాతావరణ మార్పుల నేపథ్యంలో చేయాల్సిన, చేయకూడని పనుల గురించిన సమాచారాన్ని ఎన్.డి.ఎం.ఎ. సామాజిక మాధ్యమ వేదికల ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి చిత్రీకరించిన వీడియోలను ట్విట్టర్, ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో క్రమం తప్పకుండా పోస్ట్ చేస్తున్నారు. కేంద్ర భూగోళ విజ్ఞాన శాఖ సహాయ మంత్రి, సైన్స్ టెక్నాలజీ శాఖమంత్రి జితేంద్ర సింగ్ ఈ రోజు లోక్ సభకు ఈ సమాచారాన్ని తెలిపారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో మంత్రి ఈ వివరాలు అందించారు.
pib-47182
e3336c1bd506994981f4ca0fd76392bdd2eef25a08e01280e441b109b4397899
tel
సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రేపు నేషనల్ మ్యూజియంలో ఆషాఢ పూర్ణిమ కార్యక్రమాన్ని నిర్వహించనున్న అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య 2023 జూలై 3 న ఆషాఢ పూర్ణిమను నేషనల్ మ్యూజియం, జనపథ్, న్యూఢిల్లీలో నిర్వహిస్తుంది. ధర్మ చక్ర ప్రవర్తన దివస్గా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ప్రతి ఏడాది ఒక ముఖ్యమైన కార్యక్రమంగా ఆషాఢ పూర్ణిమ కార్యక్రమం నిర్వహిస్తుంది. బుద్ధ పూర్ణిమ లేదా వైశాఖ పూర్ణిమ తర్వాత బౌద్ధులకు రెండవ అత్యంత పవిత్రమైన రోజు ఆషాఢ పూర్ణిమ. ఆషాఢ పూర్ణిమ సందర్భంగా రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము సందేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసారం చేస్తారు. లుంబినీ లో ఐబిసి అమలు చేస్తున్న ప్రత్యేక ప్రాజెక్ట్ - "ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ బుద్దిస్ట్ కల్చర్ అండ్ హెరిటేజ్ "పై ప్రసారం చేసే చలన చిత్రం కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గత సంవత్సరం బుద్ద పూర్ణిమ నాడు నేపాల్లోని లుంబినీలో ఈ కేంద్రానికి శంకుస్థాపన చేశారు. ఆషాఢ పూర్ణిమ విశిష్టతను మతపెద్ద 12వ చామ్గోన్ కెంటింగ్ తై సితుపా తన ధర్మ ప్రసంగంలో వివరిస్తారు. సాంస్కృతిక విదేశీ వ్యవహారాల మంత్రి శ్రీమతి మీనాక్షీ లేఖి కార్యక్రమంలో ప్రసంగిస్తారు. అనేక ఇతర ప్రముఖులు, బౌద్ధ సంఘాల అధిపతులు,పండితులు, న్యూఢిల్లీలో ఉన్న దౌత్య కార్యాలయాల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. భారతదేశ చారిత్రక వారసత్వం, బుద్ధుని జ్ఞానోదయం, ఆయన ధర్మ బోధలు, మహాపరినిర్వాణానికి అనుగుణంగా ఐబిసి ఆషాఢ పూర్ణిమ వేడుకలను జాతీయ మ్యూజియం, జనపథ్లో నిర్వహిస్తోంది, ఇక్కడ సఖ్యముని పవిత్ర అవశేషాలు ఉన్నాయి. సారనాథ్ వద్ద బుద్ధుడు మొదటి సారి ధర్మ బోధన చేశారు.ఇక్కడ నుంచి ధర్మ చక్రం ప్రయాణం ప్రారంభం అయ్యింది. భారతీయ చాంద్రమానం ప్రకారం ఆషాఢ మాసం పౌర్ణమి రోజున వచ్చే ఆషాఢ పూర్ణిమను శ్రీలంకలో ఎసల పోయగా, థాయిలాండ్లో అసన్హా బుచాగా పాటిస్తారు. . ఆషాఢ పౌర్ణమి రోజున భారతదేశంలోని వారణాసికి సమీపంలో ఉన్న ప్రస్తుత సారనాథ్లోని షిషిపతన మృగదయలోని ‘డీర్ పార్క్’లో జ్ఞానోదయం పొందిన తర్వాత బుద్ధ భగవానుడు తన మొదటి ఐదుగురు సన్యాసి శిష్యులకు జ్ఞాన ప్రబోధం చేశారు. సన్యాసులు, సన్యాసినుల కోసం వర్షాకాలం తిరోగమనం కూడా జూలై నుంచి అక్టోబర్ వరకు మూడు చాంద్రమాన నెలల పాటు ఈ రోజుతో ప్రారంభమవుతుంది, ఈ సమయంలో వారు ఒకే స్థలంలో నివసిస్తారు. సాధారణంగా దేవాలయాలలో ధ్యానంలో నిమగ్నం అవుతారు. ఈ రోజును బౌద్ధులు, హిందువులు తమ గురువులను గౌరవించే రోజుగా గురు పూర్ణిమ గా పాటిస్తారు.
pib-9772
3f0cf506fb249203f82f89f874983b4ffe10ce69f512bd8fb42bef78f9f14b78
tel
సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ స్ఫూర్తితో గోల్కొండ వద్ద రెండు రోజులపాటు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా రేపు పతాకావిష్కరణ చేసి వేడుకలు ప్రారంభించనున్న కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ గోల్కొండ కోట వద్ద తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుతోంది. రేపు ఉదయం కేంద్ర సంస్కృతి, పర్యాటక, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖామంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి పతాక ఆవిష్కరణ చేసి ఈ రెండు రోజుల వేడుకలను ప్రారంభిస్తారు. ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్ స్ఫూర్తితో సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. 2వ తేదీజరిగే కార్యక్రమాల్లో మార్చ్ పాస్ట్, ఫోటో, పెయింటింగ్ ప్రదర్శనలు, అనందాజీ బృందం శాస్త్రీయ నృత్యం, మంజులా రామస్వామి బృందం ప్రదర్శన ఉంటాయి. ప్రముఖ గాయకులు మంగ్లీ, మధుప్రియల పాటలను ప్రేక్షకులు ఆస్వాదించే అవకాశం కల్పించారు. శంకర్ మహదేవన్ దేశభక్తి గీతాలతో మొదటి roju కార్యక్రమం పూర్తవుతుంది. జూన్ 3న దింసా, డప్పు, బోనాలు, గుస్సాడి తదితర జానపద నృత్యాలు అలరిస్తాయి. వీటితో బాటు రాజా రామ్ మోహన్ రాయ్ మీద నాటకం ప్రదర్శిస్తారు. బహుభాషల ముషాయిరాతో రెండో రోజు కార్యక్రమం పూర్తవుతుంది. దేశ వ్యాప్తంగా ఉన్న కోటల చరిత్రకు ప్రాచుర్యం కల్పించి సాంస్కృతిక వైభవాన్ని చాటటానికి దేశవ్యాప్తంగా చేపట్టిన ఖిలా ఔర్ర్ కహానియా కార్యక్రమంలో భాగం ఇది. గుర్తింపుకు నోచుకోని స్వాతంత్ర్య సమరయోధులను ఈ సందర్భంగా స్మరించుకుంటారు. ఖిలా ఔర్ కహానియా ద్వారా దేశంలోని కోటల విశిష్టతనుగుర్తు చేసుకునే అవకాశం, మన గతంతో అనుసంధానమయ్యే అవకాశం కలుగుతాయి. ఖిలా ఔర్ కహానియా ప్రచారోద్యమం కింద ఇప్పటికే చిత్తోర్ ఘర్, కాంగ్రా లాంటి కోట్లలో అనేక కార్యక్రమాలు జరిగాయి. ఇంకా బిత్తూరు కోట, మండు కోట, ఝాన్సీ కోట, కాంగ్లా కోటలో కార్యక్రమాలు జరగాల్సి ఉంది. ఈ కార్యక్రమాలన్నీ సాంస్కృతిక శాఖ పరిధిలోని పురావస్తు విభాగం, ప్రాంతీయ సాంస్కృతిక కేంద్రలు, లలిత కళా అకాడెమీ, సంగీత నాటక అకా డెమీ, సాహిత్య అకాడెమీ లాంటి కీలక సంస్థల సమన్వయంతో సాగుతోంది. ఖిలా ఔర్ కహానియా కార్యక్రమంలో భాగంగా తెలంగాణ స్ఫూర్తిని గోల్కొండ కోటలో నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం అధికారికంగా 2014 జూన్ 2న ఏర్పాటు కాగా దాన్ని స్మరించుకుంటూ ఈ కార్యక్రమాలు ఏర్పాటయ్యాయి. భారత ప్రభుత్వం ప్రారంభించిన అజాదీ కా అమృత్ మహోత్సవ్ స్వతంత్ర భారతదేశపు 75 ఏళ్ల అద్భుత యాత్రను స్మరించుకుంటూ ఉండగా దేశ వ్యాప్తంగా ఇందుకు సంబందించిన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటిదాకా ఈ ప్రచారద్యమంలో 1.78 లక్షల కార్యక్రమాలు నిర్వహించారు.
pib-162483
97cf4d5586df28e7cfdc5e9e490b94244c01ba4fdb6505c0b5a374f20e1aabae
tel
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కొవిడ్-19 తాజా సమాచారం దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 219.58 కోట్ల డోసులు అందించారు గత 24 గంటల్లో 1,22,555 డోసులు అందించారు దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 20,821 మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.05% ప్రస్తుత రికవరీ రేటు 98.77% గత 24 గంటల్లో 1,892 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,40,97,072 కు పెరిగింది. గత 24 గంటల్లో 1,112 కొత్త కేసులు నమోదయ్యాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 0.77% వారపు పాజిటివిటీ రేటు 1.06% గత 24 గంటల్లో చేసిన 1,44,491 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 90.04 కోట్ల పరీక్షలు చేశారు.
pib-9691
481b5a861591677eed96b33f99a5074bc17aaddd80fa50ba6c366405d520a78d
tel
ప్రధాన మంత్రి కార్యాలయం కాలం చెల్లిపోయిన ఆలోచనా ధోరణుల భిన్నంగా పయనించడం, కొత్త అన్వేషణలు మన స్టార్టప్ ల పెద్ద ప్రత్యేకత : పిఎం శ్రీ మోదీ సాధారణ ధోరణుల నుంచి భిన్నంగా పయనించడం, కొత్త అన్వేషణలు ప్రపంచంలోనే అతి పెద్ద స్టార్టప్ ప్రపంచం పెద్ద ప్రత్యేకత అని ప్రధానమంత్రి అన్నారు. “ప్రారంభ్ : స్టార్టప్ ఇండియా అంతర్జాతీయ శిఖరాగ్రం”లో వీడియో కాన్ఫరెన్సింగ్ లో ఆయన మాట్లాడుతూ కొత్త అన్వేషణల ద్వారా స్టార్టప్ లు కొత్త ధోరణులు, కొత్త టెక్నాలజీలు, కొత్త మార్గాల్లో పయనించారన్నారు. కాలం చెల్లిపోయిన ఆలోచనా ధోరణుల నుంచి వారు పూర్తిగా వేరుపడ్డారని ఆయన చెప్పారు. భిన్న రంగాలకు సంబంధించి విభిన్న ఆలోచనలతో భారీ సంఖ్యలో నవ అన్వేషణలు రావడంతో ప్రతీ ఒక్కరూ సాధారణ బాటకు భిన్నంగా పయనించడంపై దృష్టి సారించవలసి వచ్చిందని ప్రధానమంత్రి అన్నారు. విభిన్న రంగాలను వారు విప్లవాత్మకంగా మార్చారని ఆయన చెప్పారు. సాంప్రదాయిక వాదం కన్నా తాము చేసే పనిపై వ్యామోహమే ఈ వ్యవస్థను ముందుకు నడిపించిన అంశమని తెలిపారు. ఈ రోజు భారత్ నడుస్తున్న బాటలో “నేను చేయగలను” అనే ధోరణే అధికంగా ఉన్నదని శ్రీ మోదీ అన్నారు.
pib-7618
0623c7233b50278a9e8070f5a8a72a7f586f7b747036830220b4b1e41d8b34e5
tel
సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ డీఈపీడబ్ల్యూడీ కింద పనిచేస్తున్న జాతీయ సంస్థలు /సీఆర్ సీల్లో 2023 జనవరి 1 నుంచి దివ్యాంగులకు రిజిస్ట్రేషన్ /డయాగ్నోస్టిక్స్ /ట్రీట్ మెంట్ ఫీజు రద్దు అంగవైకల్యం శాతం తో సంబంధం లేకుండా వైకల్య ధృవపత్రాలు మరియు యుడిఐడి పోర్టల్ లో నమోదు చేసుకున్న వారికి కూడా ఈ ప్రయోజనం విస్తరించబడుతుంది. ప్రభుత్వ నిర్ణయం వల్ల ఇతర ప్రభుత్వ సంస్థలకు యుడిఐడి కార్డును వికలాంగుల ప్రయోజనాలతో అనుసంధానించడానికి మార్గం సుగమం చేస్తుంది... కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ వికలాంగులందరికి జీవన సౌలభ్యం అందించి ఈ రంగంలో విద్య / పునరావాస నిపుణుల నైపుణ్యాలను మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవడానికి వికలాంగుల సాధికారత విభాగం ఏర్పాటు అయ్యింది. అవసరమైన చర్యలు మరియు నిర్ణయాలు అమలు చేస్తున్న డిఇపిడబ్ల్యుడి నిరంతరం లక్ష్య సాధన కోసం కృషి చేస్తోంది. దీనిలో భాగంగా 2023 జనవరి 1 నుంచి డీఈపీడబ్ల్యూడి కింద పనిచేస్తున్న అన్ని జాతీయ సంస్థలు మరియు కాంపోజిట్ రీజినల్ సెంటర్ లలో యుడిఐడి కార్డులు కలిగిన వారందరికీ రిజిస్ట్రేషన్ / డయాగ్నోస్టిక్స్ / చికిత్స ఫీజులు రద్దు చేయడం జరుగుతుంది. అదేవిధంగా వైకల్యం శాతం తో సంబంధం లేకుండా యుడిఐడి పోర్టల్ లో నమోదు చేసుకున్న వారికి 2023 జనవరి 1 నుంచి ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. అంతేకాకుండా, ఎన్ఐలు / సిఆర్సిలలో యుడిఐడి కార్డులు, వైకల్యం సర్టిఫికెట్ కలిగి యుడిఐడి పోర్టల్ లో నమోదు చేసుకున్న వివిధ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు వైకల్యం శాతం తో సంబంధం లేకుండా పూర్తి కోర్సు ఫీజు మాఫీ చేయబడుతుంది. ఇది 2022-23 బ్యాచ్ విద్యార్థులు వర్తిస్తుంది.అంతేకాకుండా, ప్రతి ఎన్ఐ మరియు సిఆర్సిలు యుడిఐడి దరఖాస్తులను దాఖలు చేయడంలో పిడబ్ల్యుడిలకు సహాయపడటానికి ప్రత్యేక కౌంటర్ ను కలిగి ఉండాలని మరియు శని మరియు ఆదివారం కూడా వ్యక్తులందరికీ చికిత్స సౌకర్యాలు అందించాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేసిన మంత్రి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఇతర ప్రభుత్వ సంస్థలకు యుడిఐడి కార్డును వికలాంగుల ప్రయోజనాలతో అనుసంధానించడానికి మార్గం సుగమం చేస్తుందన్నారు.
pib-184265
39380e731b80fe48692dbf93edab1b42087f196421349c4aa681fa485e55a212
tel
వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ శ్రీ పియూష్ గోయల్ మాట్లాడుతూ " స్వచ్ఛమైన వాతావరణం మరియు సమగ్ర, స్ధిరమైన అభివృద్ధి అనేది భారతదేశానికి ప్రాధాన్యత ఎజెండా" అని చెప్పారు. పెద్ద ఆర్థిక వ్యవస్థలలో అత్యల్ప తలసరి సిఓ2 ఉద్గారాలు ఉన్నప్పటికీ సుస్థిర అభివృద్ధి మరియు ఎస్డిజిలపై యూఎన్ 2030 అజెండా పట్ల భారతదేశం తన నిబద్ధతను చూపించింది; స్వచ్ఛమైన ఇంధనం , ఇంధన సామర్థ్యం, అటవీ నిర్మూలన మరియు జీవ వైవిధ్యంపై భారతదేశం చాలా సాహసోపేతమైన చర్యలు తీసుకుంది; పర్యావరణం మరియు సుస్థిరతకు సంబంధించిన చర్యలు వాణిజ్యంతో ముడిపడి ఉండకూడదు రైల్వే, వాణిజ్యం & పరిశ్రమ, వినియోగదారుల వ్యవహారాలు మరియు ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖ మంత్రి శ్రీ పియూష్ గోయల్ ఈ రోజు మాట్లాడుతూ" భారతదేశ తలసరి సిఓ2 ఉద్గారాలు పెద్ద ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే అత్యల్పంగా ఉన్నాయని, అయినప్పటికీ భారతదేశంలో తమ వంతు కృషి చేస్తున్నామని చెప్పారు. మరియు 2030 నాటికి 450 గిగావాట్ల ప్రతిష్టాత్మక పునరుత్పాదక ఇంధన లక్ష్యం ఐక్యరాజ్యసమితి 2030 అజెండా ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ మరియు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ పట్ల మా నిబద్ధతను చూపిస్తుంది. యుఎన్ ట్రేడ్ ఫోరం 2021 లో మాట్లాడుతూ మనమందరం చాలా ఆందోళన చెందుతున్నామనడంలో సందేహం లేదని అన్నారు. మా వాతావరణ లక్ష్యాలను సాధించడానికి కొవిడ్ అనంతర ప్రపంచంలో పునరుద్ధరించిన ఉత్సాహంతో మేము పని చేస్తాము. వాతావరణ న్యాయం పరిరక్షించబడాలని మరియు అభివృద్ధి చెందిన దేశాలు వారి వినియోగ విధానాన్ని పునఃపరిశీలించి స్థిరమైన జీవనశైలిపై దృష్టి పెట్టాలని ఆయన అన్నారు. స్వచ్ఛమైన ఇంధనం, ఇంధన సామర్థ్యం, అటవీ నిర్మూలన మరియు జీవ వైవిధ్యంపై భారత్ చాలా సాహసోపేతమైన చర్యలు తీసుకుందని అందుకే ఎన్డిసిలు 2-డిగ్రీల సెల్సియస్ అనుకూలంగా ఉన్న కొద్ది దేశాలలో భారతదేశం ఉందని మంత్రి అన్నారు. "అంతర్జాతీయ సౌర కూటమి మరియు విపత్తు నిరోధక మౌలిక సదుపాయాల కూటమి వంటి ప్రపంచ కార్యక్రమాలను కూడా మేము ప్రోత్సహించాము" అని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య విధానం మరింత సమగ్ర వృద్ధి కోసం చూడాలని శ్రీగోయల్ అన్నారు. పరిశుభ్రమైన వాతావరణం మరియు సమగ్ర అభివృద్ధి అనేది స్థిరమైనది. ఇది భారతదేశానికి ప్రాధాన్యత ఎజెండా అని ఆయన అన్నారు. పర్యావరణం మరియు సుస్థిరతకు సంబంధించిన చర్యలు వాణిజ్యంతో ముడిపడి ఉండకూడదని భారతదేశం యొక్క దీర్ఘకాల విధానం అని మంత్రి అన్నారు. వాతావరణ మార్పులపై తమ హామీలను నెరవేర్చడానికి ప్రపంచాన్ని ఒకచోట చేర్చడంపై యుఎన్ & యుఎన్ఎఫ్సిసి దృష్టి పెట్టాలని శ్రీ గోయల్ అన్నారు. వాతావరణ మార్పులకు సంబంధించిన అంశాలను యుఎన్ఎఫ్సిసి ఫ్రేమ్వర్క్ మరియు పారిస్ ఒప్పందం కింద చర్చించాల్సిన అవసరం ఉంది. అయితే వాణిజ్య చర్చలలో భాగంగా కాదు. ఈ లక్ష్యాలను సాధించడానికి వాణిజ్య ఒప్పందాలు మొదటి ఉత్తమ ఎంపిక కాదు అని చెప్పారు. శ్రీ గోయల్ పరిశుభ్రమైన వాతావరణం కోసం తీసుకున్న చర్యలను వివరిస్తూ " గత 7 సంవత్సరాలుగా మేము భారతదేశంలో 100% విద్యుత్ కనెక్షన్లు, 100% మరుగుదొడ్లు , 100% ఆర్థిక చేరిక మరియు 100% జనాభాకు వంట గ్యాస్ అందించడంపైదృష్టి సారించాము. 2030 నాటికి భారత రైల్వే క్లిన్ ఎనర్జీతో నడుస్తుందని, ‘నెట్ జీరో’ రైల్వే అవుతుందని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ నిన్న జి 7 దేశాలకు వివరించారని ఆయన అన్నారు. భారతదేశం చలనశీలతను చాలా తీవ్రంగా పరిగణిస్తోందని భవిష్యత్తులో చైతన్య సాధనంగా హైడ్రోజన్ను అభివృద్ధి చేయడంలో ఇతర దేశాలతో కలిసి పనిచేస్తున్నామని చెప్పారు. ఆరోగ్య సంరక్షణపై భారీ పెట్టుబడి భారతదేశ లక్ష్యమని ఇది పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి & మౌలిక సదుపాయాలపై కూడా దృష్టి సారిస్తోందని శ్రీ గోయల్ అన్నారు. టీకాలు మరియు ఔషధాల సమాన లభ్యతను నిర్ధారించడంలో భారతదేశం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు. భారతదేశాన్ని తరచుగా ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్ అని పిలుస్తారు. ప్రపంచానికి టీకాలు వేసే ఈ ప్రయత్నంలో మనకు ఒక ముఖ్యమైన అంశం కావాలనే సామర్థ్యం మరియు ఉద్దేశ్యం ఉందని ఆయన అన్నారు. " ప్రపంచంలోనే అతిపెద్ద ఉచిత ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం ఆయుష్మాన్ భారత్ ఉంది..దీని కింద భారతదేశంలో 500 మిలియన్ల మందికి వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి పౌరుడికి 100% కవరేజీకి విస్తరించబోతున్నాం ”అని ఆయన అన్నారు. ప్రకృతి మనకు ముఖ్యమని దాన్ని రక్షించడం మన సమిష్టి బాధ్యత అని శ్రీ గోయల్ అన్నారు. అయినప్పటికీ అభివృద్ధి చెందిన దేశాల ఎజెండాకు మాత్రమే మేము ప్రాధాన్యత ఇవ్వలేము, కానీ వ్యవసాయ రాయితీలలో అసమానతలు వంటి దీర్ఘకాలంగా ఉన్న సమస్యలను కూడా పరిష్కరించలేము అన్నారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల కోసం భారతదేశం చేస్తున్న ప్రయత్నాల గురించి మాట్లాడుతూ " కొవిడ్ మహమ్మారి సమయంలో 80 కోట్ల మంది భారతీయులకు భారతదేశం ఉచిత ఆహార ధాన్యాన్ని అందించిందని అన్నారు. "మా ప్రజా పంపిణీ కార్యక్రమాల కారణంగా ఆకలితో ఎవరూ చనిపోకుండా చూసుకోవడానికి ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలకు మేము అలాంటి సహాయాన్ని అందించగలుగుతున్నాము." అన్నారు. ప్రపంచంలోని ఆర్థిక నిర్మాణాన్ని నిర్దేశించే ఐఎంఎఫ్ వంటి క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు అభివృద్ధి చెందుతున్న మరియు తక్కువ అభివృద్ధి చెందిన దేశాలపై అన్యాయంగా కఠినంగా వ్యవహరించవని శ్రీ గోయల్ ఆశాభావం వ్యక్తం చేశారు. మరింత కరుణతో, ఉదారంగా మరియు సహాయంగా ఉండవలసిన సమయం ఇది అని ఆయన అన్నారు. పర్యావరణ అనుకూల సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలకు సరసమైన ధరలకు అందుబాటులోకి తెచ్చే కార్యక్రమాలను అన్వేషించాలని మంత్రి ఉద్ఘాటించారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు సరసమైన హరిత సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయడం ద్వారా అభివృద్ధి చెందుతున్న దేశాలు ముందడుగు వేయాలి. మరియు అభివృద్ధి చెందుతున్న దేశాలలో తయారయ్యే స్వచ్ఛమైన /హరిత ఉత్పత్తులకు ప్రధాన మార్కెట్ను కూడా అందించాలని కోరారు.
pib-30857
50a3c8e05fee710c48e33762e043128bb046138d3423e09b1d927fe2a66ad7e1
tel
ప్రధాన మంత్రి కార్యాలయం జి-20 కి భారతదేశం అధ్యక్షత వహిస్తూ ఉండడం పైన తన అభిప్రాయాల నుగురించి మరియు మనిషి ని కేంద్ర స్థానం లో నిలుపుతూ ప్రపంచీకరణ సాగాలన్న జి-20 యొక్క దృష్టికోణం గురించి వెల్లడించిన ప్రధాన మంత్రి జి-20 కి భారతదేశం అధ్యక్షత బాధ్యత ను వహిస్తూ ఉండడాన్ని గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన ఆలోచనల ను వ్యక్తం చేశారు. మనిషి ని కేంద్ర స్థానం లో నిలుపుతూ ప్రపంచీకరణ సాగాలనే విషయం లో జి-20 యొక్క దృష్టికోణం మరియు మానవ ప్రగతి ని ముదుకు తీసుకు పోవడం లో సామూహిక భావన కు పూచీ పడడానికి సంబంధించి సంపాదకీయం పేజీ లో వ్రాసిన ఒక లేఖ లో తన అభిప్రాయాల ను తెలియజేశారు. ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక పోస్ట్ ను పెడుతూ, అందులో - ‘‘దిల్లీ లో జి-20 శిఖర సమ్మేళనం ఆరంభం అవుతుండగా, జి-20 కి భారతదేశం అధ్యక్షత వహిస్తూ ఉన్న పరిణామం పైన, మనిషి ని కేంద్ర స్థానం లో నిలబెడుతూ ప్రపంచీకరణ ను సాధించడం లో మరియు మానవ ప్రగతి ని ముందుకు తీసుకు పోవడం లో సామూహిక భావన కు పూచీపడడానికని మేం ఎటువంటి కార్యాల ను చేశామో వివరిస్తూ నేను సంపాదకీయం పేజీ లో ఓ వ్యాసాన్ని వ్రాశాను.’’ అని పేర్కొన్నారు.
pib-244120
b67ff3fc557b5c32cd2323e0d648e1b6edbbfc4a3d030c41f7da41cda93f9525
tel
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఇఫ్ఫి 53లో అకాడమీ పురస్కారం పోటీ చిత్రం 'బర్త్డే బాయ్' ప్రదర్శన ‘మా సినిమా ఒక జీవిత వేడుక’- అర్టురో మాంటెనెగ్రో, బర్త్డే బాయ్ సినిమా దర్శకుడు కొవ్వొత్తులు, కేక్, కాంతులు, స్నేహితులు... పుట్టిన రోజున ఇవి కాక ఏం ఉంటాయి?, జిమ్మీ తన స్నేహితులతో కలిసి బీచ్ హౌస్లో తన 45వ పుట్టినరోజును జరుపుకున్నాడు. కేక్ కట్ చేసిన తర్వాత ఆత్మహత్యకు ప్లాన్ చేస్తున్నానని అతను చెప్పడంతో ఉత్సాహ వాతావరణం అంతా తలకిందులవుతుంది. ఆర్టురో మోంటెనెగ్రో దర్శకత్వం వహించిన పనామా దేశ థ్రిల్లర్ చిత్రం ది బర్త్డే బాయ్ . గోవాలో జరుగుతున్న 53వ 'ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా' సందర్భంగా నిర్వహించిన ‘టేబుల్ టాక్స్’లో తన సినిమా గురించి ఆర్టురో మాంటెనెగ్రో మాట్లాడారు. ప్రపంచంలో ఆత్మహత్యల శాతం గురించి ప్రస్తావించారు. “స్నేహం గురించి చెప్పే సినిమా బర్త్డే బాయ్. వర్తమానం మాత్రమే మనకు ఉంది, భవిష్యత్తు గురించి చింతించవద్దు ”అని ఆర్టురో ప్రేక్షకులకు చెప్పారు. కథ రచయిత, నిర్మాత ఆండ్రీ జె బారియంటోస్ కూడా టేబుల్ టాక్స్లో పాల్గొన్నారు. “ఈ కథ గురించిన ఆలోచన మహమ్మారి కాలంలో వచ్చింది. మరణం గురించి ఇందులో ఎక్కువగా చెప్పాం" అని వెల్లడించారు. ఈ చిత్ర కథానాయకుడికి అమియోట్రోఫిక్ లాటరల్ స్ల్కెరోసిస్ వ్యాధి ఉంటుంది. "ఏఎల్ఎస్ గురించి గతంలో చెప్పని విషయాలను ఈ చిత్రంలో చూపించాం" అని దర్శకుడు తెలిపారు. ఈ వ్యాధి గురించి మాట్లాడుతూ, “తన భావాలను బయటకు వెల్లడించలేకపోవడం ఉక్కిరిబిక్కిరి చేస్తుంది, నిరుత్సాహపరుస్తుంది” అన్నారు. ఈ సినిమా ఈ ఏడాది అకాడమీ పురస్కారం పోటీదారుగా నిలిచింది. “దేశానికి ప్రాతినిధ్యం వహించడం చాలా అందమైన విషయం. జాతీయ జెండాను మోస్తున్నట్లు అనిపిస్తుంది" అని ఆర్టురో మోంటెనెగ్రో వ్యాఖ్యానించారు. “బర్త్డే బాయ్ ఒక జీవిత వేడుక. ఇది వ్యక్తిగత భావాలకు సంబంధించింది. పుట్టుక, మరణం వంటి వాటి గురించి మాట్లాడుతుంది. ఇది జీవితచక్రాన్ని వివరిస్తుంది” అని దర్శకుడు తెలిపారు.(Visitor Counter : 86
pib-249484
de305d6f1c5ea8e56f4098187a6c36c664038c15e3014d25f1cd914003ffb475
tel
ప్రధాన మంత్రి కార్యాలయం ప్రముఖ విద్యావేత్త బాబా ఇక్బాల్ సింగ్ జీ మృతి పట్ల సంతాపం తెలిపిన ప్రధానమంత్రి. ప్రముఖ విద్యావేత్త ఇక్బాల్ సింగ్ జీ మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా ఒక సందేశం ఇస్తూ, బాబా ఇక్బాల్ సింగ్ జీ మరణం ఎంతో బాధ కలిగించింది. యువతకు విద్యావకాశాలు పెంపొందించడానికి ఆయన చేసిన కృషికి ఎల్లవేళలా గుర్తుండిపోతారు. సామాజిక ఉపాధి కల్పనకు ఆయన నిరంతర కృషి చేశారు. ఈ విషాద సమయంలో నా ఆలోచనలు వారి కుటుంబసభ్యులు, వారి అభిమానుల వెంట ఉంటాయి. వాహేగురు ఆయన ఆత్మను దీవించు గాక. అని పేర్కొన్నారు.
pib-72848
0e527e0bdef3d0e2dea8822c88e9bea2cc65cf4f71ee41c600ee60213aa62d88
tel
ప్రధాన మంత్రి కార్యాలయం స్మార్ట్ ఇండియా హ్యాకథన్ 2020 యొక్క గ్రాండ్ ఫినాలే ను ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాన మంత్రి స్మార్ట్ ఇండియా హ్యాకథన్ 2020 యొక్క గ్రాండ్ ఫినాలే ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆగస్టు 1 వ తేదీ నాడు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించనున్నారు. ఇదే సందర్భం లో విద్యార్థుల తో ఆయన సంభాషిస్తారు కూడా. మన నిత్య జీవనం లో మనం ఎదుర్కొంటున్న పెద్ద సమస్యల లో కొన్ని సమస్యల కు పరిష్కారాల ను కనుగొనడానికి విద్యార్థుల కు ఒక వేదిక ను అందించేటటువంటి, మరి ఆ విధం గా సమస్య ను పరిష్కరించే మనస్తత్వాన్ని, ఇంకా ఉత్పత్తుల ను ఆవిష్కరించే సంస్కృతి ని మనస్సు లో నాటే ఒక దేశవ్యాప్త కార్యక్రమమే స్మార్ట్ ఇండియా హ్యాకథన్. ఇది యువ మస్తిష్కాల లో కొంచెం భిన్నమైన విషయాల ను ఆలోచించడాన్ని ప్రోత్సహించడం లో ఎంతగానో విజయవంతం అయింది. స్మార్ట్ ఇండియా హ్యాకథన్ 2017 ఒకటో సంచిక లో 42000 మందది విద్యార్థులు పాలుపంచుకోగా 2018 వ సంవత్సరం లో ఈ కార్యక్రమం లో పాల్గొన్న వారి సంఖ్య 1 లక్ష కు మరియు 2019 వ సంవత్సరం లో అది కాస్తా 2 లక్షల కు పెరిగిపోయింది. స్మార్ట్ ఇండియా హ్యాకథన్ 2020 యొక్క ఒకటో వృత్తం లో 4.5 లక్షల మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం లో గ్రాండ్ ఫినాలే యొక్క సాఫ్ట్ వేర్ సంచిక ను దేశం అంతటి నుండి పాలుపంచుకొంటున్న వారి ని ప్రత్యేకంగా నిర్మించినటువంటి ఒక ఆధునిక వేదిక ద్వారా కలుపుతూ ఆన్ లైన్ మాధ్యమం లో నిర్వహించడం జరుగుతున్నది. 37 కేంద్ర ప్రభుత్వ విభాగాలు, 17 రాష్ట్ర ప్రభుత్వాలు మరియు 20 పరిశ్రమలు ఇచ్చిన 243 సమస్యాత్మక నివేదనల కు పరిష్కారాలను కనుగొనడం కోసం 10,000 మంది కి పైగా విద్యార్థులు పోటీపడనున్నారు.
pib-84508
acf2b6784bb84d56866a51cacfadcfbbf06d744578dca581716e8dfc145c6800
tel
రక్షణ మంత్రిత్వ శాఖ అంతర్గత , బాహ్య భద్రత మధ్య అంతరం తగ్గించడానికి, సైబర్-దాడులు, సమాచార యుద్ధం వంటి ఉద్భవిస్తున్న బెదిరింపులను ఎదుర్కోవటానికి స్థిరమైన అంతర్జాతీయ ప్రయత్నాలు అవసరం: న్యూఢిల్లీలో 60 వ నేషనల్ డిఫెన్స్ కాలేజ్ కోర్సు గ్రాడ్యుయేట్ అధికారులతో రక్షణ మంత్రి అందరికీ ప్రయోజనకరమైన ప్రపంచ వ్యవస్థ కోసం సున్నా-మొత్తం ఆటగా గాకుండా జాతీయ భద్రతను నిజమైన సమిష్టి చర్య గా పరిగణించాలని పిలుపు: భారతదేశం బహుళ-సమలేఖన విధానాన్ని విశ్వసిస్తుంది, కొంతమందిని ఇతరుల కంటే ఉన్నతంగా భావించే ప్రపంచ క్రమాన్ని కాకుండా భారతదేశం బహుళ-సమలేఖన విధానాన్ని విశ్వసిస్తుంది: శ్రీ రాజ్ నాథ్ సింగ్ రక్షణ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్ సైబర్ దాడులు , సమాచార యుద్ధం వంటి "తీవ్రమైన" భద్రతా బెదిరింపులను ఎదుర్కోవడానికి అంతర్జాతీయ సమాజం సమిష్టి గా కృషి చేయాలని రక్షణ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. 2022 నవంబర్ 10న న్యూఢిల్లీలో జరిగిన 60వ నేషనల్ డిఫెన్స్ కాలేజ్ కోర్సు స్నాతకోత్సవంలో భారత సాయుధ దళాలు, సివిల్ సర్వీసెస్, మిత్ర దేశాల నుంచి వచ్చిన అధికారులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం జాతీయ భద్రత ను ప్రధానమైన కేంద్ర బిందువుగా పరిగణిస్తోందని ఆయన అభివర్ణించారు. దేశ ప్రయోజనాలను సంరక్షించినప్పుడు మాత్రమే దేశం యొక్క పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకోవచ్చని ఆయన ఉద్ఘాటించారు. నాగరికత సుసంపన్నం, సౌభాగ్యవంతం కావడానికి భద్రత అనేది సైన్-క్వా-నాన్ అని ఆయన అన్నారు. ఆంతరంగిక, బాహ్య భద్రతల మధ్య ఉన్న అంతరాన్ని గురించి శ్రీ రాజ్ నాథ్ సింగ్ ప్రస్తావిస్తూ, మారుతున్న కాలానికి అనుగుణంగా బెదిరింపుల కొత్త కోణాలు జోడించబడుతున్నాయని, వాటిని వర్గీకరించడం కష్టమని అన్నారు. సాధారణంగా అంతర్గత భద్రతలోకి వచ్చే ఉగ్రవాదాన్ని ఇప్పుడు బాహ్య భద్రత కేటగిరీలో వర్గీకరిస్తున్నామని, అలాంటి సంస్థలకు శిక్షణ, నిధులు, ఆయుధాల మద్దతు దేశం వెలుపల నుంచి లభిస్తున్నాయని ఆయన అన్నారు. సైబర్ దాడులకు కీలకమైన మౌలిక సదుపాయాల దుర్బలత్వాన్ని పెద్ద ఆందోళనగా పేర్కొంటూ, ఇంధనం,, రవాణా, ప్రభుత్వ రంగ సేవలు, టెలికమ్యూనికేషన్స్, కీలకమైన తయారీ పరిశ్రమలు, పరస్పర అనుసంధానిత ఆర్థిక వ్యవస్థలు వంటి రంగాలు ఇటువంటి బెదిరింపులకు గురయ్యే అవకాశం ఉందని రక్షణ మంత్రి అన్నారు. సమాచార యుద్ధం ఒక దేశ రాజకీయ స్థిరత్వాన్ని బెదిరించే సామర్థ్యాన్ని కలిగి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. సామాజిక మాధ్యమాలు , ఇతర ఆన్ లైన్ కంటెంట్ జనరేషన్ ప్లాట్ ఫారమ్ ల వ్యవస్థీకృత ఉపయోగం వల్ల ప్రజల అభిప్రాయం , దృక్పథాన్ని ఏర్పరుస్తుందని ఆయన సూచించారు. రష్యా , ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణలో సమాచార యుద్ధం మోహరింపు చాలా స్పష్టంగా కనిపించింది. సంఘర్షణ అంతటా, యుద్ధం గురించి పోటీ కథనాలను వ్యాప్తి చేయడానికి , సంఘర్షణను వారి స్వంత వూహలపై చిత్రీకరించడానికి సోషల్ మీడియా రెండు వైపులా యుద్ధభూమిగా పనిచేసింది. కథనాలను రూపొందించడానికి వ్యూహరచనకు సాధనంగా ప్రచార ప్రచారాలు యుద్ధ సమయంలో కొత్తవి కావు, కానీ ప్రాథమిక పంపిణీ ఛానల్ గా సోషల్ మీడియా వైపు మారడం వల్ల దాని వ్యాప్తి గణనీయంగా పెరిగింది" అని శ్రీ రాజ్ నాథ్ సింగ్ అన్నారు. యుద్ధ సమయంలో కథనాలను రూపొందించడానికి వ్యూహాత్మకంగా ప్రచారం చేయడం కొత్తేమీ కాదు, అయితే ప్రాథమిక పంపిణీ ఛానెల్గా సోషల్ మీడియా వైపు మళ్లడం వల్ల దాని పరిధి వేగంగా పెరిగింది” అని శ్రీ రాజ్నాథ్ సింగ్ అన్నారు. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ను ఉటంకిస్తూ, రక్షణ మంత్రి "ఎక్కడైనా అన్యాయం ప్రతిచోటా న్యాయానికి ముప్పుగా ఉంటుంది" అని పేర్కొన్నారు. ఏ ప్రాంతంలోనైనా శాంతి, భద్రతలకు ముప్పు వాటిల్లినప్పుడు, ప్రపంచం మొత్తం దాని ప్రభావాన్ని అనేక విధాలుగా అనుభూతి చెందుతుందని ఆయన ఉద్ఘాటించారు. "ఇటీవలి ఉక్రేనియన్ సంఘర్షణ దాని అలల ప్రభావాలు మొత్తం ప్రపంచాన్ని ఎలా ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయో చూపించింది. రష్యా, ఉక్రెయిన్ కలిసి ప్రపంచంలోని గోధుమలు , బార్లీలలో మూడింట ఒక వంతు ఎగుమతి చేస్తాయి, కాని ఈ సంఘర్షణ ధాన్యాన్ని 'ప్రపంచ బ్రెడ్ బాస్కెట్' ను విడిచిపెట్టకుండా నిరోధించింది . ఇంకా వివిధ ఆఫ్రికా, ఆసియా దేశాలలో ఆహార సంక్షోభానికి దారితీసింది. ఈ సంఘర్షణ ప్రపంచంలో ఇంధన సంక్షోభానికి కూడా ఆజ్యం పోసింది. ఐరోపాలో, చమురు , గ్యాస్ సరఫరా క్షీణిస్తోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం అంతర్జాతీయ ఇంధన సరఫరాకు అంతరాయం కలిగించడంతో భారతదేశం కూడా ప్రభావితమైందని, ఇంధన దిగుమతి మరింత ఖరీదైనదిగా మారిందని ఆయన అన్నారు. భద్రతను ఒక నిజమైన సమిష్టి సంస్థగా పరిగణించాల్సిన అవసరాన్ని శ్రీ రాజ్ నాథ్ సింగ్ నొక్కిచెప్పారు, ఇది అందరికీ ప్రయోజనకరమైన ప్రపంచ క్రమాన్ని సృష్టించగలదు. 'జాతీయ భద్రతను సున్నా మొత్తం ఆటగా పరిగణించకూడదు. అందరికీ గెలుపు పరిస్థితిని సృష్టించడానికి మనం కృషి చేయాలి. సంకుచిత స్వప్రయోజనాల ద్వారా మన౦ నడిపి౦చబడకూడదు, అది దీర్ఘకాల౦లో ప్రయోజనకర౦గా ఉ౦డదు. మన స్వప్రయోజనాల ద్వారా మార్గనిర్దేశం చేయాలి, ఇది స్థిరమైనదిగా, ఆకస్మిక ఉపద్రవాలకు స్థితిస్థాపకంగా ఉంటుంది" అని ఆయన అన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వంటి అనేక బహుళ పక్ష సంస్థలు భద్రతా రంగంలో పనిచేస్తున్నందున ప్రయోజనాలు, భద్రత ను అందరికీ అందే స్థాయికి పెంచాల్సిన అవసరం ఉందని రక్షణ మంత్రి అన్నారు. కోవిడ్ -19 మహమ్మారికి ప్రపంచవ్యాప్త స్పందనను ప్రస్తావిస్తూ, సమాచార భాగస్వామ్యం, సందర్భోచిత విశ్లేషణ, అలాగే వ్యాక్సిన్ పరిశోధన, అభివృద్ధి ఉత్పత్తిలో బహుళ-జాతీయ సహకారం అత్యవసర ఆవశ్యకతను ఇది చాటి చెప్పిందని రక్షణ మంత్రి తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ భద్రతకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడం కోసం దేశం లోపల, దేశాల మధ్య సంస్థలు, సంఘాల మధ్య మరింత అవగాహన , అనుసంధానం, సమిష్టి చొరవలు ఎంతైనా అవసరం అని ఆయన వివరించారు. బహుళ-సమలేఖన విధానం పట్ల భారతదేశ నమ్మకాన్ని ఉద్ఘాటిస్తూ, బహుళ వాటాదారులతో విభిన్న నిమగ్నతల ద్వారా ఇది సాకారం చేయబడిందని, తద్వారా సంపన్నమైన భవిష్యత్తు కోసం అందరి ఆందోళనలను పరిష్కరించవచ్చునని, ఇది భాగస్వామ్య బాధ్యత, శ్రేయస్సుకు దారితీసే ఏకైక మార్గం ఇది అని శ్రీ రాజ్ నాథ్ సింగ్ అభివర్ణించారు. "బలమైన , సంపన్నమైన భారతదేశం ఇతరుల ఖర్చుతో నిర్మించ బడలేదు. బదులుగా, ఇతర దేశాలు తమ పూర్తి సామర్థ్యాన్ని గ్రహించడానికి సహాయ పడేందుకే సిద్ధంగా ఉంటుంది. కొంతమందిని ఇతరుల కంటే అధికులని భావించే ప్రపంచ వ్యవస్థను భారతదేశం విశ్వసించదు. మన చర్యలు మానవ సమానత్వం , గౌరవం యొక్క సారం ద్వారా మార్గనిర్దేశం చేయబడతాయి, ఇది దాని బలమైన ప్రాచీన విలువలు, నైతిక పునాదులలో ఒక భాగం. అనైతికంగా లేదా నీతి లేకుండా రియల్ పోలిటిక్ అంజూరపు ఆకు కాదు. బదులుగా, అన్ని నాగరిక దేశాల యొక్క చట్టబద్ధమైన వ్యూహాత్మక ఆవశ్యకత పట్ల అవగాహన మరియు గౌరవంపై అంచనా వేయబడిన వ్యూహాత్మక నైతికత యొక్క చట్రంలో దేశాల యొక్క జ్ఞానోదయ స్వీయ-ఆసక్తిని ప్రోత్సహించవచ్చు.అనైతిక౦గా లేదా నైతిక౦గా ఉ౦డడానికి రియల్ పాలిటిక్స్ అ౦జీరపు ఆకు కాజాలదు. బదులుగా, దేశాల తెలివైన స్వప్రయోజనాలను వ్యూహాత్మక నైతికత చట్రంలో ప్రోత్సహించవచ్చు, ఇది నాగరిక దేశాల చట్టబద్ధమైన వ్యూహాత్మక అనివార్యతను అర్థం చేసుకోవడం గౌరవించడంపై ఆధారపడి ఉంటుంది. ఈ కారణంగానే మనం ఏ దేశాన్నైనా భాగస్వామ్యం చేసినప్పుడు అది సార్వభౌమాధికార సమానత్వం, పరస్పర గౌరవం ఆధారంగా ఉంటుంది. పరస్పర ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్నందున, సంబంధాలను ఏర్పరచుకోవడం భారతదేశానికి సహజంగానే వస్తుంది" అని రక్షణ మంత్రి అన్నారు. ఈ కోర్సును పూర్తి చేసినందుకు విదేశాలకు చెందిన అధికారులను అభినందించిన శ్రీ రాజ్ నాథ్ సింగ్, వారిని భారతదేశానికి, ప్రపంచానికి మధ్య వారధిగా అభివర్ణించారు. ప్రపంచ భద్రత , సంవృద్ధిని పెంపొందించడానికి ఈ కోర్సు మార్గాన్ని సుగమం చేస్తుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ కోర్సును పూర్తి చేసిన అధికారులు భవిష్యత్తులో ఎదురయ్యే అన్ని సవాళ్లను ఎదుర్కోవడమే కాకుండా, జాతీయ భద్రతలోని ఇతర భాగస్వాములతో కలిసి జాతీయ శక్తిలోని అన్ని అంశాలను సమన్వయం చేసుకోగలుగుతారని ఆయన అన్నారు. స్వదేశీ వ్యూహాత్మక ఆలోచనను పెంపొందించడంలో భారతదేశం నుండి మాత్రమే కాకుండా విదేశాల నుండి కూడా వ్యూహాత్మక నాయకులు, ఆలోచనాపరులు , అభ్యాసకుల తరాలను తీర్చిదిద్దడంలో ఎన్ డి సి కీలకపాత్ర పోషిస్తోందని రక్షణ మంత్రి ప్రశంసించారు. ప్రపంచ భద్రతా పరిధి లో జరిగిన పరిణామాలకు అనుగుణంగా ఉండడానికి ఎన్ డి సి నిర్విరామంగా చేస్తున్న ప్రయత్నాలను ఆయన అభినందించారు. స్నాతకోత్సవం సందర్భంగా 60వ ఎన్డీసీ కోర్సు నుంచి 80 మంది అధికారులకు మద్రాస్ విశ్వవిద్యాలయం నుంచి ప్రతిష్టాత్మక ఎంఫిల్ డిగ్రీని శ్రీ రాజ్ నాథ్ సింగ్ ప్రదానం చేశారు. పట్టభద్రులైన అధికారులకు పార్చ్ మెంట్ లను బహూకరించారు. ఎన్ డి సి ఫ్లాగ్ షిప్ 'నేషనల్ సెక్యూరిటీ అండ్ స్ట్రాటజీ' కోర్సు, సమగ్ర బోధనా నమూనాను ఉపయోగించి, 47 వారాల వ్యవధిలో నిర్వహిస్తారు. మద్రాసు విశ్వవిద్యాలయం నుండి ఎంఫిల్ పట్టాను ప్రదానం చేయడం కోర్సు సమయంలో వలంటీర్ అధికారులకు ఏకకాలంలో నడుస్తున్న కార్యక్రమం. కమాండెంట్ ఎన్డిసి, లెఫ్టినెంట్ జనరల్ ఎంకె మాగో తన ప్రసంగంలో, 60 వ ఎన్డిసి కోర్సు అధికారులు విధాన రూపకల్పన, అమలు రెండింటిలోనూ వ్యూహాత్మక స్థాయిలో జాతీయ సమస్యలపై ట్రాన్స్ డిసిప్లినరీ , అవుట్-ఆఫ్-బాక్స్ విధానాన్ని వర్తింపజేయగలరని పేర్కొన్నారు. ఎన్ డిసి శక్తివంతమైన అకడమిక్ వాతావరణాన్ని ఆయన వివరించారు. ఇది దాని బాధ్యతను నెరవేర్చడంతో పాటు, డిఫెన్స్ స్టడీస్ లో పిహెచ్ డిలు/ ఒరిజినల్ రీసెర్చ్ ను అభ్యసించడానికి అనేక మంది కోర్సు అభ్యాసకులకు ప్రేరేపించింది. ఈ కార్యక్రమానికి రక్షణ కార్యదర్శి శ్రీ గిరిధర్ అరమనే, మద్రాస్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఎస్ గౌరి, ఇతర ప్ర త్యేక అతిథులు హాజరయ్యారు. 1960లో ఎన్.డి.సి స్థాపించబడింది. దేశంలో వ్యూహాత్మక అభ్యసనకు అత్యున్నత పాఠశాలగా పరిగణించబడే ఇది, రక్షణ మంత్రిత్వ శాఖ కింద ఒక ప్రీమియర్ ఇంటర్-సర్వీసెస్ విద్యా సంస్థ, ఇది భారత సాయుధ దళాలు, సివిల్ సర్వీసెస్ అదేవిధంగా మిత్ర దేశాల సీనియర్ అధికారులకు శిక్షణ, రాణింపునకు బాధ్యత వహిస్తుంది.
pib-182013
77ff5870160e1dae97a7b54a00c493a3b473de6210ff669e5e591214cf2120d3
tel
PIB Headquarters కోవిడ్-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం (కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా పీఐబీ వాస్తవాలను తనిఖీచేసిన అంశాలు ఇందులో లభ్యమవుతాయి) - గత 24 గంటల్లో వ్యాధి నయమైనవారు 79,000కు పైగానే; 78 శాతం దాటిన కోలుకునేవారి సగటు. - మొత్తం క్రియాశీల కోవిడ్ కేసులలో 60 శాతం 5 తీవ్ర ప్రభావిత రాష్ట్రాల్లోనే; - బీహార్లోని దర్భంగాలో ‘ఎయిమ్స్’ ఏర్పాటుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం. - కోవిడ్-19పై దృష్టాంత ఆధారిత విధానాన్ని అనుసరిస్తున్న భారత్. - కోవిడ్-19 బాధితుల మానసిక ఆరోగ్యానికి మద్దతుగా అనేక వినూత్న చర్యలు చేపట్టిన కేంద్ర ప్రభుత్వం. - పీఎంజీకేపీ బీమా పథకం లెక్కల ప్రకారం... దేశంలో కోవిడ్-19 మహమ్మారివల్ల 155 మంది ఆరోగ్య సిబ్బంది మృతి భారత్లో భారీగా కోలుకుంటున్న కోవిడ్ బాధితులు; గత 24 గంటల్లో వ్యాధి నయమైనవారు 79,000కుపైగానే; 78 శాతం దాటిన కోలుకునేవారి సగటు; చికిత్స పొందేవారిలో 60 శాతం 5 రాష్ట్రాల్లోనే నమోదు దేశంలో రోజువారీగా వ్యాధి నయమయ్యేవారి సంఖ్య నానాటికీ భారీగా పెరుగుతోంది. ఆ మేరకు కోలుకునేవారి జాతీయ సగటు కూడా వేగంగా పెరుగుతూ ఇవాళ 78.28 శాతానికి దూసుకెళ్లింది. తదనుగుణంగా గత 24 గంటల్లో 79,292 మందికిపైగా ఆస్పత్రుల నుంచి ఇళ్లకు వెళ్లారు. దీంతో ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 38,59,399గా నమోదైంది. చికిత్స పొందే కేసులకన్నా కోలుకున్న కేసుల సంఖ్య నేడు 28 లక్షలు దాటింది. ఆ మేరకు ప్రస్తుతం వైద్య పర్యవేక్షణలోగల రోగుల సంఖ్య 9,90,061గా ఉంది. ఇక ఆస్పత్రులలో ఉన్నవారిలో దాదాపు సగం మంది కేవలం 3 రాష్టాల్లోనే... మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లలో ఉన్నారు. మరో పావు భాగం ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఛత్తీస్గఢ్, ఒడిషా, కేరళ, తెలంగాణలలో ఉన్నారు. మొత్తంమీద... చికిత్స పొందే కేసులలో 60.35 శాతం వాటా మహారాష్ట్ర. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలదే కాగా, కోలుకున్నకేసులపరంగానూ 60 శాతం దాకా ఈ రాష్ట్రాల్లోనే నమోదైంది. మరోవైపు గత 24 గంటల్లో 1,054 మంది మరణించగా, దాదాపు 69 శాతం మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీల్లో సంభవించాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ నమోదైన మరణాల్లో ఒక్క మహారాష్ట్రలోనే 37 శాతం సంభవించగా, గత 24 గంటల్లో 34.44 శాతం నమోదయ్యాయి. మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1654409 ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో తగినంత ఆక్సిజన్ లభ్యత దిశగా 29 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలతో ఆరోగ్య, పరిశ్రమలు-అంతర్గత వాణిజ్య, ఔషధ శాఖల కార్యదర్శుల చర్చ కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రిత్వశాఖ కార్యదర్శి నిన్న దేశంలోని 29 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలతో కేంద్ర పరిశ్రమలు-అంతర్గత వాణిజ్య, ఔషధ, జౌళి శాఖల కార్యదర్శులు ఆన్లైన్ మాధ్యమంద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఆయా రాష్ట్రాల్లోగల అన్ని ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో కోవిడ్ రోగుల కోసం తగినంత ఆక్సిజన్ లభ్యతకు భరోసా కల్పించడం లక్ష్యంగా ఈ సమావేశం నిర్వహించారు. ఆ మేరకు అన్ని రాష్ట్రాలూ తమతమ పరిధిలోనేగాక, ఇతర రాష్ట్రాలకు ఆక్సిజన్ రవాణాపై ఎలాంటి ఇబ్బందులూ రాకుండా చూడాలని ఉన్నతాధికారులకు సూచించారు. మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1654399 ‘నమామి గంగే, అమృత్’ పథకాల్లో భాగంగా బీహార్లో వివిధ పథకాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ‘నమామి గంగే, అమృత్’ పథకాలకింద బీహార్లో వివిధ కొత్త పథకాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా పాట్నా నగరంలోని బ్యూర్, కరం-లీచక్ ప్రాంతాల్లో మురుగుశుద్ధి ప్లాంట్లకు ఆయన శ్రీకారం చుట్టారు. వీటితోపాటు ‘అమృత్’ యోజన కింద సివాన్, ఛాప్రాల్లో మంచినీటి ప్రాజెక్టులకు కూడా ప్రారంభోత్సవం చేశారు. ఇవేకాకుండా ‘నమామి గంగే’ యోజన కింద ముంగేర్, జమాల్పూర్ మంచినీటి పథకాలకు, ముజఫర్పూర్లో నదీతీర అభివృద్ధి పథకానికి ఆయన శంకుస్థాపన చేశారు. కరోనా మహమ్మారి సమయంలోనూ బీహార్లో అనేక అభివృద్ధి పథకాల పనులు నిరంతరాయంగా కొనసాగాయని ఈ సందర్భంగా ప్రధానమంత్రి గుర్తుచేశారు. ఇక ‘ఇంజనీర్ల దినోత్సవం’ సందర్భంగా దేశ ప్రగతిలో ఇంజనీర్లు పోషిస్తున్న పాత్ర ఎంతో కీలకమైనదని ప్రశంసించారు. భారత ముద్దుబిడ్డ, ఇంజనీర్లకు ఆదర్శప్రాయుడైన సివిల్ ఇంజనీర్ ‘సర్ ఎం.విశ్వేశ్వరాయ’ను స్మరించుకుంటూ ఏటా సెప్టెంబరు 15న ఇంజనీర్ల దినోత్సవం నిర్వహిస్తారు. మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1654521 బీహార్లో వివిధ పథకాల ప్రారంభం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగ పాఠం మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1654432 బీహార్లోని దర్భంగాలో అఖిలభారత వైద్యవిజ్ఞాన శాస్త్రాల సంస్థ ఏర్పాటుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం బీహార్లోని దర్భంగాలో అఖిల భారత వైద్య విజ్ఞాన శాస్త్రాల సంస్థ ఏర్పాటుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్షా యోజన కింద దీన్ని ఏర్పాటు చేస్తారు. ఈ ఎయిమ్స్ నిర్మాణానికి రూ.1264 కోట్లు ఖర్చు కానుండగా, దీన్ని కేంద్ర ప్రభుత్వ ఆమోదం లభించిన 48 నెలల్లోగా పూర్తి చేయాల్సి ఉంది. ఈ వైద్య విజ్ఞాన సంస్థలో 100 అండర్ గ్రాడ్యుయేట్ సీట్లు, 60 బీఎస్సీ నర్సింగ్ సీట్లు, 15 నుంచి 20 సూపర్ స్పెషాలిటీ విభాగాలు ఉంటాయి. ప్రస్తుతం పనిచేస్తున్న ఎయిమ్స్ గణాంకాల ప్రకారం... ప్రతి కొత్త ఎయిమ్స్ రోజుకు సుమారు 2000 మంది ఓపీడీ రోగుల అవసరాలను, నెలకు 1000 మంది ఐపీడీ రోగుల అవసరాలను తీర్చగలదని భావిస్తున్నారు. మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1654602 కోవిడ్-19 మృతుల్లో ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు అంటువ్యాధుల వ్యాప్తి నిరోధం-నియంత్రణ విధానాలపై మార్గదర్శకాలను జారీచేసింది. కాగా, 2020 మార్చిలో అన్ని రాష్ట్రాలకు శిక్షణ ఇవ్వబడింది. అలాగే ఐగాట్ వేదిక పరిధిలోని అన్ని విభాగాల ఆరోగ్య కార్యకర్తలకూ సంబంధిత శిక్షణ కూడా అందుబాటులో ఉంచబడింది. కోవిడ్, కోవిడేతర ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో పనిచేసే ఆరోగ్య సంరక్షణ కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ 2020 జూన్ 18న ఒక సలహాపత్రం జారీ చేసింది. మరోవైపు ఆస్పత్రి, సామాజిక పరిస్థితుల్లో పీపీఈల హేతుబద్ధ వినియోగంపై 24.03.2020న మార్గదర్శకాలను కూడా కేంద్రం జారీ చేసింది. మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1654564 కోవిడ్-19పై పోరాటంలో వ్యూహాత్మక విధానం కోవిడ్-19పై పోరాటంలో భాగంగా దృష్టాంత ఆధారిత విధానాన్ని భారత్ అనుసరించనుంది. ఈ పద్ధతిలో భాగంగా దేశంలో ప్రయాణ సంబంధిత కేసులు కోవిడ్-19 స్థానిక సంక్రమణ నియంత్రణకు వీలైన భారీ కేసుల భారత కోవిడ్-19 విస్తృత సామాజిక వ్యాప్తి భారత్కు కోవిడ్-19 స్థానికంగా మారడం వంటి నేపథ్యాలను పరిగణనలోకి తీసుకోనుంది. ప్రస్తుతం అనేక ప్రాంతాల్లో భారీగా కేసులు నమోదవుతున్నా వాటి నియంత్రణలో ఇబ్బందులు లేవు. అందువల్ల కేంద్ర ప్రభుత్వం నియంత్రణ విధానాన్ని అనుసరిస్తోంది. ఆ మేరకు దేశంలో కోవిడ్-19 వేగంగా వ్యాపించకుండా అదుపు చేయగలిగింది. అందువల్లనే ప్రతి 10 లక్షల జనాభాకు కేసుల సంఖ్య 3,328 కాగా- మరణాల సంఖ్య 55కు మాత్రమే పరిమితమైంది. ఇది ప్రపంచంలోనే అత్యల్పం కావడం గమనార్హం. కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ సహాయ మంత్రి శ్రీ అశ్వనీకుమార్ చౌబే ఈ మేరకు రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1654579 కోవిడ్-19 బాధితుల కోసం కొత్త ఆరోగ్య సంరక్షణ పథకం కోవిడ్-19తో పోరాటంలో ముందువరుసలోగల ఆరోగ్య కార్యకర్తల కోసం కేంద్ర ప్రభుత్వం ‘ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజి’ కింద వనరులు కేటాయించింది. ఈ మేరకు వ్యాధిగ్రస్థులతో ప్రత్యక్షంగా మసలుతూ వ్యాధి సంక్రమణకు గురయ్యే అవకాశం మెండుగా ఉన్న సామాజిక ఆరోగ్య కార్యకర్తలకు రూ.50 లక్షల బీమా సదుపాయం కల్పించింది. ఇప్పటికే కోవిడ్-19వల్ల మరణించిన ఆరోగ్య కార్యకర్తలకూ ఈ బీమా వర్తిస్తుంది. అలాగే ప్రైవేటు ఆస్పత్రుల సిబ్బంది/రిటైరైనవారు/స్వచ్ఛంద కార్యకర్తలు/స్థానిక పురపాలక కార్మికులు/కాంట్రాక్టు కార్మికులు/రోజు కూలీలు/తాత్కాలిక/రాష్ట్రాల్లో అవుట్ సోర్సింగ్ సిబ్బంది/కేంద్ర ఆసుపత్రులు/స్వయం ప్రతిపత్తిగల కేంద్ర ఆసుపత్రులు/రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలు, ఎయిమ్స్, ఐఎన్ఐలు/కేంద్ర మంత్రిత్వ శాఖల ఆస్పత్రులను కోవిడ్-19 సంబంధిత బాధ్యతలకు అనుమతించారు. ఈ మేరకు రాజ్యసభలో కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్వనీ కుమార్ చౌబే రాతపూర్వక సమాధానమిచ్చారు. మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1654504 కోవిడ్-19 బాధితుల మానసిక ఆరోగ్యానికి మద్దతుగా అనేక వినూత్న చర్యలు చేపట్టిన కేంద్ర ప్రభుత్వం కోవిడ్-19 పిల్లలుసహా ప్రజల మానసిక ఆరోగ్యంపై చూపే ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని మానసికంగా మద్దతునిచ్చేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా బాధితులందరికీ మానసిక ఆరోగ్య నిపుణులతో సలహాలిచ్చేందుకు 24 గంటల సహాయ కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ మేరకు మానసిక సమస్యలున్నవారిని పిల్లలు, పెద్దలు, మహిళలు, ఆరోగ్య కార్యకర్తలు తదితర వర్గాలుగా విభజించింది. ఈ చర్యలకు సంబంధించిన అనేక అంశాల గురించి రాజ్యసభలో కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్వనీ కుమార్ చౌబే ఇవాళ రాతపూర్వక సమాధానమిచ్చారు. మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1654627 భారతీయ వైద్య విధానం, హోమియో వైద్యవిద్యలో విప్లవాత్మక పునరుజ్జీవం ఆయుష్ మంత్రిత్వ శాఖకు సంబంధించిన రెండు ముఖ్యమైన బిల్లులను పార్లమెంటు ఆమోదించింది. దీంతో భారతీయ వైద్య విధానం, హోమియో వైద్య విద్యలో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చేందుకు దేశం సన్నద్ధమవుతోంది. ‘భారతీయ వైద్య విధానం జాతీయ కమిషన్ బిల్లు-2020, హోమియోపతి జాతీయ కమిషన్ బిల్లు-2020’లను లోక్సభలో సెప్టెంబర్ 14న ఆమోదించారు. ప్రస్తుత ‘ఇండియన్ మెడిసిన్ సెంట్రల్ కౌన్సిల్ యాక్ట్-1970, హోమియోపతి సెంట్రల్ కౌన్సిల్ యాక్ట్-1973’ స్థానంలో ఈ జంట బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కాగా, ఈ బిల్లులకు పార్లమెంటు ఆమోదం పొందడం ఆయుష్ శాఖ చరిత్రలోనే ఒక మైలురాయి. మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1654416 కోవిడ్-19 నుంచి కోలుకోవడంలో రోగులకు యోగా సాయం కోవిడ్-19 బాధితులు వేగంగా కోలుకోవటంలో యోగా ఏ మేరకు తోడ్పడుతున్నదో పరిశోధించడం కోసం ఢిల్లీలోని రాజివ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, ఎయిమ్స్, ఎయిమ్స్ రిషీకేశ్, ఆర్ఎంఎల్ ఆస్పత్రుల సహకారంతో కేంద్ర యోగా-నేచురోపతి పరిశోధన మండలి ఒక ప్రాజెక్ట్ చేపట్టింది. కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఇవాళ రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంద్వారా వెల్లడించారు. మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1654526 దేశంలో కోవిడ్-19 వ్యాప్తిపై ముందస్తు సంకేతాలు చైనాలోని వుహాన్ పట్టణంలో నిమోనియా లక్షణాల వ్యాప్తి పరిణామాల గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత్ను 2020 జనవరి 6న హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య- కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ చైనాలో పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తూ వచ్చింది. ఇందులో భాగంగా కేంద్ర ఆరోగ్యసేవల విభాగం డైరెక్టర్ జనరల్ నేతృత్వంలో ఏర్పాటైన సంయుక్త పర్యవేక్షక బృందం 2020 జనవరి 8న సమావేశమైంది. ఈ సందర్భంగా చైనాలో పరిస్థితులతోపాటు స్వదేశంలో ప్రజారోగ్య వ్యవస్థ సంసిద్ధతపైనా, వ్యాధి వ్యాప్తి నిరోధంపైనా అనుసరించాల్సిన వివిధ వ్యూహాలపై చర్చించింది. తదనుగుణంగా దేశవ్యాప్త దిగ్బంధం విధింపునకు ముందే పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనడానికి సముచిత చర్యలు తీసుకుంది. ఈ అంశాలకు సంబంధించి కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్వినీకుమార్ చౌబే ఇవాళ రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన సందర్భంగా వివరాలు వెల్లడించారు. మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1654576 భారతదేశంలో కోవిడ్ టీకా అభివృద్ధి ప్రగతిపై సమాచారం దేశంలో కోవిడ్కు సమర్థ, సురక్షిత టీకా రూపకల్పనకు ప్రభుత్వం, వివిధ పరిశోధన సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీకా ఎప్పుడు అందుబాటులోకి వస్తుందన్నది కచ్చితంగా వెల్లడించడం కష్టసాధ్యం. అయితే, ప్రభుత్వం తనవంతు ప్రయత్నాల్లో భాగంగా ఉన్నతస్థాయి జాతీయ నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసి, పర్యవేక్షణ బాధ్యతను అప్పగించింది. తదనుగుణంగా టీకా అభివృద్ధికి సంబంధించిన వివిధ దశలను ఈ బృందం పర్యవేక్షిస్తూ సమస్యల పరిష్కారానికి తోడ్పడుతోంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే ఇవాళ రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంద్వారా వెల్లడించారు. మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1654736 ప్రైవేటు ఆస్పత్రులలో అధిక రుసుముల వసూలుపై నియంత్రణ కోవిడ్-19 ప్రభావం నిరోధం, నియంత్రణ, ఉపశమనం దిశగా ప్రభుత్వం అనేక వరుస చర్యలు తీసుకుంది. ఆ మేరకు ‘పూర్తిస్థాయి ప్రభుత్వం’, ‘సంపూర్ణ సమాజం’ విధానాన్ని ప్రధానంగా అనుసరించింది. గౌరవనీయ ప్రధానమంత్రి, ఉన్నతస్థాయి మంత్రుల బృందం, మంత్రిమండలి కార్యదర్శి, ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖలోని కార్యదర్శులు-సీనియర్ అధికారుల కమిటీలు ప్రజారోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ వచ్చాయి. అయితే, ప్రైవేటు ఆస్పత్రులను రంగంలోకి దించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలది కావడంతో కేంద్ర ఆరోగ్య శాఖ ఆ మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకూ లేఖలు రాసింది. అంతేకాకుండా కోవిడ్ చికిత్స కోసం పీఎం-జేఏవై, సీజీహెచ్ఎస్ ప్యాకేజీలు నిర్దేశిస్తున్న ప్రకారమే రుసుములు వసూలు చేసేలా చూడాలని కూడా సూచించింది. తదనుగుణంగా అన్ని రాష్ట్రాల్లోనూ కేంద్ర సూచనల మేరకు ప్రైవేటు ఆస్పత్రులను ప్రభుత్వాలు పర్యవేక్షిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే ఇవాళ రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంద్వారా వెల్లడించారు. మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1654535 మహమ్మారిపై పోరు కోసం ప్రపంచ బ్యాంకు నుంచి భారతదేశానికి రుణవితరణ వివరాలు కోవిడ్-19 మహమ్మారిపై భారత పోరాటానికి మద్దతుగా ప్రపంచ బ్యాంకు ఇప్పటిదాకా 2.5 బిలియన్ డాలర్లను మూడు రుణాల రూపంలో అందించింది. ఈ మేరకు ఆరోగ్యం, , సామాజిక రక్షణ , ఆర్థిక ఉద్దీపన ల కోసం విడుదల చేసింది. ఈ రుణాలతో అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రయోజనాలు లభించాయని ఇవాళ ఒక ప్రశ్నకు రాజ్యసభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర ఆర్థిక-కార్పొరేట్ వ్యవహారాలశాఖ సహాయ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ వెల్లడించారు. మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1653923 మాధ్యమిక దశ విద్యార్థుల కోసం ఎన్సీఈఆర్టీ 8 వారాల ప్రత్యామ్నాయ విద్యా కేలండర్ను విడుదల చేసిన కేంద్ర విద్యాశాఖ మంత్రి కోవిడ్-19 సమయంలో ఇళ్లలో ఉండిపోయిన విద్యార్థులకు అర్థవంతమైన విద్యాభ్యాసం కోసం కేంద్ర విద్యాశాఖ పలు చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహాయంతో ఇంట్లోనే విద్యా కార్యకలాపాలకు వీలు కల్పించింది. తదనుగుణంగా 1 నుంచి 12 తరగతులవారి కోసం జాతీయ విద్యా-పరిశోధన-శిక్షణ మండలి తో నాలుగు వారాల ప్రత్యామ్నాయ విద్యా కేలండర్ ను సిద్ధం చేయించింది. అలాగే ప్రాథమిక-ప్రాథమికోన్నత దశల విద్యార్థుల కోసం ఎనిమిది వారాల కేలండర్ ఇప్పటికే విడుదల కాగా, ఇవాళ కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ ‘నిశాంక్’ వాస్తవిక సాదృశ మాధ్యమంద్వారా ఆవిష్కరించారు. మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1654563 వలస కార్మికులకు ఆర్థిక సహాయం దేశంలో దిగ్బంధం అనివార్యమైన పరిస్థితులలో ప్రజలకు నిత్యావసరాల సరఫరా ఆగకూడగదన్న వాస్తవాన్ని కేంద్ర ప్రభుత్వం ఎన్నడూ మరువలేదు. ఈ మేరకు జాతీయ స్థాయిలో కంట్రోల్ రూమ్ల ద్వారా పరిస్థితిని 24 గంటలూ పర్యవేక్షిస్తూ వచ్చింది. తదనుగుణంగా వలస కార్మికులుసహా నిరాశ్రయులకు ఆహారం, ఆరోగ్య సంరక్షణ, ఆశ్రయం కల్పించే దిశగా 28.03.2020న రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి ని వినియోగించుకునేలా రాష్ట్ర ప్రభుత్వాలను అనుమతించింది. కాగా, దిగ్బంధం సమయంలో వలసకార్మికులు స్వస్థలాలకు నడచివెళ్లే సమయంలో పలువురు మరణించినప్పటికీ దీనిపై కేంద్రస్థాయిలో రికార్డులేవీ లేవు. అయినప్పటికీ వలస కార్మికుల ప్రయాణాన్ని సులభతరం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం అవసరమైన చర్యలన్నీ తీసుకుంది. కాగా, ఈ అంశంపై లోక్సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చిన దేశీయాంగ శాఖ సహాయ మంత్రి శ్రీ నిత్యానంద్ రాయ్ ఈ మేరకు వెల్లడించారు. మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1653923 దిగ్బంధంపై ఎన్డీఎంఏ మార్గదర్శకాలు దేశంలో కోవిడ్-19 వ్యాప్తి నిరోధం దిశగా సముచిత చర్యలు చేపట్టడంతోపాటు దేశవ్యాప్తంగా మహమ్మారి నియంత్రణకు మార్గదర్శకాలు జారీచేయాల్సిందిగా జాతీయ విపత్తుల నిర్వహణ ప్రాధికార సంస్థ దేశీయాంగ శాఖను ఆదేశించింది. ఈ మేరకు విపత్తు నిర్వహణ చట్టం-2005 ) ప్రకారం జాతీయ కార్యనిర్వాహక కమిటీ చైర్పర్సన్గా ఉన్న దేశీయాంగ కార్యదర్శికి ఉత్తర్వు జారీచేసింది. తదనుగుణంగానే ఎన్ఈసీ ఎప్పటికప్పుడు దేశంలో దిగ్బంధం, దిగ్బంధ విముక్తి దశలపై మార్గదర్శకాలను జారీ చేస్తూవస్తోంది. దీనికి సంబంధించి ఇవాళ లోక్సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంద్వారా దేశీయాంగ శాఖ సహాయమంత్రి శ్రీ నిత్యానంద్ రాయ్ వివరాలు వెల్లడించారు. మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1654750 పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం - పంజాబ్: రాష్ట్రంలో కోవిడ్ కేసులు, మరణాలు పెరిగిన నేపథ్యంలో వైద్యపరమైన ఆక్సిజన్ దేశీయ తయారీ, సరఫరాలను వేగిరపరచాలని పంజాబ్ ముఖ్యమంత్రి ఆరోగ్యశాఖను ఆదేశించారు. దీంతోపాటు ఆక్సిజన్ సరఫరా, డిమాండ్ తదితరాలను పర్యవేక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక నోడల్ అధికారిని కూడా నియమించింది. - హర్యానా: రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత ఉండబోదని హర్యానా ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి కేంద్ర ప్రభుత్వానికి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ద్రవ, వైద్యపరమైన ఆక్సిజన్ ఉత్పాదన, నిల్వకు తగినంత సామర్థ్యం ఉందని, తదనుగుణంగా ప్రభుత్వ-ప్రైవేట్ ఆస్పత్రులలో ఆక్సిజన్కు కొరత లేకుండా ఏర్పాట్లు కూడా చేశామని చెప్పారు. - అరుణాచల్ ప్రదేశ్: రాష్ట్రంలోని హోలోంగిలోగల పీహెచ్సీలో పనిచేసే ఉద్యోగి కోవిడ్-19తో అరుణాచల్ ప్రదేశ్లో కన్నుమూశారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 11కు చేరింది. కాగా, రాష్ట్రంలో 176 కొత్త కేసులు నమోదవగా క్రియాశీల కేసుల సంఖ్య 1,756కు చేరగా, 156మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. - అసోం: రాష్ట్రంలో నిన్న 1,918 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 1,15,051కు చేరగా, చురుకైన కేసుల సంఖ్య 28,630గా ఉన్నట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ట్వీట్ చేశారు. - మణిపూర్: రాష్ట్రంలో 96 కొత్త కేసులు నమోదవగా, 79 శాతం కోలుకునే సగటుతో 149 మంది వ్యాధి నయం చేసుకుని ఇళ్లకు వెళ్లారు. ప్రస్తుతం మొత్తం 1,585 క్రియాశీల కేసులున్నాయి. - మేఘాలయ: రాష్ట్రంలో క్రియాశీల కేసులు 1,623కు చేరగా, వీరిలో బిఎస్ఎఫ్, సాయుధ దళాల సిబ్బంది 344 మంది కాగా, ఇతరులు 1,279 మంది ఉన్నారు. కాగా, ఇప్పటిదాకా 2,075 మంది కోలుకున్నారు. - మిజోరం: రాష్ట్రంలో నిన్న 40 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 1,468కి చేరింది. ప్రస్తుతం క్రియాశీల కేసులు 549గా ఉన్నాయి. - నాగాలాండ్: రాష్ట్రంలోని 5,214 కేసులలో సాయుధ దళాల సిబ్బంది 2,463 మంది కాగా, రాష్ట్రానికి తిరిగి వచ్చినవారు 1411 మంది, ముందువరుసలోని ఆరోగ్య కార్యకర్తలు 319 మంది, పరిచయాలతో వ్యాధి సంక్రమించినవారు 1,021 మంది ఉన్నారు. - సిక్కిం: రాష్ట్రంలో కోవిడ్ కేసుల వివరాలు: వ్యాధినయమై ఇళ్లకు వెళ్లినవారు 1,690 మంది. ప్రస్తుత క్రియాశీల కేసులు 464, కొత్త కేసులు 54గా ఉన్నాయి. - కేరళ: రాష్ట్రంలో ఓణం పండుగ తరువాత కోవిడ్ పరిస్థితి తీవ్రమైందని రాష్ట్ర ఆరోగ్యశాఖ అంచనా వేసింది. కేరళలోని 6 జిల్లాల్లో కేసులు పెరగ్గా, మూడు జిల్లాల్లో కేసులు రెట్టింపయ్యే వ్యవధి తగ్గింది. రోజువారీ పరీక్షల సంఖ్యను పెంచాలని, ప్రాంతీయ స్థాయిలో ఆరోగ్య వ్యవస్థ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయాలని కోరింది. కేరళలో నిన్న 2,540 కొత్త కేసులు నమోదవగా ప్రస్తుతం, 30,486 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2.05 లక్షలమంది పరిశీలనలో ఉండగా మృతుల సంఖ్య 454గా ఉంది. - తమిళనాడు: సకాల వైద్యచికిత్సకు వీలు కల్పించడంలో భాగంగా తమిళనాడు ప్రభుత్వం ప్రభుత్వ హెలికాప్టర్ను ఎయిర్ అంబులెన్స్గా మార్చాలని యోచిస్తోంది. కాగా, కోయంబత్తూరులో కోవిడ్ పరీక్షా ఫలితాలను సకాలంలో ప్రకటించడంలో భాగంగా వివిధ స్థాయిలలో నమూనాల నిర్వహణలో దుర్వినియోగం చోటుచేసుకున్నట్లు ఆరోగ్య శాఖను ఉటంకిస్తూ మాధ్యమాలు వార్తా కథనాల్లో పేర్కొన్నాయి. ఇక రాష్ట్రంలో నిన్న 5,752 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 5 లక్షలు దాటగా ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 4.5 లక్షలుగా ఉంది. కాగా, తమిళనాడులో మృతుల సంఖ్య 8434గా ఉంది. - కర్ణాటక: రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరగడంతో, చిక్కమగళూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి తమ ప్రాంగణంలో ఒక ద్రవ ఆక్సిజన్ ప్లాంట్ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఇది మరో వారంలో అందుబాటులోకి రానుంది. రాష్ట్రంలో నిన్న 8244 కొత్త కేసులు, 8865 డిశ్చార్జిలు, 119 మరణాలు నమోదయ్యాయి. కాగా, బెంగళూరు నగరంలో కేసుల సంఖ్య 2966గా ఉంది. నిన్నటిదాకా మొత్తం కేసులు: 4,67,689; క్రియాశీల కేసులు: 98,463; మరణాలు: 7384; డిశ్చార్జి: 3,61,823గా ఉన్నాయి. - ఆంధ్రప్రదేశ్: రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస రావుకు కోవిడ్ సోకినట్లు నిర్ధారణ అయింది. కాగా, ఆస్పత్రులలో కోవిడ్ రోగులకు మందులు, ఆహారం అందించడంలో సాయపడగల రోబోను వాల్టేర్ డివిజన్ డీజిల్ లోకోషెడ్ సిబ్బంది రూపొందించారు. దీనికి ‘మెడ్ రోబో’ గా నామకరణం చేశారు. దీన్ని విశాఖపట్నంలోని డివిజనల్ రైల్వే ఆసుపత్రిలో వినియోగించే దిశగా విస్తృత పరీక్షలు నిర్వహించారు. - తెలంగాణ: రాష్ట్రంలో గత 24 గంటల్లో 2058 కొత్త కేసులు, 10 మరణాలు నమోదయ్యాయి. కాగా, 2180 మంది కోలుకున్నారు. కొత్త కేసులలో 277 జీహెచ్ఎంసీ నుంచి నమోదయ్యాయి. మొత్తం కేసులు: 1,60,571; క్రియాశీల కేసులు: 30,400; మరణాలు: 984; డిశ్చార్జి: 1,29,187గా ఉన్నాయి. కోవిడ్-19 చికిత్స పర్యవేక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం నియమించిన ఉన్నత-స్థాయి కార్యాచరణ బృందం పడకల తనిఖీతోపాటు సాధారణ- ఇతర వార్డులలో పరిశీలన ప్రారంభమైంది. కాగా, హైదరాబాద్లోని దక్షిణమధ్య రైల్వే కార్యాలయంలో తొలిసారిగా 30 మంది సిబ్బందికి కోవిడ్ నిర్ధారణ కావడంతో ఆఫీసును మూసివేశారు. - మహారాష్ట్ర: రాష్ట్రంలో వైద్యపరమైన ఆక్సిజన్ రవాణాచేసే వాహనాలకు ఏడాదిపాటు ‘అంబులెన్స్’ హోదా ఇస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తితోపాటు రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రులకు ఆక్సిజన్ నిరంతరాయ సరఫరా అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని కోవిడ్ రోగులలో సుమారు 11 శాతానికి 500 టన్నుల ఆక్సిజన్ అవసరం. అయితే, మహారాష్ట్రలో ప్రస్తుతం 1,000 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి అవుతున్నప్పటికీ, కొరత ఉందంటూ చాలాచోట్లనుంచి ఫిర్యాదులు వచ్చాయి. - గుజరాత్: రాష్ట్రంలో తాను ప్రవేశపెట్టిన "టెస్ట్ ఈజ్ బెస్ట్" నినాదం మేరకు ముఖ్యమంత్రి విజయ్ రూపానీ స్వచ్ఛందంగా పరీక్ష చేయించుకోగా, ఆయన ఆరోగ్యంగా ఉన్నట్లు తేలింది. వ్యాధి సోకిందీ లేనిదీ నిర్ధారణ కోసం ముందుకొచ్చేలా ప్రజలను ప్రోత్సహించడం కోసం ఆయన స్వయంగా పరీక్ష చేయించుకున్నారు. - రాజస్థాన్: రాష్ట్రంలో ఈ ఉదయం 793 కొత్త కేసులు నమోదవగా రాజస్థాన్లో క్రియాశీల కేసులు 17,410కి చేరాయి. వీటిలో జోధ్పూర్ 147, రాజధాని జైపూర్ 145 వంతున అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో నిరంతరం కేసులు పెరుగుతున్నా కోలుకునేవారి సగటు 82 శాతంగా ఉండటం విశేషం. - మధ్యప్రదేశ్: రాష్ట్రానికి మహారాష్ట్ర నుంచి ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయిన ఫలితంగా ఏర్పడిన సంక్షోభం పరిష్కారానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పారిశ్రామికంగా ఆక్సిజన్ వాడకాన్ని నిషేధించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ప్రస్తుతం 180 టన్నుల ఆక్సిజన్ సరఫరా అవుతుండగా, డిమాండ్ రోజుకు 110 నుంచి 120 టన్నుల మధ్య ఉంటోంది. మధ్యప్రదేశ్లో ప్రస్తుతం చురుకైన కేసులు 90,000కన్నా ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు రాష్ట్రంలో సోమవారం అత్యధికంగా ఒకేరోజు 2,483 కేసులు నమోదయ్యాయి. ఐదు రోజులుగా నిత్యం 2 వేలదాకా కొత్త కేసులు నమోదవుతున్నాయి. - ఛత్తీస్గఢ్: రాష్ట్రంలో ఆక్సిజన్ సిలిండర్ల మద్దతుగల 560 కొత్త పడకలు రాయ్పూర్కు అందుబాటులోకి రానున్నాయి. కాగా, లాల్పూర్లోని కోవిడ్ ప్రత్యేక ఆస్పత్రిలో ఆక్సిజన్ సదుపాయాలుగల 100 పడకలను ఏర్పాటు చేసినట్లు రాయ్పూర్ జిల్లా కలెక్టర్ తెలిపారు. మరోవైపు రాయ్పూర్లోని ఆయుర్వేద కళాశాల ఆస్పత్రిలో 400, ఈఎస్ఐసీ ఆస్పత్రిలో 60 వంతున అదనపు పడకలు ఏర్పాటుకానున్నాయి. FACT CHECK
pib-270234
4b965b1bd2c1f3397f3aafd914a1f2f7921b8ab324dd9276219b9d131d2a17ab
tel
ప్రధాన మంత్రి కార్యాలయం ఇంధన రంగంలో స్వయం-సమృద్ధి, మరింత సుస్థిర వృద్ధి సాధనకు భారత్ కట్టుబడి ఉంది : పిఎం ఇంధన రంగంలో స్వయం-సమృద్ధి, మరింత సుస్థిర వృద్ధి సాధనకు భారత్ కట్టుబడి ఉన్నదని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. భారతదేశం ప్రపంచంలో మూడో పెద్ద ఇంధన వినియోగ దేశంగా, మూడో పెద్ద పెట్రోల్ వినియోగ దేశంగా, మూడో పెద్ద ఎల్ పిజి వినియోగ దేశంగా, నాలుగో పెద్ద ఎల్ఎన్ జి దిగుమతిదారుగా, నాలుగో పెద్ద రిఫైనర్ గా, నాలుగో పెద్ద ఆటోమొబైల్ మార్కెట్ గా మారిందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి శ్రీ హర్ దీప్ సింగ్ పురి చేసిన ట్వీట్ కు ప్రధానమంత్రి స్పందిస్తూ ‘‘ఇంధన రంగంలో స్వయం-సమృద్ధికి, మరింత సుస్థిర వృద్ధి సాధనకు భారత్ కట్టుబడి ఉంది’’ అని ట్వీట్ చేశారు.
pib-93959
0bfa9969dda245e21f7a66ce6e601ec8d2ea4e76bf05798bc9ff80506d0f7e0d
tel
రైల్వే మంత్రిత్వ శాఖ 2021-22 విద్యా సంవత్సరంలో బిబిఎ,బీఎస్సీ ,బీటెక్ ,ఎంబీఏ, ఎంఎస్సీ కోర్సుల్లో చేరడానికి దరఖాస్తుల స్వీకరణ గడువును పొడిగించిన నేషనల్ రైల్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఇన్స్టిట్యూట్ 2021-22 విద్యా సంవత్సరంలో బిబిఎ,బీఎస్సీ ,బీటెక్ ,ఎంబీఏ, ఎంఎస్సీ కోర్సుల్లో చేరడానికి దరఖాస్తుల స్వీకరణ గడువును నేషనల్ రైల్ అండ్ ట్రాన్స్ పోర్ట్ ఇన్స్టిట్యూట్ పొడిగించింది. వడోదరలో రైల్వే మంత్రిత్వశాఖ నెలకొల్పిన నేషనల్ రైల్ అండ్ ట్రాన్స్ పోర్ట్ ఇన్స్టిట్యూట్ డీమ్డ్ యూనివెరిస్తుంటీగా గుర్తింపు పొందింది. 12వ తరగతి ఫలితాలు, జేఈఈ మెయిన్స్, విశ్వవిద్యాలయాల అండర్ గ్రాడ్యుయేట్ ఫలితాలు, ప్రవేశాల నిర్వహణ, విద్యా సంవత్సర నిర్వహణపై తాజాగా ఏఐసీటీఈ, యూజీసీ చేసిన మార్పులను దృష్టిలో ఉంచుకుని ఎన్ఆర్టిఐ ఈ నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని బిబిఎ,బీఎస్సీ ,ఎంబీఏ, ఎంఎస్సీ కోర్సుల్లో ప్రవేశానికి ఆగస్ట్ 21వరకు,బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి సెప్టెంబర్ 15వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని ఎన్ఆర్టిఐ వైస్ ఛాన్సలర్ అల్కా అరోరా మిశ్రా తెలిపారు. కోవిడ్ తో పాటు 12 తరగతి ఫలితాల ప్రకటన, విశ్వవిద్యాలయాల పరీక్షల ఫలితాల వెల్లడి, జేఈఈ పరీక్షల నిర్వహణలో చేసిన మార్పులు, మార్గదర్శకాల జారీ లో వచ్చిన మార్పుల తో విద్యార్థులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అల్కా అరోరా తెలిపారు. తమ ముందు ఉన్న అవకాశాలను పరిశీలించి ఎన్ఆర్టిఐ లాంటి ప్రముఖ విద్యా సంస్థలో చేరడానికి వారికి వీలు కల్పించాలని దరఖాస్తుల స్వీకరణ గడువును పొడిగించామని అన్నారు. ప్రవేశ పరీక్ష కోసం విద్యార్థులు www.nrti.edu.in లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్ లైన్ దరఖాస్తులను మాత్రమే స్వీకరిస్తారు. సవరించిన తేదీలు: బిబిఎ,బీఎస్సీ , ఎంఎస్సీ మరియు ఎంబీఏ కోర్సులు : ఆగస్టు 21, 2021 బి .టెక్. కోర్సులు సెప్టెంబర్ 15, 2021 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. 2021-22 విద్యా సంవత్సరంలో ఎన్ఆర్టిఐ అందిస్తున్న కోర్సులుఅండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు >బీబీఏ ట్రాన్స్పోర్టేషన్ మేనేజిమెంట్ >బీఎస్సీ ట్రాన్స్పోర్టేషన్ టెక్నాలజీ >బి.టెక్. రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్ >బి. టెక్. రైల్ సిస్టమ్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ >బి. టెక్.మెకానికల్ అండ్ రైల్ ఇంజనీరింగ్ జమాల్పూర్లోని ఇరిమీలో అందించనున్నారుపోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు >ఎంబీఏ ట్రాన్స్పోర్టేషన్ మేనేజిమెంట్ >ఎంబీఏ సప్లై చైన్ మేనేజిమెంట్ > ఎంఎస్సి ట్రాన్స్పోర్ట్ టెక్నాలజీ అండ్ పాలసీ >ఎం ఎస్ సి రవాణా సమాచార వ్యవస్థలు మరియు విశ్లేషణలు >ఎం ఎస్ సి రైల్వే సిస్టమ్స్ ఇంజనీరింగ్ అండ్ ఇంటిగ్రేషన్ · పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సులు పిజిడిఎం ట్రాన్స్పోర్టేషన్ / లాజిస్టిక్స్ పిజిడిఎం ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ & ఫైనాన్సింగ్ / ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ వివరాలకు : [email protected] సంప్రదించ వచ్చును. దేశంలోని వివిధ కేంద్రాల్లో ఎన్ఆర్టిఐ నిర్వహించే జాతీయ ప్రవేశ పరీక్ష ఆధారంగా బిబిఎ, బిఎస్సి, పోస్ట్గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలు జరుగుతాయి . బి టెక్ కోర్సులలో ప్రవేశం జెఇఇ మెయిన్స్ స్కోరు ఆధారంగా ఉంటుంది. గతేడాది సంస్థలో ఉన్న 425 సీట్లకు 7 వేలకు పైగా విద్యార్థులు పోటీ పడ్డారు. నిపుణులు సభ్యులుగా ఉన్న బోర్డు పర్యవేక్షణలో ఎన్ఆర్టిఐ పనిచేస్తోంది. బోర్డులో ఇద్దరు ఐఐటిల డైరెక్టర్లు, ప్రముఖ విద్యావేత్తలు మరియు పరిశ్రమ ప్రతినిధులు సభ్యులుగా ఉన్నారు, విశ్వవిద్యాలయ ఛాన్సలర్ గా వ్యవహరించే భారత రైల్వేల చైర్మన్ బోర్డు అధ్యక్షుడిగా పనిచేస్తారు. రైలు రవాణా రంగాల్లో అత్యుతమ శిక్షణ ఇస్స్తున్న ఎన్ఆర్టిఐ ప్రపంచ ప్రసిద్ధి పొందిన బర్మింగ్హామ్ విశ్వవిద్యాలయం, యుసి బర్కిలీ మరియు కార్నెల్తో సహా ప్రపంచంలోని కొన్ని అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలతో అవగాహనా ఒప్పందాలను కలిగివుంది. ఎన్ఆర్టిఐలో తొలిసారిగా బీబీఏ, బీఎస్సీ పూర్తి చేసిన విద్యార్థులు ఆదిత్య బిర్లా గ్రూప్, రిలయన్స్ గ్రూప్, అదానీ గ్రూప్, ఎల్ అండ్ టి, మహీంద్రా గ్రూప్, హిందుస్తాన్ యూనిలీవర్, సిమెన్స్, కెఇసి ఇంటర్నేషనల్ లాంటి ప్రముఖ భారతీయ మరియు ఎంఎన్సి సంస్థలలో ఉద్యోగాలు పొందారు.
pib-131641
1920ff914c8cbc7f6f3bb759df851dedfaa25568477f0cfb1090bad3717b28ec
tel
సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలుగు కళాకారుడు సుధీర్ కు అరుదైన గుర్తింపు రాజ్ పథ్ రిపబ్లిక్ డే వేడుకలలో ప్రదర్శనకు సుధీర్ కలంకారీ హ్యాండ్ పెయింటింగ్ సంప్రదాయం , చరిత్రలో సంపన్నమైన భారతదేశ వైవిధ్యభరితమైన జానపద కళారూపాలు శతాబ్దాలుగా ఉత్తేజకరమైన దృశ్య ప్రాతినిధ్యం ద్వారా ఎన్నో కథలను వివరించాయి . వాటిలో ప్రతిఒక్కటి సాంస్కృతికంగా ప్రముఖమైనదే. పంజాబ్ లోని రాజ్ పురా చిట్కారా విశ్వవిద్యాలయం లోని కళాకుంభ్ లో స్క్రోల్ తయారీ ప్రక్రియలో భాగంగా ఉన్న ఇటువంటి కొన్ని సంప్రదాయ రాబోయే గణతంత్ర దినోత్సవ కవాతు సందర్భంగా న్యూఢిల్లీ రాజ్ పథ్ లో ప్రదర్శించ నున్నారు. రాజ్ పథ్ లోని ఒక ఓపెన్ గ్యాలరీలో, నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్ భారీ స్క్రోల్స్ ను ప్రదర్శిస్తుంది, వీటి పొడవు ఒక్కొక్కటి 750 మీటర్లు. భారతదేశం అంతటా ఉన్న 500 మందికి పైగా కళాకారులు దీనిని చిత్రించారు. గణతంత్ర దినోత్సవం రోజున ప్రదర్శనకు ఎంపిక చేసిన ప్రతిష్టాత్మక కళారూపాల జాబితాలో కలంకారీ కళారూపం కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ కాళహస్తి కి చెందిన ఆర్టిస్ట్ సుధీర్ రూపొందించిన కలంకారీ కళ స్క్రోల్ పై ఉంటుంది. కలంకారీ అనేది సహజమైన రంగులను ఉపయోగించి, చింతపండు పెన్నుతో కాటన్ లేదా సిల్క్ ఫ్యాబ్రిక్ పై చేసే చేతి పెయింటింగ్ యొక్క పురాతన శైలి. కలంకారీ అనే పదం ఒక పర్షియన్ పదం నుండి ఉద్భవించింది, ఇక్కడ ' కలం ' అంటే కలం 'కరి' కళాత్మకతను సూచిస్తుంది.ఈ కళలో డైయింగ్, బ్లీచింగ్, హ్యాండ్ పెయింటింగ్, బ్లాక్ ప్రింటింగ్, స్టార్చింగ్, క్లీనింగ్ ఇంకా మరెన్నో 23 శ్రమతో కూడిన దశలు ఉంటాయి. కలంకారీలో గీసిన మోటిఫ్ లు పువ్వులు, నెమలి ,పైస్లీల మొదలు మహాభారతం ,రామాయణం వంటి హిందూ ఇతిహాసాల దైవిక పాత్రల వరకు విస్తరించి ఉంటాయి.ఈ రోజుల్లో, ఈ కళ ప్రధానంగా కలంకారీ చీరల తయారీకి ఉపయోగిస్తున్నారు. శ్రీ సుధీర్ అనేక ప్రతిష్టాత్మక అవార్డులను గెలుచుకున్న సంప్రదాయ కలంకారీ కళాకారుడు. హంపిలోని కన్నడ విశ్వవిద్యాలయం నుంచి పెయింటింగ్ లో బ్యాచిలర్ ఇన్ విజువల్ ఆర్ట్స్ పూర్తి చేశాడు.
pib-105896
d1deb5f34baa523d78dd402dd74779314d45980a6bc42d20da1a43eed0618ed0
tel
ప్రధాన మంత్రి కార్యాలయం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఉన్నత స్థాయి బహిరంగ చర్చ 'సముద్ర భద్రతను పెంపొందించడం: అంతర్జాతీయ సహకారం అవసరం' పై ప్రధాన మంత్రి వ్యాఖ్యలు శ్రేష్ఠులారా, సముద్ర భద్రతపై ఈ ముఖ్యమైన చర్చలో పాల్గొన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు.సెక్రటరీ జనరల్ యొక్క సానుకూల సందేశం మరియు యుఎన్ ఒడిసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇచ్చిన వివరణకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆఫ్రికన్ యూనియన్ అధ్యక్షుడిగా కాంగో రిపబ్లిక్ అధ్యక్షుడు ఆఫ్రికన్ యూనియన్ అధ్యక్షుడిగా తన సందేశాన్ని తెలియజేశారు. నేను ఆయనకు ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రష్యా అధ్యక్షుడు, కెన్యా అధ్యక్షుడు మరియు వియత్నాం ప్రధానికి కూడా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. శ్రేష్ఠులారా, సముద్రం మన ఉమ్మడి వనరు. మన సముద్ర మార్గాలు అంతర్జాతీయ వాణిజ్యానికి జీవనాడి. అన్నింటికంటే ముఖ్యంగా, ఈ సముద్రం మన గ్రహం యొక్క భవిష్యత్తుకు చాలా ముఖ్యమైనది. కానీ మన ఉమ్మడి సముద్ర సరిహద్దు నేడు వివిధ సవాళ్లను ఎదుర్కొంటోంది. పైరసీ మరియు ఉగ్రవాదం కోసం సముద్ర మార్గాలు దుర్వినియోగం చేయబడుతున్నాయి. అనేక దేశాల మధ్య సముద్ర వివాదాలు ఉన్నాయి. మరియు వాతావరణ మార్పు మరియు ప్రకృతి వైపరీత్యాలు కూడా సముద్ర డొమైన్ కు సంబంధించిన విషయాలు. ఈ విస్తృత సందర్భంలో, మన ఉమ్మడి సముద్ర పరాక్రమాన్ని రక్షించడానికి మరియు ఉపయోగించడానికి పరస్పర అవగాహన మరియు సహకార చట్రాన్ని సృష్టించాలి. ఏ దేశం కూడా అటువంటి ఫ్రేమ్ వర్క్ ను ఒంటరిగా సృష్టించదు. ఇది ఉమ్మడి ప్రయత్నంతో మాత్రమే నిజం కాగలదు. ఈ ఆలోచనతోనే మేము ఈ ముఖ్యమైన విషయాన్ని భద్రతా మండలి ముందు తీసుకువచ్చాము. నేటి ఉన్నత స్థాయి చర్చ సముద్ర భద్రత అంశంపై ప్రపంచానికి మార్గనిర్దేశం చేస్తుందని నేను విశ్వసిస్తున్నాను. శ్రేష్ఠులారా, ఈ మేధోమథనాన్ని రూపొందించడానికి నేను మీ ముందు ఐదు ప్రాథమిక సూత్రాలను ఉంచాలనుకుంటున్నాను. మొదటి సూత్రం: చట్టబద్ధమైన సముద్ర వాణిజ్యం నుండి అడ్డంకులను తొలగించాలి. మనమందరం సముద్ర వాణిజ్యం యొక్క చురుకైన ప్రవాహంపై ఆధారపడి ఉన్నాము. దీనిలో అడ్డంకులు మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సవాలుగా ఉండవచ్చు. స్వేచ్ఛా సముద్ర వాణిజ్యం భారతదేశ నాగరికతతో అనాది కాలంతో ముడిపడి ఉంది. వేల సంవత్సరాల క్రితం, సింధు లోయ నాగరికత యొక్క లోథల్ నౌకాశ్రయం సముద్ర వాణిజ్యంతో సంబంధం కలిగి ఉంది. ప్రాచీన కాలంలో స్వతంత్ర సముద్ర వాతావరణంలోనే బుద్ధభగవానుడి శాంతి సందేశం ప్రపంచానికి వ్యాపించిం. నేటి సందర్భంలో, భారతదేశం దీనిని బహిరంగ మరియు సమ్మిళిత ఈథస్ ఆధారంగా అన్ని ప్రాంతాల కోసం సాగర్-భద్రత మరియు వృద్ధి యొక్క దార్శనికతగా నిర్వచించింది. ఈ దార్శ నిక త ద్వారా మ న ప్రాంతంలో స ముద్ర భద్రత తో కూడిన స మ న్వ య నిర్మాణాన్ని ఏర్పాటు చేయ ద లుచిస్తున్నాం. ఈ విజన్ సురక్షితమైన మరియు స్థిరమైన సముద్ర డొమైన్. స్వేచ్ఛా సముద్ర వాణిజ్యం పేదలపట్ల ఒకరి హక్కులను మరొకరు పూర్తిగా గౌరవించుకోవడం కూడా ముఖ్యం. రెండవ సూత్రం: సముద్ర వివాదాలను శాంతియుత మరియు అంతర్జాతీయ చట్టం ఆధారంగా మాత్రమే పరిష్కరించాలి. పరస్పర విశ్వాసం మరియు విశ్వాసానికి ఇది చాలా అవసరం. ఈ మాధ్యమం ద్వారానే మనం ప్రపంచ శాంతి మరియు స్థిరత్వాన్ని నిర్ధారించగలం. భారతదేశం తన పొరుగున ఉన్న బంగ్లాదేశ్ తో తన సముద్ర సరిహద్దును అదే అవగాహన మరియు పరిపక్వతతో సర్దుబాటు చేసింది. మూడవ సూత్రం: ప్రకృతి వైపరీత్యాలు మరియు రాష్ట్రేతర నటులు సృష్టించిన సముద్ర బెదిరింపులను మనం కలిసి ఎదుర్కోవాలి. ఈ అంశంపై ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించడానికి భారతదేశం అనేక చర్యలు తీసుకుంది. తుఫాను, సునామీ మరియు కాలుష్యానికి సంబంధించిన సముద్ర విపత్తులలో మేము మొదటి బాధ్యత వహించాము. పైరసీని నిరోధించడానికి భారత నౌకాదళం ౨౦౦౮ నుండి హిందూ మహాసముద్రంలో ట్రోలింగ్ చేస్తోంది. భారతదేశపు వైట్ షిప్పింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్ మన ప్రాంతం యొక్క ఉమ్మడి సముద్ర డొమైన్ అవగాహనను విస్తరిస్తోంది. హైడ్రోగ్రాఫిక్ సర్వే సపోర్ట్ మరియు సముద్ర భద్రతలో మేము అనేక దేశాలకు శిక్షణ ఇచ్చాము. హిందూ మహాసముద్రంలో భారతదేశం పాత్ర నికర భద్రతా ప్రదాతగా ఉంది. నాల్గవ సూత్రం: మనం సముద్ర పర్యావరణాన్ని మరియు సముద్ర వనరులను కాపాడుకోవాలి. మనకు తెలిసినట్లుగా, మహాసముద్రాలు వాతావరణంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి, ప్లాస్టిక్ లు మరియు చమురు ఒలికిపోవడం వంటి కాలుష్యం లేకుండా మన సముద్ర వాతావరణాన్ని మనం ఉంచాలి. మరియు అధిక చేపలు పట్టడం మరియు సముద్ర వేట వ్యతిరేకంగా ఉమ్మడి చర్యలు తీసుకోవాలి. అదే స మ యంలో మ నం మ హాస ముద్ర విజ్ఞాన శాస్త్రంలో స హ కారాన్ని కూడా పెంపొందించుకోవాలి. భారతదేశం ఒక ముఖ్యమైన "డీప్ ఓషన్ మిషన్"ను ప్రారంభించింది. స్థిరమైన ఫిషింగ్ ను ప్రోత్సహించడానికి మేము ఇంతకు ముందు చాలా తీసుకున్నాము. ఐదవ సూత్రం: బాధ్యతాయుతమైన సముద్ర అనుసంధానానికి మనం ప్రోత్సాహకాలు ఇవ్వాలి. సముద్ర వాణిజ్యాన్ని పెంపొందించడానికి మౌలిక సదుపాయాల నిర్మాణం అవసరమని స్పష్టం చేశారు. అయితే, ఇటువంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అభివృద్ధి దేశాల ఆర్థిక సుస్థిరత మరియు శోషణ సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. దీని కోసం మనం తగిన ప్రపంచ నిబంధనలు మరియు ప్రమాణాలను సృష్టించాలి. శ్రేష్ఠులారా, ఈ ఐదు సూత్రాల ఆధారంగా సముద్ర భద్రతా సహకారం ప్రపంచ రోడ్ మ్యాప్ గా మారగలదని నేను విశ్వసిస్తున్నాను. నేటి బహిరంగ చర్చలో అధిక మరియు చురుకైన భాగస్వామ్యం భద్రతా మండలి సభ్యులందరికీ ఈ విషయం ముఖ్యమని చూపిస్తుంది. దీనితో, మీ హాజరుకు నేను మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. (
pib-42649
92a2a0405b3f35baa15cf01a0d6579c31b05b39a280c5d187aff0a6418819de0
tel
కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ 'స్వచ్ఛత హి సేవ ప్రచారం'లో భాగంగా, 01.10.2023న, 'ఏక్ తారీఖ్ ఏక్ ఘంటా ఏక్ సాథ్' కార్యక్రమం కింద భారీ స్థాయిలో పరిశుభ్రత కార్యకలాపాలు చేపట్టిన ఈఎస్ఐసీ కార్యాలయాలు & ఆసుపత్రులు 'స్వచ్ఛత హి సేవ ప్రచారం'లో భాగంగా, 01.10.2023న, 'ఏక్ తారీఖ్ ఏక్ ఘంటా ఏక్ సాథ్' కార్యక్రమం కింద, ఈఎస్ఐసీకి చెందిన అన్ని కార్యాలయాలు & ఆసుపత్రులు దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో పరిశుభ్రత కార్యకలాపాలు చేపట్టాయి. ఈఎస్ఐసీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజేంద్ర కుమార్ దిల్లీలోని రోహిణిలో ఉన్న పబ్లిక్ పార్కులో పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొని, ఈ ప్రచారాన్ని ప్రారంభించారు. రోహిణిలోని ఈఎస్ఐసీ ఆసుపత్రి ప్రధాన కార్యాలయం అధికారులు, వైద్యులు, సిబ్బంది, ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో జత కలిశారు. ఆసుపత్రులు, మురికివాడలు, బస్టాండులు, నది ప్రదేశాలు, మురికి కాల్వలు మొదలైన ప్రదేశాల్లో ఈఎస్ఐసీ క్షేత్ర స్థాయి కార్యాలయాలు, ఆసుపత్రులు పరిశుభ్రత కార్యకలాపాలు చేపట్టాయి. ఈఎస్ఐసీ దేశవ్యాప్తంగా నిర్వహించిన “ఏక్ తారీఖ్ ఏక్ ఘంటా ఏక్ సాథ్” కార్యక్రమాల్లో, మహారాష్ట్రలో ఎంపీ శ్రీ ధనంజయ్ మహాదిక్, అహ్మదాబాద్లో ఎంపీ శ్రీ కిరీట్ ప్రేమ్జీభాయ్ సోలంకి, కేరళలో కొల్లాం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీమతి ప్రసన్న ఎర్నెస్ట్ వంటి ప్రముఖులు కూడా పాల్గొన్నారు. పరిశుభ్రతను దైనందిన అలవాటుగా మార్చడం, ప్రజా భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడంపై దృష్టితో, సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు, ESICకి చెందిన 116 ప్రాంతీయ కార్యాలయాలు/ఉప-ప్రాంతీయ కార్యాలయాలు/వైద్య కళాశాలలు/ఆసుపత్రుల్లో 15 రోజుల పాటు 'స్వచ్ఛత హి సేవ ప్రచారం' నిర్వహించారు.
pib-243275
8fb9032592b93f7cb2942dbf1f6c836976ecaaf2c0a4767e9d42df2c3739056b
tel
యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఉత్తరప్రదేశ్ లోని వారణాసి లో ఈ రోజు విజయవంతంగా ముగిసిన - యూత్ 20 సదస్సు ఏకగ్రీవ సమ్మతితో విజయవంతంగా ఆమోదం పొందిన - వై20 అధికారిక ప్రకటన 2023 ఆగష్టు, 17వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరిగిన - వై20 సదస్సు జి-20 అధ్యక్షతన జరుగుతున్న మొత్తం సమావేశాల్లో భాగంగా, వై-20 ఇండియా ఎంగేజ్మెంట్ గ్రూప్ సమావేశం ఈరోజు వారణాసిలో విజయవంతంగా ముగిసింది. భారతదేశం అధ్యక్షతన జరుగుతున్న మొత్తం జి-20 సమావేశాల్లో భాగంగా నిర్వహించిన వై-20 సమావేశం ప్రపంచానికి కొత్త రికార్డులు నెలకొల్పింది. ఈ శిఖరాగ్ర సమావేశంలో, వై-20 అధికారిక ప్రకటన పై సవివరమైన చర్చ జరిగింది. అనంతరం, ఏకగ్రీవ సమ్మతితో ఆ ప్రకటనను విజయవంతంగా ఆమోదించడం జరిగింది. ఈ అధికారిక ప్రకటనలో చేర్చిన ప్రధాన సిఫార్సులు -జీవితకాల అభ్యాసానికి సాధికారత కల్పించడం.అంతర్జాతీయ సవాళ్ళ కోసం ప్రపంచ స్థాయి శ్రామికశక్తిని సమకూర్చడం.అంతర్జాతీయ పరిశోధనా సహకారాన్ని బలోపేతం చేయడం.కార్మికులకు ఒకే రకమైన హక్కులు ప్రోత్సహించడంఅందుబాటులో సుస్థిరమైన ఆర్ధిక సహకారం, పర్యవేక్షణ ను అమలుచేయడం. ఈ రోజు చివరి రోజున రుద్రాక్ష ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్ లో ప్లీనరీ సమావేశం జరిగింది. ఈ ప్లీనరీ సమావేశానికి వై-20 ఇండియాకి చెందిన శ్రీ శరద్ వివేక్ సాగర్, శ్రీ అన్మోల్ సోవిట్; వై-20 ఇండియా కోఆర్డినేషన్ హెడ్ శ్రీ పతిక్రిత్ పేన్; వై-20 ఇండియా డెలిగేషన్ హెడ్ శ్రీ ఫాలిత్ సిజారియా; వై-20 ఇండియా ట్రాక్ చైర్ శ్రీమతి అదితి నారాయణి పాశ్వాన్ నాయకత్వం వహించారు. 2023 యూత్-20 అధికారిక ప్రకటనను ఇండోనేషియా నిర్వహణ కమిటీ ప్రతినిధి, బ్రెజిల్ నిర్వహణ కమిటీ ప్రతినిధి తో కూడిన ట్రోయికా దేశాలు విడుదల చేశాయి. వై-20 అధ్యక్ష స్థానంలో ఉన్న భారతదేశం పతాకాన్ని బ్రెజిల్ ప్రతినిధి బృందం అధిపతికి అధికారికంగా అందజేసింది. వై-20 అధికారిక ప్రకటన రూపంలో వెలువడిన సదస్సు ఫలితంపై ప్రతినిధి బృందాల నాయకులు సంతకం చేశారు, ఇది గత కొన్ని నెలలుగా జరిగిన వివిధ చర్చల ముగింపును సూచిస్తుంది. వై-20 కి చెందిన ఐదు గుర్తించిన ఇతివృత్తాలలో సామూహిక ఉమ్మడి దృష్టికి ఇది నిదర్శనం, ఇది ప్రపంచ వేదికపై అత్యున్నత స్థాయి నిర్ణయాధికారులకు యువత అభిప్రాయాలను వినిపించేలా చేస్తుంది. 4 రోజుల శిఖరాగ్ర సమావేశంలో భాగంగా, ప్రతినిధులు సారనాథ్, ప్రసిద్ధ కాశీ విశ్వనాథ దేవాలయంతో పాటు, గంగానదిలో పడవల్లో తిరుగుతూ వివిధ ఘాట్ లను కూడా సందర్శించారు. భారతదేశ గొప్ప కళ, సంస్కృతి, వారసత్వం ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన ప్రతినిధులపై దీర్ఘకాల ముద్ర వేసింది. పవిత్ర నగరం వారణాసి గొప్ప, విభిన్న సాంస్కృతిక వారసత్వం; దాని ఆధ్యాత్మికత, సాహిత్యం, కళ, సంగీతం కూడా జి-20 దేశాలు, అతిథి దేశాలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులను మంత్రముగ్ధులను చేశాయి. 2023 యూత్-20 సదస్సు నిర్వహణ బాధ్యతను భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని యువజన వ్యవహారాల విభాగానికి అప్పగించడం జరిగింది. న్యూ ఢిల్లీలో వై-20 కర్టెన్ రైజర్; గౌహతిలో ప్రారంభ సమావేశం; లడఖ్ లోని లే లో వై-20 ప్రీ-సమ్మిట్; దేశవ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాల్లో 14 చోట్ల వై-20 సంప్రదింపులు; భారత పారిశ్రామిక సమాఖ్య తో పాటు అభివృద్ధి చెందుతున్న దేశాలకోసం పరిశోధన, సమాచార విధానం ద్వారా ఒక్కొక్కటి 50 చొప్పున మేధోమథన సదస్సులు వంటి అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.
pib-108764
d6e787139532955fca3f63ab31a38c057d41a9a7a777380462ffb4a30b8b1440
tel
ప్రధాన మంత్రి కార్యాలయం బ్రెజిల్ ‘డెఫ్లింపిక్స్-2021’లో పాల్గొంటున్న క్రీడాకారులకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు బ్రెజిల్లో నిర్వహిస్తున్న “బధిర ఒలింపిక్స్ -2021”లో పాల్గొంటున్న ప్రతిభావంతులైన భారత క్రీడాకారులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రీడలకు బయల్దేరే ముందు వారు జాతీయ యుద్ధస్మారకాన్ని సందర్శించి నివాళి అర్పించడం తన హృదయాన్ని తాకిందని శ్రీ మోదీ ఈ సందర్భంగా చెప్పారు. ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా ఇచ్చిన సందేశంలో; “జర్మనీలో ఇవాళ ప్రారంభమయ్యే #Deaflympics2021లో పాల్గొనే భారత బృందాన్ని భారతదేశం హర్షధ్వానాలతో ఉత్సాహపరుస్తోంది. ప్రతిభావంతులైన మన క్రీడాకారులదరికీ శుభాకాంక్షలు. ఈ క్రీడోత్సవాలకు బయల్దేరేముందు వారంతా జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించి నివాళి అర్పించడం నిజంగా నన్నెంతగానో కదిలించింది” అని ప్రధాని పేర్కొన్నారు.
pib-90013
3c6ad864f19c017f3754386539ed7949c27191086d451b75d1afcddccb4a8c1c
tel
నీతి ఆయోగ్ హైదరాబాద్ లో విజయవంతంగా ముగిసిన స్టార్టప్ 20 ప్రారంభ సభ భారత్ జీ20 అధ్యక్షతన ప్రారంభమైన స్టార్టప్ 20 ప్రారంభ సమావేశం హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ లో విజయవంతంగా ముగిసింది. ప్రముఖులు, ప్రతినిధులకు స్వాగతం పలుకుతూ స్టార్టప్ 20 ఇండియా చైర్మన్ డాక్టర్ చింతన్ వైష్ణవ్ సదస్సు ప్రారంభించారు. 'వినూత్న ఆవిష్కరణలతో ప్రపంచ సవాళ్లను పరిష్కరించే ప్రయత్నం ' అనే అంశంపై జరిగిన ఈ సదస్సులో అతిథులు కీలకోపన్యాసం చేశారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, జౌళి శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ వర్చువల్ విధానంలో సదస్సును ఉద్దేశించి మాట్లాడారు. స్టార్టప్ 20 వంటి వేదిక ప్రాముఖ్యతను శ్రీ గోయల్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. "స్టార్టప్ 20 గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా స్టార్టప్ లకు గుర్తింపు, గౌరవాన్ని తీసుకురాగల శక్తివంతమైన సంస్థగా పనిచేస్తుందని నేను భావిస్తున్నాను. సదస్సులో రాబోయే కొద్ది రోజుల పాటు జరిగే చర్చలు ప్రపంచవ్యాప్తంగా స్టార్టప్ రంగం అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తుంది. స్టార్టప్ విప్లవాన్ని ప్రారంభిస్తుంది" అని శ్రీ గోయల్ అన్నారు. "దృఢ సంకల్పం మరియు భావసారూప్యత కలిగిన వ్యక్తుల చిన్న సమూహం చరిత్ర గతిని మార్చగలదు" అంటూ జాతిపిత మహాత్మా గాంధీ చేసిన వ్యాఖ్యలను శ్రీ గోయల్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. రాబోయే రెండు రోజుల్లో జరిగే చర్చలు ప్రపంచానికి బలమైన ఎజెండాను ఇస్తాయన్న ధీమా వ్యక్తం చేసిన శ్రీ గోయల్ దీనివల్ల స్టార్టప్ విప్లవం ప్రారంభమవుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ. జి.కిషన్ రెడ్డి తన ప్రసంగంలో స్టార్టప్ రంగంలో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా 3 వ స్థానంలో ఉందన్నారు. వినూత్న ఆలోచనలతో భవిష్యత్తు మార్పులు ఎదుర్కోవడానికి భారతదేశం స్ఫూర్తి ఇస్తుందని పేర్కొన్నారు. వచ్చే 20 ఏళ్లలో స్టార్టప్ లు భారత జీడీపీని పెంచుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. " ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక స్టార్టప్ లు ఉన్న దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది. ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని భారతీయ అంకుర సంస్థలు సరికొత్త ఆలోచనలతో వినూత్న ఆవిష్కరణలను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నాయి. స్టార్టప్ సంస్థల కృషితో వచ్చే 20 ఏళ్లలో భారత జీడీపీ గణనీయంగా అభివృద్ధి సాధిస్తుంది" అని శ్రీ కిషన్ రెడ్డి చెప్పారు. స్టార్టప్ లు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు చోదకాలుగా పనిచేస్తున్నాయని అని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ సోమ్ ప్రకాష్ తెలిపారు. యాక్సిలరేటర్లు, ఇంక్యుబేటర్లు, స్టార్టప్ లు, ప్రభుత్వ సంస్థలు అవగాహనతో పనిచేసి పటిష్ట స్టార్టప్ వ్యవస్థ నిర్మాణానికి కృషి చేయాలని సూచించారు. యాక్సిలరేటర్లు, ఇంక్యుబేటర్లు, స్టార్టప్ వ్యవస్థాపకులు , ప్రభుత్వ సంస్థల మధ్య అవగాహన కల్పించడానికి అవసరమైన వ్యవస్థ నిర్మాణానికి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. స్టార్టప్ ల స్వర్ణయుగాన్ని నిర్మించడానికి, కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనపై సదస్సు ప్రధానంగా దృష్టి సారిస్తుందని శ్రీ సోమ్ ప్రకాష్ తెలిపారు. జీ- 20 షెర్పా శ్రీ అమితాబ్ కాంత్ ప్రసంగిస్తూ ప్రపంచ సమస్యలకు పరిష్కార మార్గాలను అందించే అంశంలో స్టార్టప్ ల ప్రాముఖ్యతను ప్రస్తావించారు. "అనేక సవాళ్లు ఎదురవుతున్న సమయంలో ప్రతి సవాల్ పరిష్కారానికి ఒక అవకాశం ఉంది. సంక్షోభం మధ్య సాంకేతిక అంశాలు, ఆవిష్కరణల ద్వారా సమస్య పరిష్కారం కోసం కృషి చేయడం అతిపెద్ద సవాలుగా ఉంటుంది. స్టార్టప్ ఎంగేజ్మెంట్ గ్రూప్ అనేది జీ- 20 ఉద్యమానికి భారతదేశం అందించిన ఒక అవకాశం. సాంకేతికత, సృజనాత్మకత కదలికను ప్రారంభించే మొదటి ఎంగేజ్మెంట్ గ్రూప్. ప్రపంచానికి సాంకేతిక పరిజ్ఞానం అవసరం మరింత ఎక్కువగా ఉంది. ప్రస్తుత మాంద్యం ధోరణి నుంచి బయటపడడానికి ప్రపంచానికి యువ పారిశ్రామికవేత్తలు అవసరం అని భారతదేశం నమ్ముతోంది" అని శ్రీ అమితాబ్ కాంత్ అన్నారు. నీతి ఆయోగ్ సిఇఒ శ్రీ పరమేశ్వరన్ అయ్యర్ తన ప్రసంగంలో ఒక కీలక ఆవిష్కర్తగా భారతదేశం పోషిస్తున్న పాత్రను తన ప్రసంగంలో ప్రస్తావించారు. "జీరో లోగో అనేది భారతీయ నాగరికత, సంస్కృతిలో భాగంగా ఉంది. వినూత్న ఆవిష్కరణ రంగంలో భారతదేశం అగ్ర స్థానంలో ఉంది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికత ఆలోచనలు భారతదేశంలో స్టార్టప్ రంగం అభివృద్ధిని సాధ్యం చేశాయి. దేశంలో స్టార్టప్ రంగం సాధించిన అభివృద్ధిని జీ-20 అధ్యక్ష హోదాలో ప్రపంచానికి తెలియజేయడానికి కృషి జరుగుతుంది." అని శ్రీ పరమేశ్వరన్ అయ్యర్ పేర్కొన్నారు. పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ కార్యదర్శి శ్రీ అనురాగ్ జైన్ తన ప్రసంగంలో జీ- 20 అధ్యక్ష హోదాలో భారతదేశం అనుసరించనున్న విధానం, స్టార్టప్ 20 ఏర్పాటును ప్రస్తావించారు. " భారతీయ తత్వశాస్త్రం వాసుదైవ కుటుంబకం ఆధారంగా మా ఇతివృత్తాన్ని ఎంచుకున్నాము. ప్రాథమికంగా ప్రపంచం ఒకే కుటుంబం అని అర్థం, మేము ఆ తత్వాన్ని స్వీకరించాము. అందరం కలిసి ఒక కుటుంబంగా పని చేయాల్సిన అవసరం ఉంది. లక్ష్య సాధనలో భాగంగా స్టార్టప్ 20 ఏర్పాటు అయ్యింది. జీ20కి, స్టార్టప్ రంగాల మధ్య సమన్వయం సాధించి అభివృద్ధి సాధించడానికి డీపీఐఐటీ పనిచేస్తుంది" చెప్పారు. పరిశ్రమల అభివృద్ధి, అంతర్గత వాణిజ్య శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీమతి శ్రుతి సింగ్ ముగింపు ప్రసంగంతో స్టార్టప్ 20 ఎంగేజ్మెంట్ గ్రూప్ ప్రారంభ సదస్సు ముగిసింది. అనంతరం డాక్టర్ వైష్ణవ్ స్టార్టప్ 20 టాస్క్ ఫోర్స్ ను పరిచయం చేయడంతో పాటు కౌన్సిల్ చైర్మన్ల నుంచి ఆశిస్తున్న ఫలితాలను వివరించారు. అనంతరం జరిగిన గ్లోబల్ స్టార్టప్ రివల్యూషన్ సదస్సులో అంతర్జాతీయ ప్రతినిధులు ఆయా దేశాల్లోని స్టార్టప్ రంగ వ్యవస్థపై చర్చించారు. టి-హబ్, తెలంగాణ ఇన్నోవేషన్ అండ్ స్టార్టప్ ఇమ్మర్షన్ సంస్థలను ప్రతినిధులు సందర్శించారు. తెలంగాణ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శ్రీ జయేష్ రంజన్ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. మొదటి రోజు తాజ్ ఫలక్ నుమా ప్యాలెస్ లో జరిగిన విందుతో ముగిసింది, భారతదేశం వారసత్వం , సంస్కృతి ప్రతిబింబించే విధంగా పేరిణి నాట్యం, భరతనాట్యం, భాంగ్రా నృత్యం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. తాజ్ కృష్ణలో రెండో రోజు ప్రారంభ సభ జరిగింది. సదస్సు మొదటి రోజున జరిగిన చర్చల వివరాలను డాక్టర్ వైష్ణవ్ వివరించారు. పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ మరియు యువర్ స్టోరీ వ్యవస్థాపకురాలు , సిఇఒ శ్రద్ధా శర్మ ప్రసంగించారు. భారతదేశంలో స్టార్టప్ సంస్థలు సాధించిన విజయాలను వివరించారు. ఈ నేపథ్యంలో స్టార్టప్ 20 ఎంగేజ్మెంట్ గ్రూప్ ఏర్పాటు చేసిన స్టార్టప్ 20 ఎక్స్ ను నటుడు సునీల్ శెట్టి ప్రారంభించారు. నాయకులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలు, దార్శనికులు, విద్యావేత్తలు, ఇంక్యుబేషన్ నిపుణులు , మహిళలు, యువత, చేతివృత్తులు, కళాకారులు, ఉద్యమకారులు తదితరులను ఒకచోట చేర్చి అనుభవాలు, ఉత్తమ విధానాలపై చర్చించేందుకు స్టార్టప్ 20ఎక్స్ ను ప్రారంభించారు. స్టార్టప్ 20 ఎంగేజ్మెంట్ గ్రూప్,టాస్క్ ఫోర్స్ లో జరిగే చర్చలు, సదస్సులు సమర్థవంతమైన విధాన రూపకల్పనలో సహకరిస్తాయి. స్టార్టప్ 20 ఎక్స్ ప్రాముఖ్యత,ప్రత్యేకతను డాక్టర్ వైష్ణవ్ వివరించారు. "తమ అభివృద్ధికి సహకరించే విధానాన్ని రూపొందించే అంశంలో స్టార్టప్ ల తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. స్టార్టప్ 20 ఎక్స్ దీనికి సహకరిస్తుంది. ఆవిష్కరణ రంగంలో ప్రజాస్వామ్య విధానంలో నిర్ణయాలు తీసుకుని, ప్రపంచానికి పరిచయం చేయడానికి స్టార్టప్ 20 ఎక్స్ కృషి చేస్తుంది" అని డాక్టర్ వైష్ణవ్ అన్నారు. అనంతరం ప్రతినిధులు ప్రతి టాస్క్ ఫోర్స్ లక్ష్యాలు, అనుసరించాల్సిన విధానాలపై చర్చలు జరిపారు. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలను , చర్చను ఆన్ లైన్ ఫారం ద్వారా నమోదు చేశారు. ఆ తర్వాత మూడు టాస్క్ ఫోర్స్ లకు అంతర్జాతీయ, జాతీయ ప్రతినిధులకు నామినేషన్లు దాఖలయ్యాయి. డాక్టర్ వైష్ణవ్ చేసిన ముగింపు వ్యాఖ్యలతో సదస్సు ముగిసింది. తాజ్ కృష్ణ గార్డెన్ రూమ్ లో స్టార్టప్ 20 పై చర్చలు జరిగాయి. ఇన్క్రెడిబుల్ ఇండియా లైట్ అండ్ సౌండ్ షో కోసం హుస్సేన్ సాగర్ సరస్సు, గోల్కొండ కోటకు సాంస్కృతిక విహార యాత్ర నిర్వహించారు. హైదరాబాద్ తాజ్ కృష్ణలో ప్రతినిధుల విందుతో రెండో రోజు సమావేశం ముగిసింది. 2023లో భారత్ జీ20 అధ్యక్షతన స్టార్టప్ 20 ఎంగేజ్మెంట్ గ్రూప్ ను ప్రారంభించారు. స్టార్టప్ లకు సహకారం అందించడం, స్టార్టప్ లు, కార్పొరేట్లు,పెట్టుబడిదారులు,ఆవిష్కరణ సంస్థలు ఇతర కీలక భాగస్వాముల మధ్య సహకారం, సమన్వయం సాధన కోసం గ్రూప్ కృషి చేస్తుంది. ఫౌండేషన్, అలయన్స్, ఫైనాన్స్, ఇన్ క్లూజన్ అండ్ సస్టెయినబిలిటీ అనే మూడు టాస్క్ ఫోర్స్ లు ఈ ఎంగేజ్ మెంట్ గ్రూప్ లో ఉన్నాయి. జి 20 దేశాలలో స్టార్టప్ ల విస్తరణను ప్రోత్సహించడానికి సమర్థవంతమైన విధాన వ్యవస్థపై ప్రతినిధులు చర్చలు జరుపుతారు. ప్రపంచ స్టార్టప్ రంగానికి సహకారాత్మక , ముందుచూపుతో కూడిన విధానం ద్వారా సమన్వయం సాధించడం ప్రాథమిక లక్ష్యంతో స్టార్టప్ 20 ఎంగేజ్మెంట్ గ్రూప్ పనిచేస్తుంది. జీ-20 సభ్య దేశాలకు చెందిన స్టార్టప్ సంస్థల సామర్థ్యం పెంపుదల, నిధుల అంతరాలను గుర్తించడం, ఉపాధి అవకాశాలను పెంచడం, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, వాతావరణ స్థితిస్థాపకత సాధించడం, సమ్మిళిత పర్యావరణ వ్యవస్థ వృద్ధి రూపంలో కార్యాచరణ ప్రణాళిక అభివృద్ధి చేయడానికి ఒక ఉమ్మడి వేదిక అందించడం లక్ష్యంగా స్టార్టప్ 20 ఎంగేజ్మెంట్ గ్రూప్ పనిచేస్తుంది.
pib-219221
601f721b3d78b43ff76c79827b9e160055cceb6dea15720fce01987fa94372eb
tel
ప్రధాన మంత్రి కార్యాలయం డాక్టర్ బాబాసాహెబ్ ఆంబేడ్ కర్ యొక్క మహాపరినిర్వాణ్ దివస్ నాడు ఆయన కు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి డాక్టర్ బాబా సాహెబ్ ఆంబేడ్ కర్ మహాపరినిర్వాణ్ దివస్ సందర్భం గా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు శ్రద్ధాంజలి ని ఘటించారు. “सामाजिक न्याय के लिए अपना जीवन समर्पित कर देने वाले पूज्य बाबासाहेब को उनके महापरिनिर्वाण दिवस पर कोटि-कोटि नमन। उन्होंने संविधान के रूप में देश को अद्वितीय सौगात दी, जो हमारे लोकतंत्र का आधारस्तंभ है। कृतज्ञ राष्ट्र सदैव उनका ऋणी रहेगा", అని ప్రధాన మంత్రి ఒక సందేశం లో పేర్కొన్నారు. Narendra Modi ✔@narendramodi सामाजिक न्याय के लिए अपना जीवन समर्पित कर देने वाले पूज्य बाबासाहेब को उनके महापरिनिर्वाण दिवस पर कोटि-कोटि नमन। उन्होंने संविधान के रूप में देश को अद्वितीय सौगात दी, जो हमारे लोकतंत्र का आधारस्तंभ है। कृतज्ञ राष्ट्र सदैव उनका ऋणी रहेगा। 11.4K 8:47 AM - Dec 6, 2019 Twitter Ads info and privacy 2,682 people are talking about this(Visitor Counter : 90
pib-60681
7e0cca0d6ffc4ae9e2354979be2cd4dd5b5a15fd9ecfeed9efa816909c537739
tel
మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ జాతీయ విద్యా విధానం 2020 కు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్ దీనితో దేశంలో పాఠశాల, ఉన్నత విద్యా వ్యవస్థలో పరివర్తనతో కూడిన సంస్కరణలకు వీలు. • 2030 నాటికి పాఠశాల విద్యలో 100% జిఇఆర్ తో ప్రీ-స్కూల్ నుండి సెకండరీ స్థాయి వరకు విద్యను సార్వజనీనం చేయడం నూతన విధానం లక్ష్యం • ఎన్.ఇ.పి 2020, పాఠశాల వెలుపల ఉన్న 2 కోట్ల మందిని తిరిగి ప్రధాన స్రవంతిలోకి తీసుకురానుంది. • 6 వ తరగతి నుంచే ఇంటర్న్ షిప్తో కూడిన వృత్తి విద్య • కనీసం 5 వ తరగతి వరకు మాతృభాష లేదా ప్రాంతీయ భాషలో బోధన • ఉన్నత విద్యా వ్యవస్థలో జిఇఆర్ ను 2035 నాటికి 50 శాతానికి పెంపు, • ఉన్నత విద్యలో 3.5 కోట్ల సీట్ల అదనపు సీట్ల జోడింపు • దేశంలో బలమైన పరిశోధన సంస్కృతికి వీలు కల్పిస్తూ నేషనల్ రిసెర్చ్ ఫౌండేషన్ ఏర్పాటు • 15 సంవత్సరాలలో అఫిలియేషన్ వ్యవస్థ తొలగింపు, కళాశాలలకు గ్రేడెడ్ అటానమీ • నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరమ్ను ఏర్పాటు చేయనున్నారు. • నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఫర్ పాళి, పర్షియన్, పాక్రృతి , ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ లేషన్,ఇంటర్ప్రిటేషన్ ఏర్పాటు చేయనున్నారు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ జాతీయ విద్యా విధానం -2020ని ఈ రోజు ఆమోదించింది. పాఠశాల, ఉన్నత విద్యా రంగంలో పెద్ద ఎత్తున పరివర్తనతో కూడిన సంస్కరణలకు మార్గం సుగమం చేస్తూ ఈ నూతన విద్యా విధానాన్ని ఆమోదించారు. ఇది 21వ శతాబ్దపు తొలి విద్యా విధానం. 34 సంవత్సరాల క్రితం నాటి జాతీయ విద్యా విధానం 1986 స్థానంలో ఇది రూపుదిద్దుకుంది. అందుబాటులో విద్య, అందరికీ విద్య, నాణ్యమైన విద్య, అందుబాటులో విద్య, జవాబుదారిత్వం వంటి ప్రధాన అంశాలపై ఇది రూపుదిద్దుకుంది. ఇది 2030 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా ఉంది. పాఠశాల, కళాశాల విద్యను సమగ్రమైనదిగా తీర్చిదిద్దడం, 21 వ శతాబ్దపు అవసరాలకు అనువైనదిగా తీర్చిదిద్దడం, ప్రతి విద్యార్ధిలోని ప్రత్యేక సామర్ధ్యాలను వెలికితీయడం ద్వారా ఇండియాను ఒక శక్తివంతమైన జ్ఞాన సమాజంగా, ప్రపంచ విజ్ఞాన మహాశక్తిగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రీ స్కూలు నుంచి సెకండరీ స్థాయి వరకు అన్ని స్థాయిలలోనూ పాఠశాల విద్యను సార్వత్రికంగా అందుబాటులో ఉండేలా ఎన్.ఇ.పి 2020 కట్టుబడి ఉంది. వినూత్న విద్యా కేంద్రాలు, మౌలిక సదుపాయాల మద్దతుతో మధ్యలోనే బడి మానేసిన వారు తిరిగి ప్రధాన స్రవంతిలోకి రానున్నారు. ఎన్.ఇ.పి 2020 కింద బడి వెలుపల ఉన్న సుమారు 2 కోట్ల మందిని తిరిగి విద్యారంగ ప్రధాన స్రవంతిలోకి ఎన్.ఇ.పి 2020 తీసుకురానున్నది. పూర్వ ప్రాథమిక విద్యపై దృష్టిపెడుతూ 10+2 విద్య స్థానంలో 5+3+3+4 సంవత్సరాల విద్యను తీసుకురానున్నారు. ఇవి 3-8, 8-11, 11-14, 14-18 సంవత్సరాల విద్యార్ధులు దీని పరిధిలోకి వస్తారు. ఇక ముందు 3-6 సంవత్సరాల వయసుగల వారు పాఠశాల విద్యా ప్రణాళిక కిందికి వస్తారు. అంతర్జాతీయంగా ఇది కీలకమైన , పిల్లల మానసిక వికాసానికి అనువైన దశ అని గుర్తించడం జరిగింది. కొత్త విధానంలోమూడు సంవత్సరాలు అంగన్ వాడీ లేదా ప్రీ స్కూల్తో మొత్తం 12 సంవత్సరాల పాఠశాల విద్య ఉంటుంది. పాఠశాల స్థాయి పాఠ్యాంశాలు, బోధనలో అభ్యసించేవారి సమగ్ర వికాసాన్ని దృష్టిలో ఉంచుకుని వారని 21 వ శతాబ్దపు నైపుణ్యాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం జరుగుతుంది. కీలక ఆలోచన స్థాయిని పెంచేందుకు, కీలక అంశాలను నేర్చుకునేందుకు పాఠ్యాంశాలను తగ్గిస్తారు. ప్రయోగాత్మక అభ్యాసానికి వీలు కల్పించి దానిపై దృష్టిపెడతారు. సబ్జెక్టుల ఎంపికలో విద్యార్ధులకు స్వేచ్చ ఉంటుంది. ఆర్ట్స్, సైన్సు మధ్య కఠిన విభజన ఏదీ ఉందడు. వృత్తి విద్యను 6వ గ్రేడ్ నుంచే ఇంటర్న్ షిప్ తో పాటుగా ప్రారంభిస్తారు. కొత్త సమగ్రమైన నేషనల్ కరికులమ్ ఫ్రేమ్ వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్- NCFSE 2020-21ని ఎన్.సి.ఇ.ఆర్.టి అభివృద్ధి చేయనుంది. భాష శక్తి: జాతీయ విద్యావిధానం-2020 మాతృభాష, స్థానిక భాష, ప్రాంతీయభాషను బోధన మాధ్యమంగా కనీసం 5 వ గ్రేడ్ వరకు ఉంచాలని, గ్రేడ్ 8 ఆ పై వరకూ దీనిని కొనసాగించవచ్చని చెప్పింది. సంస్కృతాన్ని పాఠశాలలోని అన్ని స్థాయిలలో విద్యార్థులు ఐచ్ఛికంగా మూడు భాషల విధానంలో భాగంగా ఎంచుకోవచ్చని స్పష్టం చేసింది. భారతదేశంలోని ఇతర ప్రాచీన భాషలు, సాహిత్యం కూడా విద్యార్థులు ఎంపిక చేసుకోవడానికి వీలుండాలని ఈ నూతన విధానం స్పష్టం చేసింది. 6-8 గ్రేడ్ ల మధ్య ‘ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్’ కార్యక్రమం కింద పలు విదేశీభాషలు సెకండరీ విద్యాస్థాయిలో ఆఫర్ చేయడం జరుగుతుంది. భారతీయ సంజ్ఙా భాషలను దేశవ్యాప్తంగా ప్రామాణీకరిస్తారు. ఇందుకు వినికిడి లోపం కల విద్యార్ధులకు దేశ, రాష్ట్రస్థాయి పాఠ్యప్రణాళికను అభివృద్ధి చేస్తారు. పుట్టుకవల్ల కానీ తన నేపథ్యం వల్ల కానీ ఏ విద్యార్థీ నేర్చుకోవడానికీ, రాణించడానికి అవకాశం కోల్పోరాదన్నది ఎన్.ఇ.పి 2020 లక్ష్యం. సామాజికంగా, ఆర్ధికంగా అణగారిన వర్గాల వారిపై ఈ విధానంలో ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. వెనుకబడిన ప్రాంతాలు, గ్రూపులకు స్పెషల్ ఎడ్యుకేషన్ జోన్ లు జెండర్ ఇంక్లూజన్ ఫండ్ ను ఏర్పాటు చేయనున్నారు. దివ్యాంగులైన పిల్లలు రెగ్యులర్ పాఠశాల ప్రక్రియలో ఫౌండేషన్ స్థాయినుంచి ఉన్నత విద్య వరకు పూర్తి స్థాయిలో పాల్గొనేందుకు వీలు కల్పిస్తారు. ఇందుకు బోధకుల మద్దతు, రిసోర్సు సెంటర్లు, తగిన వసతి, సహాయక ఉపకరణాలు, తగిన సాంకేతిక పరిజ్ఞానంతోకూడిన ఉపకరణాలు ఇలా వారి అవసరాలకు తగినట్టు ఏర్పాట్లు చేస్తారు. ప్రతి రాష్ట్రం, జిల్లా బాలభవన్ లు ఏర్పాటుచేసేందుకు ప్రోత్సహించడం జరుగుతుంది. ఇవి పగటిపూట బోర్డింగ్ స్కూళ్లుగా ఉంటాయి. కళలు, ఆటలు వంటివి నేర్పడానికి వీటిని వినియోగిస్తారు. పాఠశాల అనంతరం ఈ సదుపాయాలను సామాజిక చేతన కేంద్రాలుగా వాడుకోవచ్చు. పారదర్శక విధానంలో ఉపాధ్యాయ రిక్రూట్ మెంట్: ఉపాధ్యాయ నియామకాలను పటిష్టమైన, పారదర్శక ప్రక్రియ ద్వారా చేపడతారు. ప్రమోషన్లు మెరిట్ ఆధారితంగా ఉంటాయి. ఎప్పటికప్పడు వారి పనితీరును అంచనావేసే బహుళ మార్గ సమాచార సేకరణ ద్వారా దీనిని చేపడతారు. ఉపాధ్యాయులకు ఉమ్మడి జాతీయ వృత్తి ప్రమాణాలను నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ -ఎన్.సి.ఇ.ఆర్.టి, ఎస్.సి.ఇ.ఆర్.టి,. ఉపాధ్యాయులు, వివిధ ప్రాంతాలు వివిధ స్థాయిలలోని నిపుణుల సంస్థలతో సంప్రదించి 2022 నాటికి అభివృద్ధి చేస్తుంది. పాఠశాలలను కాంప్లెక్సులుగా లేదా క్లస్టర్లుగా ఏర్పాటుచేసి, దానిని పాఠశాల పాలనకు మౌలిక యూనిట్గా పరిగణిస్తారు. దీనికి మౌలిక సదుపాయాలు, విద్యాపరమైన లైబ్రరీలు, బలమైన టీచర్ల వ్యవస్థ కల్పిస్తారు. పాఠశాల విద్యకు ప్రమాణాలు: ఎన్.ఇ.పి 2020 విద్యా సంబంధ, నిర్వహణా పరమైన, నియంత్రణ పరమైన, విధాన నిర్ణయాలకు సంబంధించి స్పష్టమైన ప్రత్యేక వ్యవస్థ ఉండాలని సంకల్సిస్తోంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాష్ట్ర పాఠశాల ప్రమాణాల అథారిటీ ని ఏర్పాటు చేసుకుంటాయి. ఎస్.సి.ఇ.ఆర్.టి పాఠశాల నాణ్యతా అంచనా , అక్రిడిటేషన్ ఫ్రేమ్ వర్క్ ను సంబంధిత భాగస్వామ్య పక్షాలతో కలసి చర్చించి అభివృద్ధి చేస్తుంది. 2035 నాటికి 50 శాతానికి జిఇఆర్: ఉన్నత విద్యలో దేశంలో స్థూల ఎన్రోల్మెంట్ నిష్పత్తి ని 26.3 శాతం నుంచి 2035 నాటికి 50 శాతానికి చేర్చాలని జాతీయ విద్యా విధానం 2020 లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఉన్న విద్యా సంస్థలకు 3.5 కోట్ల సీట్లను జత చేయనున్నారు. మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ రిసెర్చ్ యూనివర్సిటీలు లను ఐఐటిలు, ఐఐఎం లతో సమానంగా ఏర్పాటు చేయనున్నారు. దేశంలో అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యుత్తమ మల్టీ డిసిప్లినరీ విద్యకు నమూనాగా వీటిని ఏర్పాటు చేయనున్నారు. నేషనల్ రిసెర్చ్ ఫౌండేషన్ ను ఉన్నతస్థాయి సంస్థగా ఏర్పాటు చేయనున్నారు. ఉన్నత విద్యా వ్యవస్థలో పరిశోధన సామర్ధ్యాన్ని, పరిశోధన సంస్కృతిని పెంచడానికి దీనిని ఏర్పాటు చేస్తారు. నియంత్రణ: మొత్తం ఉన్నత విద్యా వ్యవస్థకు హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ని ఏర్పాటు చేయనున్నారు. వైద్య విద్య, న్యాయ విద్య మాత్రం దీనినుంచి మినహాయింపు. హెచ్.ఇ.సి.ఐ కి నాలుగు స్వతంత్ర విభాగాలు ఉంటాయి. అవి నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ కౌన్సిల్ అనేది రెగ్యులేషన్ కోసం, ప్రమాణాలను నిర్దేశించడం కొసం జనరల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ , ఫండింగ్ కు హయ్యర్ ఎడ్యుకేషన్ గ్రాంట్స్ కౌన్సిల్ , అక్రిడిటేషన్కు నేషనల్ అక్రిడిటేషన్ కౌన్సిల్ ఏర్పాటు అవుతాయి. రెగ్యులేషన్, అక్రిడిటేషన్, అకడమిక్ ప్రమాణాలకు సంబంధించి పబ్లిక్, ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థలన్నింటికీ ఒకే రకమైన నిబంధనలు వర్తింపచేస్తారు. కళాశాలల అనుబంధాన్ని 15 సంవత్సరాలలో దశలవారీగా తొలగించాలని, కళాశాలలకు గ్రేడెడ్ స్వయంప్రతిపత్తిని ఇవ్వడానికి దశల వారీ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ఈ జాతీయ విద్యా విధానం 2020 పేర్కొంది. కొంతకాలానికి ప్రతి కాలేజీ ఒక స్వతంత్ర డిగ్రీలు మంజూరుచేసే కాలేజీగా లేదా యూనివర్సిటీ భాగస్వామ్య కళాశాలగా తయారయ్యేట్టు చూస్తారు. ఉపాధ్యాయ విద్య: ఉపాధ్యాయ విద్యకు సంబంధించి, సమగ్రమైన నూతన జాతీయ కరికులమ్ ఫ్రేమ్ వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ , ఎన్.సి.ఎఫ్.టి.ఇ 2021 ని ఎన్సిటిఇ రూపొందించనుంది. ఎన్.సి.ఇ.ఆర్.టి తో సంప్రదించి దీనిని రూపొందిస్తుంది. 2030 నాటికి బోధనకు కనీస డిగ్రీ అర్హత, నాలుగు సంవత్సరాల బిఇడి డిగ్రీ కానున్నది. నాసిరకం ఉపాధ్యాయ విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటారు. ప్రతిభ గల ఎస్.సి., ఎస్.టి, ఒబిసి ఇతర ఎస్ఇడిజి విద్యార్దులకు ప్రోత్సాహకం అందించేందుకు చర్యలు తీసుకుంటారు. నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ను విస్తరింపచేసి స్కాలర్షిప్ పొందిన విద్యార్ధుల ప్రగతిని గమనిస్తారు. ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థలు వీలైనన్ని ఎక్కువ ఫ్రీషిప్, స్కాలర్ షిప్ లను తమ విద్యార్థులకు అందించేందుకు ప్రోత్సహించనున్నారు. ఆన్లైన్, డిజిటల్ ఎడ్యుకేషన్: ఇటీవలి మహమ్మారి నేపథ్యంలో ప్రత్యామ్నాయ నాణ్యమైన విద్యా విధానాలను అనుసరించేందుకు వీలుగా ఆన్ లైన్ విద్యను ప్రోత్సహించేందుకు సమగ్ర సిఫార్సులను పొందుపరిచారు. డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పనకు, డిజిటల్ కంటెంట్, సామర్ధ్యాల నిర్మాణానికి ఎం.హెచ్.ఆర్.డి లో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తారు. ఇది పాఠశాల, ఉన్నతవిద్య స్థాయిలో ఈ - విద్య అవసరాలను తీర్చనుంది. ఆర్ధిక వనరులు: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా విద్యారంగంలొ పబ్లిక్ ఇన్వెస్ట్ మెంట్ను వీలైనంత త్వరగా జిడిపి లో ఆరు శాతానికి చేర్చేందుకు కృషి చేస్తాయి. పెద్ద ఎత్తున సంప్రదింపులు: జాతీయ విద్యా విధానం 2020, మున్నెన్నడూ లేనంత రీతిలో పెద్ద ఎత్తున సంప్రదింపుల ద్వారా రూపుదిద్దుకున్నది. 2.5 లక్షల గ్రామ పంచాయతీలు, 6600 బ్లాకుల, 6000 పట్టణ స్థానిక సంస్థలు, 676 జిల్లాల నుంచి 2 లక్షలకు పైగా సూచనలు వచ్చాయి. 2015 జనవరి నుంచి మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ మున్నెన్నడూ లేనంతగా సమగ్ర , ఉన్నతస్థాయి సంప్రదింపుల ప్రక్రియను చేపట్టింది. 2016 మే నెలలో మాజీ కేంద్ర కేబినెట్ కార్యదర్శి, దివంగత శ్రీ టి.ఎస్.ఆర్ సుబ్రమణియన్ నేతృత్వంలో, కమిటీ ఫర్ ఎవల్యూషన్ ఆప్ ద న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తన నివేదికను సమర్పించింది. దాని ఆధారంగా మంత్రిత్వశాఖ ముసాయిదా జాతీయ విద్యావిధానం- 2016 కొన్నిఅంశాలను రూపొందించింది. 2017 జూన్లో, ప్రముఖ శాస్త్రవేత్త పద్మవిభూషణ్ డాక్టర్ కె. కస్తూరి రంగన్ నేతృత్వంలో కమిటీ ఫర్ ద డ్రాప్ట్ నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ ని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ముసాయిదా జాతీయ విద్యా విధానం 2019ని కేంద్ర మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రికి 2019 మే 31న అందజేసింది. ఈ ముసాయిదా జాతీయ విద్యా విధానం 2019 ను ఎం.హెచ్.ఆర్.డి వెబ్సైట్ లో, మై గవ్ ఇన్నొవేట్ పోర్టల్ లో అప్ లోడ్ చేసి ప్రజలు భాగస్వామ్య పక్షాలు నిపుణుల నుంచి సలహాలు, సూచనలు, వ్యాఖ్యలను ఆహ్వానించింది.
pib-160573
839288645425e83dfd6b612b76153efe6b8246070ee5152b25b12cca49660e9a
tel
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆరోగ్య కార్యకర్తల కోవిడ్ 19 మరణాలు ఆరోగ్యం రాష్ట్ర సంబంధిత విషయం. ఇటువంటి డేటాను ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కేంద్ర స్థాయిలో నిర్వహించదు. ఏదేమైనా, "ప్రధాన మంత్రి గారిబ్ కళ్యాణ్ బీమా ప్యాకేజీ" కింద ఉపశమనం పొందే వారి డేటాబేస్ జాతీయ స్థాయిలోనూ నిర్వహించబడుతుంది. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు ఇన్ఫెక్షన్ సంక్రమణ నివారణ మరియు నియంత్రణ పద్ధతులపై మార్గదర్శకాన్ని అందించింది. 2020 మార్చిలో అన్ని రాష్ట్రాలకు శిక్షణ ఇవ్వబడింది. 2020 మార్చి 20 నాటికి జిల్లా స్థాయి వరకు శిక్షణను పూర్తి చేయడానికి రాష్ట్రాలకు శిక్షణా ప్రణాళికను కూడా అందించడమైనది. ఐగోట్ ప్లాట్ఫామ్లో అన్ని వర్గాల ఆరోగ్య కార్యకర్తలకు ఇన్ఫెక్షన్ నివారణ మరియు నియంత్రణకు గాను శిక్షణ కూడా అందుబాటులో ఉంచబడింది. ఇన్ఫెక్షన్ నివారణ మరియు నియంత్రణ కమిటీలను ఏర్పాటు చేయాలని రాష్ట్రాలను కోరారు. ఆరోగ్య సంరక్షణ కార్మికులను పర్యవేక్షించే మరియు వారి ఎక్స్పోజర్ స్థితిని సమీక్షించే నోడల్ అధికారిని ఆసుపత్రులు గుర్తించడమైంది. అధిక రిస్క్ ఎక్స్పోజర్ కలిగిన వారిని 7 రోజుల పాటు క్వారెంటైన్ నిర్బంధంలో ఉంచాలి. వైద్యులు, నర్సింగ్ అధికారులు మరియు ఇతర ఆరోగ్య కార్యకర్తలు వారి ఎక్స్పోజర్ / క్లినికల్ ప్రొఫైల్ ఆధారంగా, నోడల్ ఆఫీసర్/ డిపార్ట్మెంట్ హెడ్ క్వారెంటైన్ సమయాన్ని మరో వారం పాటు పోడిగించే విషయమై నిర్ణయం తీసుకుంటారు. కోవిడ్ మరియు నాన్-కోవిడ్ ప్రాంతాల్లోని ఆసుపత్రులలో పనిచేసే ఆరోగ్య సంరక్షణ కార్మికుల సంక్షేమం కోసం ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జూన్ 18, 2020న ఒక అడ్వైజరీని జారీ చేసింది. ఆసుపత్రి మరియు కమ్యూనిటీ సెట్టింగుల కోసం పీపీఈలను హేతుబద్ధంగా ఉపయోగించే విషయమై మార్గదర్శకాలను కేంద్రం 24.03.2020 న జారీ చేసింది. ఈ మార్గదర్శకాలు రిస్క్ బేస్డ్ విధానాన్ని అనుసరించాయి. అధిక మరియు తక్కువ రిస్క్ ఉన్న ప్రాంతాల్లో ఉపయోగించాల్సిన పీపీఈ రకాలను ఇది సిఫార్సు చేసింది. ఆరోగ్య సంరక్షణ కార్మికులలో రోగనిరోధకత మరియు సంక్రమణ నివారణకు హైడ్రాక్సీక్లోరోక్విన్ అందించబడ్డాయి. ఎన్-95 ముసుగులు మరియు ట్రిపుల్ / డబుల్ ప్లై మాస్క్లను ధర నియంత్రణలోకి తీసుకురావడం జరిగింది. స్వావలంబన సాధించేంత వరకు పీపీఈ, ఎన్ 95 మాస్క్లు, ట్రిపుల్ / డబుల్ ప్లై మెడికల్ మాస్క్లు, గాగుల్స్ మరియు వైజర్ల ఎగుమతులు నిషేధించబడ్డాయి. “ఇండియా కోవిడ్ -19 ఎమర్జెన్సీ రెస్పాన్స్ అండ్ హెల్త్ సిస్టమ్ ప్రిపరేషన్నెస్ ప్యాకేజీ” కింద 15000 కోట్ల రూపాయల ప్యాకేజీని 2020 ఏప్రిల్ 22 న కేబినెట్ ఆమోదించింది. అత్యవసర కోవిడ్-19 ప్రతిస్పందనతో సహా వివిధ విభాగాల కింద రాష్ట్రాలకు నిధులు మరియు వస్తువులను కేటాయించారు. 9.81 కోట్ల హైడ్రాక్సీక్లోరోక్విన్ టాబ్లెట్లు మరియు 28,476 వెంటిలేటర్లు రాష్ట్రాలు / యూటీలకు సరఫరా చేయబడ్డాయి. మహమ్మారి యొక్క ప్రారంభంలోరక్షిత గేర్లు అందుబాటులో లేకపోవడంపై పలు ఆందోళనలు వ్యక్తమైయ్యాయి. ఏదేమైనా, భారత ప్రభుత్వం సామర్థ్యాన్ని పెంచడానికి మరియు పీపీఈల యొక్క అవసరాలకు అనుగుణంగా రాష్ట్రాలకు కేటాయించడంతో ఈ ఆందోళన పరిష్కరించబడింది. దేశంలో రాష్ట్రాలు / యూటీలకు 3.05 కోట్ల ఎన్-95 మాస్క్లు, 1.2 కోట్ల మేర పీపీఈ కిట్లు అందించబడినాయి. "ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజీ" కింద ఉపశమనం పొందిన ఆరోగ్య సంరక్షణ కార్మికుల సంఖ్య రాష్ట్రాల వారీగా ఈ క్రిందన ఇవ్వబడ్డాయి: | | పీఎంజీకేపీ: బీమా పథకం ప్రకారం కోవిడ్ 19 కారణంగా మరణించిన ఆరోగ్య కార్యకర్తల సంఖ్య | | రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతం వారీగా జాబితా భ | | క్రమ సంఖ్యభ | | రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతం | | డాక్టర్లు | | ఏఎన్ఎం/ఎంపీహెచ్డబ్ల్యూ | | ఆశా | | ఇతరులు | | మొత్తం | | 1 | | అండమాన్ నికోబార్ | | 1 | | 0 | | 0 | | 0 | | 1 | | 2 | | ఆంధ్రప్రదేశ్ | | 5 | | 5 | | 1 | | 1 | | 12 | | 3 | | అరుణాచల్ ప్రదేశ్ | | 0 | | 0 | | 0 | | 0 | | 0 | | 4 | | అస్సాం | | 1 | | 0 | | 0 | | 4 | | 5 | | 5 | | బీహార్ | | 4 | | 1 | | 1 | | 0 | | 6 | | 6 | | ఛండీగఢ్ | | 0 | | 0 | | 0 | | 0 | | 0 | | 7 | | ఛత్తీస్గఢ్ | | 2 | | 0 | | 1 | | 1 | | 4 | | 8 | | ఢిల్లీ | | 3 | | 0 | | 0 | | 5 | | 8 | | 9 | | గుజరాత్ | | 5 | | 6 | | 2 | | 1 | | 14 | | 10 | | హర్యానా | | 2 | | 0 | | 0 | | 0 | | 2 | | 11 | | హిమాచల్ ప్రదేశ్ | | 0 | | 0 | | 1 | | 0 | | 1 | | 12 | | జమ్మూ మరియు కాశ్మీర్ | | 2 | | 0 | | 0 | | 1 | | 3 | | 13 | | జార్ఖండ్ | | 2 | | 2 | | 1 | | 1 | | 6 | | 14 | | కర్ణాటక | | 2 | | 0 | | 1 | | 1 | | 4 | | 15 | | కేరళ | | 0 | | 0 | | 0 | | 1 | | 1 | | 16 | | మధ్యప్రదేశ్ | | 3 | | 0 | | 0 | | 4 | | 7 | | 17 | | మహారాష్ట్ర | | 6 | | 3 | | 0 | | 12 | | 21 | | 18 | | మిజోరాం | | 0 | | 0 | | 0 | | 2 | | 2 | | 19 | | ఒడిషా | | 3 | | 1 | | 0 | | 1 | | 5 | | 20 | | పంజాబ్ | | 1 | | 2 | | 1 | | 1 | | 5 | | 21 | | పుదిచ్ఛెరి | | 0 | | 0 | | 0 | | 0 | | 0 | | 22 | | రాజస్థాన్ | | 2 | | 5 | | 0 | | 1 | | 8 | | 23 | | తమిళనాడు | | 5 | | 3 | | 0 | | 2 | | 10 | | 24 | | తెలంగాణ | | 3 | | 0 | | 3 | | 1 | | 7 | | 25 | | ఉత్తర్ ప్రదేశ్ | | 8 | | 0 | | 0 | | 1 | | 9 | | 26 | | పశ్చిమ బెంగాల్ | | 4 | | 4 | | 2 | | 4 | | 14 | | | | మొత్తం | | 64 | | 32 | | 14 | | 45 | | 155 ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్విని కుమార్ చౌబే ఈ రోజు ఇక్కడ రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాల్ని వెల్లడించారు.
pib-168912
a666a6a15feb19260fa0ceb41ab852e4d45c5f1519d8fe89508170c3202d57f2
tel
హోం మంత్రిత్వ శాఖ సుభాష్ చంద్రబోస్ ఆప్ద ప్రభందన్ పురస్కార్ 2021 భారతదేశంలోని వ్యక్తులు, సంస్థలు, విపత్తుల నిర్వహణ రంగంలో వారు అందించిన విలువైన , నిస్వార్థ సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం సుభాష్ చంద్రబొస్ ఆప్ద ప్రభంధన్ పురస్కార్ పేరుతో వార్షిక అవార్గులను ఏర్పాటు చేసింది. ఈ అవార్డులను ప్రతి ఏడాది నేతాజి సుభాష్ చంద్రబొస్ జయంతి నాడు అయిన జనవరి 23న ప్రకటిస్తారు. ఈ అవార్డు కింద సంస్థలకు అయితే రూ 51 లక్షల రూపాయల నగదు, సర్టిఫికేట్ ,వ్యక్తులకు అయితే 5 లక్షల రూపాయల నగదు , సర్టిఫికేట్ ఇస్తారు. ఈ ఏడాది ఈ అవార్డుకు 2020 జూలై 1 నుంచి నామినేషన్లను ఆహ్వానించారు. 2021 సంవత్సరానికి అవార్డు స్కీమ్కు సంబంధించిన వివరాలను ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం కల్పించారు. ఈ ప్రకటనకు స్పందించి వివిధ సంస్థలు వ్యక్తుల నుంచి అర్హత కలిగిన 371 నామినేషన్లు వచ్చాయి. 2021 సంవత్సరానికి 1)సుస్థిర పర్యావరణం, పర్యావరణ అభివృద్ధి సొసైటీ వ్యక్తుల కేటగిరీలో డాక్టర్ రాజేంద్ర కుమార్ భండారిలను విపత్తుల నిర్వహణలో సుభాష్ చంద్రబోస్ ఆప్ద ప్రబంధన్ పురస్కార్ కు ఎంపిక చేశారు. 2020 సంవత్సరానికి సంస్థల కేటగిరీలో ఉత్తరాఖండ్ కు చెందిన డిజాస్టర్ మిటిగేషన్, మేనేజ్మెంట్ సెంటర్ను , వ్యక్తుల కేటగిరీలో శ్రీ కుమార్ మున్నన్ సింగ్ ఎంపికైన విషయం తెలిసిందే. .విపత్తుల నిర్వహణకు సంబంధించి 2021 సంవత్సరానికి అవార్డులు గెలుపొందిన వారి ప్రతిభా విశేషాలు: 1) సస్టెయిన బుల్ ఎన్విరాన్మెంట్, ఎకలాజికల్ డవలప్మెంట్ సొసైటీ ప్రకృతి విపత్తులనుంచి కమ్యూనిటీలు తట్టుకుని నిలబడేలా చేయడంలో అద్భుత కృషి చేసింది. ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండడం, పునరావాసం, స్థానిక సామర్ద్యాల నిర్మాణం, వివిధ రాష్ట్రాలలో కమ్యూనిటీల స్థాయిలో రిస్క్ తగ్గింపు వంటి కార్యకలాపాల విషయంలో విశేష కృషి చేస్తున్నది. స్థానిక అంశాలపై లోతైన అవగాహన కలిగిన స్థానిక నాయకత్వాలు, పెద్ద పెద్ద పధకాల కు ఆవలగల వారిని చేరుకునే సామర్ధ్యాలు కలిగి ఉంటాయి. స్థానిక నాయకులు స్థానిక వ్యవస్థలు, రాజకీయాలు, సంస్కృతిపై మంచి అవగాహన కలిగి ఉంటారు. ఎస్ఇఇడిఎస్ సంస్థ కమ్యూనిటీల ఇబ్బందులు తొలగించేందుకు తమ సామర్ధ్యాలను వినియోగిస్తుంది.ఎస్.ఇ.ఇ.డి.ఎస్ సంస్థ పలురాష్ట్రాలలో పాఠశాలల భద్రత విషయంలో పనిచేస్తున్నది. ఇది టీచర్లు, స్థానిక నాయకత్వాలు ఆయా ప్రాంతాలలో రిస్క్లను గుర్తించేందుకు,అంచనా వేసేందుకు తోడ్పడుతున్నది. వీరు పౌర వేదికలను ప్రోత్సహించారు. ఇందులో స్థానిక సంక్షేమ సంఘాలకు , మార్కెట్ ట్రేడర్ల అసోసియేషన్లు , రాష్ట్రాలకు చెందిన స్థానిక గ్రూప్లు సభ్యులుగా ఉన్నారు. వీరు జిల్ఆ అధికారులు, కమిటీలకు మధ్య అనుసంధాన కర్తలుగా పనిచేస్తారు. వీరు ప్రజారోగ్యం, భద్రత కార్యక్రమాలను సంయుక్తంగా అమలు చేయడంలో సహకరిస్తారు. 2001,2005,2015 లలో ఇండియాలో భూకంపం అనంతరం ఎస్.ఇ.ఇ.డి.ఎస్ సంస్థ నిర్మాణ మేస్త్రీలను సమీకరించి వారికి ప్రకృతి విపత్తులను తట్టుకునే నిర్మాణాల గురించి తెలిపింది. వీరు స్థానిక కమ్యూనిటీలకు ఈ విషయంలో రాయబారులుగా తయారయ్యారు. విపత్తులకు సంబంధించి సత్వర హెచ్చరికలకు కృత్రి మ మేధతో కూడిన సాంకేతిక పరిజ్ఙానాన్ని , ఫీడ్ బ్యాక్కు సంబంధించిన పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెస్తోంది. ఇది సత్వర నిర్ణయాలు తీసుకోవడానికి , విపత్తులను ఎదుర్కొవడంలో సన్నద్దతకు ఉపకరిస్తుంది. 2) డాక్టర్ రాజేంద్ర కుమార్ భండారి భారతదేశంలోని జియో ముప్పుకు సంబంధించి శాస్త్రీయ అధ్యయనానికి పునాదివేసిన వారు. ఆయన సిఎస్ఐఆర్- సెంట్రల్ బిల్డింగ్ రిసెర్చి ఇన్స్టిట్యూట్ సిబిఆర్ ఐ వద్ద,మరో మూడు కేంద్రాలలో కొండచరియలు విరిగిపడడం దానికి సంబంధించి తొలి శాస్త్రీయ అధ్యయనాలకు పునాది వేశారు. భారతదేశంలో విపత్తులపై ఆయన అధ్యయనాలు చేశారు. ఇందుకు సంబంధించి అధునాతన రాడార్లను, జియోటెక్నికల్ డిజిటల్ సిస్టమ్ను , వైబ్రేటింగ్ వైర్ పీజోమీటర్లు, లేసర్ పార్టికల్ అనలైజర్, పైల్ డ్రైవ్ అనలైజర్, అకౌస్టిక్ ఎమిషన్ టెక్నాలజీ ని లోతైన పరిశోధన, ఇన్స్ట్రుమెంటేషన్, మానిటరింగ్, రిస్క్ అనలసిస్, కొండచరియలు విరిగిపడడం వంటి వాటికి సంబంధించి హెచ్చరికలు వంటి వాటి విషయంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చారు. విపత్తలను తట్టుకునే ఆవాసాల నిర్మాణం, జాతీయ రహదారుల నిర్మాణానిఇక సంబంధించి శాస్త్రీయ పరిశోదనలు, ఇంజనీరింగ్ నైపుణ్యాలకు ఒక ఉదాహరణగా నిలిచారు. డైరక్షనల్ డ్రిల్లింగ్ ద్వారా ద్వారా కోండచరియలు పడిపోకుండా చూడడం, దేశంలో కోండచరియలు పడిపోవడానికి సంబంధించి న ముప్పు పై అట్లాస్ రూపకల్పన వంటివి ముఖ్యమైనవి. దీనిని బిల్డింగ్ మెటీరియల్స్ టెక్నాలజీ ప్రమోషన్ కౌన్సిల్ ప్రచురించింది. నేషనల్ డిజాస్టర్ నాలెడ్జ్ నెట్వర్క్ కోసం ఆయన చేసిన ప్రతిపాదనలను 2001లో ఉన్నతస్థాయి కమిటీ సిఫార్సులలో భాగం అయ్యాయి. ఇండియన్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్ ఫోరం కు ఆయన నాయకత్వం వహించారు. కొండచరియలు విరిగిపడడం వంటి విపత్తును ఎదుర్కొనేందుకు కార్యాచరణతో కూడిన సిఫార్సుల కు ఆయన నాయకత్వం వహించారు. అలాగే ఆయన విపత్తులను ఎదుర్కోవడంపై విద్యార్ధులకు పాఠ్యాంశాలు రూపొందించారు.
pib-274398
556df4de778474f3e5d27f9d6d412552e1fee2813e7c48c4a9ca3808a5a943af
tel
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తగ్గుదలబాటలో చికిత్సపొందుతున్న కోవిడ్ బాధితులు నెలరోజుల తరువాత మొదటి సారిగా చికిత్సలో ఉన్నవారి సంఖ్య 9 లక్షల లోపు కొత్తగా వస్తున్న కేసులకంటే కోలుకుంటున్నవారే మూడు వారాలుగా అధికం చికిత్స పొందుతూ ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య దేశవ్యాప్తంగా బాగా తగ్గుతో వస్తోంది. నెలరోజుల తరువాత మొట్టమొదటి సారిగా 9 లక్షలకంటే తక్కువ స్థాయికి పడిపోయింది. 9న 8.97 లక్షల కేసులు నమోదు కాగా ఈ రోజు ఆ సంఖ్య 8.93 లక్షలకు తగ్గింది. ప్రస్తుతం చికిత్సలో ఉన్నవారి సంఖ్య 8,93, 952 గా నమోదైంది. ఇది మొత్తం పాజిటివ్ కేసులలో 12.94% మాత్రమే. కోలుకుంటున్నవారి శాతం పెరుగుతున్నకొద్దీ చికిత్సలో ఉన్నవారి శాతం బాగా తగ్గుతూ వస్తున్నది. ఇప్పటివరకూ కోలుకున్నవారి సంఖ్య 59,06,069 మందిగా నమోదైంది. కోలుకున్నవారికీ, చికిత్సలో ఉన్నవారికీ మధ్య తేడా 50 లక్షలు దాటింది. కచ్చితంగా చెప్పాలంటే 50,12, 477 మంది. కోలుకుంటున్నవారు పెరిగేకొద్దీ, ఈ తేడా కూడా పెరుగ్గుతూ వస్తోంది. కోలుకుంటున్నవారి సంఖ్య పెరిగేకొద్దీ, జాతీయస్థాయిలో కోలుకుంటున్నవారి శాతం కూడా పెరుగూ వస్తోంది. జాతీయ స్థాయిలో కోలుకున్నవారి శాతం85.52% అయింది. గడిచిన 24 గంటల్లో 78.365 మంది కోలుకున్నారు.కొత్తగా నమోదైన కేసులు 70,496 ఉన్నాయి. కొత్తగా వస్తున్న కేసులకంటే కొత్తగా కోలుకుంటున్నవారి సంఖ్య వరుసగా మూడు వారాలుగా పెరుగుతూనే ఉంది. మూడువారాలౌలుగా నమోదవుతున్న కొత్త కేసులు తగ్గుతూ వస్తున్నాయి.రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఉమ్మడిగా కేంద్ర ప్రభుత్వసహకారంతో సాగిస్తున్న కృషిఫలితంగా, ఆస్పత్రులు నాణ్యమైన సేవలందిస్తూ ప్రామాణిక విధానాలు పాటించటం వల్లనే ఇది సాధ్యమైంది. కొత్త కేసులలో 75% మేరకు 10 రాష్ట్రాలలోనే కేంద్రీకృతమయ్యాయి. వాటిలో మహారాష్ట, కర్నాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ ఢిల్లీ, మధ్యప్రదేశ్ ఉన్నాయి. మహారాష్ట ఒక్కటే గరిష్ఠంగా ఒక్క రోజులో 15,000 కేసులు నమోదు చేసింది. 70,496 కొత్తకేసులు గత 24 గంటలలో నమోదయ్యాయి. కొత్త కెసులలో 78% 10 రాష్ట్రాలనుంచే నమోదు కాగా ఇందులో కూడా మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ 13,000 కేసులు నమోదయ్యాయ్తి. ఆ తరువాత స్థానం 10,000 కేసులతో కర్నాటక నమోదు చేసుకుంది. గడిచిన 24 గంటలలో 964 మరణాలు నమోదయ్యాయి. వీటిలో దాదాపు 82% కేవలం పది రాష్ట్రాలలోనే కేంద్రీకృతమయ్యాయి. 37% పైగా కొత్త మరణాలు మహారాష్ట్రలొ నమోదయ్యాయి. ఎంటర్టైన్మెంట్ పార్కులు, తదితర స్థలాలు తరచూ జనం పెద్ద సంఖ్యలో గుమికూడే ప్రదేశాలు కాబట్టి అక్కడ కోవిడ్ వ్యాప్తి చెందకుండా కేంద్ర ఆరోగ్య, క్టుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ప్రామాణిక ఆచరణావిధానాలు రూపొందించ వలసిందిగా కోరింది. ఆ సమాచారం ఈ కింది లింక్ లో చూడవచ్చు. https://www.mohfw.gov.in/pdf/SOPonpreventivemeasurestobefollowedinEntertainmentParksandsimilarplacestocontainspreadofCOVID19.pdf
pib-38893
2b7eda6b41b0843e5cbbb6af6ba5d5b5fd2a68939ebd38083326e5e9a14b62e8
tel
| PIB Headquarters | కోవిడ్-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం (కోవిడ్-19కు సంబంధించి గత 24 గంటల్లో జారీ చేసిన పత్రికా ప్రకటనలతోపాటు పీఐబీ వాస్తవాలను తనిఖీచేసిన అంశాలు ఇందులో లభ్యమవుతాయి) - దేశంలో 10,632 మందికి కోవిడ్-19 నయంకాగా- కోలుకున్నవారి శాతం 26.59కి పెరిగింది. - నిన్నటి నుంచి దేశవ్యాప్తంగా 2,644 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 39,980కి చేరింది. - ఎంఎస్ఎంఈలు, రైతులకు మద్దతిచ్చే వ్యూహాలు, చర్యలతోపాటు ద్రవ్యలభ్యత, రుణపరపతి బలోపేతంపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి, అధికారులతో సమావేశంలో ప్రధానమంత్రి చర్చ. - రాష్ట్ర ప్రభుత్వాలు వెసులుబాటు కల్పించే, తీసుకొచ్చే ప్రయాణికులను మాత్రమే అనుమతిస్తున్నట్లు రైల్వేశాఖ స్పష్టీకరణ కోవిడ్-19పై కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ తాజా సమాచారం దేశంలో ఇప్పటిదాకా కోవిడ్-19 బారినపడి నయమైనవారి సంఖ్య 10,632కు చేరగా, వీరిలో గడచిన 24 గంటల్లో కోలుకున్నవారు 682మంది. దీంతో మొత్తం కోలుకున్నవారి శాతం 26.59కి పెరిగింది. దేశవ్యాప్తంగా నమోదైన కోవిడ్-19 నిర్ధారిత కేసుల సంఖ్య 39,980 కాగా, నిన్నటినుంచి 2,644 కొత్త కేసులు నమోదయ్యాయి. కాగా, దిగ్బంధం మూడోదఫాలోనూ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాల్సిందిగా దేశవాసులకు కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ విజ్ఞప్తి చేశారు. కోవిడ్-19 సంక్రమణ గొలుసును విచ్ఛిన్నం చేయడంలో ఇదొక కీలకచర్యగా ఆయన పేర్కొన్నారు. కోవిడ్-19 రోగులకు చికిత్సచేసే డాక్టర్లను అంటరానివారిలా చూడరాదని, కోలుకున్నవారిని కళంకితుల్లా భావించరాదని ప్రజలకు సూచించారు. మరిన్ని వివరాలకు... hhttps://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1620671 దేశంలో వృద్ధికి ఉత్తేజమిచ్చే విధంగా ఆర్థికరంగంలో చేపట్టాల్సిన నిర్మాణాత్మక సంస్కరణలు, సంక్షేమచర్యలపై చర్చకు విస్తృత సమావేశం నిర్వహించిన ప్రధాని ప్రస్తుత పరిస్థితుల నడుమ దేశంలో వృద్ధికి ఉత్తేజమిచ్చే దిశగా ఆర్థిక రంగంలో చేపట్టాల్సిన నిర్మాణాత్మక సంస్కరణలు, సంక్షేమ చర్యలకు సంబంధించిన వ్యూహాలపై చర్చించేందుకు ప్రధానమంత్రి ఒక విస్తృత సమావేశం నిర్వహించారు. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి, ఇతర అధికారులు ఇందులో పాల్గొన్నారు. దేశంలోని సూక్ష్మ-చిన్న-మధ్యతరహా పరిశ్రమల రంగంతోపాటు రైతులకు సంబంధించి ద్రవ్యలభ్యత పెంపు, రుణపరపతి బలోపేతం తదితర చర్యలపై వారితో చర్చించారు. కోవిడ్-19 నేపథ్యంలో ఆర్థిక సుస్థిరతకు భరోసా ఇవ్వగల తక్షణ మార్గాలుసహా ఈ మహమ్మారి ప్రభావం నుంచి వ్యాపారాలు త్వరగా కోలుకునే దిశగా తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చించారు. అలాగే కార్మికులు, సామాన్యుల సంక్షేమం అంశాన్ని కూడా ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. కోవిడ్-19 సృష్టించిన అంతరాయాలను అధిగమించి లాభదాయక ఉపాధి అవకాశాలు సృష్టించగలిగేలా వ్యాపార రంగానికి చేయూతనివ్వడంపై దృష్టి సారించాల్సి ఉందని పేర్కొన్నారు. లేడీ హార్డింజ్ వైద్యకళాశాల ఆస్పత్రిలో కోవిడ్-19 నియంత్రణ పరిస్థితిని స్వయంగా సమీక్షించిన డాక్టర్ హర్షవర్ధన్ దేశంలో కోవిడ్-19 రోగులకు వైద్యసేవలు అందించడంలో ఆరోగ్య సంరక్షణ నిపుణులు, కార్యకర్తలు తదితర ముందువరుస పోరాట యోధుల దీక్ష, కఠోరశ్రమ, అంకితభావం ప్రశంసనీయమని డాక్టర్ హర్షవర్ధన్ కొనియాడారు. “కోవిడ్-19 నుంచి కోలుకుంటున్నవారి శాతం స్థిరంగా పెరుగుతోంది. దీన్నిబట్టి పెద్దసంఖ్యలో రోగులు వ్యాధి నయం చేసుకుని ఇళ్లకు వెళ్తున్నారని స్పష్టమవుతోంది. ఈ మేరకు ప్రస్తుతం 10,000 మందికిపైగా రోగులు సాధారణ జీవనం గడుపుతున్నారు. ఇంకా ఆస్పత్రుల్లో ఉన్నవారిలో అధికశాతం వేగంగా కోలుకుంటున్నారు. ముందువరుసలోని ఆరోగ్య సంరక్షణ సిబ్బంది ఎంతో నాణ్యమైన చికిత్స అందిస్తున్నారని చెప్పడానికి ఇదే నిదర్శనం. ఈ ఘన విజయం సాధించినందుకు వారిని అభినందిస్తున్నాను” అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వెసులుబాటు కల్పించే, తరలించే ప్రయాణికులను మాత్రమే అనుమతిస్తామని రైల్వేశాఖ స్పష్టీకరణ దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు, యాత్రికులు, పర్యాటకులు, విద్యార్థులు తదితరులను తరలించడంపై రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తిమేరకు మాత్రమే కొన్ని ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వేశాఖ స్పష్టం చేసింది. ఆ మేరకు రాష్ట్రాలు వెసులుబాటు కల్పించే, తరలించే ప్రయాణికులను మాత్రమే అనుమతిస్తామని వివరించింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రయాణికుల రైళ్ల రద్దు యథాతథంగా కొనసాగుతుందని పేర్కొంది. కరోనా యోధులకు భారతదేశం శిరసాభివందనం కోవిడ్ యోధుల సహకారంతో ప్రపంచ మహమ్మారి కరోనా వైరస్పై భారత్ పోరాటం విజయవంతంగా సాగుతోంది. ఆ మేరకు కరోనా నియంత్రణలో జాతి చేస్తున్న కృషికి చేయూతగా భారత వాయుసేన-ఐఏఎఫ్ జాతీయ, అంతర్జాతీయ స్థాయులలో నిపుణులను, అవసరమైన సామగ్రిని తరలిస్తూ తనవంతు కర్తవ్యం నిర్వర్తిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటిదాకా 600 టన్నుల వైద్య సరఫరాలతోపాటు పెద్దసంఖ్యలో డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బంది, వైద్య పరికరాలు, కోవిడ్ నిర్ధారణ ప్రయోగశాలల ఏర్పాటుకు కావాల్సిన సామగ్రి తదితరాలను చేరవేసింది. అంతేకాదు... కరోనాపై పోరాటానికి ఐఏఎఫ్ సిబ్బంది సహకారం ఇకమీదట కూడా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో తన సోదర సంస్థలతో కలసి, తమదైన శైలిలో దేశవ్యాప్తంగాగల కరోనా యోధులకు కృతజ్ఞతలు తెలపాలని నిర్ణయించింది. తదనుగుణంగా వాయుసేన యుద్ధవిమానాలు గగనతలంలో ఎగురుతూ- ప్రపంచ మహమ్మారి కరోనా వైరస్పై ప్రస్తుత అనూహ్య పరిస్థితుల నడుమ అవిశ్రాంతంగా, నిస్వార్థంగా సేవలందిస్తున్న కోవిడ్ యోధులకు కృతజ్ఞతాభివందనం చేశాయి. కోవిడ్-19పై పోరాటంలో అసమాన కృషి, త్యాగనిరతి ప్రదర్శిస్తున్న కరోనా యోధులకు దేశీయాంగ శాఖ మంత్రి అభివందనం “కరోనా యోధులకు భారతదేశం శిరసాభివందనం చేస్తోంది. మోదీ ప్రభుత్వంతోపాటు దేశం మొత్తం మీకు అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా నేను హామీ ఇస్తున్నాను. సవాళ్లను అవకాశాలుగా మలచుకోవడంద్వారా కరోనా నుంచి మనం దేశాన్ని విముక్తం చేసుకోవాలి. ఆ మేరకు బలమైన, ఆరోగ్యకర, సౌభాగ్య భారతాన్ని సృష్టించడంద్వారా ప్రపంచానికి మనం ఆదర్శంగా నిలవాలి. జైహింద్!” అని శ్రీ అమిత్ షా ఒక ట్వీట్ద్వారా సందేశమిచ్చారు. 9, 10 తరగతులకు ప్రత్యామ్నాయ విద్యా కేలండర్ను ఆవిష్కరించిన హెచ్ఆర్డి మంత్రి ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ- అందుబాటులోగల వివిధ సాంకేతిక, సామాజిక మాధ్యమ ఉపకరణాల సాయంతో విద్యార్థులకు వినోదాత్మకంగా, ఆసక్తికరంగా విద్యనందించే పద్ధతులపై మార్గదర్శకాలను ఈ కేలండర్ వివరిస్తుందని చెప్పారు. ఆ మేరకు ఇంటివద్దనే పాఠ్య ప్రణాళికను పూర్తిచేయడంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులేగాక ఉపాధ్యాయులకూ అవగాహన లభిస్తుందన్నారు. దీనికి సంబంధించి విద్యార్థులకు మొబైల్ ఫోన్, రేడియో, టెలివిజన్, ఎస్ఎంఎస్, వివిధ సామాజిక మాధ్యమాలవంటి ఉపకరణాల అందుబాటు స్థాయులను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపారు. కోవిడ్-19తో పోరాడుతూ లోక్పాల్ ఆఫ్ ఇండియా న్యాయవిభాగ సభ్యుడు జస్టిస్ అజయ్కుమార్ త్రిపాఠీ మృతి లోక్పాల్ ఆఫ్ ఇండియా న్యాయవిభాగ సభ్యుడు అజయ్కుమార్ త్రిపాఠీ కోవిడ్-19తో న్యూఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ శనివారం, 2020 మే 2న రాత్రి సుమారు 8:45 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయనకు కరోనా వైరస్ సోకడంతో శ్వాస కష్టంకాగా, 2020 ఏప్రిల్ 2న ఎయిమ్స్లో చేరారు. కోవిడ్-19 దిగ్బంధం సందర్భంగా 2020 ఏప్రిల్లో రికార్డుస్థాయిన రూ.52 కోట్ల స్థూల విక్రయాలు నమోదు చేసిన జనౌషధి కేంద్రాలు కోవిడ్-19 దిగ్బంధం కారణంగా మందుల కొనుగోళ్లు రవాణాలో సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ ప్రధానమంత్రి భారతీయ జనౌషధి కేంద్రాలు 2020 ఏప్రిల్లో రూ.52 కోట్ల విక్రయాలతో 2020 మార్చిలో సాధించిన రూ.42 కోట్ల స్థాయిని అధిగమించి రికార్డు సృష్టించాయి. కాగా, 2019 మార్చిలో అమ్మకాలు కేవలం రూ.17 కోట్లు కావడం ఈ సందర్భంగా గమనార్హం. సంక్షభాన్ని అధిగమించేందుకు భాగస్వాములందరూ ఏకీకృత విధానాలను అనుసరించాలి: శ్రీ నితిన్ గడ్కరీ కోవిడ్-19 వ్యాప్తి నిరోధానికి అవసరమైన ముందుజాగ్రత్త చర్యలన్నిటినీ తప్పకుండా అమలు చేసేలా పరిశ్రమల యాజమాన్యాలు శ్రద్ధ వహించాలని శ్రీ గడ్కరీ పిలుపునిచ్చారు. వ్యక్తిగత రక్షణ సామగ్రి వినియోగానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. అదేవిధంగా వ్యాపార కార్యకలాపాల్లో సామాజిక దూరం నిబంధనను తూచా తప్పకుండా అనుసరించాలని సూచించారు. దేశం నుంచి ఎగుమతుల పెంపుతోపాటు దేశీయ ఉత్పాదనద్వారా దిగుమతులకు ప్రత్యామ్నాయాలు చూపడంపై దృష్టి నిలపాలని కేంద్ర మంత్రి అన్నారు. వస్తుసామగ్రితో/ఖాళీగా వెళ్లే వాహనాలకు ఇబ్బందులపై డ్రైవర్లు/రవాణాదారుల సమస్యలు, ఫిర్యాదుల పరిష్కారం దిశగా దేశీయాంగ శాఖ కంట్రోల్ రూమ్ సేవలు దిగ్బంధం నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాలకు వస్తుసామగ్రితో/ఖాళీగా వెళ్లే వాహనాలకు ఎదురయ్యే ఇబ్బందులపై డ్రైవర్లు/రవాణాదారుల సమస్యలు, ఫిర్యాదులకు సత్వర పరిష్కారం కోసం దేశీయాంగశాఖ నిర్వహిస్తున్న కంట్రోల్రూమ్ సేవలను వాడుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం సదరు కంట్రోల్ రూమ్లో కేంద్ర రోడ్డు రవాణా-జాతీయ రహదారుల శాఖ అధికారులను కూడా నియమించనున్నట్లు ప్రకటించింది. కాగా, ఈ కంట్రోల్ రూమ్లోగల 1930, 1033 నంబర్లకు సహాయం కోసం ఫోన్ చేయవచ్చు. ‘లైఫ్లైన్ ఉడాన్’ కింద 430 విమానాల సేవలు ‘లైఫ్లైన్ ఉడాన్’ కింద ఎయిరిండియా, అలయెన్స్ ఎయిర్, ఐఏఎఫ్, ఇతర ప్రైవేటు విమానయాన సంస్థలు ఇప్పటిదాకా 430 విమానాలను నడిపాయి. వీటిలో ఎయిరిండియా, అలయెన్స్ ఎయిర్ సంస్థలు నడిపిన 252 విమానాలద్వారా 795.86 టన్నుల సామగ్రిని రవాణా చేశాయి. లైఫ్లైన్ ఉడాన్ విమానాలు ఇప్పటిదాకా 4,21,790 కిలోమీటర్ల మేర నడిచాయి. ఇక జమ్ముకశ్మీర్, లద్దాఖ్, ద్వీప ప్రాదేశికాలు, ఈశాన్య భారత ప్రాంతంలోని మారుమూల ప్రదేశాలకు పవన్హన్స్ లిమిటెడ్ సంస్థసహా పలు హెలికాప్టర్ సర్వీసులు వైద్య సామగ్రితోపాటు రోగులను కూడా తీసుకెళ్లాయి. పవన్హన్స్ సంస్థ 2020 మే 2దాకా 7,729 కిలోమీటర్లు ప్రయాణించి 2.27 టన్నుల సామగ్రిని రవాణా చేశాయి. కోవిడ్ అనంతర కాలంలో వెదురు వనరుల మద్దతుతో దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఉత్తేజమిచ్చే అవకాశం: డాక్టర్ జితేంద్ర సింగ్ కోవిడ్ అనంతరం భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజమివ్వడంలో వెదురు వనరులు కీలకం కాగలవని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మన దేశం ప్రపంచంలో ప్రధాన ఆర్థికశక్తిగా అవతరిస్తుందని ఆయన పేర్కొన్నారు. కోవిడ్-19 పరిస్థితుల నేపథ్యంలో గిరిజనులకు మద్దతు దిశగా సూక్ష్మ అటవీ ఉత్పత్తుల కొనుగోళ్ళు వేగిరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచన కోవిడ్-19 సృష్టించిన సంక్షోభం నుంచి గిరిజనులకు మద్దతిచ్చే దిశగా సూక్ష్మ అటవీ ఉత్పత్తుల కొనుగోళ్ళు వేగిరపరచాలని కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. సూక్ష్మ అటవీ ఉత్పత్తుల సేకరణకు ఇది సరైన సమయం కావడంవల్ల ఈ తరుణంలో గిరిజనులకు మద్దతుగా నిలవాలని పేర్కొంది. ‘పీఎం కేర్స్’ నిధికి రూ.2.5 కోట్ల విరాళమిచ్చిన ఈపీఎఫ్వో ఉద్యోగులు ‘భవిష్యత్ నదీ నిర్వహణ’పై ఎన్ఎంసీజీ-ఎన్ఐయూఏ ‘ఐడియా’థాన్ భవిష్యత్ నదీనిర్వహణ వ్యూహాలను కోవిడ్-19 సంక్షోభం ఎలా ప్రభావితం చేస్తుందన్న అంశంపై ‘భవిష్యత నదీ నిర్వహణ’ పేరిట జలశక్తి మంత్రిత్వశాఖ పరిధిలోని ‘పరిశుభ్ర గంగానది కోసం జాతీయ కార్యక్రమం’ , జాతీయ పట్టణ వ్యవహారాల సంస్థ సంయుక్తంగా ‘ఐడియా’థాన్ నిర్వహించాయి. ప్రపంచంలోని అనేక దేశాల్లో ఏదో ఒక రూపంలో దిగ్బంధం కొనసాగిన నేపథ్యంలో కోవిడ్-19 సంక్షోభ నిర్వహణ ఒక సవాలుగా పరిణమించింది. ఈ సంక్షోభం పర్యవసానాలపై ఆందోళన, ఆదుర్దా సర్వసాధారణమే అయినా, ఇది కొన్ని సానుకూల పరిణామాలకూ దారితీస్తోంది. పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం - కేరళ: రాష్ట్రంలోని తిరువనంతపురం, కోచ్చి నగరాల్లో సాయుధ దళాలు ఇవాళ కోవిడ్-19 యోధులకు వందనం-కృతజ్ఞతలు తెలియజేశాయి. వలస కార్మికుల తరలింపు నిమిత్తం రైల్వేశాఖ ఇవాళ నాలుగు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ రైళ్లు త్రిస్సూర్, కన్నూర్, ఎర్నాకుళం నుండి బయల్దేరాయి. మరోవైపు గల్ఫ్ దేశాల్లోగల కేరళీయులలో మరో ఐదుగురు కోవిడ్-19కు బలయ్యారు. రాష్ట్రంలో నిన్నటి వరకు మొత్తం కేసులు: 499, యాక్టివ్ కేసులు: 96, డిశ్చార్జ్ అయినవారు: 400 మంది, మరణాలు: 4. - తమిళనాడు: చెన్నైలోని కోవిడ్ ఆస్పత్రులపై సాయుధ దళాలు ఇవాళ పుష్పవర్షం కురిపించాయి. కాగా, రేపటినుంచి అన్ని జోన్లలోనూగల నియంత్రణేతర ప్రాంతాలలో దిగ్బంధం సడలించేందుకు నిర్ణయించడంతో ఆర్థిక కార్యకలాపాలు పునఃప్రారంభం కానున్నాయి. కాగా, విల్లుపురంలో ఇద్దరు పిల్లలుసహా 25 మందికి కోవిడ్-19 సోకినట్లు నిర్ధారణ అయింది. పుదుచ్చేరిలోని జిప్మెర్లో కేన్సర్ రోగికి కోవిడ్-19 నిర్ధారణ అయిన నేపథ్యంలో 44 మంది ఆరోగ్య కార్యకర్తలను నిర్బంధ వైద్య పరిశీలనకు తరలించారు. తమిళనాడులో నిన్నటిదాకా మొత్తం కేసులు: 2,757, వీటిలో యాక్టివ్ కేసులు: 1,384, మరణాలు: 29, డిశ్చార్జ్ అయినవారు: 1341 మంది. కాగా, చెన్నై అత్యధిక కేసులతో అగ్రస్థానంలో ఉంది. - కర్ణాటక: రాష్ట్రంలో ఇవాళ 5 కొత్త కేసులు నిర్ధారణ కావడంతో మొత్తం కేసుల సంఖ్య 606కు చేరింది. కొత్త కేసులలో కల్బుర్గి 3, బాగల్కోట్ 2వంతున ఉన్నాయి. ఇప్పటివరకు 25 మంది మరణించగా, 282 మంది నయమై డిశ్చార్జ్ అయ్యారు. తమ తరలింపులో అధిక చార్జీలు వసూలు చేయడంపై వలస కార్మికుల నిరసనతో వారికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. - ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రెడ్జోన్లలోగల ప్రతి ఇంటిలో ఒకరికి కోవిడ్-19 పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా, గుంటూరు వైద్య కళాశాల నైతిక నియమాల కమిటీ ప్లాస్మా చికిత్స విధానానికి ఆమోదం తెలిపింది. అయితే, దీనికి సంబంధించిన తమ నివేదికను ఐసీఎంఆర్ స్పందన కోసం ఈ కమిటీ నివేదించనుంది. గడచిన 24 గంటల్లో 58 కేసులు నమోదు కాగా, వీరిలో ఒక్క కర్నూలు జిల్లావాసులే 30 మంది ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు 1583కాగా, యాక్టివ్ కేసులు: 1,062, డిశ్చార్జ్ అయినవారు: 488 మంది, మృతులు: 33 మంది. ఇప్పటిదాకా 1,14,937 పరీక్షలు నిర్వహించి నేపథ్యంలో కర్నూలు , గుంటూరు , కృష్ణా జిల్లాలు కేసుల సంఖ్యరీత్యా తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. - తెలంగాణ: రాష్ట్రంలో కోవిడ్ 'యోధులకు' కృతజ్ఞతలు తెలుపుతూ, భారత వైమానిక దళం హెలికాప్టర్ గాంధీ ఆసుపత్రిపై పూలవర్షం కురిపించింది. దిగ్బంధం ప్రకటించిన నాటినుంచి హైదరాబాద్ నగరంలో వాయు, జల నాణ్యత గణనీయంగా మెరుగుపడటాన్ని పర్యావరణ నిపుణులు ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. ఈ పరిస్థితిని కాపాడుకోవడంపై శ్రద్ధ చూపకపోతే మళ్లీ ముప్పు తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. కాగా, ఉత్తర భారతదేశం నుంచి వస్తున్న వలస కార్మికులు ఆహారం, నిత్యావసరాల కోసం మైళ్లకొద్దీ దూరం నడవాల్సి వస్తోంది. రాష్ట్రంలో నిన్నటిదాకా నమోదైన కేసులు 1,061, యాక్టివ్ కేసులు 533, కోలుకున్నవారు 499, మొత్తం మరణాలు 29. - అరుణాచల్ ప్రదేశ్: కరోనా వైరస్పై పోరాటంలో ముందువరుసనగల ఆరోగ్య సంరక్షకులకు భారత వైమానిక దళ విమానాలు వందనం చేస్తూ గగనతలంలో విహరించాయి. - అసోం: కరోనా వైరస్ వ్యాప్తి నడుమ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దటానికి అసోం ప్రభుత్వం 8 మంది సభ్యులతో కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేసింది. - మణిపూర్: భారత ఆహార సంస్థ పంజాబ్, హర్యానాల నుంచి మణిపూర్కు 29000 టన్నుల ఆహార ధాన్యాలను తరలించింది. - మిజోరం: దిగ్బంధం నేపథ్యంలో రాష్ట్రంలోని మామిట్ జిల్లా పరిధిలోగల గ్రామాల్లో 324 కుటుంబాలకు ఐవోసీ సరఫరాల విభాగం వంటగ్యాస్ సిలిండర్లను అందించింది. - నాగాలాండ్: కోవిడ్ -19పై జిల్లా కార్యాచరణ బృందం ప్రారంభించిన 'అందరికీ మాస్క్లు' కార్యక్రమం కింద నాగాలాండ్లోని మోకోక్చుంగ్ వాసులు సమష్టిగా 2 లక్షల ఫేస్ మాస్క్లు తయారుచేయనున్నారు. - త్రిపుర: కోవిడ్-19పై పోరులో భాగంగా అంకితభావంతో సేవలందిస్తున్న కరోనా యోధులకు కృతజ్ఞతగా పూలవర్షం కురిపిస్తూ భారత వాయుసేన గగనతలంలో చేసిన విన్యాసం అద్భుతమని ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు. - చండీగఢ్: ఈ కేంద్రపాలిత ప్రాంతంలో మరో రెండు వారాలపాటు- 2020 మే 17 వరకు దిగ్బంధం పొడిగించబడింది. అయితే, నగరంలో మే 3 అర్ధరాత్రి నుంచి కర్ఫ్యూ తొలగిస్తారు. నగరంలో ఇప్పటికే ప్రకటించిన, అధికార యంత్రాంగం గుర్తించిన ప్రాంతాలను మాత్రమే నియంత్రణ జోన్లుగా పరిగణిస్తారు. సంబంధిత జోన్లలో అన్ని కేసుల విషయంలోనూ ముమ్మర పరిశీలన, పరీక్షల నిర్వహణను యంత్రాంగం తప్పనిసరి చేసింది. - పంజాబ్: రాష్ట్రంలోని గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంటవరకూ మాత్రమే దుకాణాలు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఇక రెడ్, నియంత్రణ జోన్లలో సడలింపులు ఉండవు. ఇక కోవిడ్-19 మహమ్మారి పరిస్థితుల నడుమ వస్తురవాణా చేస్తున్న వాహనాలతోపాటు వాటిని నడిపే డ్రైవర్లు/కార్మికుల వ్యక్తిగత పరిశుభ్రతపై శ్రద్ధ వహించాలని పంజాబ్ ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ తాజా సలహాపత్రంలో ఆదేశించింది. - హర్యానా: రాష్ట్రంలో చిక్కుకున్న వ్యక్తులు, వలస కార్మికులను అంతర్రాష్ట్ర ప్రయాణానికి అనుమతించే దిశగా ఆన్లైన్ నమోదు కోసం https://edisha.gov.in/eForms/MigrantService అనే వెబ్ పేజీని ప్రభుత్వం ప్రారంభించింది. కోవిడ్-19 పరిస్థితుల నేపథ్యంలో పరస్పర మార్పిడి ద్వారా పుస్తకాల పంపిణీపై సమాచారం అందించాలని హర్యానా ప్రభుత్వం అన్ని జిల్లాల విద్యాధికారులు, ప్రాథమిక విద్యాధికారులు, ప్రాజెక్టు సమన్వయకర్తలు, సమితి విద్యాధికారులు, ప్రాథమిక విద్యాధికారులను ఆదేశించింది. దీనికి సంబంధించి విద్యాధికారి, పాఠశాల ప్రధానాధిపతి/ఇన్చార్జిలతోపాటు ఎస్ఎంసిల అధ్యక్షులు, సభ్యులకు కూడా మార్గదర్శకాలు జారీచేసింది. - హిమాచల్ ప్రదేశ్: కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో రాష్ట్రమంతటా కర్ఫ్యూ కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది, అయితే, 2020 మే 4 నుంచి కర్ఫ్యూ సమయం సడలింపును 4 గంటల నుంచి 5 గంటలకు పెంచనుంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరణ కోసం కొత్తగా ప్రకటించినముఖ్యమంత్రి షహరీ రోజ్గార్ యోజనకింద పట్టణాల్లోని ప్రజలకు 120 రోజుల ఉపాధికి హామీ కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ దిశగా అవసరమైతే, నైపుణ్యాభివృద్ధికి తగిన శిక్షణ ఇవ్వబడుతుందని తెలిపింది. - మహారాష్ట్ర: మహారాష్ట్రలో ఇవాళ ఒకేరోజు 790 కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 12,296కు దూసుకెళ్లింది. అలాగే 521 మరణాలతో మృతుల సంఖ్యరీత్యా రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. ఇక రాజధాని ముంబైకి సంబంధించి కేసులు 8,359 కాగా, మరణాలు 322గా ఉన్నాయి. రాష్ట్రంలోని నాసిక్ జిల్లాలో మరో 27 మందికి వ్యాధి నిర్ధారాణ కావడంతో కేసుల సంఖ్య 360కి పెరిగినట్లు జిల్లా యంత్రాంగం తెలిపింది. కాగా, ఈ కేసులలో ఒక్క మాలెగావ్లోనే 324 నమోదవడం గమనార్హం. కాగా, వేలాదిమంది ‘కోవిడ్ -19 యోధుల’ గౌరవార్థం ముంబైలో భారత వైమానిక దళ యుద్ధ విమానాలు నిర్వహించిన అద్భుత విన్యాసం అందర్నీ ఆకట్టుకుంది. కరోనావైరస్ మహమ్మారితో పోరాటంలో ముందున్న వీరులకు కృతజ్ఞతలు తెలిపేందుకు దేశవ్యాప్తంగా చేసిన కసరత్తులో ఒక భాగంగా ఈ ప్రదర్శన సాగింది. - గుజరాత్: రాష్ట్రంలో 333 కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 5,054కు చేరింది. కాగా, ఇప్పటివరకూ 26 మరణాలు నమోదయ్యాయి. ఇక ఒకేరోజు గరిష్ఠ కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. ఇవాళ్టి 333 కేసులలో అత్యధికంగా అహ్మదాబాద్ 250, వడోదర, సూరత్లో 17 కేసుల వంతున నమోదయ్యాయి. - మధ్యప్రదేశ్: రాష్ట్రంలో ఇవాళ 127 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,846కు చేరింది. ఇప్పటిదాకా వ్యాధి సోకిన వారిలో 624 మంది కోలుకోగా 151 మంది మరణించారు. - రాజస్థాన్: రాష్ట్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం... రాజస్థాన్లో 104 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,770కి చేరింది. కాగా, ఇవాళ్టివరకూ నిర్ధారిత రోగులలో 1,121 మంది కోలుకోగా 65 మంది మరణించారు. - ఛత్తీస్గఢ్: ఆరోగ్య కార్యకర్తల తరహాలో ప్రధానమంత్రి సంక్షేమ ప్యాకేజీ కింద రాష్ట్రంలోని పోలీసులు, స్థానిక సంస్థల అధికారులు, జిల్లా పాలన యంత్రాంగం సిబ్బందిని చేర్చాలని ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తూ ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్ లేఖ రాశారు.
pib-88838
0cae8a41012cef2d5eb0fe2f5d75bafe8cfa4979b0a1693676b75d3f1827384b
tel
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కొవిడ్ టీకాల లభ్యతపై తాజా సమాచారం రాష్ట్రాలు, యూటీలకు ఇప్పటివరకు 193.53 కోట్లకు పైగా డోసులు పంపిణీ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వద్ద అందుబాటులో 18.64 కోట్లకుపైగా నిల్వలు దేశవ్యాప్తంగా కొవిడ్-19 టీకాల వేగాన్ని మరింత పెంచడానికి పరిధిని విస్తరించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమం గత ఏడాది జనవరి 16న ప్రారంభమైంది. కొవిడ్ టీకాల సార్వత్రికీకరణ కొత్త దశ 2021 జూన్ 21 నుంచి ప్రారంభమైంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మరిన్ని టీకాల లభ్యత, టీకాల లభ్యతపై దూరదృష్టిని పెట్టడం ద్వారా టీకా కార్యక్రమం వేగవంతమైంది. ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చక్కటి ప్రణాళికతో పని చేయడానికి, టీకా సరఫరా గొలుసును క్రమబద్ధీకరించడానికి దీనిని ప్రారంభించారు. సార్వత్రిక టీకా కార్యక్రమంలో భాగంగా, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉచితంగా కొవిడ్ టీకాలను అందించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం మద్దతునిస్తోంది. టీకా సార్వత్రీకరణ కొత్త దశలో, దేశంలో తయారవుతున్న టీకాల్లో 75 శాతాన్ని కేంద్ర ప్రభుత్వం సమీకరించి, వాటిని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉచితంగా సరఫరా చేస్తోంది. | | టీకా డోసులు | | | | పంపిణీ చేసినవి | | 1,93,53,58,865 | | అందుబాటులోని నిల్వలు | | 18,64,66,285 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ద్వారా , ప్రత్యక్ష సేకరణ పద్ధతిలో 193.53 కోట్లకు పైగా టీకా డోసులు అందాయి. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వద్ద 18.64 కోట్లకుపైగా నిల్వలు అందుబాటులో ఉన్నాయి.
pib-191918
86252e534957806861bb7dca8ddd907ab6787b1b5109ffc074790a4985ae2c1e
tel
రక్షణ మంత్రిత్వ శాఖ ఐఎఎఫ్ మిగ్ -29 ఎయిర్క్రాఫ్ట్ ప్రమాదం శిక్షణ కార్యక్రమాలలో భాగంగా జలంధర్ కు దగ్గరలోని వైమానిక స్థావరం నుంచి 2020 మే 8 న బయలుదేరిన మిగ్ -29 ఎయిర్క్రాఫ్ట్ ,ఉదయం 10.45 గంటలకు ప్రమాదానికి గురైంది. ఈ ఎయిర్ క్రాఫ్ట్లో సాంకేతిక లోపం తలెత్తడం , ఎయిర్ క్రాఫ్ట్ అదుపులోకి రాకపోవడంతో పైలట్ దానినుంచి సురక్షితంగా బయటపడ్డాడు. పైలట్ను హైలికాప్టర్ద్వారా కాపాడారు. ఈ ఘటనకు కారణాలపై దర్యాప్తు జరిపేందుకు కోర్ట్ ఆఫ్ ఎంక్వయిరీని ఆదేశించారు. (
pib-272262
df7cddfc3bd17d717488023389399041dede8720fed67a779a36742ac9e0c771
tel
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ 2021 ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం సందర్భంగా, పొగాకుకు దూరంగా ఉండేలా ప్రతిజ్ఞకు నాయకత్వం వహించిన కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ పొగాకును వదిలించుకునేందుకు కట్టుబడి ఉన్నాను..అన్నది 2021 ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం థీమ్ ఈ సిగరెట్ల బెడదకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమానికి నాయకత్వం వహించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిరంతర కృషివల్ల పొగాకు వాడకం 2009-10లో 34.6 శాతం ఉండగా 201617 నాటికి 28.6 శాతానికి తగ్గింది. అంటే ఆరు శాతం పాయింట్ల తగ్గుదల కనిపించింది. ప్రస్తుతం 16 భాషలలో క్విట్ లైన్ ఉచిత సేవలు అందుబాటులో ఉన్నాయి. ప్రజలు తమ ప్రవర్తనలో మార్పు తెచ్చుకుని పొగాకు వాడకం విడనాడాలన నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను: డాక్టర్ హర్షవర్ధన్ ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమానికి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతిఒక్కరూ పొగాకుకు దూరంగా ఉండేలా ప్రతిజ్ఞ చేయించారు. డిజిటల్ రూపంలో జరిగిని ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయమంత్రి శ్రీ అశ్విని కుమార్ చౌబే కూడా పాల్గొన్నారు. సరైన సమయంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు డాక్టర్ హర్షవర్ధన్ తమమ సంతృప్తిని వ్యక్తంచేశారరు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, ప్రతి సంవత్సరం భారత దేశంలో1.3 మిలియన్ల మరణాలు పొగాకు వాడినందువల్ల సంభవిస్తున్నాయని , అంటే రోజుకు 3,500 మంది చనిపోతున్నట్టు లెక్క అని ఆయన అన్నారు. దీనివల్ల సామాజిక ఆర్ధికంగా భారం పడుతుందని ఇది తప్పించలేనిదేమీ కాదని ఆయన అన్నారు. మరణాలు , దీనివల్ల వచ్చే వ్యాధులే కాకుండా పొగాకు దేశ ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందని అన్నారు. పొగతాగేవారిలో కోవిడ్ -19 కారణంగా తీవ్రవ్యాధిలక్షణాలతో మరణం సంభవించే రిస్క్ 40 నుంచి 50 శాతం ఎక్కువ ఉంటుందని ఆయన చెప్పారు. ఇండియాలో పొగాకు వాడడం వల్లే వచ్చే వ్యాధులవల్ల పడే ఆర్ధిక భారం, మరణాల పై అధ్యయన నివేదికను వెలువరించింది. దీని ప్రకారం పడే ఆర్దిక భారం 1.77 లక్షల కోట్లు . అంటే దేశ జిడిపిలో ఇది 1 శాతం. ప్రభుత్వం తీసుకుంటున్న చట్టబద్ధమైన పాలనాపరమైన చర్యలవల్ల పొగాకువినియోగించే ప్రజల సంఖ్య గణనీయంగా తగ్గుతున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. పొగాకు నియంత్రణ చట్టం 1975 ప్రకారం , సిగరెట్ పాకెట్లు, కార్టన్లపై ఆరోగ్య సంబంధ హెచ్చరికను తప్పనిసరిగా ప్రచురించాలని చెబుతోందిని తెలిపారు. పొగాకుకు వ్యతిరేకంగా తన కెరీర్లో తాను సాగించిన సుదీర్ఘ పోరాటం గురించి కేంద్ర ఆరోగ్యమంత్రి వివరించారు. ఢిల్లీ ఆరోగ్య మంత్రిగా ఢిల్లీ ప్రొహిబిషన్ ఆఫ్ స్మోకింగ్, నాన్ స్మోకర్స్ హెల్త్ ప్రొటక్షన్ యాక్ట్ను తీసుకువచ్చే అవకాశం తనకు కలిగిందని ఆయన తెలిపారు. దీనిని 1997 లో ఢిల్లీ శాసనసభలో ఆమోదింపచేశామననారు. ఈ చట్టమే 2002లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరరకు బహిరంగ ప్రదేశాలలో పొగతాగడాన్ని నిషేధిస్తూ కేంద్రం చట్టం తేవడానికి నమూనాగా ఉపయోగపడిందని ఆయన చెప్పారు. ఆ తర్వాత 2003లో సమగ్ర పొగాకు నియంత్రణ చట్టం వచ్చిందని ( సిగరెట్లు ఇతర పొగాకు ఉత్పత్తుల వ్యాపార ప్రకటనల నిషేధం, దాని వాణిజ్యం, వ్యాపారం, ఉత్పత్తి, సరఫరా, పంపిణీ నియంత్రణ చట్టం - సిఒటిపిఎ -2003 వచ్చిందని ఆయన తెలిపారు. దీనివల్ల బహిరంగ ప్రదేశాలలో పొగతాగకుండా చేయగలిగారని, పొగాకు ప్రకటనలు, ప్రోత్సామమంపై ఇది తగిన నియంత్రణలు తెచ్చిందని ఆయన తెలిపారు. డాక్టర్ హర్ష వర్ధన్ ఈ దిశగా సాగించిన కృషికి గుర్తింపుగా ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు లభించాయి. ఆయనకు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరక్టర్జనరరల్ కమెండేషన్ మెడల్, సర్టిఫికేట్ 1998 మేలో లభించింది. దీనిని వారికి బ్రెజిల్ లోని రియో డి జెనీరియో లో జరిగిన ఒక కార్యక్రమంలో పొగాకు రహిత సమాజానికి కృషి చేస్తున్నందుకు ఇచ్చారు. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల నిరంతర కృషి కారణంగా పొగాకు వాడకం 2009-10లో 34.6 శాతం ఉండగా ఇది 2016-17లో 6 పర్సెంటేజ్ పాయింట్లు తగ్గి 28.6 శాతానికి చేరడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. పొగాకు వినియోగాన్ని అదుపుచేసేందుకు ప్రభుత్వం రాజకీయంగా గట్టిగా కట్టుబడి ఉందని అంటూ ఆయన, తాను కేంద్ర ఆరోగ్య మంత్రిగా చేరిన వెంటనే ఈ సిగరెట్ల బెడదను ఎదుర్కోవాలని నిర్ణయించానని, దీనితో ప్రొహిబిషన్ ఆఫ్ ఎలక్ట్రానిఇక్ సిగరెట్స్ బిల్ 2019 ఆలోచన చేశామన్నారు. ఇది ఈ సిగరెట్ల ఉత్పత్తి, తయారీ, దిగుతి, ఎగుమతి, రవాణా, అమ్మకం, పంపిణీ, నిల్వ, వ్యాపార ప్రకటనలను నిషేధిస్తుందని చెప్పారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీజీ తన అద్భుత నాయకత్వంలో ఈ బిల్లును ఆమోదింపచేశారని అన్నారు. ప్రభుత్వ నిరంతర కృషి వలల్ దేశాన్ని ఈ సిగరెట్ల బెడదనుంచి రక్షించడానికి వీలు కలిగిందని అన్నారు. లేకుంటే ఇది టీనేజ్ పిల్లలపై పెద్ద ఎత్తున ప్రభావం చూపించి ఉండేదని ఆయన అన్నారు. టుబాకో క్విట్లైన్ సర్వీసెస్కు కాల్స్ పెరుగుతుండడాన్ని డాక్టర్ హర్ష వర్ధన్, మనకు టోల్ ఫ్రీ క్విట్ లైన్ సర్వీసులు 1800-112-356 ఉన్నాయని , దీనని 2016 లో ప్రారంభించామని చెప్పారు. దీనిని 2018లో మరింత విస్తరింప చేశామన్నారు. క్విట్ లైన్ సర్వీసులు ప్రస్తుతం 16 భాషలలో ఇతర స్థానిక మాండలికాఆలలోఓ 4 కేంద్రాలనుంచి పనిచేస్తున్నాయన్నారు. క్విట్లైన్ సర్వీసును విస్తరించకముందు నెలకు 20,500 కాల్స్ వస్తుండగా దాని విస్తరణ అనంతరం నెలకు 2.50 లక్షల కాల్స్ వస్తున్నాయని అన్నారు. పొగతాగడం, పొగాకు ఉత్పత్తుల వాడకం మానేయాల్సిందిగా ప్రజలకు డాక్టర్ హర్షవర్ధన్ మరోసారి పిలుపునిచ్చారు. 2017 జాతీయ ఆరోగ్య విధానం కింద ముఖ్యంగా పొగాకు నియంత్రణ విషయంలో పెట్టుకున్న లక్ష్యాల గురించి డాక్టర్ హర్షవర్ధన్ ప్రముఖంగా ప్రస్తావించారు. 2025 నాటికి పొగాకు వాడకాన్ని 30 శాతం తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారరు. సాంక్రమికేతర వ్యాధుల నియంత్రణ లక్ష్యాలు, సుస్థిరా భివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా ఈ లక్ష్యాలను రూపొందించుకున్నట్టు ఆయన తెలిపారరు. పాఠశాలకు వెళ్లే విద్యార్ధులైన 13-15 సంవత్సరాల మధ్యవయస్కులకు సంబంధించి గ్లోబల్ యూత్ టుబాకో సర్వే నాలుగవ రౌండ్ అధ్యయన ఫలితాలు త్వరలోనే విడుదల చేయనున్నట్టు ఆయన తెలిపారు. భాగస్వామ్య సంస్థలు, మంత్రిత్వశాఖ అధికారులు, క్షేత్రస్థాయ కార్యకర్తలు, ప్రత్యేకించి ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఇప్టటివరకకకూ పొగాకు వాడకాన్ని గణనీయంగా తగ్గించగలిగినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరక్టర్ జనరల్ , పొగాకు నియంత్రణలో తన సేవలు, మంత్రిత్వశాఖ సేవలు గుర్తించి, 2021 సంవత్సరానికి డైరక్టర్ జనరల్ ప్రత్యేక గుర్తింపు అవార్డును ప్రకటించినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రతి సంవత్సరం ప్రపంచ ఆరోగ్య సంస్థ తన ఆరు ప్రాంతాలలో పొగాకు నియంత్రణకు కృషిచేసిన వ్యక్తులు, సంస్థలను గుర్తిస్తుంది. కేంద్ర ఆరోగ్య అదనపు కార్యదర్శి శ్రీమతి ఆర్తి అహుజ, ఆరోగ్య అదనపు కార్యదర్శి శ్రీ వికాశ్ శీల్, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖకు చెందిన ఇతర సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
pib-233008
88541f53e891c0bd61cfa8f2e5f95ccb6770ee0331e4d15e52134ed52ee05531
tel
ప్రధాన మంత్రి కార్యాలయం మహారాష్ట్రలో రూ.75,000 కోట్ల విలువైన ప్రాజెక్టుల శంకుస్థాపన.. జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి మహారాష్ట్ర సమృద్ధి మహామార్గాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి; “మహారాష్ట్ర అభివృద్ధికి నేడు పదకొండు కొత్త నక్షత్రాల కూటమి ఆవిర్భవిస్తోంది”; “మౌలిక వసతులంటే నిర్జీవ రహదారులు.. ఫ్లై ఓవర్లకు పరిమితం కాదు; ఇతర రంగాలకూ విస్తరణ చాలా ముఖ్యం”; “లోగడ నిర్లక్ష్యానికి గురైనవారు నేడు ప్రభుత్వ ప్రాథమ్యంగా మారారు”; “అడ్డదారి రాజకీయాలు వ్యాధితో సమానం”; “అడ్డదారుల్లో వెళ్లే రాజకీయ పార్టీలు పన్ను చెల్లింపుదారులకు అతిపెద్ద శత్రువులు”; “అడ్డదారులతో ఏ దేశమూ ముందుకు వెళ్లదు.. దేశ ప్రగతికి దీర్ఘదృష్టితో శాశ్వత పరిష్కారాలు చాలా కీలకం”; “శాశ్వత ప్రగతి.. శాశ్వత పరిష్కారంతో కూడిన ఆర్థిక విధానానికి గుజరాత్ ఎన్నికల ఫలితాలే నిదర్శనం” ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ మహారాష్ట్రలో రూ.75,000 కోట్లకుపైగా విలువైన వివిధ పథకాలకు శంకుస్థాపనతోపాటు జాతికి అంకితం చేశారు. ఇందులో రూ.1500 కోట్లకుపైగా విలువైన జాతీయ రైలు ప్రాజెక్టులు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఒన్ హెల్త్ , నాగ్పూర్-నాగ్ నది కాలుష్య ప్రక్షాళన ప్రాజెక్ట్ కూడా వీటిలో భాగంగా ఉన్నాయి. మరోవైపు చంద్రాపూర్లోని ‘సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ’ ను ప్రధానమంత్రి దేశానికి అంకితం చేశారు. అలాగే ‘సెంటర్ ఫర్ రీసెర్చ్, మేనేజ్మెంట్ అండ్ కంట్రోల్ ఆఫ్ హిమోగ్లోబినోపతీస్’ను ఆయన ప్రారంభించారు. అంతకుముందు నాగ్పూర్-బిలాస్పూర్ మార్గంలో వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు. అదేవిధంగా ‘నాగ్పూర్ మెట్రో ఫేజ్-1’ను జాతికి అంకితం చేసి, రెండో దశ మెట్రోకు శంకుస్థాపన చేశారు. ఇవేగాక నాగ్పూర్-షిర్డీల మధ్య 520 కిలోమీటర్ల పొడవైన ‘హిందూ హృదయ సామ్రాట్ బాలాసాహెబ్ ఠాక్రే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్’ తొలిదశ రహదారిని ప్రధాని ప్రారంభించారు. అలాగే నాగ్పూర్లో రూ.1,575 కోట్లకుపైగా వ్యయంతో నిర్మించిన ‘ఎయిమ్స్’ ఆస్పత్రిని జాతికి అంకితం చేశారు. ఈ ఆస్పత్రిలో అత్యధునాతన సదుపాయాలతోపాటో ఓపీడీ, ఐపీడీ, రోగనిర్ధారణ సేవలు, శస్త్రచికిత్స గదులు ఉన్నాయి. వీటితోపాటు 38 వైద్య విభాగాలతో వైద్య విజ్ఞానానికి సంబంధించిన స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ సదుపాయాలు కూడా ఉన్నాయి. ఈ ఆస్పత్రి ఏర్పాటుతో మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతానికి ఆధునిక ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. అంతేకాకుండా గడ్చిరోలి, గోండియా, మేల్ఘాట్ వంటి పరిసర గిరిజన ప్రాంతాలకు ఇదొక వరమని చెప్పవచ్చు. ఈ కార్యక్రమాల అనంతరం ప్రధానమంత్రి ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ- పవిత్ర శంకాష్టి చతుర్థి నేపథ్యంలో గణేశుని ప్రస్తుతించారు. ఇది అత్యంత ప్రత్యేకమైన రోజని, నాగ్పూర్ నుంచి అనేక ప్రగతి పనులు ప్రారంభమయ్యాయని ప్రధాని గుర్తుచేశారు. దీంతో మహారాష్ట్ర ప్రజల జీవితాల్లో పరివర్తనాత్మక మార్పులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు “మహారాష్ట్ర అభివృద్ధికి నేడు పదకొండు కొత్త నక్షత్రాలతో ఓ కూటమి ఆవిర్భవిస్తోంది. ఇది కొత్త దిశను నిర్దేశిస్తూ రాష్ట్రాన్ని సమున్నత శిఖరాలకు చేర్చడంలో తోడ్పడుతుంది” అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా 11 కొత్త ప్రాజెక్టుల జాబితాను ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఈ మేరకు “నాగ్పూర్ నుంచి షిర్డీ వరకు ‘హిందూ హృదయ సామ్రాట్ బాలాసాహెబ్ ఠాక్రే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్’ ఇప్పుడు సిద్ధమైంది. ‘ఎయిమ్స్’ విదర్భ ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఒన్ హెల్త్ ఏర్పాటైంది. చంద్రపూర్లో నిర్మించిన ‘ఐసీఎంఆర్’ పరిశోధన కేంద్రం, ‘సీఐపీటీ’ ఏర్పాటయ్యాయి. నాగ్ నది కాలుష్య ప్రక్షాళన, నాగ్పూర్ మెట్రో ఫేజ్-1 ప్రారంభోత్సవంతోపాటు ఫేజ్-2కు శంకుస్థాపన, నాగ్పూర్-బిలాస్పూర్ మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభం, నాగ్పూర్, అజ్ని రైల్వేస్టేషన్ల నవీకరణకు శ్రీకారం, అజ్ని వద్ద 42 వేల హార్స్పవర్ రైలు ఇంజిన్ల నిర్వహణ కేంద్రం, నాగ్పూర్-ఇటార్సీ మార్గంలో భాగమైన కోహ్లీ-నార్ఖేడ్ విభాగం ప్రారంభం వగైరాలున్నాయి” అని ప్రధాని పేర్కొన్నారు. ఇప్పటికే పూర్తయిన, మరిన్ని ప్రాజెక్టులు రూపుదిద్దుకోనున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రజలందరికీ ఆయన అభినందనలు తెలిపారు. మహారాష్ట్రలో రెండు ఇంజన్ల ప్రభుత్వ వేగవంతమైన కృషికి నేటి ప్రాజెక్టులే నిదర్శనమని ప్రధాని చెప్పారు. సమృద్ధి మహామార్గ్ కేవలం నాగ్పూర్-ముంబై మార్గంలో దూరం తగ్గించడానికి మాత్రమే పరిమితం కాదని, రాష్ట్రంలోని 24 జిల్లాలకు ఆధునిక సంధానం కల్పిస్తుందని వివరించారు. ఈ సంధాన ప్రాజెక్టులతో ఉద్యోగావకాశాలు పెరగడమే కాకుండా ఈ ప్రాంతంలోని రైతులు, యాత్రికులు, పరిశ్రమలకూ ప్రయోజనాలు ఉంటాయని ప్రధాని పేర్కొన్నారు. ఆయా ప్రాజెక్టుల వాస్తవిక ప్రణాళిక గురించి వివరిస్తూ- ఇవన్నీ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై సమగ్ర దృక్పథాన్ని స్పష్టం చేస్తున్నాయని ప్రధానమంత్రి అన్నారు. “ఎయిమ్స్, నాగ్పూర్ లేదా సమృద్ధి మహామార్గ్ కావచ్చు... వందే భారత్ ఎక్స్ప్రెస్ కావచ్చు లేదా నాగ్పూర్ మెట్రో కావచ్చు... ఈ ప్రాజెక్టుల రూపురేఖలలో వ్యత్యాసాలు ఉండవచ్చు. కానీ ఇవన్నీ పుష్పగుచ్ఛంలాంటివి.. పరస్పరం కలిపినపుడు సంపూర్ణ ప్రగతి ఫలితాలు ప్రతి పౌరునికీ చేరుతాయి” అని ఆయన విశదీకరించారు. రెండు ఇంజన్ల ప్రభుత్వ కృషిని ప్రముఖంగా ప్రస్తావిస్తూ- సామాన్యులకు వైద్యం, సంపద సృష్టి, రైతుకు సాధికారత, జల సంరక్షణ తదితర మౌలిక సదుపాయాలు ఏవైనప్పటికీ మానవీయ దృక్కోణాన్ని ప్రభావితం చేసే వీటన్నిటికీ ప్రభుత్వం మానవ రూపమివ్వడం ఇదే ప్రథమమని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి వెనుకగల సమగ్ర దృక్పథానికి ప్రధానమంత్రి కొన్ని ఉదాహరణలు ఇచ్చారు. ఈ మేరకు “ప్రతి పేదకూ రూ.5 లక్షలదాకా ఉచిత చికిత్సనందించే ఆయుష్మాన్ భారత్ పథకం సామాజిక మౌలిక వసతికి ఒక ఉదాహరణ. కాశీ, కేదారనాథ్, ఉజ్జయిని, పంధర్పూర్ వంటి మన విశ్వాస క్షేత్రాల అభివృద్ధి సాంస్కృతిక మౌలిక వసతులకు నిదర్శనం. దేశంలోని 45 కోట్లమంది పేదలను బ్యాంకింగ్ వ్యవస్థతో జోడించే జనధన్ యోజన ఆర్థిక మౌలిక వసతికి రుజువు” అని వివరించారు. నాగ్పూర్ ‘ఎయిమ్స్’ తరహాలో ఆధునిక ఆస్పత్రులు, వైద్య కళాశాలల ఏర్పాటు కార్యక్రమాలు వైద్య మౌలిక వసతులకు రూపమని ఆయన పేర్కొన్నారు. కాబట్టి “మౌలిక వసతులంటే నిర్జీవ రహదారులు.. ఫ్లై ఓవర్లకు పరిమితం కాదు.. ఇతర రంగాలకూ విస్తరణ చాలా ముఖ్యం” అని ప్రధాని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా గోస్ఖుర్ద్ ఆనకట్టను ఉదాహరిస్తూ- దీనికి 30-35 ఏళ్ల కిందట రూ.400 కోట్ల అంచనా వ్యయంతో శంకుస్థాపన చేసినా నేటికీ నిర్మాణం పూర్తికాలేదని ప్రధానమంత్రి ఎత్తిచూపారు. ఫలితంగా ఈ ఆనకట్ట అంచనా వ్యయం నేడు రూ.18 వేల కోట్లకు చేరిందని శ్రీ మోదీ గుర్తుచేశారు. ఈ పరిస్థితుల నడుమ 2017లో రెండు ఇంజన్ల ప్రభుత్వం ఏర్పడిన ఈ ఆనకట్ట పనులు వేగిరం చేశామన్నారు. అంతేకాకుండా ప్రతి సమస్యకూ పరిష్కారం లభించిందని ఆయన అన్నారు. ఈ ఏడాది జలాశయం పూర్తిగా నిండిందంటూ ఈ సందర్భంగా సంతృప్తి వ్యక్తం చేశారు. “స్వాతంత్ర్య అమృత కాలంలో ప్రగతిశీల భారత నిర్మాణ సంకల్పంతో దేశం ముందుకెళ్తోంది. జాతి సమష్టి శక్తిసామర్థ్యాలతోనే ఈ స్వప్నం సాకారం కాగలదు. దేశాభివృద్ధి కోసం ప్రతి రాష్ట్రం ప్రగతి సాధించడమే ప్రగతిశీల భారత సంకల్పం నెరవేరడానికి తారకమంత్రం” అని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. అనుభవం నుంచి పాఠం నేర్వడాన్ని ప్రస్తావిస్తూ- అభివృద్ధి పరిమితమైనప్పుడు అవకాశాలూ పరిమితమే అవుతాయన్నారు. సమాజంలో కొందరికి మాత్రమే విద్య పరిమితమైనపుడు జాతి ప్రతిభ పరిగణనలోకి రాదన్నారు. బ్యాంకులు కొందరికే అందుబాటులో ఉంటే వాణిజ్య-వ్యాపారాలూ పరిమితమే అవుతాయి. మెరుగైన అనుసంధానం కేవలం కొన్ని నగరాలకు పరిమితమైన ఫలితంగా ప్రగతి కూడా ఆ పరిధికే పరిమితమైందని ప్రధానమంత్రి విశదీకరించారు. ఈ కారణంగానే దేశ జనాభాలో అధికశాతానికి ప్రగతి ఫలాలు పూర్తిస్థాయిలో అందలేదని లేదా జాతి వాస్తవ శక్తిసామర్థ్యాలు వెలుగులోకి రావడం లేదని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. అయితే, ‘సబ్కా సాథ్.. సబ్కా వికాస్.. సబ్కా విశ్వాస్.. సబ్కా ప్రయాస్’ సూత్రాలతో గత 8 ఏళ్లలో ఈ దృక్పథం, విధానం రెండూ మారాయని ఆయన గుర్తుచేశారు. అందువల్లనే “లోగడ నిర్లక్ష్యానికి గురైనవారు ఇవాళ ప్రభుత్వ ప్రాథ్యమంగా మారారు” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ఇక రైతుల నాయకత్వంలో ప్రగతి గురించి శ్రీ మోదీ ప్రస్తావిస్తూ- పీఎం కిసాన్ సమ్మాన్ నిధితో విదర్భ ప్రాంత రైతులు కూడా కూడా ఎంతో ప్రయోజనం పొందారని పేర్కొన్నారు. మరోవైపు పశుపోషకులకు కూడా ప్రభుత్వం ప్రాధాన్యమిస్తూ కిసాన్ క్రెడిట్కార్డు సౌకర్యాన్ని అనుసంధానం చేసిందని చెప్పారు. నిర్లక్ష్యానికి గురైనవారికి ప్రాథమ్యం గురించి మాట్లాడుతూ- 100కుపైగా ప్రగతికాంక్షిత జిల్లాలతోపాటు చిన్న వర్తకులకు సులభ రుణలభ్యతకు చేపట్టిన చర్యల గురించి ప్రధాని వెల్లడించారు. మరఠ్వాడా, విదర్భసహా దేశంలోని 100కుపైగా జిల్లాలు అనేక పరామితుల రీత్యా వెనుకబడి ఉన్నాయని ప్రధాని గుర్తుచేశారు. అయితే, “ఈ వెనుకబడిన ప్రాంతాలను సత్వర ప్రగతికి సరికొత్త శక్తి కేంద్రాలుగా రూపొందించడం కోసం గత ఎనిమిదేళ్లుగా మేం కృషి చేస్తున్నాం” అని ఆయన ఉద్ఘాటించారు. భారతదేశంలో అడ్డదారి రాజకీయాలు పుట్టుకొస్తున్నాయంటూ ప్రధానమంత్రి ప్రజలను అప్రమత్తం చేశారు. ఇలాంటి పార్టీలు స్వార్థపూరిత రాజకీయాలతో పన్ను చెల్లింపుదారుల కష్టార్జితాన్ని దోచుకుంటున్నాయని పేర్కొన్నారు. అంతేకాకుండా అధికారంలోకి రావడమే పరమావధిగా బూటకపు హామీలతో అడ్డదారి పట్టాయని విమర్శించారు. రాబోయే 25 ఏళ్ల వ్యవధిలో భారత్ ప్రగతిశీల దేశంగా రూపొందడానికి కృషి చేస్తుంటే, కొన్ని పార్టీలు స్వార్థ ప్రయోజనాల కోసం దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని ప్రధాని హెచ్చరించారు. తొలి పారిశ్రామిక విప్లవ ప్రయోజనాలను అందిపుచ్చుకునే అవకాశాలను కోల్పోవడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. దీని ఫలితంగానే 2వ, 3వ పారిశ్రామిక విప్లవాల సమయంలో వెనుకబడ్డామని గుర్తుచేశారు. ఇప్పుడు నాలుగో పారిశ్రామిక విప్లవ సమయంలో ఏ అవకాశాన్నీ భారత్ వదులుకోబోదని పునరుద్ఘాటించారు. ఈ మేరకు “అడ్డదారిలో పరుగు ఏ దేశానికీ సాధ్యం కాదు.. శాశ్వత పరిష్కారాల దిశగా దూరదృష్టి కలిగి ఉండటమే దేశాభివృద్ధికి చాలా ముఖ్యం” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. దక్షిణ కొరియా, సింగపూర్ ఒకనాడు పేద దేశాలుగా పరిగణించబడేవని ప్రధాని గుర్తుచేశారు. అయితే, మౌలిక సదుపాయాల రంగంలో ఊపును సద్వినియోగం చేసుకుంటూ తమ తలరాతను మార్చుకోవడంలో సఫలమైనందువల్లే ఆర్థిక వ్యవస్థలకు నేడు భారీ కేంద్రాలుగా రూపొందాయని చెప్పారు. రాబోయే యువతరానికి ఉజ్వల భవిష్యత్ కల్పన దిశగా ప్రభుత్వ ఖజానాలోని ప్రతి పైసా ఖర్చు చేయడం నేటి తక్షణావసరమని ఆయన పునరుద్ఘాటించారు. స్వార్థ రాజకీయ పార్టీల గుట్టురట్టు చేయాలని యువతరానికి, పన్ను చెల్లింపుదారులకు ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ‘పరిమిత ఆర్జన... అపరిమిత వ్యయం’ వాటి విధానమని, అటువంటి దుర్విధానాల కారణంగానే ప్రపంచంలో అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయని వివరించారు. అయితే, మన దేశంలో మాత్రం సుస్థిర ప్రగతి, శాశ్వత పరిష్కారాల దిశగా ప్రభుత్వ కృషికి ప్రజానీకం మద్దతివ్వడంపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా “సుస్థిర ప్రగతి, శాశ్వత పరిష్కారాలతో కూడిన ఆర్థిక విధానాలకు గుజరాత్ ఎన్నికల ఫలితాలే నిదర్శనం” అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమాల్లో ప్రధానమంత్రి వెంట మహారాష్ట్ర గవర్నర్ శ్రీ భగత్ సింగ్ కోష్యారీ, ముఖ్యమంత్రి శ్రీ ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడణవీస్, కేంద్ర రోడ్డు రవాణా - రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ తదితరులు పాల్గొన్నారు. నేపథ్యం – నాగ్పూర్ మెట్రో పట్టణ రవాణాను మరింత విప్లవాత్మకంగా తీర్చిదిద్దే దిశగా మరో అడుగుపడింది. ఈ మేరకు ‘నాగ్పూర్ మెట్రో తొలిదశ’ను ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు. అలాగే ఖాప్రీ నుంచి ఆటోమోటివ్ స్క్వేర్ , ప్రజాపతి నగర్ నుంచి లోకమాన్య నగర్ వరకూగల మార్గంతోపాటు; ఖప్రీ మెట్రో స్టేషన్లో రెండు రైళ్లను కూడా ఆయన జెండా ఊపి ప్రారంభించారు. నాగ్పూర్ మెట్రో తొలి దశ రూ.8650 కోట్లకుపైగా వ్యయంతో పూర్తిచేయగా, మరో రూ.6700 కోట్లకు పైగా వ్యయంతో అభివృద్ధి చేయనున్న నాగ్పూర్ మెట్రో రెండోదశకూ ప్రధాని శంకుస్థాపన చేశారు. రైలు ప్రాజెక్టులు నాగ్పూర్-బిలాస్ పూర్ మార్గంలో నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రధానమంత్రి నాగ్పూర్ రైల్వే స్టేషన్ నుంచి జెండా ఊపి ప్రారంభించారు. అలాగే నాగ్పూర్, అజ్ని రైల్వేస్టేషన్ల పునర్నవీకరణకు శంకుస్థాపన చేశారు. వీటికోసం రూ.590 కోట్లు, రూ.360 కోట్లు వంతున నిధులు వెచ్చిస్తారు. అజ్నివద్ద రైలు ఇంజన్ల నిర్వహణ డిపోతోపాటు నాగ్పూర్-ఇటార్సీ మార్గంలోని కోహ్లీ-నార్ఖేడ్ విభాగం మార్గాన్ని ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్టులను రూ.110 కోట్లు, రూ.450 కోట్ల వ్యయంతో పూర్తిచేశారు. సమృద్ధి మార్గ్ నాగ్పూర్-షిర్డీల మధ్య 520 కిలోమీటర్ల పొడవైన ‘హిందూ హృదయసామ్రాట్ బాలాసాహెబ్ ఠాక్రే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్’ తొలిదశను ప్రధానమంత్రి ప్రారంభించారు. దేశంలో అనుసంధానం మెరుగుపై ప్రధానమంత్రి దూరదృష్టికి అనుగుణంగా ముందడుగులో ఈ సమృద్ధి మార్గం లేదా నాగ్పూర్-ముంబై సూపర్ కమ్యూనికేషన్ ఎక్స్ ప్రెస్ రహదారి ప్రాజెక్టు ఒక భాగం. కాగా, రూ.55,000 కోట్లతో 701 కిలోమీటర్ల మేర నిర్మించిన ఈ రహదారి దేశంలోని అత్యంత పొడవైన ఎక్స్ ప్రెస్ మార్గాల్లో ఒకటి. ఇది మహారాష్ట్రలోని 10 జిల్లాల మీదుగా సాగుతుంది. అలాగే ప్రసిద్ధ అమరావతి, ఔరంగాబాద్, నాసిక్ నగరాలను తాకుతూ వెళ్తుంది. మరోవైపు పరిసర 14 జిల్లాలతో అనుసంధానం మెరుగుపరుస్తుంది. తద్వారా విదర్భ, మరఠ్వాడా, ఉత్తర మహారాష్ట్రసహా రాష్ట్రంలోని 24 జిల్లాల అభివృద్ధికి దోహదం చేస్తుంది. ప్రధానమంత్రి గతిశక్తి కింద సమీకృత ప్రణాళిక, మౌలిక సదుపాయాల అనుసంధాన ప్రాజెక్టుల సమన్వయంపై ప్రధాని దృక్కోణానికి అనుగుణంగా ఈ రహదారి రూపొందింది. ఈ నేపథ్యంలో సదరు సమృద్ధి మహామార్గం ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వే, జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్, అజంతా-ఎల్లోరా గుహలు, షిర్డీ, వెరుల్, లోనార్ తదితర పర్యాటక ప్రదేశాలతోనూ అనుసంధానం అవుతుంది. మొత్తంమీద మహారాష్ట్ర ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడంలో సమృద్ధి మహామార్గ్ కీలకపాత్ర పోషిస్తుంది. ‘ఎయిమ్స్’ నాగ్పూర్ నాగ్పూర్లో నిర్మించిన ‘ఎయిమ్స్’ను జాతికి అంకితం చేయడం ద్వారా దేశవ్యాప్తంగా ఆరోగ్య మౌలిక సదుపాయాల బలోపేతంపై ప్రధానమంత్రి నిబద్ధతకు నిదర్శనం. కేంద్ర ప్రభుత్వ రంగ పథకం ‘ప్రధానమంత్రి స్వాస్త్య సురక్ష యోజన’ కింద 2017 జులైలో ఆయన స్వయంగా దీనికి శంకుస్థాపన చేశారు. మొత్తం రూ.1,575 కోట్లతో నిర్మించిన ఈ ఆస్పత్రిలో అత్యధునాతన సదుపాయాలతోపాటో ఓపీడీ, ఐపీడీ, రోగనిర్ధారణ సేవలు, శస్త్రచికిత్స గదులు ఉన్నాయి. వీటితోపాటు 38 వైద్య విభాగాలతో వైద్య విజ్ఞానానికి సంబంధించిన స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ సదుపాయాలు కూడా ఉన్నాయి. ఈ ఆస్పత్రి ఏర్పాటుతో మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతానికి ఆధునిక ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. అంతేకాకుండా గడ్చిరోలి, గోండియా, మేల్ఘాట్ వంటి పరిసర గిరిజన ప్రాంతాలకు ఇదొక వరమని చెప్పవచ్చు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఒన్ హెల్త్, నాగ్పూర్ నాగ్పూర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఒన్ హెల్త్ కి ప్రధానమంత్రి శంకుస్థాపన చేయడం ‘ఒన్ హెల్త్’ విధానంలో దేశ సామర్థ్యం, మౌలిక సదుపాయాల పెంపు దిశగా ఒక ముందడుగు. జంతుజాలంతోపాటు పర్యావరణంతోనూ మానవారోగ్యం ముడిపడి ఉంటుందన్నది ‘ఒన్ హెల్త్’ విధానం. మానవాళిని ప్రభావితం చేసే అనేక అంటువ్యాధులు ప్రకృతిలో జంతువు నుంచి మనిషి సంక్రమిస్తుంటాయని ఈ విధానం చెబుతుంది. ఈ నేపథ్యంలో రూ.110 కోట్లకుపైగా వ్యయంతో ఈ సంస్థ స్థాపించబడింది. దేశవ్యాప్తంగా ‘ఒన్ హెల్త్’ విధానంలో పరిశోధన-సామర్థ్య వికాసం దిశగా భాగస్వామ్య సంస్థలన్నిటితో ఇది సహకరిస్తూ సమన్వయం చేసుకోవడమేగాక ఉత్ప్రేరకంగానూ పనిచేస్తుంది. ఇతర ప్రాజెక్టులు నాగ్పూర్లో నాగ్ నది కాలుష్య నివారణకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. జాతీయ నదీ పరిరక్షణ ప్రణాళిక కింద రూ.1925 కోట్లకుపైగా వ్యయంతో ఈ ప్రాజెక్టు అమలవుతుంది. కాగా, మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే విదర్భలో... ముఖ్యంగా గిరిజన ప్రాబల్యం అధికంగాగల ప్రదేశాల్లో సికిల్ సెల్ వ్యాధి చాలా ఎక్కువగా ఉంది. తలసేమియా, హెచ్బిఇ వంటి ఇతర హిమోగ్లోబినోపతీలతోపాటు దేశంలో వివిధ వ్యాధుల భారానికి ఇది గణనీయంగా కారణమవుతుంది. ఈ సమస్య పరిష్కారం దిశగా ప్రధానమంత్రి 2019 ఫిబ్రవరిలో “సెంటర్ ఫర్ రీసెర్చ్-మేనేజ్మెంట్ అండ్ కంట్రోల్ ఆఫ్ హిమోగ్లోబినోపతీస్, చంద్రాపూర్’ కేంద్రానికి శంకుస్థాపన చేయగా నేడు దేశానికి అంకితం చేశారు. దేశ హిమోగ్లోబినోపతి రంగంలో వినూత్న పరిశోధన-సాంకేతికతల అభివృద్ధి, మానవ వనరుల అభివృద్ధికి ఇది అత్యుత్తమ కేంద్రం కాగలదని ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది. అంతేకాకుండా చంద్రపూర్లో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ను కూడా ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు. పాలీమర్, అనుబంధ పరిశ్రమల అవసరాలు తీర్చగల నిపుణ మానవ వనరులను అభివృద్ధి చేయడమే ఈ సంస్థ లక్ష్యం.
pib-160961
89a5e3c924e3d40adca01d3158ffac76815daee378fb3f7a07b0368fe2742da9
tel
సాంస్కృతిక మంత్రిత్వ శాఖ బుద్ధ పూర్ణిమ సందర్భంగా వర్చువల్ మాధ్యమంద్వారా నిర్వహించే ప్రపంచ వైశాఖీ వేడుకల్లో కీలక ప్రసంగం చేయనున్న ప్రధానమంత్రి బుద్ధ పూర్ణిమ సందర్భంగా 2021 మే 26వ తేదీన వర్చువల్ మాధ్యమం ద్వారా నిర్వహించే ‘‘ప్రపంచ వైశాఖీ వేడుకల్లో’’ ఉదయం 9:45 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేయనున్నారు. అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య సహకారంతో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ ఈ వేడుకలను నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగాగల బౌద్ధ సంఘాల అత్యున్నత అధిపతులంతా ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. దీంతోపాటు ప్రపంచంలోని 50 మందికిపైగా ప్రముఖ బౌద్ధమత పెద్దలు ఈ వేడుకలలో ప్రసంగిస్తారు.
pib-92461
10c6e3dcf469c63dd5eda7057003fa213654c4f56b6c0bca8c906ffac94c3516
tel
PIB Headquarters కోవిడ్-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం (కోవిడ్-19కు సంబంధించి గత 24 గంటల్లో జారీ చేసిన పత్రికా ప్రకటనలతోపాటు పీఐబీ వాస్తవాలను తనిఖీచేసిన అంశాలు ఇందులో లభ్యమవుతాయి) - దేశవ్యాప్తంగా కోవిడ్-19 నుంచి కోలుకున్నవారి శాతం క్రమేణా మెరుగుపడి 42.4కి చేరింది; ఈ మేరకు వ్యాధి నయమైన/కోలుకున్నవారి సంఖ్య 64,426గా నమోదైంది. - దేశంలో కోవిడ్-19 నిర్ధారిత కేసుల సంఖ్య 1,51,767కు చేరింది. - నిన్న దేశవ్యాప్తంగా 1,16,041 కోవిడ్-19 నమూనాల పరీక్ష. - దిగ్బంధం విధింపుతో వ్యాధి వ్యాప్తి వేగం తగ్గడంసహా దేశానికి పలురకాల ప్రయోజనాలు. - ఆరోగ్య సేతు ఆండ్రాయిడ్ వర్షన్ ఇకపై ఓపెన్ సోర్స్. కోవిడ్-19పై కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ తాజా సమాచారం; కోలుకునేవారి శాతం మెరుగై 42.4కు చేరిక; నిన్న 1,16,041 నమూనాల పరీక్ష దేశంలో దిగ్బంధం విధింపువల్ల అనేక ప్రయోజనాలు సిద్ధించగా... వాటిలో ప్రధానమైనది కోవిడ్ వ్యాధి వ్యాప్తి వేగం గణనీయంగా తగ్గడం. అదే సమయంలో కోవిడ్-19 సంబంధిత ప్రత్యేక ఆరోగ్య మౌలిక వసతుల అభివృద్ధికి వీలు కలిగింది; అంతేగాక మానవ వనరుల సామర్థ్య వికాసం; పరీక్షల నిర్వహణ సామర్థ్యం పెరుగుదల; అత్యవసర సరఫరాలు, పరికరాలు, ఆక్సిజన్ అందుబాటులో మెరుగుదల; సముచిత మార్గదర్శకాల జారీ, ప్రమాణాల నిర్ధారణ, సమాచార వ్యాప్తిసహా అనుసరణ, భాగస్వామ్యం; రోగనిర్ధారణ సదుపాయాల అభివృద్ధి, ఔషధ ప్రయోగాలు, టీకాపై పరిశోధన వంటివి మరికొన్ని కీలక ప్రయోజనాలు. ఇక సాంకేతికతపరంగా నిఘా వ్యవస్థలు బలోపేతమై వ్యాధి పీడితుల సంబంధాన్వేషణ, ఇంటింటి సర్వేసహా ఆరోగ్యసేతు యాప్ వంటి ఉపకరణాల అభివృద్ధి తదితర ప్రయోజనాలు కూడా సమకూరాయి. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 435 ప్రభుత్వ, 189 ప్రైవేటు ప్రయోగశాలలద్వారా నమూనాల పరీక్ష సామర్థ్యం ఇనుమడించింది. ఆ మేరకు రెండురంగాల్లోని ప్రయోగశాలల్లో ఇప్పటిదాకా 32,42,160 కోవిడ్-19 నమూనాలను పరీక్షించగా, నిన్న ఒక్కరోజే 1,16,041 నమూనాల పరీక్ష సాగింది. దేశంలో ఇప్పటిదాకా కోవిడ్-19 రోగుల సంఖ్య 1,51,767కు చేరగా, వారిలో కోలుకున్నవారి సంఖ్య 64,426గా నమోదు కావడంతో నయమయ్యేవారి శాతం మెరుగుపడి నేడు 42.4కు చేరింది. అలాగే ప్రపంచంలో మరణాల శాతం 6.36 కాగా, మన దేశంలో క్రమేణా తగ్గుముఖం పడుతూ 2.86 శాతానికి దిగివచ్చింది. ఇక కోవిడ్-19 మహమ్మారి సమయంలో, ఆ తర్వాత పునరుత్పత్తి, ప్రసూతి, నవజాత, పిల్లలు-కౌమార బాలల ఆరోగ్యంసహా పోషకాహార సేవలు అందించడంపై ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ మార్గదర్శక ప్రకటన జారీచేసింది. మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1627267 ఆరోగ్య సేతు ఇకపై ఓపెన్ సోర్స్ కోవిడ్-19 వ్యాప్తి నియంత్రణ కృషిని ముమ్మరం చేయడంలో తోడ్పడేందుకు బ్లూటూత్ ఆధారితంగా ఈ మహమ్మారి సమాచార విస్తృతి, వ్యాధివ్యాప్తి అధికంకాగల ప్రాంతాల గుర్తింపు, రోగుల మధ్య సంబంధాల అన్వేషణ లక్ష్యంగా ‘ఆరోగ్య సేతు’ మొబైల్ యాప్ను 2020 ఏప్రిల్ 2వ తేదీన భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రపంచంలోని ఇదేతరహా సంబంధాన్వేషణ యాప్ల వినియోగంతో పోలిస్తే మే 26వ తేదీనాటికి మన దేశంలో ఆరోగ్య సేతు యాప్ను 114 మిలియన్లకుపైగా ప్రజలు వినియోగిస్తున్నారు. ఇది ఆండ్రాయిడ్, ఐవోఎస్, కేఏఐవోఎస్ వేదికలపై మొత్తం 12 భాషలలో ప్రజలకు అందుబాటులో ఉంది. పారదర్శకత, గోప్యత, భద్రతలే ఆరోగ్య సేతు యాప్ మూలస్తంభాలు. ఈ నేపథ్యంలో భారత్ అనుసరిస్తున్న ఓపెన్సోర్స్ సాఫ్ట్వేర్ విధానానికి అనుగుణంగా ఆరోగ్యసేతు సోర్స్ కోడ్ను ప్రభుత్వం ఇప్పుడు ఓపెన్ సోర్స్గా అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు ఇకపై ఆండ్రాయిడ్ వెర్షన్లో ఈ యాప్పై సమీక్ష, సహకారాలకు వీలుంటుంది. అలాగే ఐవోఎస్ వెర్షన్లోనూ ఓపెన్సోర్స్ మరో రెండు వారాల్లో లభ్యంకానుంది. అటుపైన సర్వర్ కోడ్ను కూడా ప్రభుత్వం విడుదల చేస్తుంది. మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1627140 ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఖతర్ పాలకుడు గౌరవనీయ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ మధ్య టెలిఫోన్ సంభాషణ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ- ఖతర్ పాలకుడు గౌరవనీయ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీతో టెలిఫోన్ ద్వారా సంభాషించారు. రంజాన్ పర్వదినం సందర్భంగా ఆయనతోపాటు ఖతర్ ప్రజలకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. కోవిడ్-19 మహమ్మారి పరిస్థితుల నడుమ ఖతర్లోని భారతీయుల సంక్షేమంపై వ్యక్తిగత శ్రద్ధ చూపినందుకుగాను దేశాధినేతకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఖతర్లో భారతీయులు... ప్రత్యేకించి ఆరోగ్యరంగంలోని కార్యకర్తలు ప్రశంసనీయ సేవలు అందిస్తున్నారని ఖతర్ అధినేత కూడా కొనియాడారు. మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1627094 ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఈజిప్టు అధ్యక్షుడు గౌరవనీయ అబ్దెల్ ఫతా అల్-సిసి మధ్య టెలిఫోన్ సంభాషణ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ- ఈజిప్టు అధ్యక్షుడు గౌరవనీయ అబ్దెల్ ఫతా అల్-సిసితో టెలిఫోన్ ద్వారా సంభాషించారు. రంజాన్ పర్వదినం సందర్భంగా ఆయనతోపాటు ఈజిప్టు ప్రజలకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. దీనిపై ఈజిప్టు అధ్యక్షుడు స్పందిస్తూ... ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైన భారత్-ఈజిప్టు దేశాల నాగరకరతలను ప్రస్తావించారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు వేగంగా విస్తరిస్తున్నాయంటూ హర్షం వ్యక్తం చేశారు. కోవిడ్-19 సంక్షోభం నేపథ్యంలో ఈజిప్టులోని భారతీయుల భద్రత, సంక్షేమాలపై అధికారవర్గాలు సంపూర్ణ శ్రద్ధవహించి వారికి మద్దతుగా నిలిచినందుకు ప్రధానమంత్రి అభినందనలు తెలిపారు. ఈ ఏడాది ఈజిప్టులో తన పర్యటన కార్యక్రమం కోవిడ్-19 మహమ్మారి కారణంగా వాయిదాపడటాన్ని ప్రస్తావిస్తూ- పరిస్థితులు సహకరిస్తే వీలైనంత త్వరగా అధ్యక్షుడు సిసితో భేటీకోసం ఎదురుచూస్తున్నానని ప్రధాని మోదీ చెప్పారు. మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1627190 ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, గణతంత్ర ఆస్ట్రియా అధ్యక్షుడు గౌరవనీయ అలెగ్జాండర్ వాన్డెర్ బెలెన్ మధ్య టెలిఫోన్ సంభాషణ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ- గణతంత్ర ఆస్ట్రియా అధ్యక్షుడు గౌరవనీయ అలెగ్జాండర్ వాన్డెర్ బెలెన్తో టెలిఫోన్ ద్వారా సంభాషించారు. కోవిడ్-19 సృష్టించిన ఆరోగ్య, ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనడంలో తమ దేశాల్లో అనుసరించిన విధానాలపై దేశాధినేతలిద్దరూ పరస్పరం అభిప్రాయాలు వెల్లడించుకున్నారు. ప్రస్తుత సవాళ్లను ఎదుర్కొనడంలో అంతర్జాతీయ సహకారానికిగల ప్రాముఖ్యాన్ని వారిద్దరూ అంగీకరించారు. కోవిడ్ మహమ్మారి అనంతరం ప్రపంచంలో భారత్-ఆస్ట్రియాల సంబంధాల వైవిధ్యీకరణతోపాటు బలోపేతం చేసుకోవాలన్న ఆకాంక్షను అధినేతలిద్దరూ పునరుద్ఘాటించారు. మౌలిక సదుపాయాల కల్పన, పరిశోధన-ఆవిష్కరణ, ఎస్ఎంఈ తదితర రంగాల్లో సహకార విస్తృతికిగల అవకాశాలను ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1627197 ఈశాన్య భారత రాష్ట్రాల విద్యార్థులకు నాణ్యమైన విద్య, మౌలిక విద్యాసదుపాయాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: హెచ్ఆర్డి మంత్రి సిక్కింలోని యాంగ్యాంగ్లో రూ.986.47 కోట్ల వ్యయంతో సిక్కిం విశ్వవిద్యాలయ శాశ్వత ప్రాంగణం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి మంజూరుచేసింది. ఇందుకోసం సిక్కిం రాష్ట్ర ప్రభుత్వం రూ.15 కోట్ల విలువైన 300 ఎకరాల భూమిని కేటాయించడమేగాక ఇప్పటికే 265.94 ఎకరాలను విశ్వవిద్యాలయానికి స్వాధీనం చేసింది. ఇక అరుణాచల్ ప్రదేశ్, మిజోరం, మేఘాలయ, నాగాలాండ్, ఢిల్లీ, పుదుచ్చేరిలలో రూ.4371.90 కోట్ల సవరించిన అంచనా వ్యయంతో ఆరు కొత్త ఎన్ఐటీల ఏర్పాటుకు కూడా ప్రభుత్వం అనుమతులిచ్చిందని మంత్రి గుర్తుచేశారు. ఇవి 2022 మార్చి 31 నుంచి తమతమ శాశ్వత ప్రాంగణాల్లో పూర్తిస్థాయిన పనిచేయడం ప్రారంభిస్తాయని వెల్లడించారు. మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1627095 జమ్ముకశ్మీర్లో కోవిడ్-19 పరిస్థితిపై కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సమీక్ష జమ్ముకశ్మీర్లో కోవిడ్-19 వ్యాప్తి ప్రస్తుత స్థితిగతులపై కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఇప్పటిదాకా ఇతర ప్రాంతాల్లోఉన్నవారు ఈ కేంద్రపాలిత ప్రాంతానికి తిరిగివస్తున్న నేపథ్యంలో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మంత్రి సమీక్షించారు. మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1627265 కోవిడ్-19పై పోరు దిశగా ఆరోగ్య సంరక్షణలో పరిశోధన-అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్న ‘సిపెట్’; డబ్ల్యూహెచ్వో/ఐఎస్వో మార్గదర్శకాల మేరకు పీపీఈలు, సంబంధిత ఉత్పత్తుల తయారీ-ధ్రువీకరణ కోవిడ్-19పై పోరు దిశగా కేంద్ర రసాయనాలు-ఎరువుల మంత్రిత్వశాఖ పరిధిలోని అత్యున్నత జాతీయ సంస్థ ‘సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ-సిపెట్’ తనవంతు కృషికి సిద్ధమైంది. ఈ మేరకు ఆరోగ్య సంరక్షణ రంగంలో పరిశోధన-అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనుంది. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్యసంస్థ /అంతర్జాతీయ ప్రమాణాల సంస్థల మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యక్తిగత రక్షణ సామగ్రి, సంబంధిత ఇతర ఉత్పత్తుల తయారీ-ధ్రువీకరణ బాధ్యతలను చేపడుతుంది. కాగా, కరోనా వైరస్పై పోరులో భాగంగా మురుత్తల్, జైపూర్, మదురై, లక్నోలలోని ‘సిపెట్’ కేంద్రాలు ఇప్పటికే వ్యక్తిగత రక్షణ సామగ్రి-ముఖ కవచాలను రూపొందించాయి. మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1627193 కోవిడ్-19 రోగులకు సేవలందిస్తున్న డాక్టర్లు, ఇతర వైద్యసిబ్బందికి మధ్యాహ్న భోజనం సరఫరా చేయనున్న పీఎఫ్సీ కోవిడ్-19 మహమ్మారిపై పోరాటంలో భాగంగా కేంద్ర విద్యుత్ శాఖ పరిధిలోని ప్రభుత్వరంగ సంస్థ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ మరొక ముందడుగు వేసింది. ఈ మేరకు కోవిడ్-19పై పోరులో ముందువరుసలోగల కరోనా యోధులకు పరిశుభ్ర, పౌష్టికాహార సరఫరా కోసం ఆసియాలోనే అతిపెద్ద ఆహార కంపెనీల సమూహమైన ‘తాజ్ శాట్స్’తో అనుసంధానం చేసుకుంది. ఈ భాగస్వామ్యంకింద న్యూఢిల్లీలోని డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో కోవిడ్-19 రోగులకు సేవలందిస్తున్న డాక్టర్లు, ఇతర ఆరోగ్య, వైద్య సిబ్బందికి మధ్యాహ్న భోజనం బాక్సులను పీఎఫ్సీ అందజేస్తుంది. మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1627264 బహుళ ప్రాచుర్యం పొందిన ‘కోవిడ్ కథ’ను హిందీలో విడుదల చేసిన ఎన్సీఎస్టీసీ కోవిడ్-19పై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించడం లక్ష్యంగా ఈ మహమ్మారి సంబంధిత ముఖ్యమైన సమాచారంతో “కోవిడ్ కథ” పేరిట బహుళ ప్రాచుర్యం పొందిన మల్టీమీడియా కరదీపికను కేంద్ర శాస్త్ర-సాంకేతిక శాఖ పరిధిలోని నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్ హిందీలో రూపొందించి విడుదల చేసింది. ఈ కరదీపిక ఆంగ్ల భాషా ప్రతిని ఈ నెలారంభంలోనే ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో దీని హిందీ ప్రతి కోసం హిందీ భాషాధిక్యంగల ప్రాంతాల నుంచి డిమాండ్ అధికంగా ఉండటంతో ‘కోవిడ్ కథ’ను మరికాస్త సవరించి ఆ పాఠకుల ప్రయోజనార్థం మరింత సమాచారంతో తీసుకొచ్చారు. పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం - చండీగఢ్: ఈ కేంద్రపాలిత ప్రాంతంలోని కోవిడ్-19 నియంత్రణ జోన్లలో విధులు నిర్వర్తించే నగరపాలక, పోలీసు, ఆరోగ్యాధికారులుసహా ప్రభుత్వ సిబ్బంది అందరూ సముచిత వ్యక్తిగత రక్షణ సామగ్రిని తప్పక వాడాలని పాలనాధికారి ఆదేశాలిచ్చారు. అలాగే నియంత్రణ జోన్లలో నిత్యావసర వస్తువుల సరఫరాలో కొరతలేకుండా చూడాలని డిప్యూటీ కమిషనరును ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రైవేటు దాతలతోపాటు ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలు కూడా పాలుపంచుకోవాలని కోరారు. నియంత్రణ జోన్లలో నిత్యం రోగకారకాల నిర్మూలన, పరిశుభ్రతకు చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్తోపాటు నగరపాలక సంస్థకు ఆదేశాలు జారీచేశారు. ముఖ్యంగా నమూనాల సేకరణ కేంద్రాలవద్ద వ్యర్థాలను... ప్రత్యేకించి వైద్యవ్యర్థాలను సవ్యంగా తొలగించి, విసర్జించేలా చూడాలని సూచించారు. కాగా, శ్రామిక్ స్పెషల్ రైలులో ఉత్తరప్రదేశ్ వెళ్లడం కోసం ఇవాళ ఒక గర్భవతి తన భర్త, బిడ్డతో సహాయకేంద్రానికి వచ్చింది. అనంతరం వారికి వైద్య పరీక్షలు నిర్వహించి, రైల్వేస్టేషన్కు పంపగా, అక్కడ ఆమెకు ప్రసవ వేదన మొదలైంది. దీంతో ఆమెను అంబులెన్స్ద్వారా జీఎంసీహెచ్-32కు తరలించారు. అయితే, నొప్పులు తీవ్రంకావడంతో సమీపంలోని మణిమజ్రాలోగల ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆమె మగబిడ్డను ప్రసవించింది. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. - పంజాబ్: విమాన, రైలు, రోడ్డు మార్గాల్లో రాష్ట్ర్రానికి వచ్చే దేశ/విదేశీ ప్రయాణికులందరికీ వర్తించేలా ఏకీకృత, సమగ్ర మార్గదర్శకాలను పంజాబ్ ప్రభుత్వం జారీచేసింది. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ముమ్మర నిర్ధారణ పరీక్షలు, సంబంధాన్వేషణ, ఏకాంతీకరణలే ఏకైక మార్గమని ఈ మార్గదర్శకాల్లో ప్రభుత్వం స్పష్టంచేసింది. ఇక సాధారణ నిఘాలో భాగంగా దేశీయ ప్రయాణికులను యాదృచ్ఛిక ప్రాతిపదికన పరీక్షించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా అమృత్సర్, మొహాలీ విమానాశ్రయాల్లో కొందరు దేశీయ ప్రయాణికులను యాదృచ్ఛిక ప్రాతిపదికన పరీక్షించారు. - హర్యానా: రాష్ట్రంలో కోవిడ్-19 నిరోధం, నియంత్రణలో దిగ్బంధం నిబంధనలకు ప్రజల మద్దతు, వాటిని పాటించడంలో చూపిన సహనం, రాష్ట్ర ప్రభుత్వ సమర్థ చర్యలు ఎంతగానో తోడ్పడినట్లు ముఖ్యమంత్రి చెప్పారు. - హిమాచల్ ప్రదేశ్: కోవిడ్-19 మహమ్మారి కారణంగా రాష్ట్రంలో 2020 మార్చి 24 నుంచి ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. ఈ నేపథ్యంలో సెక్షన్ 144 కింద 2020 జూన్ 30 వరకు దీన్ని కొనసాగించాలని 2020 మే 23నాటి మంత్రిమండలి సమావేశం నిర్ణయించింది. అయితే, ఇలా పొడిగించడంపై నిర్ణయాధికారాన్ని జిల్లా కలెక్టర్లకు అప్పగిస్తూ తీర్మానించింది. - కేరళ: రాష్ట్రంలో వివిధ వర్గాల విస్తృత నిరసన నేపథ్యంలో చెల్లింపు సంస్థాగత నిర్బంధవైద్య పర్యవేక్షణ సంబంధిత నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచన చేస్తోంది. కాగా, దిగ్బంధం నిబంధనల సడలింపును ప్రజలు విస్తృతంగా దుర్వినియోగం చేస్తున్నారని రాష్ట్ర మంత్రిమండలి తేల్చింది. రాష్ట్రంలో ప్రస్తుతం 415 కేసులుండగా నిన్న ఒకేరోజు 67సహా గడచిన నాలుగు రోజుల్లో మొత్తం 231 నమోదయ్యాయి. వీరిలో 133 మంది విదేశాల నుంచి, 178 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు. ఇక విదేశాల నుంచి తిరిగివచ్చేందుకు నమోదు చేసుకున్న 1.35 లక్షల మందిలో ఇప్పటిదాకా 11,189 మంది మాత్రమే రాష్ట్రానికి చేరుకున్నారు. - తమిళనాడు: రాష్ట్రంలో దాదాపు రూ.15,128కోట్ల విలువైన పెట్టుబడులపై 17అవగాహన ఒప్పందాలపై సంతకాలు పూర్తయిన నేపథ్యంలో వీటిద్వారా 47,150 మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని ప్రభుత్వం పేర్కొంది. కాగా, చెన్నైలోని బిల్రోత్ హాస్పిటల్స్ లిమిటెడ్ భవనంలో ఎగువనగల నాలుగు అంతస్తులను కోవిడ్-19 రోగుల చికిత్స కోసం ఉపయోగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఆ భవనంలో అనుమతుల్లేకుండా నిర్మించిన ఎనిమిది అంతస్తుల సముదాయంలోని తొలి ఐదు అంతస్తులను కూల్చివేయాలని మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సర్వోన్నత న్యాయస్థానం నిలిపివేసింది. తిరుచ్చి సెంట్రల్ జైలులో ఒక ఖైదీకి కోవిడ్-19 నిర్ధారణ అయింది; దీంతో అదే బ్లాక్లోగల మరో 28 మంది ఖైదీలను అధికారులు వేరుగా ఉంచారు. రాష్ట్రంలో నిన్నటిదాకా మొత్తం కేసులు: 17,728, యాక్టివ్ కేసులు: 8,256, మరణాలు: 127, డిశ్చార్జ్: 9342. చెన్నైలో యాక్టివ్ కేసులు 6056గా ఉన్నాయి. - కర్ణాటక: రాష్ట్రంలో ఇవాళ మధ్యాహ్నం 12 గంటల వరకు 122 కొత్త కేసులు రాగా, ఒకరు మరణించారు... మరో 14మంది ఆస్పత్రుల నుంచి విడుదలయ్యారు. కొత్త కేసులలో కల్బుర్గి 28, యాదగిరి 16, హసన్ 15, బీదర్ 12, దక్షిణ కన్నడ 11, ఉడిపి 9, ఉత్తర కన్నడ 6, రాయచూర్ 5, బెళగావి 4, చిక్కమగళూరు 3, విజయపుర 2; మాండ్యా, తుమ్కూర్, బళ్లారిలలో ఒక్కొక్కటి వంతున నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసులు 2405కి చేరగా, వీటిలో క్రియాశీల కేసులు: 1596, కోలుకున్నవి: 762, మరణాలు: 45గా ఉన్నాయి. - ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో దిగ్బంధం నిబంధనలు ఉల్లంఘించారంటూ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుపై దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా నియంత్రణ జోన్లుమినహా మిగిలిన ప్రాంతాల్లో ఆహారశాలలు, వస్త్ర, ఆభరణాల దుకాణాలను తిరిగి తెరవడానికి ఆంధ్ర్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలో 68 కొత్త కేసులు నమోదవగా, 9664 నమూనాల పరీక్ష తర్వాత గడచిన 24 గంటల్లో 10మంది ఆస్పత్రుల నుంచి ఇళ్లకు వెళ్లారు. రాష్ట్రంలో ఇవాళ ఒక మరణం నమోదవగా, ప్రస్తుతం మొత్తం కేసులు: 2787. యాక్టివ్: 816, రికవరీ: 1913, మరణాలు: 58. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 219 కేసులుండగా వీటిలో 75 యాక్టివ్ కేసులున్నాయి. ఇక విదేశాల నుంచి వచ్చినవారిలో కేసుల సంఖ్య 111గా నమోదైంది. - తెలంగాణ: మిడుతల దండు దాడి నేపథ్యంలో మహారాష్ట్రతో తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో అత్యంత అప్రమత్తత ప్రకటించారు. సామాజిక నిర్లక్ష్యం ఫలితంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ మేరకు మే 27నాటికి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1991 కాగా, నిన్నటివరకూ వలసదారులలో సుమారు 172 మందికి, విదేశాల నుంచి వచ్చినవారిలో 42 మందికి రోగ లక్షణాలు నిర్ధారణ అయ్యాయి. - మహారాష్ట్ర: రాష్ట్రంలో 2,091 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 54,758కి చేరింది. వీటిలో 36,004 యాక్టివ్ కేసులున్నాయి. హాట్స్పాట్ ముంబైలో 1,002 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 32,791కి చేరింది. మహారాష్ట్రలో 72 ప్రయోగశాలల్లో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరో 27 కొత్త ప్రయోగశాలలు అందుబాటులోకి రానున్నాయి. కాగా రాష్ట్రంలో కోవిడ్ కేసుల రెట్టింపు వ్యవధి 14 రోజులకు పెరగ్గా, మరణాల శాతం 3.27కు తగ్గింది. - గుజరాత్: రాష్ట్రంలోని 19 జిల్లాలనుంచి 361 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 14,829కి చేరింది. వీటిలో 6,777 యాక్టివ్ కేసులున్నాయి. - రాజస్థాన్: రాష్ట్రంలో ఇవాళ 144 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 7680కి చేరగా, ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 4341గా నమోదైంది. ఇక నేటిదాకా 172 మరణాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కోవిడ్-19 సీరో-సర్వే నిర్వహించే ఐసీఎంఆర్ నగరాల జాబితాలో జైపూర్ కూడా చేరింది. - మధ్యప్రదేశ్: రాష్ట్రంలో 165 కొత్త కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 7,024కు చేరింది. వీటిలో 3030 యాక్టివ్ కేసులుకాగా, హాట్స్పాట్ ఇండోర్లో నేటిదాకా నిర్ధారిత కేసుల సంఖ్య 3103గా నమోదైంది. దిగ్బంధం నిబంధనలు భిన్నరకాలుగా అమలు చేస్తున్న నేపథ్యంలో ఇవాళ భోపాల్లో దుకాణాలు, వ్యాపార సంస్థలు పునఃప్రారంభమయ్యాయి. కాగా, ఉదయం 11 నుండి సాయంత్రం 5 గంటలదాకా దుకాణాలను తెరిచి ఉంచడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. - ఛత్తీస్గఢ్: రాష్ట్రంలో 50 కొత్త కేసుల నమోదుతో యాక్టివ్ కేసుల సంఖ్య 271కి చేరింది. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి నిరోధం దిశగా ప్రభుత్వం 13 డెవలప్మెంట్ బ్లాక్లను రెడ్ జోన్గా, 39ని ఆరెంజ్ జోన్గా ప్రకటించింది. ఇవేకాకుండా ఇప్పటికే కోవిడ్-19 కేసులు బయల్పడిన మరో 95 ప్రాంతాలు ఇప్పటికే నియంత్రణ జోన్లుగా ప్రకటించబడ్డాయి. - అరుణాచల్ ప్రదేశ్: రాష్ట్రంలో మే, జూన్ నెలల్లో పంపిణీ కోసం 313.956 టన్నుల పప్పుదినుసులను నాఫెడ్ అరుణాచల్ ప్రదేశ్కు సరఫరా చేసింది. - అసోం: రాష్ట్రంలో కోవిడ్-19 రోగుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన సోనాపూర్ జిల్లా ఆస్పత్రి 108 పడకలతో అందుబాటులోకి వచ్చిందని అసోం ఆరోగ్యశాఖ మంత్రి చెప్పారు. కాగా, రాష్ట్రంలో 18 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 704కు చేరింది. ఇందులో యాక్టివ్ 635, కోలుకున్నవారు 62, మరణాలు 4 వంతున నమోదైనట్లు ఆయన సామాజిక మాధ్యమం ట్విట్టర్ద్వారా పేర్కొన్నారు. - మణిపూర్: కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో దుర్బలవర్గాలకు తోడ్పాటు దిశగా ఇందిరా గాంధీ జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకం, ఇందిరాగాంధీ జాతీయ వితంతు పెన్షన్ పథకం, ఇందిరా గాంధీ జాతీయ దివ్యాంగ పెన్షన్ పథకం లబ్ధిదారులకు ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజనకింద ప్రభుత్వం రూ.500 వంతున పంపిణీ చేసేందుకు నిధులు విడుదల చేసింది. - మిజోరం: రాష్ట్రంలో హెచ్ఎస్ స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్, హెచ్ఎస్ఎల్సీ -2020 పరీక్షలను జూన్ 16నుంచి 11 కేంద్రాల్లో తిరిగి నిర్వహించాలని మిజోరం బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నిర్ణయించింది. - నాగాలాండ్: ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న రాష్ట్ర పౌరులను వెనక్కు తీసుకురావడం కోసం నాగాలాండ్ ప్రభుత్వం గోవా, ఆంధ్రప్రదేశ్, బెంగళూరు, రాజస్థాన్ల నుంచి ‘శ్రామిక్ స్పెషల్’ ప్రత్యేక రైళ్లను; పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్, పంజాబ్, డామన్-డయ్యూ, లక్నోల నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. కాగా, కోవిడ్-19 ప్రత్యేక ఉద్యాన కార్యక్రమ బృందం దిగ్బంధం సమయంలో “అధిక సాగు... అధికోత్పత్తి... అధికార్జన” ఇతివృత్తంగా వ్యవసాయ-ఉద్యాన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. PIB FACT CHECK
pib-37820
2748767399c5b158b57a67b7f8faf87a8b2ea6b433906167b80015e12cfeeb2b
tel
ప్రధాన మంత్రి కార్యాలయం ‘బిపర్ జాయ్’ చక్రవాతం నేపథ్యం లో సన్నద్ధత ను సమీక్షించడం కోసం జరిగిన ఉన్నత స్థాయిసమావేశాని కి అధ్యక్షత వహించిన ప్రధాన మంత్రి చక్రవాతం యొక్క ప్రభావాన్ని తగ్గించడాని కి చేపట్టినప్రయాసల ను ప్రధాన మంత్రి దృష్టి కి తీసుకు రావడమైంది అపాయం ఉన్న స్థానాల లో నివసిస్తున్న ప్రజల నుసురక్షితం గా ఖాళీ చేయించడం కోసం వీలైన అన్ని చర్యల ను తీసుకోండి: ప్రధాన మంత్రి నష్టం వాటిల్లే క్రమం లో అన్ని అత్యవసర సేవ ల నిర్వహణకు పూచీ పడండి, ఆయా సేవల నువెనువెంటనే పునరుద్ధరించడాని కి సంబంధించి సర్వసన్నద్ధులు గా ఉండండి: ప్రధాన మంత్రి పశువుల సురక్ష కు సైతం తగిన చర్యల ను తీసుకోవాలని అధికారుల కుసూచించిన ప్రధాన మంత్రి ‘బిపర్ జాయ్’ చక్రవాతాన్ని దృష్టి లో పెట్టుకొని తల ఎత్తగల స్థితి ని ఎదుర్కోవడాని కి కేంద్రం తో పాటు గుజరాత్ లో మంత్రిత్వ శాఖలు /ఏజెన్సీల సన్నాహాల ను సమీక్షించడం కోసం ఈ రోజు న జరిగిన ఒక ఉన్నత స్థాయి సమావేశాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. అపాయం బారిన పడే ప్రమాదం పొంచి ఉన్న స్థానాల లో కాపురం ఉంటున్న వారి ని గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సురక్షిత ప్రదేశాల కు చేర్చడం జరగాలని, అలాగే విద్యుత్తు, టెలి కమ్యూనికేశన్స్, ఆరోగ్యం, త్రాగునీరు మొదలైన అవసరమైన అన్ని సేవల ను తగిన జాగ్రతల తో సంబాళించడానికి పూచీ పడాలని సీనియర్ అధికారుల ను ప్రధాన మంత్రి ఆదేశాలు ఇచ్చారు. వాటికి ఏవైనా నష్టాలు వాటిల్లినట్లయితే గనక ఆయా సేవల ను తక్షణం పునరుద్ధరించాలి అని ఆయన పేర్కొన్నారు. పశువుల సురక్షత విషయం లో కూడాను పూచీ పడవలసింది గా ప్రధాన మంత్రి ఆదేశాల ను ఇచ్చారు. కంట్రోల్ రూములను 24 గంటలు క్రియాత్మకం గా ఉండాలి అని ఆయన ఆదేశించారు. సమావేశం సాగిన క్రమం లో, భారతదేశం వాతావరణ అధ్యయన విభాగం ‘బిపర్ జాయ్’ చక్రవాతం జూన్ 15 వ తేదీ నాడు మధ్యాహ్నాని కల్లా గుజరాత్ లోని జఖామూ నౌకాశ్రయం సమీపం లో మాండవి మరియు పాకిస్తాన్ లోని కరాచీ ల మధ్య సౌరాష్ట్ర, ఇంకా కచ్ఛ్ లను దాటేందుకు అవకాశం ఉంది అని వెల్లడించింది. ఇది మహాచక్రవాతం గా మార్పు చెందిందా అంటే గంట కు 125 కి.మీ. నుండి 135 కి.మీ. వేగం మొదలుకొని గంట కు 145 కి.మీ. వేగం కలిగివుండే ఈదురు గాలుల తో కూడి గుజరాత్ లోని కోస్తా తీర ప్రాంత జిల్లాల లో భారీ వర్షం కురియవచ్చని భావిస్తున్నారు. తత్ప్రభావం తో కచ్ఛ్, దేవభూమి ద్వారక మరియు జామ్ నగర్ లలో అత్యధిక వర్షాలు కురుస్తాయని, గుజరాత్ లోని పోర్ బందర్, రాజ్ కోట్, మోర్ బీ, జూనాగఢ్ జిల్లాల లో కొన్ని చోట్ల లో జూన్ 14 వ, 15 వ తేదీల లో భారీ నుండి అతి భారీ వర్షపాతం ఉండవచ్చని తెలియ జేయడమైంది. జూన్ 6 వ తేదీ న గాలివాన తో తుపాను ఆరంభం అయిన తరువాత నుండి అన్ని రాష్ట్రాల కు మరియు సంబంధిత ఏజెన్సీల కు తాజా ముందస్తు సమాచారం సహా క్రమం తప్పక బులెటిన్ ల ను జారీ చేస్తూ వస్తున్నట్లు ఐఎమ్ డి పేర్కొన్నది. గృహ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 24 గంటలూ స్థితి ఎలా ఉంటున్నదీ సమీక్షిస్తున్నదని, గుజరాత్ ప్రభుత్వం మరియు సంబంధి కేంద్రీయ ఏజెన్సీల తో సంప్రదింపులు జరుపుతోందని కూడా సమావేశం లో వెల్లడించడమైంది. ఎన్ డిఆర్ఎఫ్ 12 దళాల ను మొదట నుండే మోహరించింది; ఆ బృందాల కు పడవల ను, చెట్ల నరికివేత యంత్రాల ను, టెలికం ఉపకరణాల ను తదితర అవసర వస్తువుల ను సమకూర్చడం జరిగింది; దీనికి అదనం గా 15 జట్టుల ను కార్యరంగం లో దిగేందుకు తయారు గా ఉంచడమైంది. సహాయం, వెతకులాట మరియు రక్షణ కార్యాల కోసం ఓడల ను మరియు హెలికాప్టర్ లను భారతీయ కోస్తా రక్షక దళం మరియు నౌకాదళం మోహరించాయి. వీటికి తోడు పడవల తోను, కాపాడే సామగ్రి తోను కూడి ఉన్న వాయు సేన మరియు సైన్యాని కి చెందిన ఇంజినీర్ టాస్క్ ఫోర్స్ యూనిట్ లు అవసరం తలెత్తిన వెనువెంటనే కార్యరంగం లోకి దిగేందుకు సిద్ధం గా ఉన్నాయి. నిఘా విమానాలు మరియు హెలికాప్టర్ లు కోస్తా తీరం వెంబడి అదే పని గా పర్యవేక్షణ ను గిస్తున్నాయి. సైన్యం, నౌకాదళం, ఇంకా కోస్తా తీర ప్రాంత రక్షక దళాని కి చెందిన విపత్తు రక్షక జట్టు లు మరియు వైద్య చికిత్స బృందాల ను అప్రమత్తమై ఏ క్షణాన్నైనా విధులు నిర్వర్తించేటందుకు సన్నద్ధం చేయడమైంది. చక్రవాతం వేళ లో అన్ని చర్యల ను తీసుకోవడాని కి గుజరాత్ ప్రభుత్వం సిద్ధం గా ఉంది అనే విషయాన్ని సైతం ప్రధాన మంత్రి కి వివరించడం జరిగింది. ముఖ్యమంత్రి జిల్లా పాలన యంత్రాంగం తో సమీక్ష సమావేశాల ను నిర్వహించారు. ఏ అత్యవసర స్థితి ని అయినా తట్టుకోవడానికని రాష్ట్రం లోని పాలన సంబంధి యంత్రాంగాన్ని అంతటిని సర్వసన్నద్ధం గా ఉంచడమైంది. దీనికి తోడు, కేబినెట్ సెక్రట్రి మరియు హోం సెక్రట్రి లు గుజరాత్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తో మరియు సంబంధిత కేంద్రీయ మంత్రిత్వ శాఖల తో/ఏజెన్సీల తో నిరంతరం సంప్రదింపులు సాగిస్తున్నారు. ఈ సమావేశం లో హోం మంత్రి, ప్రధాన మంత్రి కి ప్రిన్సిపల్ సెక్రట్రి, కేబినెట్ సెక్రట్రి మరియు ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
pib-61998
308ec469097aec0bbaf8394cb946f07a3a2a99c1d5e241517bb8597f64a93b56
tel
సాంస్కృతిక మంత్రిత్వ శాఖ భారత యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రత్యేక చర్యలు: శ్రీ జి. కిషన్ రెడ్డి యువతకు అన్ని రంగాలలో శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించేలా మొదటిసారిగా తెలంగాణలో కౌశల్ మహోత్సవ్: శ్రీ జి. కిషన్ రెడ్డి ఈ కార్యక్రమానికి 24 రంగాలకు చెందిన 200 కు పైగా సంస్థలు హాజరవుతాయని అంచనా భారత యువతకు ఇంటిదగ్గరే ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని కేంద్ర పర్యాటక, సంస్కృతి, ఈశాన్యప్రాంత అభివృద్ధి శాఖల మంత్రి శ్రీ కిషన్ రెడ్డి అన్నారు. ఈరోజు సికింద్రాబాద్ లోని జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థలో జరిగిన విలేఖరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. యువతకు అన్ని రంగాలలో శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించేలా మొదటిసారిగా తెలంగాణలో కౌశల్ మహోత్సవ్ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. జూన్ 3-4 తేదీలలో సికింద్రాబాద్ లో కౌశల మహోత్సవ్ మేళా జరుగుతుందని, ఇందులో వివిధ రంగాలకు చెందిన 200 కు పైగా ప్రైవేట్ కంపెనీలు పాల్గొంటాయని చెప్పారు. వాటులో ఫార్మా సూటికల్, బాంకింగ్, మాన్యుఫాక్చరింగ్, ఐటీ, ఆస్పత్రుల వారు ఉంటారు. ఈ మేళాలో దాదాపు 40 వేల ఉద్యోగావకాశాలు కల్పిస్తారు. సెక్యూరిటీ విభాగంలో ఇప్పటికే ఒప్పందాలు జరిగాయని మంత్రి ఉదాహరించారు. ఈశాన్య ప్రాంత యువతకు శిక్షణనిచ్చి ఉపాధి కల్పిస్తారు. ఈ ప్రత్యేక మేళాలో ఉపాధి లభించని యువతకు మరింత శిక్షణ ఇచ్చి తగిన ఉద్యోగావకాశాలు కల్పిస్తామని శ్రీ కిషన్ రెడ్డి చెప్పారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ పేర్లను కౌశల మహోత్సవ్ వెబ్ సైట్ లో నమోదు చేసుకోవాలని సూచించారు. జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ దక్షిణ ప్రాంతీయాధిపతి శ్రీమతి పునీత పుష్యరాగం మాట్లాడుతూ, జాతీయ సంస్థ అయిన జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థలో కౌశల్ మహోత్సవ్ ఒక భాగమని చెప్పారు. నైపుణ్యమున్న వారికి స్వదేశంలోనూ, విదేశాలలోనూ ఉద్యోగావకాశాలు కల్పించటానికి ఇదొక వేదిక అన్నారు. ఇప్పుడు జరిపే మేళాలో 200 కు పైగా సంస్థలు, 15,000 మందికి పైగా ఉద్యోగార్థులు వస్తారని అంచనావేస్తున్నట్టు చెప్పారు. నైపుణ్యాభివృద్ధి, వ్యాపారదక్షత మంత్రిత్వశాఖ ఈ నియామకాల ప్రక్రియ నిర్వహిస్తుండగా జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ వ్యూహాత్మక భాగస్వామిగా వ్యవహరిస్తూ ఉపాధి, అప్రెంటిస్ షిప్ అవకాశాలను స్థానిక తెలంగాణ యువత ముందు ఉంచుతూ వివిధ రంగాలలో సాధికారతకు కృషి చేస్తోంది. నిపుణ అనే ప్రభుత్వేతర సంస్థ, అనేల ప్రభుత్వ విభాగాలు కూడా ఉమ్మడిగా ఇందులో పాల్గొంటున్నాయి. నిపుణులైన ఉద్యోగార్థులను, స్వదేశీ, విదేశీ సంస్థలను ఒకే వేదిక మీదికి తీసుకు వచ్చి అక్కడికక్కడే ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి తీసుకురావటం ఈ కార్యక్రమ లక్ష్యం. ఇది రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఈ రెండు రోజుల ప్రతిపాదిత కౌశల్ మహోత్సవ్ లో యువతకు కౌన్సిలింగ్, ఉచిత పరీక్షలు, మోటివేషన్ తరగతులు, ఉద్యోగావకాశాలకు సంబంధించిన సలహాలతో అనేక కార్యక్రమాలు జరుగుతాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూన్ 28 న జరిగే ముందస్తు పరీక్షలకు హాజరు కావలసి ఉంటుంది, వారు ఇంటర్వ్యూ ప్రక్రియ ముగించుకొని అక్కడికక్కడే ఉద్యోగ లేఖలు అందుకోవచ్చు. కౌశల్ మహోత్సవ్ లో పాల్గొన దలచిన అభ్యర్థులు ఈ వెబ్ సైట్ లో నమోదు చేసుకోవాలి: https://kaushalmahotsav.nsdcdigital.org/ అందులో ఆహార, వ్యవసాయ, ఆటోమోటివ్, సౌరశక్తి తదితర రంగాల వారీగా ఉన్న ఉద్యోగావకాశాలను ఎంచుకోవాలి. ఈ మెగా రిక్రూట్ మెంట్ లో 24 రంగాలకు చెందిన 450 విభాగాలలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. మహీంద్రా అండ్ మహీంద్రా, పార్లే ఆగ్రో, ఐసీఐసీఐ, జాన్సన్ లిఫ్ట్స్, సోడెక్సో లాంటి సంస్థలు పాల్గొంటున్నాయి. పాల్గొనేవారి కోసం దాదాపు 40 వేల ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. ఎంబీఏలు, ఐటిఐలు, డిప్లొమా హోల్డర్లు, గ్రాడ్యుయేట్లు, ఇంటర్, టెన్త్ పాసైన వారు కూడా హాజరవుతారు. అభ్యర్థులు కనీసం 18 సంవత్సరాలవారై ఉండాలి. పీఎంకేకే, పిఎంకేవివై, అప్రెంటిస్, అనేక నైపుణ్యాభివృద్ధి శిక్షణ పథకాల కింద శిక్షణ పొందినవారు హాజరుకావచ్చు. నైపుణ్యాభివృద్ధి, వ్యాపార దక్షత మంత్రిత్వశాఖ వారి ప్రధాన కార్యక్రమమైన కౌశల్ మహోత్సవ్ పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలను ప్రోత్సహించే చొరవ. నైపుణ్య భారత్ లక్ష్యాలను వేగంగా, నాణ్యమైన ప్రమాణాలతో సాధించే ప్రక్రియ ఇది. రాష్ట్రంలో తరచూ క్రమంగా జరిపే కార్యక్రమాలలో ఒకటి. ఉద్యోగాలు ఇచ్చేవాళ్లను, తీసుకునేవాళ్లను ఒకే వేదికమీదికి తీసుకురావటం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు పరచటం దీని లక్ష్యం. జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ గురించి: దేశంలో నైపుణ్య పర్యావరణాన్ని నిర్మించే ప్రధాన సంస్థ జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ. భారత ప్రభుత్వపు నైపుణ్యాభివృద్ధి, వ్యాపార దక్షత మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో నడుస్తుంది. ప్రైవేట్ రంగాన్ని కూడా భాగస్వామిగా చేసి, వారి అవసరాలకు తగిన శిక్షణ ఇచ్చి అక్కడే ఉద్యోగవకాశాలు కూడా కల్పించాలనే ధ్యేయంతో ఎన్ ఎస్ డీ సీ ఏర్పాటైంది. దీని ద్వారా వృత్తినైపుణ్య శిక్షణ ఇచ్చి దేశ యువతను సాధికారం చేస్తారు. వ్యాపార సంస్థలకు, అంకుర సంస్థలకు కంపెనీలకు ఎన్ ఎస్ డి సి అండగా ఉంటూ నిపుణులైన సిబ్బందిని అందిస్తుంది. ప్రైవేట్ సంస్థలకు నిధులు సమకూర్చి వారే శిక్షణ ఇచ్చి ఉద్యోగాలివ్వటాన్ని కూడా ప్రోత్సాహిస్తుంది.
pib-62862
22aad38d9e16eab683c1f9571da1faca28942e6a29171db6bffd71c7e5070e02
tel
పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వినియోగదారులకోసం సేవలు సరళతరం చేసే ఈ-జీసీఏ పైలట్ ఈ-లాగ్ బుక్ ను ఆపరేటర్ల అంతర్గత సాఫ్ట్ వేర్ లో సమీకృతం ఆపరేటర్ల ఏవోసీ సమాచారాన్ని కూడా హేలీ-సేవా పోర్టల్ లో సమీకృతం వాయుప్రయాణ యోగ్యత ధ్రువపత్రాల జారీ ప్రక్రియలో మార్పు నిరుడు పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ ఆధ్వర్యంలో ఈ-జీసీఏ పేరుతో ఒక సింగిల్ విండో ఈ-గవర్నెన్స్ వేదిక రూపకల్పన జరిగింది. దీనిద్వారా పారదర్శకత, జవాబుదారీ తనం, వ్యాపారాన్ని సులభతరం చేయటం సాధ్యమవుతాయని భావిస్తున్నారు. అన్ని రకాల ఆమోదాలు, ధ్రువపత్రాలు, డీజీసీఏ జారీచేసిన లైసెన్సులు ఈ-జీసీఏ పరిధిలోకి వస్తాయి. దీనివలన ఆమోదాలకోసం పెట్టుకునే దరఖాస్తులు, సంబంధిత డాక్యుమెంట్లు సంబంధిత పోర్టల్ లో సమర్పించే వెసులుబాటు కలుగుతోంది. అప్పటి నుంచి డీజీసీఏ తన భాగస్వాములతో ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండటం, సేవలు సులభతరం చేయటం సాధ్యమవుతోంది. రెండు బయటి పోర్టల్స్ తో ఏపీఐ ద్వారా ఈ-జీసీఏ సమీకృతమైంది. దీనివలన విదేశాలలో ఉన్న విమానాలకు కూడా సర్టిఫికెట్ల జారీ సులువవుతోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి: ఎ. .పైలట్ ఈ-లాగ్ బుక్ ను ఈ-జీసీఏ లో సమీకృతం చేయటం ద్వారా ఏపీఐ సాయంతో ఆపరేటర్ అంతర్గత సాఫ్ట్ వేర్ కు అనుసంధానం కావటం పైలట్ పనితీరును మదింపు చేయటానికి ప్రయాణించిన చరిత్ర వివరాలు నమోదు చేయటం చాలా అవసరం. సకాలంలో ఈ సమాచారాన్ని పైలట్ లాగ్ బుక్ లో ఎక్కించటం ద్వారా వారి సమర్థత పెరుగుతుంది. మెరుగైన నైపుణ్యాభివృద్ధికి అవకాశం కల్పించటం వలన సురక్షితంగా నడపగలుగుతారు. విమానాల సాఫ్ట్ వేర్ ను ఈ-జీసీఏ సాఫ్ట్ వేర్ తో అనుసంధానం చేయాలసిన అవసరం ఈ ప్రాజెక్ట్ రూపకల్పన జరిగిన వెంటనే కనిపించింది. డీజీసీఏ తో సంబంధమున్న అన్నీ ఎయిర్ లైన్స్ తమ అంతర్గత సాఫ్ట్ వేర్ ను ఈ-జీసీఏ తో అనుసంధానం చేయాలని అన్నీ ఎయిర్ లైన్స్ ను ఆదేశించారు. దానివలన పైలెట్ల ప్రయాణ రికార్డులు నేరుగా ఈ-జీసీఏ లోని వారి ఈ-లాగ్ బుక్ లోకి వెళ్ళిపోతాయి. దీనివలన ఈ-లాగ్ బుక్స్ నింపే సమయం ఆదాయ అవుతుంది. పైగా స్వయంగా పాల్గొనాల్సిన అవసరమే రాదు. వివిధ ఎయిర్ లైన్స్ వాటి పైలట్ల డేటా ను తమ సిస్టమ్స్ నుంచి ఈ-జీసీఏ లోకి పంపగలిగేలా టీసీఎస్ ఒక ఏపీఐ రూపొందించింది. ఎయిర్ లైన్స్ కూడా ఇందుకు తగినట్టుగా తమ సిస్టమ్స్ లో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సమీకృత కార్యక్రమంలో పాల్గొన్న ఎనిమిది ఎయిర్ లైన్స్ లో ఇండిగో ఇప్పటకే దీన్ని అమలు చేసింది. అందువల్ల ఇండిగో పైలెట్ల ప్రయాణ సమాచారం నేరుగా ఈ-జీసీఏ సాఫ్ట్ వేర్ లో సమీకృతమవుతోంది. మిగతా ఎయిర్ లైన్స్ ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్, విస్తారా, గో ఎయిర్, బ్లూ డార్ట్ పరీక్ష దశలో ఉండి అమలుకు చివరి దశలో ఉన్నాయి. ఒకటీ రెండు నెలల్లో ఇవి కూడా పూర్తవుతాయి. . బి. ఆపరేటర్ల ఏవోసి డేటాను హెలి-సేవా పోర్టల్ లో సమీకృతం చేయటం పౌర విమానయాన మంత్రిత్వశాఖ వారి హేలీ-సేవా పోర్టల్ ద్వారా ఆపరేటర్లు హెలికాప్టర్ లాండింగ్ అభ్యర్థనలను నమోదు చేయటానికి, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తక్కువ వ్యవధిలోనే జిల్లా అధికారులకు సమాచారం అందించవచ్చు. కార్పొరేట్ , ఛార్టర్ , వి ఐ పీ ప్రయాణాలు, వైద్య అవసరాలు సైతం చాలా వేగంగా అనుమతులు పొందవచ్చు. హేలీ-సేవా పోర్టల్ వాడుకోవటానికి ఈ-జీసీఏ దగ్గర ఎయిర్ ఆపరేటర్ లాగ్స్ ను వాడుకోవటం చాలా సులభమవుతుంది. దరఖాస్తుదారులు/ హెలికాప్టర్ ఆపరేటర్ల వివరాలు పోర్టల్ లో అందుబాటులో ఉంటాయి. దీనివలన ఒకే పని రెండుస ఆరలు చేయాల్సిన అవసరముండదు. దీనివలన చాలా శ్రమ తగ్గుతుంది. ప్రాసెసింగ్ చాలా వేగవంతమవుతుంది. C. కొత్తగా వచ్చిన విమానాన్ని ఎయిర్ లైన్స్ లోకి తీసుకునేటప్పుడు సర్టిఫికెట్ల జారీ సులభతరం ప్రయాణ యోగ్యత ఉన్నట్టు ఒక విమానానికి ధృవపత్రం ఇచ్చే ప్రక్రియ, మళ్ళీ ప్రయాణ యోగ్యతను సమీక్షించినప్పుడు ఇచ్చే ధృవపత్రం ఇప్పుడు సులువవుతాయి. విదేశాల్లో ఉన్నప్పటికీ జారీచేయటం కుదురుతుంది. ఈ-జీసీయే దీన్ని సులభతరం చేస్తోంది. ఇంతకుముందు పాక్షికంగా నింపిన పత్రాలను డీజీసీఏ కేంద్ర కార్యాలయానికి పంపి అక్కడి నుంచి విఊదేశాలకు పంపాల్సి వచ్చేది. అక్కడ జారీ చేసేవారు. డీజీసీయే తన కార్యాచరణ ప్రక్రియలన్నీటినీ సులభతరం చేయటానికి ఎప్పటికప్పుడు కృషి చేస్తూ ఉంది. వినియోగదారులకు సులభంగా అందుబాటులో ఉండాలన్న లక్ష్యాన్ని చేరుకునేందుకు సూచనలు, సలహాలు తీసుకుంటోంది. దీని వాలమ ఈ-జీసీయే ను మరింత పాటిష్టపరుస్తోంది.
pib-165270
16b205c4c8ef80c3cfd806e3984e03f138bf6e91c691e37a0f931aa616e63f19
tel
మంత్రిమండలి ఆరోగ్యం- మందుల రంగంలో సహకారం అంశంపై భారతదేశానికి, ఇజ్రాయల్ కు మధ్య అవగాహన పూర్వక ఒప్పందానికి ఆమోదం తెలిపిన మంత్రిమండలి ఆరోగ్యం-మందుల రంగంలో సహకారం అంశంపై భారతదేశానికి, ఇజ్రాయల్ కు మధ్య అవగాహన పూర్వక ఒప్పందానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. ఈ క్రింద పేర్కొన్న రంగాల లో సహకారం ఈ ఎమ్ఒయు పరిధిలోకి వస్తుంది: i) వైద్యులు, ఇతర ఆరోగ్య రంగ వృత్తి నిపుణులకు శిక్షణ- వారి సేవల ఆదాన ప్రదానం; ii) మానవ వనరుల వికాసం తో పాటు ఆరోగ్య సంరక్షణ సదుపాయాల స్థాపనలో సహాయం; iii) ఔషధ నిర్మాణ సంబంధి సాధనాలు, చికిత్స ఉపకరణాలు, సౌందర్యవర్ధక సాధనాల నియంత్రణకు సంబంధించిన సమాచారాన్ని ఒక పక్షానికి మరొక పక్షం ఇచ్చి పుచ్చుకోవడం; iv) జలవాయు సంబంధి అపాయాల నేపథ్యంలో పౌరుల ఆరోగ్యానికి గల సవాళ్లను అంచనా వేసే, అటువంటి సవాళ్లను అదుపులో పెట్టాలన్న, వాటి పట్ల అనుకూలతను ఏర్పరచాలన్న ఉద్దేశ్యాలతో సార్వజనిక స్వస్థత సంబంధి కార్యక్రమాలను గురించిన నైపుణ్యాన్ని ఒక పక్షానికి రెండో పక్షం వెల్లడించుకోవడం; v) జలవాయు సంబంధి మార్పులకు తట్టుకుని నిలచే మౌలిక సదుపాయాలకు సంబంధించిన నైపుణ్యాన్ని, దానితో పాటే ‘గ్రీన్ హెల్త్ కేర్’ ను అభివృద్ధి చేసేందుకు సహాయాన్ని అందించేందుకు అవసరమైన నైపుణ్యాన్ని ఒక దేశానికి రెండో దేశం పంచడం; vi) సంబంధం కలిగిన వివిధ రంగాల లో పరస్పర పరిశోధన ను ప్రోత్సహించడం; vii) ఉభయ పక్షాలు నిర్ణయించే మేరకు, మరేదైనా రంగంలో కూడాను సహకరించుకోవడం. ప్రతి ఒక్క పక్షం రెండో పక్షానికి సంబంధించిన సంస్థల ద్వారా సహకారాన్ని లక్షించే అంశాలపై నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశాలు, చర్చా సభలు, సదస్సులు, కార్యశాలలు, సమ్మేళనాల్లో తమ దేశాల ప్రతినిధులు పాలు పంచుకొనేటట్లుగా వారిని ప్రోత్సహించడం జరుగుతుంది. (
pib-129535
3112e3d27d4cf3c1b1c05984e30498866fb6270d181eaf3f3f8fb725a742bf19
tel
పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ఎఫ్.సి.ఐ. వద్ద మిగిలిన బియ్యాన్ని ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ సానిటైజర్ గా తయారుచేయడానికీ, పెట్రోల్ లో కలపడానికీ వీలుగా ఇథనాల్ గా మార్చేందుకు అనుమతించారు. జీవ ఇంధనాలపై జాతీయ విధానం, 2013 కింద పేరా 5.3 ప్రకారం ఒక వ్యవసాయ పంట కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ అంచనాల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మిగిలిన ఆహారధాన్యాల ను ఇథనాల్ గా మార్చడానికి జాతీయ జీవ ఇంధనాల సమన్వయ కమిటీ ఆమోదంతో పాలసీ అనుమతిస్తుంది. పెట్రోలియం మరియు సహజ వాయువు శాఖ కేంద్ర మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ అధ్యక్షతన ఈ రోజు నిర్వహించిన ఎన్.బి.సి.సి. సమావేశంలో భారత ఆహార సంస్థ వద్ద మిగిలిన బియ్యాన్ని ఇథనాల్ గా మార్చడానికి అనుమతించారు. ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ సానిటైజర్స్ తయారుచేయడానికీ, ఇథనాల్ కలిసిన పెట్రోల్ కార్యక్రమం కోసం ఇలా మార్చిన ఇథనాల్ ను వినియోగిస్తారు.
pib-275736
31622a0991f7796af7f1ff0f459582fb31beef77ec81bca0663465b2ac1d25b5
tel
రక్షణ మంత్రిత్వ శాఖ డి ఆర్ డి వో రూపొందించిన 1.5 లక్షల ఆక్సిజెన్ వ్యవస్థల కొనుగోలుకు పిఎం కేర్స్ ఫండ్ ఆమోదం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ రూపొందించిన ఆక్సిజెన్ వ్యవస్థ “ఆక్సీకేర్” యూనిట్లు లక్షన్నర కొనుగోలుకు రూ. 322.5 కోట్లు వెచ్చించటానికి పిఎం కేర్స్ ఫండ్ ఆమోదం తెలియజేసింది. ఆక్సీకేర్ అనేది రోగులకు ఇచ్చే ఆక్సిజెన్ ను నియంత్రించే వ్యవస్థ. ఇప్పుడు కేటాయించిన నిధుల సాయంతో మానవ సాయంతో పనిచేసేవి లక్ష, ఆటోమేటిక్ గా పనిచేసేవి 50 వేలు ఆక్సీకేర్ లు కొనుగోలు చేయవచ్చు. వీటితోబాటు శ్వాసలో సాయపడే మాస్కులు కూడా కొనుగోలు చేస్తారు. ఈ ఆక్సీకేర్ వ్యవస్థ ఆక్సిజెన్ స్థాయిని బట్టి అవసరమైన అదనపు ఆక్సిజెన్ ను అందించటంతో బాటు ఆ వ్యక్తి ప్రాణాంతకమైన స్థితిలోకి జారిపోకుండా కాపాడుతుంది. దీనిని అత్యంత ఎత్తైన ప్రదేశాలలో పనిచేసే సైనికుల కోసం డి ఆర్ డి వో కు చెందిన బెంగళూరులోని డిఫెన్స్ బయో ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రో మెడికల్ లేబరేటరీ తయారు చేసింది. క్షేత్రస్థాయి సమస్యలకు అనుగుణంగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన వ్యవస్థ ఇది. ఇది కోవిడ్-19 రోగుల చికిత్సకు సమర్థంగా పనిచేస్తుంది. ఈ ఆక్సకేర్ పరికరం రెండు నమూనాల్లో లభిస్తుంది. ప్రాథమిక నమూనాలో 10 లీటర్ల ఆక్సిజెన్ సిలిండర్, ప్రవాహాన్ని నియంత్రించే రెగ్యులేటర్, గాలిలో తేమను కొనసాగించే హ్యుమిడిఫయర్, ముక్కులోకి గాలిని తీసుకువెళ్ళే శ్వాసగొట్టం ఉంటాయి. ఎస్పీఓ2 కొలమానానికి అనుగుణంగా మానవసాయంతో ఆక్సిజెన్ ను నియంత్రిస్తారు. ఇక రెండో నమూనా విషయానికొస్తే, ఆక్సిజెన్ సిలిండర్ తోబాటు ఎలక్ట్రానిక్ నియంత్రణలు అనుసంధానమై ఉంటాయి. అవి వాటంతట అవే రెగ్యులేటర్ సాయంతో ఆక్సిజెన్ ప్రవాహాన్ని నియంత్రిస్తాయి. రోగి ఆక్సిజెన్ స్థాయిని బట్టి ఆక్సిజెన్ వాడకాన్ని నియంత్రించటం వలన ఈ యంత్రం ఆక్సిజెన్ వృధాకాకుండా సాయపడుతుంది. అందువలన ఆక్సిఎజ్న్ సిలిండర్ ను సమర్థంగా వాడుకోవచ్చు. వైద్య సిబ్బంది ఈ ప్రవాహాన్ని ఎప్పటి కప్పుడు మార్చే వెసులుబాటు ఉంటుంది. ఎస్పీఓ2 స్థాయిని పర్యవేక్షించటానికి వీలుగా అది కనడుతూ ఉంటుంది. మాటిమాటికీ స్వయంగా వచ్చి ఆక్సిజెన్ ప్రవాహాన్ని కొలవాల్సిన అవసరం ఉండదుగనుక వైద్య సిబ్బందికి సమయం కలిసి వస్తుంది. ఆటోమేటిక్ వ్యవస్థ వలన ఎస్పీఓ2 స్థాయి తగ్గినప్పుడు శబ్దరూపంలో హెచ్చరిక వచ్చే ఏర్పాటు కూడా ఉంది. ఆక్సీకేర్ వ్యవస్థకు నాన్-రీబ్రీతర్ మాస్కులు అనుసంద్థానమై ఉంటాయి. ఆ విధంగా ఆక్సిజెన్ ను మరింత సమర్థవంతంగా వాడుకునే వీలుంటుంది. దీనివలన దాదాపు 30-40% ఆక్సిజెన్ ఆదా అవుతుంది. ఈ ఆక్సీకేర్ వ్యవస్థను ఇంటిలోను, క్వారంటైన్ కేంద్రాల్లోనూ కోవిడ్ కేర్ కేంద్రాల్లోను, ఆస్పత్రులలోను వాడుకోవచ్చు. . ప్రతి రోగికీ ఈ మాస్కులు మార్చాల్సి ఉంటుంది. డి ఆర్ డి వో సంస్థ ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆక్సీకేర్ పరికరాలు తయారుచేసే అనేక భారతీయ పరిశ్రమలకు బదలాయించింది.
pib-49810
f7aaa655a29b6d1e1edf52632691259c838c4a8e3ffdbcd46ceed6de4e06bc1a
tel
ప్రధాన మంత్రి కార్యాలయం విజయదశమి నాడు అందరి కి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి విజయ దశమి సందర్భం లో అందరి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు. ఈ మంగళప్రదమైనటువంటి రోజు ప్రతి ఒక్కరి జీవనం లో ధైర్యాన్ని, సాహసాన్ని, సంయమనాన్ని మరియు సకారాత్మకమైన శక్తి ని కొనితేవాలని కూడా ఆయన కోరుకున్నారు. ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో - ‘‘దేశం లో అందరి కి విజయ దశమి యొక్క అనేకానేక శుభాకాంక్షలు. ఇది విజయాని కి ప్రతీక గా నిలచే పండుగ రోజు. ఈ పవిత్రమైన దినం ప్రతి ఒక్కరి జీవనం లో సాహసం, సంయమనం మరియు సకారాత్మకమైన శక్తి ని తీసుకు రావాలని నేను కోరుకుంటున్నాను.’’ అని పేర్కొన్నారు.
pib-46031
3e5cfbdfacc1b286e94f604a3adeadbb72e22e239e5662c784dd2fd74143ff73
tel
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ‘అల్ఫా’ రకం వైరస్తో పోలిస్తే బి.1.617.2గా పిలిచే ‘డెల్టా’ రకం 40-60 శాతం అధికంగా వ్యాధిని వ్యాప్తి చేయగలదు- డాక్టర్ ఎన్.కె.అరోరా, ‘ఇన్సాకాగ్’ సహ-చైర్మన్ ‘‘ఈ అంశంపై ఐసీఎంఆర్ నిర్వహించిన అధ్యయనాల ప్రకారం... ప్రస్తుత టీకాలు డెల్టా రకం వైరస్పై పోరులో ఎంతో ప్రభావశీలంగా పనిచేస్తున్నాయి’’ “ఎక్కువ మంది టీకా తీసుకుని.. కోవిడ్ అనుగుణ ప్రవర్తనను కచ్చితంగా అనుసరిస్తే భవిష్యత్ వైరస్ దశలు కూడా నియంత్రణలో ఉండటమేగాక ఆలస్యం అవుతాయి” డెల్టా రకం వైరస్ వల్ల వ్యాధి తీవ్రత మరింత అధికంగా ఉంటుందని చెప్పడం కష్టం- డాక్టర్ ఎన్.కె.అరోరా వివిధ రకాల వైరస్ల నిర్ధారణ, అనుసరణకు సంబంధించిన ప్రామాణిక విధాన ప్రక్రియ గురించి ‘ఇండియన్ సార్స్-సీఓవీ-2 జెనోమిక్స్ కన్సార్టియం’ సహ-చైర్మన్ డాక్టర్ ఎన్.కె.అరోరా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వివరించారు. ఈ సందర్భంగా ‘డెల్టా’ రకం వైరస్ వల్ల వ్యాధి వ్యాప్తి ఎందుకు ఎక్కువగా ఉంటుందో, జన్యుపరమైన నిఘా ద్వారా దాని వ్యాప్తిని ఎలా అరికట్టవచ్చునో వివరించారు. అంతేకాకుండా కోవిడ్ అనుగుణ ప్రవర్తన ప్రాముఖ్యం గురించి పునరుద్ఘాటించారు. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో వైరస్ సంపూర్ణ జన్యుక్రమం రూపకల్పన కోసం కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, బయోటెక్నాలజీ శాఖ, భారత వైద్య పరిశోధన మండలి , భారత శాస్త్ర-పారిశ్రామిక పరిశోధన సంస్థ ల పరిధిలోని మొత్తం 28 ప్రయోగశాలలతో ‘ఇన్సాకాగ్’ రూపుదిద్దుకుంది. దీన్ని భారత ప్రభుత్వంలోని ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ 25/12/2020న ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో డాక్టర్ ఎన్.కె.అరోరా ఇచ్చిన ఇంటర్వ్యూ వివరాలిలా ఉన్నాయి: ప్రశ్న: ‘ఇన్సాకాగ్’ ఇటీవల తన పరిధిని పెంచుకుంది... ఈ విస్తరణ వెనుక ఆలోచన ఏమిటి? జవాబు: మనకు ఆందోళన కలిగిస్తున్న వైరస్ రకాల ఆవిర్భావం, వాటి వ్యాప్తిపై మనం నిశితంగా నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. తద్వారా అవి మరిన్ని ప్రాంతాలకు వ్యాపించకముందే వాటిని నియంత్రించడం సాధ్యమవుతుంది. ఈ నేపథ్యంలోనే 10 ప్రయోగశాలలతో ‘ఇండియన్ సార్స్-సీఓవీ-2 జెనోమిక్స్ కన్సార్టియం’ 2020 డిసెంబరులో ఏర్పాటు కాగా, ఇటీవల మరో 18 ప్రయోగశాలలు ఇందులో భాగమయ్యాయి. ‘సార్స్-సీఓవీ-2’ జన్యుక్రమపరమైన నిఘా కోసం ప్రయోగశాలల బలమైన నెట్వర్క్ అవసరమన్నదే దీనివెనుకగల ఆలోచన. ఈ నెట్వర్క్ రూపొందించే సంపూర్ణ జన్యుక్రమ సమాచారంతో వైద్య/వ్యాధులవ్యాప్తి అధ్యయన సమాచార సహసంబంధాన్ని పోల్చి చూస్తారు. తద్వారా ఏదైనా వైరస్ రకం మరింత అధికంగా వ్యాధి వ్యాప్తికి కారణమవుతుందా, వ్యాధి తీవ్రత పెరుగుతుందా, వ్యాధి నిరోధకతను అధిగమిస్తుందా, ఇతర వ్యాధుల విజృంభణకు దారితీస్తుందా, టీకాల సామర్థ్యంపై దుష్ప్రభావం చూపుతుందా తదితర అంశాలనే కాకుండా ప్రస్తుత పరీక్ష పద్ధతులతో నిర్ధారణ సాధ్యమవుతుందా అన్నది కూడా తెలుసుకోవచ్చు. ఆ తర్వాత ఈ సమాచారం మొత్తాన్నీ ‘జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం’ పూర్తిస్థాయిలో విశ్లేషిస్తుంది. ఇందుకోసం దేశాన్ని రెండు భౌగోళిక ప్రాంతాలుగా విభజించి ప్రతి ప్రయోగశాలకు ఒక ప్రాంతం బాధ్యత అప్పగించబడింది. అలాగే ప్రతి సముదాయంలో 4 జిల్లాల వంతున మొత్తం 180-190 సముదాయాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ సముదాయాల పరిధిలో క్రమబద్ధంగా శ్లేష్మం నమూనాలు, తీవ్ర అనారోగ్యం బారినపడిన రోగుల నమూనాలు తీయడంతోపాటు టీకాల వల్ల కలిగే వ్యాధులు, ఇతర అసాధారణ వైద్య దృష్టాంతాలు వంటి వివరాలు సేకరించి, వాటి క్రమాన్ని రూపొందించడం కోసం ప్రాంతీయ ప్రయోగశాలలకు పంపుతారు. ప్రస్తుతం నెలకు 50,000కుపైగా నమూనాల జన్యుక్రమాన్ని రూపొందించగల సదుపాయాలు దేశంలో ఉండగా ఇంతకుముందు ఈ సామర్థ్యం సుమారు 30,000 నమూనాలకు మాత్రమే పరిమితం కావడం గమనార్హం. ప్రశ్న: ‘ఈ వైరస్ రకాల నిర్ధారణకుగల యంత్రాంగం ఏమిటి... ఆ రకాలను ఎలా అనుసరిస్తారు? జవాబు: భారతదేశంలో ఇప్పటికే అత్యంత సమర్థ ‘వ్యాధులపై సమగ్ర నిఘా కార్యక్రమం’ యంత్రాంగం ఉంది. ఈ కార్యక్రమం కింద జిల్లాలు/నిఘా కేంద్రాల నుంచి నమూనాల సేకరణ, ప్రాంతీయ జన్యుక్రమ రూపకల్పన ప్రయోగశాలల కు రవాణా బాధ్యతను సమన్వయం చేస్తారు. అటుపైన జన్యుక్రమం రూపకల్పన, ఆందోళనకారక వైరస్ రకాలు /ఆసక్తికర వైరస్ రకాలు , సంభావ్య ఆసక్తికర రకాలు, ఇతర మార్పుల క్రమాన్ని రూపొందించడం ‘ఆర్జీఎస్ఎల్’ల బాధ్యత. ఇందులో ‘వీఓసీ/వీఓఐ‘లకు సంబంధించిన సమాచారం నేరుగా కేంద్రీయ నిఘా యూనిట్ కు పంపబడుతుంది. అక్కడి అధికారులు దీన్ని రాష్ట్ర నిఘా అధికారులతో సమన్వయంద్వారా వైద్య-సాంక్రమిక వ్యాధులతో సహసంబంధాన్ని విశ్లేషిస్తారు. అనంతరం నమూనాలను సంబంధిత ప్రత్యేక ‘జీవనిధి‘ కి పంపిస్తారు. ప్రజారోగ్యంతో సంబంధంగల జన్యు పరివర్తనను గుర్తించిన తర్వాత, ఆ నమూనాలను ‘ఆర్జీఎస్ఎల్’లు ‘శాస్త్ర-వైద్య సలహా బృందానికి పంపుతాయి. ఈ బృందం సంభావ్య ఆసక్తికర రకాలు, వాటిలో పరివర్తనలపై నిపుణులతో చర్చించి, అవసరమైతే మరింత పరిశోధన కోసం ‘సీఎస్యూ’కు తిరిగి పంపాలని సిఫారసు చేస్తుంది. సమాచారం ‘ఎన్సీడీసీ’ పరిధిలోని ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ, భారత వైద్య పరిశోధన మండలి, బయోటెక్నాలజీ శాఖ, భారత శాస్త్ర-పారిశ్రామిక పరిశోధన మండలి, ఆయా రాష్ట్రాల అధికారులతో సంయుక్తంగా ‘ఐడీఎస్పీ’లు క్రోడీకరించిన సమాచారంపై వైద్య-సాంక్రమిక వ్యాధి సహసంబంధ విశ్లేషణ చేపడుతుంది. చివరగా, కొత్త ఉత్పరివర్తనాలు/ఆందోళనకారక రకాల సంవర్ధనం చేపట్టి శాస్త్రీయ అధ్యయనం నిర్వహిస్తారు. తద్వారా వ్యాధి వ్యాపకతపై ప్రభావం, వైరస్ తీవ్రత, టీకా సామర్థ్యం, వ్యాధి నిరోధకత అధిగమనం తదితర లక్షణాలను గుర్తిస్తారు. ప్రశ్న: ‘డెల్టా’ రకంపై ప్రపంచమంతా ఆందోళన చెందుతోంది... దీన్ని తీవ్ర ప్రభావం గలదిగా పరిగణించడానికి కారణమేమిటి? జవాబు: కోవిడ్-19 వైరస్ ‘బి.1.617.2’ను ‘డెల్టా’ రకంగా వ్యవహరిస్తారు. దీన్ని 2020 అక్టోబరులో భారతదేశంలో కనుగొనగా... దేశంలో రెండోదశ వ్యాధి వ్యాప్తికి ఇదే ప్రధానంగా కారణం. దేశంలో ప్రస్తుతం నమోదైన కోవిడ్-19 కేసులలో 80 శాతం దీనివల్ల వ్యాపించినవే. ఇది మహారాష్ట్రలో ఆవిర్భవించి దేశంలోని పశ్చిమ రాష్ట్రాల మీదుగా ఉత్తరదిశగా ప్రయాణించి, ఆ తర్వాత మధ్య, తూర్పు రాష్ట్రాలో ప్రవేశించింది. మన కణ ఉపరితలం మీదగల ‘ఏసీఈ2’ గ్రాహకాలతో మరింతగా పెనవేసుకోవడంలో దీని ప్రధాన ప్రొటీన్లో ఉత్పరివర్తనాలు తోడ్పడతాయి. దీనివల్ల ఇది మరింత ఎక్కువగా వ్యాపించడమే కాకుండా శరీర వ్యాధి నిరోధకతను మాయచేయగలుగుతుంది. అందువల్ల మునుపటి రకంతో పోలిస్తే ఇది 40 నుంచి 60 శాతం ఎక్కువగా విస్తరించగలదు. ఇది ఇప్పటికే యూకే, యూఎస్ఏ, సింగపూర్ తదితర 80కిపైగా దేశాల్లో వ్యాపించింది. ప్రశ్న: ఇతర రకాలతో పోలిస్తే దీనివల్ల వ్యాధి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందా? జవాబు: ఈ రకంలో సంయుక్త కణ స్వరూపం దాల్చగల కొన్ని ఉత్పరివర్తనాలు చోటు చేసుకున్నట్లు కొన్ని అధ్యయనాల్లో తేలింది. అంతేకాకుండా మానవ కణంపై దాడిచేశాక ఇది మరింత వేగంగా తన ప్రతిరూపాన్ని సృష్టించగలదు. దీనికి ప్రతిస్పందనగా ఊపిరితిత్తుల వంటి అవయవాల్లో విపరీతమైన మంట, బాధ మొదలవుతాయి. అయితే, ‘డెల్టా’ రకం వల్ల వ్యాధి తీవ్రత అధికమవుతుందని చెప్పలేం. కాగా, భారతదేశంలో వైరస్ తొలిదశ తరహాలోనే రెండో దశలోనూ పీడితుల వయసు, మరణాలు ఒకేవిధంగా ఉన్నాయి. ప్రశ్న: ‘డెల్టా’ రకంతో పోలిస్తే ‘డెల్టా ప్లస్’ మరింత తీవ్రమైనదా? జవాబు: ఈ ‘డెల్టా ప్లస్’లో- ‘ఎవై.1, ఎవై.2’ రకాలకు చెందిన 55 నుంచి 60 కేసులు మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్ సహా 11 రాష్ట్రాల్లో నమోదయ్యాయి. ‘ఎవై.1’ రకం నేపాల్, పోర్చుగల్, స్విట్జర్లాండ్, పోలాండ్, జపాన్ దేశాల్లో కూడా కనుగొనడినప్పటికీ ‘ఎవై.2’ రకం తక్కువగా కనిపిస్తోంది. దీని వ్యాపకత, తీవ్రత, టీకాల అధిగమన లక్షణాలను ఇంకా అధ్యయనం చేయాల్సి ఉంది. ప్రశ్న: ‘డెల్టా’ రకంపై టీకాలు సమర్థంగా పోరాడగలవా? జవాబు: కచ్చితంగా... దీనికి సంబంధించి ‘ఐసీఎంఆర్’ నిర్వహించిన అధ్యయనం మేరకు మన టీకాలు ‘డెల్టా’ రకంపై సమర్థంగా పోరాడగలవు. ప్రశ్న: దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కొత్త కేసుల తీవ్రత ఇంకా ఎక్కువగానే ఉంది... ఎందుకు? జవాబు: దేశంలోని అనేక ప్రాంతాల్లో కొత్త కేసుల సంఖ్య గణనీయంగా తగ్గినప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో మాత్రం నిర్ధారణ పరీక్షల్లో కొత్త కేసుల శాతం ఎక్కువగా ఉంటోంది. ముఖ్యంగా ఈశాన్య భారత రాష్ట్రాల్లో, దక్షిణ భారతంలోని పలు జిల్లాల్లో నమోదవుతున్న కేసులకు ఈ ‘డెల్టా’ రకం వైరస్ కారణం కావచ్చు. ప్రశ్న: వైరస్ తదుపరి దశలను నిరోధించగలమా? జవాబు: జనాభాలోని ఇతరత్రా వ్యాధి పీడితులకు, వ్యాధులకు తేలికగా లొంగిపోయే శరీర స్వభావంగలవారికి ఈ వైరస్ వ్యాపించడం ప్రారంభిస్తుంది. అధికశాతం జనాభాకు వ్యాపించిన తర్వాత వారిలో నిరోధక శక్తి పెరగడంతో ఈ వైరస్ అంతర్థానమై... జనాభాలో నిరోధకశక్తి తగ్గిన తర్వాత మళ్లీ దాడిచేయడం ప్రారంభిస్తుంది. ఆ మేరకు మరింత వ్యాధికారక వైరస్ వల్ల కొత్త కేసుల సంఖ్య బాగా పెరగవచ్చు. ఒక్కమాటలో చెబితే, తేలికగా లొంగిపోయే శరీర స్వభావం గలవారిపైనే తదుపరి దశ ప్రభావం అధికంగా ఉంటుంది. అయితే, రెండోదశ ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రజలు మరింత అధికసంఖ్యలో టీకాలు తీసుకునేకొద్దీ భవిష్యత్ దశల నియంత్రణ, ఆలస్యం సాధ్యమే. ముఖ్యంగా జనాభాలో అధికశాతం టీకాలు తీసుకునేదాకా కోవిడ్ అనుగుణ ప్రవర్తనను కచ్చితంగా అనుసరించడం తప్పనిసరి. కాబట్టి ప్రజలంతా టీకాలు తీసుకోవడంపై దృష్టా సారించడమే కాకుండా కోవిడ్-19 నివారణ దిశగా కోవిడ్ అనుగుణ ప్రవర్తనకు కట్టుబడి ఉండటం అవశ్యం.
pib-160030
ec19f9640844adcba110a91fee84005be167edb141974e86462905845b57ad05
tel
వ్యవసాయ మంత్రిత్వ శాఖ నేటితో ముగియనున్న ‘రైతుల హక్కులపై మొదటి గ్లోబల్ సింపోజియం’ సాంకేతిక సమావేశాలు 60 దేశాల నుండి 500 కంటే ఎక్కువ మంది ప్రతినిధులు, నేషనల్ ఫోకల్ పాయింట్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రీటీ, 150 మంది రైతులు మరియు 100 మంది విదేశీ భాగస్వాములు గ్లోబల్ సింపోజియమ్కు హాజరయ్యారు జిఎస్ఎఫ్ఆర్ నుండి వెలువడే చర్చలు మరియు సూచనలు 'రైతుల హక్కులపై ఢిల్లీ ఫ్రేమ్వర్క్'లో స్ఫటికీకరించబడ్డాయి. ఫినోమిక్స్, జెనోమిక్స్ మరియు జీన్ బ్యాంక్ సౌకర్యాలను చూడటానికి రేపు పూసా క్యాంపస్ను సందర్శించనున్న ప్రతినిధులు న్యూఢిల్లీలోని నేషనల్ అగ్రికల్చరల్ సైన్స్ సెంటర్లోని ఐసీఏఆర్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన 'రైతుల హక్కులపై మొదటి గ్లోబల్ సింపోజియం ' సాంకేతిక సమావేశాలు నేటితో విజయవంతంగా ముగిశాయి. జిఎస్ఎఫ్ఆర్కి 60 దేశాల నుండి 500 కంటే ఎక్కువ మంది ప్రతినిధులు హాజరయ్యారు. వీరిలో ఇంటర్నేషనల్ ట్రీటీ యొక్క నేషనల్ ఫోకల్ పాయింట్స్, 150 మందికి పైగా రైతులు మరియు 100 కంటే ఎక్కువ మంది విదేశీ భాగస్వాములు ఉన్నారు. అంతర్జాతీయ ఒప్పందంలోని ఆర్టికల్ 9లో పేర్కొన్న రైతుల హక్కులకు సంబంధించిన వివిధ అంశాలు ఐదు వేర్వేరు సాంకేతిక సెషన్లు, రెండు ప్యానెల్ చర్చలు మరియు మూడు ప్రత్యేక సెషన్లలో చర్చించబడ్డాయి. రైతుల ఫోరమ్పై ప్రత్యేక సెషన్ జిఎస్ఎఫ్ఆర్లో ఒక ముఖ్యమైన చేర్చబడింది. జిఎస్ఎఫ్ఆర్ నుండి వెలువడే చర్చలు మరియు సూచనలు 'రైతుల హక్కులపై ఢిల్లీ ఫ్రేమ్వర్క్'లో స్ఫటికీకరించబడ్డాయి. ఒప్పందానికి భారతదేశం నుండి ప్రతిపాదనలు: - రైతుల హక్కుల సాధన కోసం ఒప్పందం ద్వారా సూచించబడిన బహుళ ఎంపికలను అమలు చేయడానికి ప్రయత్నాలను వేగవంతం చేయాలి. దీని కోసం హ్యాండ్హోల్డింగ్ మరియు కెపాసిటీ డెవలప్మెంట్ మెకానిజంను రూపొందించడానికి ఒప్పంద సెక్రటేరియట్ ఏర్పాటు చేయాలి. - రైతుల హక్కుల గురించి అవగాహన కల్పించడం, సంరక్షక రైతులు మరియు రైతుల విత్తన వ్యవస్థల సామర్థ్యాన్ని పెంపొందించడం మరియు సమాన ప్రయోజనాల భాగస్వామ్యాన్ని సులభతరం చేయడం కోసం బాధ్యత వహించే ఒక సంస్థాగత యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి అలాగే అటువంటి కార్యక్రమాలను సమన్వయం చేయడానికి ఒప్పంద సెక్రటేరియట్ను అభ్యర్థించాలి. - రైతుల హక్కుల సాకారాన్ని సులభతరం చేయడానికి వివిధ యూఎన్ సంస్థల్లో ఫంక్షనల్ సినర్జీని సృష్టించడం కోసం న్యాయవాది. - పిజిఆర్ఎఫ్ఏ పరిరక్షణ మరియు స్థిరమైన వినియోగాన్ని నిర్ధారించడానికి రైతులు మరియు రైతుల విత్తన వ్యవస్థలకు మద్దతు ఇవ్వడం కోసం బెనిఫిట్ షేరింగ్ ఫండ్ను బలోపేతం చేయాలి; మరియు జాతీయ ప్రభుత్వాలు, అంతర్జాతీయ సంస్థలు పర్యావరణాన్ని ఎనేబుల్ చేయడం ద్వారా రైతుల హక్కులను సాధించడం మరియు పరిరక్షణ కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడంలో ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించాలి. - రైతుల హక్కుల అమలును వేగవంతం చేయడానికి దక్షిణ-దక్షిణ, త్రిభుజాకార మరియు ప్రాంతీయ సహకారంతో సహా వివిధ వాటాదారుల క్రియాశీల భాగస్వామ్యానికి మరియు రైతు-కేంద్రీకృత భాగస్వామ్య అవకాశాలను నిర్మించడానికి అనుకూలమైన పరిస్థితిని సృష్టించడం. - వాతావరణ మార్పుల అనుసరణ మరియు ఉపశమన నిధులలో భాగంగా ప్రత్యేక ప్యాకేజీ ప్యాక్ చేయబడి విపరీతమైన వాతావరణ సంఘటనల వల్ల ఎక్కువగా ప్రభావితమైన వ్యవసాయ క్షేత్ర పరిరక్షణ మరియు సంరక్షక రైతులకు నేరుగా మద్దతునిస్తుంది. - సంరక్షక రైతుల వ్యవసాయ ఆదాయాన్ని పెంపొందించడానికి మరియు స్థానిక ఆహార వ్యవస్థలను బలోపేతం చేయడానికి, సాంప్రదాయ రకాల కోసం రైతు-నిర్వహణ విత్తన వ్యవస్థను ఏర్పాటు చేయడం/మద్దతు ఇవ్వడం మరియు స్వీయ-నిరంతర ఉత్పత్తి మరియు మార్కెటింగ్ విలువ గొలుసును సృష్టించాలి. - పిజిఆర్ఎఫ్ఏతో అనుబంధించబడిన సాంప్రదాయ పరిజ్ఞానాన్ని క్రమపద్ధతిలో డాక్యుమెంట్ చేయడానికి చేతులు కలపాలి. ముందస్తు సమాచార సమ్మతికి కట్టుబడి మరియు కమ్యూనిటీల సున్నితత్వాన్ని గౌరవించాలి. కొనసాగుతున్న డాక్యుమెంటేషన్ ప్రోగ్రామ్ల క్రింద ప్రక్రియను సులభతరం చేయడానికి ఒప్పంద సెక్రటేరియట్ ఏర్పాటు చేయాలి. - పిజిఆర్ఎఫ్ఏ పరిరక్షణ మరియు సుస్థిర వినియోగం లక్ష్యంగా కొత్త సైన్స్ మరియు టెక్నాలజీల అప్లికేషన్, రైతుల హక్కులపై ప్రతికూల ప్రభావాన్ని నివారించడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం మరియు మెరుగైన ప్రయోజనాలను పంచుకునే అవకాశాలను నిర్ధారించాలి. - ప్లాంట్ ట్రీటీలో ఊహించిన విధంగా రైతుల హక్కులను గుర్తించి రక్షించే వారి ప్రస్తుత వ్యవస్థలో చట్టపరమైన మరియు అధికారిక నిబంధనలను రూపొందించాలి. రేపు సమావేశం యొక్క చివరి రోజున ప్రతినిధులు పూసా క్యాంపస్ ను సందర్శించి ఫినోమిక్స్, జెనోమిక్స్ మరియు జీన్ బ్యాంక్ సౌకర్యాలను పరిశీలిస్తారు. సమావేశాన్ని రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు.పంటల వైవిధ్యానికి నిజమైన సంరక్షకులుగా వ్యవసాయ సోదరులను గుర్తిస్తూ రైతుల హక్కులపై భారతదేశం యొక్క చట్టం చట్టం, 2001లో పొందుపరచబడింది) ప్రపంచానికి ఒక నమూనాగా ఉంటుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. భారతదేశంలోని రైతులు మరియు వ్యవసాయ వర్గాలకు 26 ప్లాంట్ జీనోమ్ సేవర్స్ అవార్డులు/గుర్తింపులను కూడా రాష్ట్రపతి ప్రదానం చేశారు. అలాగే కొత్తగా నిర్మించిన 'ప్లాంట్ అథారిటీ భవన్', పిపివిఎఫ్ఆర్ అథారిటీ కార్యాలయం మరియు ఆన్లైన్ ప్లాంట్ వెరైటీ 'రిజిస్ట్రేషన్ పోర్టల్'ను కూడా రాష్ట్రపతి ప్రారంభించారు. కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్, మరియు వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ కైలాష్ చౌదరి పాల్గొన్నారు. రోమ్లోని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ యొక్క ఆహారం మరియు వ్యవసాయం కోసం మొక్కల జన్యు వనరులపై అంతర్జాతీయ ఒప్పందం సెక్రటేరియట్ ద్వారా నిర్వహించబడింది. ఈ గ్లోబల్ సింపోజియం పిపివిఎఫ్ఆర్ సహకారంతో వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు రైతుల సంక్షేమంచే నిర్వహించబడుతోంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ , ఐకార్-ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ , మరియు ఐకార్-నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ . భారతదేశంలోని గొప్ప వ్యవసాయ జీవవైవిధ్యాన్ని ప్రదర్శించే ఒక ప్రదర్శనను 80 సంస్థల మద్దతుతో ఏర్పాటు చేశారు. అవార్డు గ్రహీతలు రైతులు/వ్యవసాయ సంఘం, ఐకార్ ఇన్స్టిట్యూట్లు,ఎస్ఏయు, సిఏయు, సిజిఐఏఆర్ ఇన్స్టిట్యూట్లు మరియు సీడ్ అసోసియేషన్ అనుభవాలను పంచుకోవడం మరియు రైతుల హక్కులపై భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించడం కోసం 2022 సెప్టెంబరు 17 నుండి 24 వరకు న్యూఢిల్లీలో జరిగిన ఎఫ్ఏఓకు చెందిన ఇంటర్నేషనల్ ట్రీటీ పాలకమండలి తొమ్మిదవ సెషన్ అనుభవాలను పంచుకోవడానికి మరియు రైతుల హక్కులపై భవిష్యత్ కార్యాచరణను చర్చించడానికి గ్లోబల్ సింపోజియంను అభ్యర్థించారు.